మూడేళ్లు దాచి బంగారు పోత పోసిన మృతదేహానికి పూజలు..
posted on May 2, 2016 1:12PM

చనిపోయిన తన గురువు మరణాన్ని తట్టుకోలేక ఆయన మృతదేహాన్ని దాచి.. దానికి బంగారు పూత పూసి భగవంతుడిలా కొలుచుకుంటున్నారు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇంత విచిత్రమైన ఘటన దక్షిణ చైనాలో చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే.. దక్షిణ చైనాలో ఫూహోయ్ అనే బాలుడు తన 13వ ఏట బౌద్ధ భిక్షువుగా మారి, ధమ్మ సూత్రాలను బోధిస్తూ, 94 సంవత్సరాల పాటు చాంగ్ ఫూ దేవాలయంలోనే గడిపారు. అయితే 2012 లో ఆయన మరిణంచగా.. అది జీర్ణించుకోలేని అతని శిష్యులు ఆయన మృతదేహాన్ని మూడు సంవత్సరాలు ప్రత్యేక రసాయనాలతో కూర్చున్న భంగిమలో ఓ కుండలో భద్రపరిచారు. ఇటీవలే ఆ మమ్మీని బయటకు తీసి దానికి బంగారంతో పోత పోసి అక్కడే పూజలు నిర్వహిస్తూ, దేవుడని కొలుస్తూ, ఆయనపై ఉన్న తమ భక్తిని చాటుకుంటున్నారు.