బాలీవుడ్ జంటల ‘ఫస్ట్’నైట్ ఎక్కడ?
posted on Dec 30, 2013 9:15AM

న్యూఇయర్ పార్టీని, వెంటనే వచ్చే 1వ తేదీ రాత్రి సమయాన్ని ఆనందంగా గడిపేందుకు మన బాలీవుడ్ తారలు ఒక్కొక్కొరు ఒక్కోరకంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ తన భార్య గౌరి, పిల్లలను తీసుకుని థాయ్‌లాండ్‌లోని పుఖెట్‌కు వెళుతున్నారు. చాలా కాలం తర్వాత తన భార్యా పిల్లలతో అటు హాలిడే ట్రిప్, ఇటు న్యూఇయర్ పార్టీ రెండూ ఎంజాయ్ చేస్తున్నాడు షారూఖ్.
బాలీవుడ్ గుడ్ హజ్బెండ్ అక్షయ్ తన భార్య ట్వింకిల్‌ఖన్నా, పిల్లలతో కలిసి గోవాలో న్యూఇయర్ జోష్‌లో మునిగిపోనున్నాడు. ఇక కూతురి ముద్దుమురిపాలతో ఆనందోత్సాహాల్లో ఉన్న ఐశ్వర్య, అభిషేక్ జంట జాయ్‌నైట్ కోసం దుబాయ్ బయలుదేరనున్నారు. ఇక అమీర్‌ఖాన్ ఎప్పటిలానే తన భార్య కిరణ్, తన కొడుకుతో కలిసి పంచంగనిలోని తన స్వంత ఇంట్లో కొత్త సంవత్సరారంభాన్ని ఆస్వాదించనున్నాడు.
ఏక్ దో తీన్ మాధురి దీక్షిత్... తన భర్త శ్రీరామ్‌నెనేతో కలిసి సింగపూర్‌లో పార్టీయింగ్‌కు సిద్ధమైంది. లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి అన్నట్టుండే... సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్‌ల జంట... ఎప్పటిలానే స్విట్జర్లాండ్‌లోని జిస్తాడ్‌కు వెళ్లనుంది. అయితే ఈసారి అక్కడ స్కైయింగ్ నేర్చుకోవాలని కూడా వీరు అనుకుంటున్నారట. సింగిల్‌గా, బ్యాచిలర్స్‌గా ఉన్నవారు వారి వారి ‘ప్రత్యేక’ మైన వ్యక్తులతో కలిసి... సీక్రెట్ సరదాలకు సిద్ధమయ్యారట.
ఈ ఏడాది విజయాలతో మైమరచిపోతున్న దీపికాపదుకునే... వాటిని ఆస్వాదించేందుకు ఇప్పటికే మాల్థీవులు వెళ్లిపోయింది. అక్కడ తన సన్నిహితులతో గడుపుతోంది. అయితే 31కి మాత్రం ఈ భామ ముంబయి వచ్చేసి న్యూఇయర్ పార్టీని ఫ్రెండ్స్‌తో థూమ్ థామ్ అనిపిస్తానంటోంది. ఆర్.రాజ్‌కుమార్ విజయంతో జోష్ మీదున్న హీరో షాహిద్‌కపూర్ లాస్‌ఏంజెల్స్‌లో కొత్త ఏడాదిని స్వాగతించనున్నాడు. సో... బ్యూటీ సోనమ్ కపూర్ రాజస్థాన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని గోవాకు వెళ్లిపోతోంది. అక్కడ ఫుల్ పార్టీ అట.