మధ్యాహ్న భోజనమా.. విషమా..

కలుషితమైన మధ్యాహ్న భోజనం తిని కడప జిల్లా పులివెందులలోని విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి అయిదో తరగతి చదువుతున్న 30 మంది విద్యార్ధులు అనారోగ్యం పాలయ్యారు. చికిత్స కోసం వాళ్లని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనే విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకొంది. గొలుగొండ మండలంలోని కే.డి పేట ఉన్నత పాఠశాలలో కలుషితమైన మధ్యాహ్న భోజనం తిని 20 మంది అస్వస్థతకు గురైయ్యారు. వారిని చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu