బ్రాహ్మణుల 'చలో వరంగల్'
posted on Nov 11, 2012 10:11AM

దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారంటూ రేగిన వివాదం రోజురోజుకూ పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఏకంగా చలో వరంగల్ పేరుతో భారీ బహిరంగసభకు పిలుపునిచ్చారు. బ్రాహ్మణులను కించపరిచేలా నిర్మించే సినిమాలను నిషేధించాలంటూ వరంగల్‌లో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు బ్రాహ్మణ సం ఘాలు, బ్రాహ్మణులు భారీ సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వేముల జయశ్రీ, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య పిలుపునిచ్చారు.
వినోదం పేరుతో బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా నిర్మించిన ‘దేనికైనా రెడీ’, ‘ఉమెన్ ఇన్ బ్రామ్మనిజం’ చిత్రాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. మోహన్‌బాబును, ఆయన కుమారుడు విష్ణును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.