ఏం పనిలేదా దాని గురించే మాట్లడటానికి.. వెంకయ్య
posted on Oct 13, 2015 4:01PM
.jpg)
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని.. ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లడటం లేదని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమర్శలకు ధీటుగా వెంకయ్య సమాధానం చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి.. దీనికి సంబంధించి నీతి అయోగ్ కమిటీ కూడా పర్యవేక్షిస్తుందని అన్నారు. అంతేకాదు అధికారంలో ఉన్నవాడు పనిచేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడాలని అన్నారు. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రతిరోజూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడమే పనా? వేరే పనంటూ లేదా? అని వెంకయ్య ప్రశ్నించారు. మాకు మాటల కంటే చేతలే ముఖ్యమని.. వెంకయ్య చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని.. ఇందులో భాగంగానే విశాఖకు మెట్రోరైలు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎన్డీయే చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.