యూపీఏ-2 మంత్రివర్గం నుంచి టీఎంసీ మంత్రులు వైదొలగుతారా?
posted on Sep 17, 2012 8:53PM
.jpg)
దేశీయ చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీకి నచ్చలేదు. డీజిల్ ధరలు పెంచడం, గ్యాస్ సిలిండర్లపై పరిమితిని విధించడంకూడా దీదీకి కోపాన్ని తెప్పించాయ్. యూపీయే సర్కారుపై అలిగిన ఫైర్ బ్రాండ్ మమత ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించారు. మమత విధించిన డెడ్ లైన్ సోమవారంతో ముగుస్తోంది. మన్మోహన్ ప్రభుత్వం దిగిరాకపోతే తృణమూల్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని దీదీ నిర్ణయించారు. యూపీఏ 2 ప్రభుత్వానికి బైటినుంచి మద్దతుని కొనసాగించాలన్నది మమతాబెనర్జీ యోచన. ఒకవేళ పరిస్థితి విషమిస్తే మధ్యంతర ఎన్నికలకుకూడా తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటన చేసిన ఆమె ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపుకూడా ఇచ్చారు.