అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై కేసీఆర్ పేరు
posted on Oct 21, 2015 6:02PM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా చేర్చారు, అయితే రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ పేరును ఏపీ కొత్త రాజధాని శంకుస్థాపన శిలాఫలకంపై ఎలా చేర్చుతారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు, టీడీపీ నేతలు కూడా కేసీఆర్ పేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది, అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ రాష్ట్ర విడిపోవడానికి కారణమైన కేసీఆర్ పేరును శిలాఫలకంపై ఎలా చేరుస్తారంటూ కొందరు టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు, దీనిపై పార్టీ హైకమాండ్ ను నేరుగా ప్రశ్నించినట్లు కూడా తెలిసింది, అయితే ప్రోటోకాల్ ప్రకారమే కేసీఆర్ పేరును చేర్చామని, గవర్నర్లు, ముఖ్యమంత్రుల పేర్లు చేర్చడం ఆనవాయితీ అని చెప్పారట.