రోజా వ్యాఖ్యలపై రగడ

 

వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా చేసిన వ్యాఖ్యలపై విశాఖలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళితసంఘాల పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా రోజా దిష్టి బొమ్మను దహనం చేశారు. రోజా దళితులకు క్షమాపణ చెప్పాలని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద రోజాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలపై సీఎం, స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తానని, అట్రాసిటీ కేసు పవరేంటో ప్రభుత్వం చూపిస్తుందని అనిత చెప్పారు. మరోవైపు తెలంగాణ దళిత సంఘ అధ్యక్షుడు రాములు కూడా రోజా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజా.. సినిమా భాషను పక్కనపెట్టి అన్ని కులాలను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu