మోడీ తప్పుడు విధానాల వల్లే తెలంగాణ బిడ్డ బలి!..పాతిక లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్
posted on Jun 17, 2022 11:38PM
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే తెలంగాణ బిడ్డ బలయ్యాడని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళన సందర్భంగా పోలీసు కాల్పులలో వరంగ్ కు చెందిన రాకేష్ అనే యువకుడు మరణించిన సంగతి తెలిసిందే.
రాకేష్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన రాకేష్ కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆ కుటుంబంల అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.