రాజ్యసభ సభ్యత్వానికి మాల్యా రాజీనామా

బ్యాంకులకు కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టి ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపినట్లు మాల్యా ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. బ్యాంకులకు రూ.9000 కోట్ల ఎగవేతకు పాల్పడిన మాల్యాపై చర్యలు తీసుకోవాలని కరణ్ సింగ్ నేతృత్వంలోని నైతిక విలువల కమిటీ నిర్ణయించింది. ఆయనపై వేటు తప్పదని భావించిన మాల్యా తనకు తానుగా రాజీనామా సమర్పించినట్టు తెలుస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu