ఆంధ్రజ్యోతిపై జగన్ సర్కార్ సంచలన ఆరోపణలు...

  విశాఖ దగ్గర లోని పరదేశిపాలెంలోని రాళ్ల గుట్టల భూమిని చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా ఆంధ్రజ్యోతికి కేటాయించేసిందని జగన్ క్యాబినెట్ ఆరోపించింది. మార్కెట్ విలువ నలభై కోట్లకు పైగా ఉన్న భూమిని కేవలం యాభై లక్షల ఐదు వేలకే ఆంధ్రజ్యోతికి ఇచ్చేశారని కూడా మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఇక రెండు వేల పదిహేడు లోనే భూమి కేటాయించినా ఇప్పటి వరకూ అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరగలేదని పేర్ని నాని అంటున్నారు, అది కూడా నిజం కాదు. ఈ భూమి ఆంధ్రజ్యోతికి అప్పనంగా వచ్చింది కాదు, జగన్ క్యాబినెట్ అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం తేరగా ధారాదత్తం చేయలేదు. పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి ఆంధ్రజ్యోతికి నాటి ప్రభుత్వం ఎకరన్నర భూమి కేటాయించింది. పత్రిక అవసరాల కోసం చట్టబద్దంగా ఇచ్చిన భూమి అది, నిబంధనల ప్రకారం చెల్లింపులు కూడా జరిగాయి, తర్వాత కొద్ది రోజులకే ఆ ఎకరన్నర భూమిలో ఓ ఎకరాన్ని జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంది. ఇక మిగిలిన అర ఎకరం భూమి వాడుకునే వీలు లేక అలాగే వుండిపోయింది. జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమికి పరిహారంగా పరదేశిపాలెంలో ఎకరా భూమిని ఏపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో కేటాయించింది. అంటే నాటి ఒకటిన్నర ఎకరాకు బదులుగా జరిగిన కేటాయింపు ఇది. దీని కోసం మళ్లీ కొత్తగా చెల్లింపు కూడా చేయాల్సిన అవసరం లేదు కానీ, ఎనభయ్యవ దశకం నాటి రికార్డులు అందుబాటులో లేవంటూ కలెక్టర్ ఓ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు. విశాఖలో ఉన్న పరిస్థితులు మార్కెట్ అన్నింటినీ లెక్క లోకి తీసుకొని ఎకరానికి యాభై లక్షలు చెల్లించాలని చెప్పారు. దాని ప్రకారమే యాభై లక్షల ఐదు వేలు చట్టబద్ధంగా చెల్లించింది ఆంధ్రజ్యోతి యాజమాన్యం. పైగా మంత్రి పేర్ని నాని చెబుతున్నట్టుగా ఈ భూమి విలువ కూడా నలభై కోట్లు కానేకాదు. రిజిస్ర్టేషన్ విలువ రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేలు మాత్రమే. పరదేశిపాలెంలో ఎకరా భూమి రాళ్లు రప్పలతో నిండిన ప్రాంతం, నిర్మాణాలు నేరుగా చేపట్టేందుకు అనుకూలంగా ఏమీ లేదు. ఇక్కడ కొండలూ గుట్టలూ చదును చేసేందుకు రెండేళ్లుగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రయత్నిస్తోంది, ఇప్పటికే లక్షలు ఖర్చు చేసింది కూడా. మరి ఇలాంటి చోట పనులేమీ జరగటం లేదు అని మంత్రి పేర్ని నాని చాలా తేలిగ్గా చెప్పేశారు. ఇది వాస్తవం కానీ, రాజకీయ ఆరోపణలు చేసి నిజాలు మరుగుపరిచేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా మంత్రి మాటలతో స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ దురుద్దేశాలు, పరస్పర అవగాహన లాంటి మాటలు అనడం లోనే అసలు విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. మరో విషయమేంటంటే ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పేర్ని నాని చెప్పారు.

ఏపీలో మళ్లీ పునరుద్ధరణ లోకి రానున్న ఏబీఎన్ ప్రసారాలు...

  ఏపీలో ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేసింది జగన్ ప్రభుత్వం. అప్పటి నుంచి ఛానల్ అధికారులు, ప్రజలు ట్రాయ్ కు ఎన్నో సార్లు పునరుద్దరించాలని ఫిర్యాదులు చేపట్టారు.ఎట్టకేలకి  ఏబీఎన్ ప్రసారాలను రెండ్రోజుల్లో పునరుద్ధరించాలని ఏపీ ఫైబర్ నెట్ కు టిడి శాట్ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందున ఏపీ ఫైబర్ నెట్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని టిడి శాట్ స్పష్టం చేసింది. ఎంత జరిమానా విధించాలి అనేది ఇరవై రెండవ తేదీన నిర్ణయిస్తామని టిడి శాట్ ప్రకటించింది.  ఏబీఎన్ ఛానళ్ ప్రసారాల నిలిపివేతపై ఇవాళ టిడి శాట్ లో విచారణ జరిగింది. అయితే ఈ నెల ఇరవై రెండు కల్లా ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరిస్తామని టిడి శాట్ కు ఏపీ ఫైబర్ నెట్ తెలిపింది. గతంలో ఏ నెంబర్ లో అయితే ఛానల్ ఇచ్చారో అదే స్థానం నుంచి ప్రసారాలను ఇవ్వాలని ఇంతకు ముందే టిడి శాట్ ఆదేశించింది. సాంకేతిక సమస్యలంటూ సాకులు చెప్పొద్దని ఇప్పటికే హెచ్చరించింది. ఆదేశాలు పాటించకపోతే ఎంఎస్వోలు ఏపీ ఫైబర్ నెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  ఏపీలో సిటీ కేబుల్ తో పాటు ఏపీ ఫైబర్ నెట్ లో ఏబీఎన్  ఛానళ్ ప్రసారాలు నిలిపివేశారు. అప్పట్నుంచీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జర్నలిస్టు సంఘాలతో పాటుగా ప్రజలు కూడా ఏబీఎన్ ఛానల్ ఇవ్వాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రసారాలు వెంటనే పునరుద్దరించాలని వేలాది సంఖ్యలో ట్రాయ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా ఏపీలో ఏబీఎన్ ప్రసారాలు ఇవ్వాల్సిందేననీ టిడి శాట్ స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మీడియాపై ఆంక్షలు విధించాలి అనుకోవడం జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్. ఇలాంటి పనులు మానుకోవాలని ఆయన జగన్ కు హితవు పలికారు.ఇక సర్కార్ దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

అసలేం జరుగుతోంది? ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తమిళిసై

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ఫోన్ చేసిన గవర్నర్... సమ్మె ప్రభావం, ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలపై వివరాలు అడిగారు. అలాగే, సమ్మెపై వివరాలు అందించాలని గవర్నర్ ఆదేశించడంతో.... మంత్రి పువ్వాడ.... రవాణాశాఖ సెక్రటరీని రాజ్‌భవన్‌కు పంపారు. దాంతో రవావాశాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ రాజ్ భవన్ కు వెళ్లి... తాజా పరిస్థితిని గవర్నర్ కు వివరించారు. రాజ్ భవన్ కు వచ్చిన రవావాశాఖ ప్రధాన కార్యదర్శితో సమావేశమైన గవర్నర్ తమిళిసై... ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్, అలాగే రాష్ట్రంలో పరిస్థితి సమీక్ష జరిపారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల నుంచి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని గవర్నర్ అన్నారు. అయితే, ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి.... రవావాశాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ.... గవర్నర్‌కు వివరించారు. ప్రస్తుతం 9వేల బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే, తాతాల్కిక సిబ్బంది అధిక ఛార్జీలు వసూలు చేయకుండా... టికెట్ ఇష్యూయింగ్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు గవర్నర్‌కు నివేదించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని రవావాశాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ వివరించారు. అయితే, త్వరలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా గవర్నర్‌ను కలిసి... ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

ప్రభుత్వం కుప్పకూలినా కూలొచ్చు.! కేసీఆర్‌కు అశ్వద్ధామరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  తెలంగాణలో ఆర్టీసీ అలజడి కొనసాగుతోంది. అటు కార్మిక సంఘాలు... ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో...  ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. ఇక, ఆర్టీసీ సమ్మెపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుండటంతో ఇరువర్గాలూ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, హైకోర్టు విచారణ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై మరోసారి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో రవాణా, ఆర్టీసీ, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్‌... హైకోర్టుకు సమర్పించాల్సిన నివేదిక, వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ నియమించేందుకు కసరత్తు చేశారు. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఇలాగుంటే, మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్టీఆర్ కంటే కేసీఆర్ ఛరిష్మా ఉన్న నాయకుడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మొండి వైఖరి ఇలాగే కొనసాగితే.... ఎన్టీఆర్ హయాంలో జరిగిన 1995 తరహా రాజ్యాంగ సంక్షోభం వచ్చినా రావొచ్చన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే కుప్పకూలిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. మేధావుల మౌనం ప్రమాదకరమన్న అశ్వద్ధామరెడ్డి... ఇప్పటికైనా మంత్రులు హరీష్ రావు‌, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి నోరు విప్పాలని కోరారు. ఇక, పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడారన్న అశ్వద్ధామరెడ్డి.... వాళ్లంతా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల బాధలను చూసి... పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఆదేశాలతో మీడియా ముందు విమర్శించినా... ఆ తర్వాత ఇంటికెళ్లి ఏడుస్తున్నారంటూ అశ్వద్ధామరెడ్డి చెప్పుకొచ్చారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడుతున్నారనే... తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అశ్వద్ధామరెడ్డి ఆరోపించారు. సాధ్యంకాదన్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకున్నామని, అలాంటిది ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎందుకు కాదో తేల్చుకుంటామని అశ్వద్ధామరెడ్డి తేల్చిచెప్పారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లే... తమ డిమాండ్లును కూడా సాధించుకుంటామన్నారు. ప్రజాప్రతిఘటన మొదలైతే ఎవరూ ఆపలేరంటూ కేసీఆర్ సర్కారును హెచ్చరించిన అశ్వద్ధామరెడ్డి.... ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకపోతే 1995 తరహా సంక్షోభం ఎప్పుడైనా రావొచ్చని, ఏదైనా జరగొచ్చని వార్నింగ్ ఇచ్చారు.

జగన్ కేసుపై తీవ్ర ఉత్కఠం... నాంపల్లి కోర్టు తీర్పుపై వైసీపీలో టెన్షన్

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. అయితే, జగన్ కచ్చితంగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనంటూ సీబీఐ దాఖలుచేసిన కౌంటర్ పిటిషన్ పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తనపై అనేక బాధ్యతలు ఉన్నాయని, అందువల్ల కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ అభ్యర్ధించారు. దాంతో సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఓ సాధారణ ఎంపీగా...జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించి సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా సాక్షులను మరింత ప్రభావితంచేసే అవకాశముందని సీబీఐ వాదనలు వినిపించింది. వాస్తవాలను దాచిపెట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారంటూ సీబీఐ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర విభజనతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమంటూ కోర్టుకు తెలిపింది సీబీఐ. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనేక సౌకర్యాలు కల్పిస్తారని, ఆ సౌకర్యాలతో వారానికోసారి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం పెద్ద కష్టమేమీ కాదని సీబీఐ వాదించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వ్యక్తిగతంగా హాజరుకావడం ఎంతో అవసరమన్న సీబీఐ.... జగన్ పిటిషన్ ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని కోరింది. అయితే, సీబీఐ కౌంటర్ పిటిషన్ పై జగన్ తరపు లాయర్లు తమ వాదనలు వినిపించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని అభ్యర్ధించనున్నారు. అయితే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించిన సీబీఐ కోర్టు... మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి. ఒకవేళ సీబీఐ వాదనల వైపు మొగ్గుచూపి జగన్ పిటిషన్ ను కొట్టివేస్తే... ముఖ్యమంత్రి హోదాలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే సీఎంగా దేశవ్యాప్తంగా సంచలనం కావడం ఖాయం.

అద్దె బస్సులతో ఆర్టీసీ బతుకు బస్టాండు...

  అద్దె బస్సులతో ఆర్టీసీ బతుకు కష్టాలపాలవుతోంది. సంస్థకు నష్టాలకు అద్దె బస్సులే సగం కారణమవుతున్నాయి. ఆర్టీసీని ఎన్ని రకాలుగా దోచుకోవాలో ప్రైవేటు బస్సుల యజమానులు అన్ని రకాలుగా దోచేస్తున్నారు. సాధారణంగా ఏదైనా వాహనాన్ని అద్దెకు తీసుకోవాల్సి వస్తే ఎవరైనా రోజుకి ఇంతని చెల్లిస్తారు. దాని నిర్వహణ ఖర్చులు, బీమా, వాహన పన్ను వంటివి ఆ వాహన యజమానే కట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ రోజు అద్దె ఇస్తూ దాని నిర్వహణ చార్జీలు కూడా భరించరు. కానీ ఆర్టీసీలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నడుస్తోంది. బస్సులకూ అద్దె చెల్లిస్తూనే వాటి నిర్వహణ ఖర్చులను ఆర్టీసీనే భరిస్తుంది. మోటారు వాహన పన్ను, బీమా ప్రీమియం వంటివన్ని చెల్లిస్తోంది. కేవలం చార్జీల రూపంలోనే ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల పదకొండు కోట్లు చెల్లించింది. విచిత్రమేంటంటే గత ఐదేళ్లుగా కేవలం అద్దె బస్సుల మెయింటినెన్స్ కిందే ఆర్టీసీ వెయ్యి అరవై ఆరు కోట్లను ఖర్చు చేసింది. ఇక భ్హీమా ప్రీమియం, ఎంవీ టాక్స్ రూపంలో మరో రూ నాలుగు వందల ముప్పై కోట్ల వరకూ చెల్లించింది.  అద్దె బస్సుల ద్వారా కిలోమీటరుకు సగటున ఇరవై తొమ్మిది రూపాయల ముప్పై తొమ్మిది పైసలు ఆదాయం వస్తుండగా, ముప్పై నాలుగు రూపాయల డెబ్బై మూడు పైసలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు. అద్దె బస్సుల యజమానులు తమకు ఇష్టమైన రూట్లలోనే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. టైర్ల అరుగుదల లేకుండా రోడ్లు బాగున్న రూట్లనే ఎంపిక చేసుకుంటున్నారు. గ్రావెల్, కచ్చా రూట్లలో బస్సులు నడపడానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి అధ్వాన రూట్లలో ఆర్టీసీ సొంత బస్సులను నడపాల్సి వస్తోంది. స్పీడ్ బ్రేకర్ లు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో అద్దె బస్సులను నడపడం లేదు. కేఎంపీఎల్ ఎక్కువగా వచ్చే రూట్లు, ట్రాఫిక్ రద్దీ లేని రూట్లలో మాత్రమే అద్దె బస్సులను నడుపుతున్నారు. అందుకే వీటిలో ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా ఉండటం లేదు.టీఎస్ ఆర్టీసీలో మొత్తం బస్సులు పది వేల నాలుగు వందల అరవై వాటిలో ఆర్టీసీ సొంత బస్సులు ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు, అద్దె బస్సులు రెండు వేల నూట మూడు అంటే మొత్తం బస్సుల్లో అద్దె బస్సులు దాదాపు ఇరవై శాతం. కానీ ఆర్టీసీ మంగళవారం మరో వెయ్యి ముప్పై ఐదు అద్దె బస్సుల కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బస్సులో వచ్చి చేరితే కార్పొరేషన్ లో అద్దె బస్సులు ముప్పై శాతానికి చేరతాయి. అద్దె బస్సులు మరో పది శాతం పెరిగితే అదే స్థాయిలో నష్టాలు పెరగనున్నాయి.  ఆర్టీసీలో సొంత బస్సు రోజుకు సగటున పదమూడు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు సంపాదిస్తుంటే, అద్దె బస్సు ఆదాయం పది వేల ఐదు వందల నలభై నాలుగు మాత్రమే అంటే ఆర్టీసీ బస్ తో పోలిస్తే అద్దెబస్సు వల్ల రోజుకు సగటున రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయల నష్టం వస్తుంది. మొత్తం అద్దె బస్సులతో రోజుకు సగటున నలభై లక్షల ఎనభై ఏడు వేల రూపాయలలో నష్టాలు వస్తున్నాయి.గత ఐదేళ్లుగా కేవలం అద్దె బస్సులే ఆర్టీసీకి ఆరు వందల ముప్పై కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. నిజానికి తెలంగాణ ఏర్పడే నాటికి అంటే రెండు వేల పద్నాలుగులో అద్దె బస్సుల సంఖ్య కేవలం పదిహేను వందల నలభై రెండు మాత్రమే కానీ కేవలం ఐదేళ్లలోనే అద్దె బస్సులు మరో ఐదు వందల అరవై ఒకటి పెరిగాయి. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన అద్దె బస్సులు దాదాపు రెండు వందల మాత్రమే ఇక అద్దె బస్సుల వల్ల రెండు వేల పద్నాలుగు, పదిహేనులో రోజుకు ఇరవై మూడు లక్షల రూపాయల నష్టాలు మాత్రమే వచ్చేవి. ఇవి క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. రెండు వేల పదహారు, పదిహెడులో రోజుకు ముప్పై నాలుగు లక్షలు. రెండు వేల పధ్ధెనిమిది, పంతొమ్మిదికు వచ్చే సరికి నలభై లక్షలకు ఈ నష్టాలు చేరాయి. ఇప్పుడు వీటి సంఖ్యను సగానికి పెంచితే, ఆర్టీసీ మునగడం ఖాయమని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ ఆర్టీసీ సమ్మే తో మొత్తానికి ప్రైవేట్ వాహనదారులు తెగ లాభాల బాట పడుతున్నారని చెప్పుకోవచ్చు.

ఘనంగా పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు... దీని వెనుకా రాజకీయమేనా?

  అర్జీలకు పనులూ కావు, ఆశీర్వచనాలకు బిడ్డలూ పుట్టరు అన్న నానుడిని విస్మరించినట్లుగా ఉందట చిత్తూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల తీరు. నిజానికి జిల్లా కేంద్రం చిత్తూరులో రాజకీయంగా ఏది జరిగినా అది సంచలనమే అవుతుంది. ఇలాంటి పరిస్థితులున్న చోట తాజాగా చోటు చేసుకున్న మరో పరిణామం చర్చ నీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున జరిపిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే జిల్లా వ్యాప్తంగా జరిగిన వేడుకలు ఒకెత్తైతే చిత్తూరు నగరంలో జరిగిన వేడుకలు మరొకెత్తుగా నిలవడం విశేషం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం సీఎం జగన్ తరువాత ప్రత్యేక గుర్తింపు కలిగిన నేతగా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుక తన సొంత జిల్లా చిత్తూరులో ఓ రేంజ్ లోనే జరిగిందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి, ఎందుకంటే జిల్లాలో అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయట. జిల్లా కేంద్రం చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీకి చెందిన నాయకులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నిర్వహించడం హాట్ టాపిగ్గా మారింది. ముఖ్యంగా ముగ్గురు నాయకులూ తమ తమ అనుచరులతో కలిసి వేరువేరుగా మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందులోనూ ఇద్దరు నాయకులు పోటీ పడి నువ్వా నేనా అన్న రీతిలో వేడుకలను నిర్వహించడం విశేషం. అయితే వారిద్దరూ అంతగా ఎందుకు పోటీ పడి వేడుకల్ని నిర్వహించారనే విషయానికొస్తే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరువురు కూడా నగర మేయర్ పదవిపై ఆశలు పెట్టుకోవడం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకనే ఆ ఇద్దరు నాయకులు ఎవరికి వారుగా పై చేయి సాధించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను పోటా పోటీగా నిర్వహించారనే ప్రచారం సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కో కన్వీనర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుల్లెట్ సురేష్ చిత్తూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు పివి గాయత్రిదేవి ఈ ముగ్గురు మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహించారు. వీరిలో బుల్లెట్ సురేష్, చంద్ర శేఖర్ లు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితులు, ప్రియశిష్యులు, నమ్మిన బంట్లు కావడమనేది చెప్పుకోదగ్గ అంశం. ఆయన జన్మదినం రోజున ఉదయాన్నే గాంధీ విగ్రహం వద్ద చంద్రశేఖర్ హంగమా చేశారు. తన అనుచరులతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తర్వాత మధ్యాహ్నం తపోవనం పాఠశాలలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు జరిపారు. చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రెండు కార్యక్రమాలకు ఆయన అనుచర గణం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో ఎంఎస్సార్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం వేళ పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో చేరుకున్న అనుచరులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రజల నడుమ తొలుత భారీ కేక్ కట్ చేశారు. తర్వాత పేదలకు అన్నదానం కార్యక్రమం చేశారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు పివి గాయత్రిదేవి స్థానిక కొంగారెడ్డిపల్లె ఎస్టేట్ లోని ఎస్సీ ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థుల మధ్య పెద్దిరెడ్డి జన్మదిన వేడుక నిర్వహించారు. ఇలా ఎవరికి వారు వేర్వేరుగా మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాయత్రిదేవి అంశాన్ని పక్కకు పెట్టి బుల్లెట్ సురేష్, చంద్ర శేఖర్ ల విషయానికొస్తే వీరిద్దరు మాత్రం నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడి మంత్రి పెద్దిరెడ్డి జన్మదినవేడుకలు జరిపారట. వీరిద్దరూ త్వరలోనే జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమం లోనే వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను తమ బలప్రదర్శనకు వేదికగా మార్చుకున్నారట. ఎవరికి వారు తమ సత్తా చాటాలనే ఉద్దేశంతోనే రామచంద్రా రెడ్డి జన్మదిన వేడుకలను పోటాపోటీగా జరిపారని అంటున్నారు. బుల్లెట్ సురేష్ ఇప్పటికే పలు పార్టీలో కొనసాగారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చిత్తూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా కృషి చేయడం జరిగింది. మొదలియార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో చిత్తూరులోని ఆ కులస్తుల్లో ఆయనకు మంచి పట్టుంది. బీసీ నేత ఆర్ కృష్ణయ్యతోనూ బుల్లెట్ సురేష్ కు మంచి సత్సంబంధాలు కలిగిన కారణంగానే సమైక్య రాష్ట్రంలోనే కాకుండా విభజిత ఏపీలోని బీసీ సంక్షేమ సంఘం కో కన్వీనర్ పదవిలో బుల్లెట్ సురేష్ కొనసాగుతున్నారు. ఇక చంద్రశేఖర్ విషయానికొస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. ఇపుడు చిత్తూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేశారు. ఈయన సైతం గౌండర్ బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో బుల్లెట్ సురేష్ చంద్ర శేఖర్ మధ్య పోటీ ఏర్పడిందట. ఈ క్రమం లోనే వచ్చిన పెద్దిరెడ్డి జన్మదినం వేడుకలను వీరిద్దరూ పోటా పోటీగా నిర్వహించడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  త్వరలో చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలు రెండో సారి జరగనున్నాయి, రెండు వేల పద్నాలుగులో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. ఈసారి అది జనరల్ కేటగిరీకి కేటాయిస్తారని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ, ఒక్క ఎస్సీ ఎస్టీ వర్గానికి మినహా మిగిలిన ఏ వర్గానికి రిజర్వేషన్ వచ్చినా అది జనరల్ క్యాటగిరీ అయినా సరే మేయర్ పదవి కోసం తామే పోటీ అన్న నమ్మకంతో చంద్ర శేఖర్, బుల్లెట్ సురేష్ లు ముందుకు వెళుతున్నారట. మరి చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వీరిద్దరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం...

  ముస్లింలకు ప్రసిద్ధ స్థానం మక్కా అని అందరికి తెలిసిన విషయం. మక్కాని దర్శించుకోవాలని ప్రతి ముస్లిం సోదరులు ఆకాంక్షిస్తారు. అలాంటి పుణ్య స్థానాన్ని సందర్శించి వస్తున్న ప్రజలు ఒక్క సారిగా అనంత లోకాలకు వెళ్ళీపోవడం పై వారి బంధువులు తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముప్పై ఐదు మంది విదేశీ భక్తులు మరణించారు. మక్కాకు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ముప్పై ఐదు మంది యాత్రికులు మరణించారని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా ఆధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియాలోని మదీనా ప్రావిన్స్ లోని అల్ అకల్ కేంద్రం వద్ద ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు.  యాత్రికులతో వెళ్తున్న బస్సు మరో భారీ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రమాదం అనంతరం బస్సు పూర్తిగా దగ్ధమైందని అధికారులు తెలియజేశారు. ప్రమాదం జరిగిన బస్ లో ఆసియా, అరబిక్ యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని అల్హంన ఆసుపత్రికి తరలించామని సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని సౌదీ అరేబియా అధికారులు వెల్లడించారు. మరోవైపు సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాద ఘటన పై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

శ్రీకాకుళం జిల్లా టిడిపిలో ఏం జరుగుతోంది..?

  కలిసి ఉంటే కలదు సుఖం అన్న సత్యాన్ని ఆలస్యంగానైనా శ్రీకాకుళం జిల్లాలో తెలుగు దేశం నేతలు తెలుసుకున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన క్యాడర్ కలిగిన జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటిగా చెప్పవచ్చు. హస్తం పార్టీ హవా జోరుగా కొనసాగిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీకి జిల్లా వాసులు వెన్నుదన్నుగా నిలిచారు. అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది.  జిల్లాలోని మొత్తం పది శాసన సభ స్థానాలుంటే కేవలం రెండు చోట్ల మాత్రమే టిడిపి గెలిచింది. పార్టీ ఓటమికి గల కారణాలు ఏవైనప్పటికీ జిల్లా టిడిపి నేతలు మాత్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు కాస్త ప్రజలకు దూరంగా ఉండేవారన్న విమర్శలనెదుర్కున్న పార్టీ నేతలు ఇప్పుడు పంథా మార్చారు. ప్రతిపక్ష పాత్రలో తమదైన శైలిలో నేతలు చేస్తున్న ప్రయత్నాలూ, ఓటమి నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయట. అధికారులను దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల మాజీ ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ పై కేసు నమోదైంది. అరెస్టు తప్పదన్న భావించిన కూన రవికుమార్ నెల రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హై కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న ఆయన అనంతరం అజ్ఞాతం వీడారు. అయితే నెల రోజుల పాటు రవికుమార్ ఆచూకి కోసం కార్యకర్తలు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. స్వతహాగా గట్టి వాక్చాతుర్యం కలిగి ప్రజల్లో మంచి పట్టున్న నాయకుడిగా రవికి పేరుంది. అలాంటి నాయకుడు పైన కేసులు పెడితే ఇక దిగువ స్థాయి కేడర్ పరిస్థితేంటి అని అందరూ అనుకున్నారట. ఇక ఇదే సమయంలో జిల్లా టిడిపి ముఖ్య నేతలంతా కూన రవి కుమార్ కు అండగా నిలిచారట. ఆమదాలవలస నియోజక వర్గ కార్యకర్తలతో పాటు రవి కుమార్ కుటుంబ సభ్యులకు మేమున్నాం అని ధైర్యం చెబుతూ వారు భరోసా ఇచ్చారని సమాచారం. ఎన్నికల ముందు వరకు శ్రీకాకుళం జిల్లాలో టిడిపి లో గ్రూపుల గోల ఎక్కువగా ఉండేది. అయితే కూన రవికుమార్ వ్యవహారంలో మాత్రం నేతలంతా ఐక్యంగా ముందుకు సాగడంతో కేడర్ కు కొత్త సంకేతాలు వెళ్ళాయట. మా నాయకులు గతంలో మాదిరిగా కాదని ఇప్పుడు మేమంతా ఒక్కటేనని మాలో ఎవరికైనా కష్టమొస్తే ఐక్యంగా కదులుతామని టిడిపి శ్రేణులు గట్టిగా చెబుతున్నాయట. పార్టీ మీకు అండగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదంటూ రవి అనుచరులకు జిల్లా ముఖ్య నేతలు ఇచ్చిన భరోసా ఇప్పుడు పార్టీలో సరికొత్త పరిణామాలకు నాంది అయిందనే భావన వినిపిస్తోంది. అధికార పీఠం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి జిల్లా టిడిపి నేతల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందనే టాక్ జిల్లాలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, గ్రామాల్లో కార్యకర్తలను అధికార పార్టీ నేతలు వేధింపులకు గురి చేస్తే వారికి అండగా నేతలు నిలబడడం వంటి అంశాలు పార్టీ భవిష్యత్ కి మంచి చేస్తున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ ఐక్యత ఎన్నికల వరకు ఉంటుందా లేక కూన రవి కుమార్ ఇష్యూ తోనే ముగుస్తుందా అనేది మాత్రం అంతుచిక్కడం లేదట. మొత్తమ్మీద ఎడమొహం పెడమొహం అన్నట్టుండే సిక్కోలు టిడిపి నేతలకు ఇపుడు తత్వం బోధపడినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్ళకు వారికి జ్ఞానోదయం అయింది అన్న సెటైర్ లు కూడా వినిపిస్తున్నాయి.

హుజూర్ నగర్ లో కేసీఆర్ మీటింగ్ రద్దు.. కారణం?

  దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్లు తయారయ్యింది పరిస్థితి.వివరాళ్లోకి వెళ్తే హుజూర్ నగర్ లో కేసీఆర్ మీటింగ్ జరుగుతుందా లేదా అని ఉత్కంఠంతో ఎదురు చుసిన ప్రజలకు తెర పడింది. టీఆర్ఎస్ సభ రద్దైంది.పొద్దుటి నుంచి సీఎం రాక కోసం ఎన్నొ ఆర్బాటాలు చేసిన సిబ్బంది కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు పాలైయ్యింది. సభా ప్రాంగణం వద్ద భారీగా వర్షం పడుతుండటం కేసీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం లేకపోవటంతో సభ రద్దయ్యింది. వర్షం కారణంగా కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. భారీ వర్షం కురుస్తున్నందు వల్ల సభను రద్దు చేసుకోవడమే మంచిదని ఏవియేషన్ అధికారులు చెప్పడంతో కేసీఆర్ సభను రద్దు చేసుకున్నారు.  సభా ప్రాంగణానికి కార్యకర్తల కూడా పూర్తిస్థాయిలో చేరుకోలేదు. వచ్చిన కొంత మంది కూడా భారీ వర్షం కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోయారు. అటు అధికారులు పోలీసులు కూడా సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి పోయారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసిఆర్ తో ప్రచారం చేయించేందుకు టిఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. చివరి వరకూ కేసీఆర్ వస్తారో రారో అని ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే సస్పెన్స్ కు తెరదించుతూ సభకు రావాలని కెసిఆర్ నిర్ణయించుకున్న వర్షం కారణంగా సభ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు హాజరు కావాలని చూసిన కెసీఆర్ కు వరుణ దేవుడు ఆటంకంగా మారాడు.

జెసి దివాకర్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆర్టీఏ అధికారులు...

  మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాకిచ్చారు. ఆర్టీఏ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఇరవై మూడు బస్సులను సీజ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం. ఇష్టానుసారంగా టిక్కెట్ల రేట్లు పెంచడం వంటి ఆరోపణలు వచ్చాయని అవి నిజమేనని తేలడంతో సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి జరిగిన ఆర్టీఏ అధికారుల తనిఖీలో భాగంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ కు సంబంధించిన 23 బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ కూడా పర్మిషన్లు ఒక రూట్లో ఉంటే మరొక రూట్లో నడుపుతున్నారు అనే నేపధ్యంతో అలాగే కొన్ని బస్సులకు పర్మీషన్ ల్ కూడా లేవు అనే నేపధ్యంలో 23 బస్సులను సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా 8 బస్సులు అనంతపురంలో నాలుగు బస్సులు అలాగే గుంతకల్లులో మూడు బస్సులు పెనుకొండలో ఒక బస్సు రాత్రి ఆర్టీఏ అధికారులు సీజ్ చేసారు. కానీ జేసీ వాళ్ళతో మాట్లాడితే మాత్రం మేము 2003 నుంచి కూడా బస్సు సర్వీసులు నడుపుతున్నామని తమకు అన్ని పర్మీషన్ లు కూడా ఉన్నాయని వాళ్ళు వెల్లడించారు.తమ ప్రైవేట్ బస్సులను సీజ్ చేయ్యడం తగదని ఆయన ఆర్టీఏ అధికారులకు వెల్లడించారు.తన బస్సులు ఏ రూటు వెల్లాల్లో వాటిని పర్మీషన్ ఉన్న ప్రాంతాలల్లొనే నడుపుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.వారికి ట్రాఫిక్ నిబందనలు అన్ని తెలుసని వాటి ప్రకారమే బస్సులను నడుపుతున్నామని జేసీ వెల్లడించారు.కానీ ఆర్టీఏ వాదనలు మాత్రం ఇందుకు విరుద్ధింగా ఉన్నాయి,కావునే తాము సీజ్ చేసే పరిస్థితి నెలకొంది అని ఆర్టీఏ అధికారులు సమాధానమిచ్చారు.ఇక ఈ చర్చ దేనికి దారి తీయ్యనుందో వేచి చూడాలి.

ఆపరేషన్ వశిష్టను నిలిపివేయాలని ఆదేశం.. అయోమయంలో సత్యం బృందం!!

  ఆపరేషన్ వశిష్టకి మళ్ళీ  ఆటంకాలు ఎదురైయ్యాయి.ఈ సారి ఆటంకం ప్రకృతి వల్ల వచ్చింది కాదు, ప్రభుత్వం వల్ల ఏర్పడింది.తాత్కాలికంగా బోటును వెలికి తీసే పనులు నిలిపి వేయాలని ధర్మాడి సత్యం బృందానికి అధికారుల నుంచి ఆదేశాలందాయి. ఉదయం నదిలోకి వెళ్లి లంగర్ లను వేసి బోటును లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఆదేశాలిచ్చారు దీంతో ధర్మాడి సత్యం బృందం అయోమయంలో పడింది. ఇటు అధికారులు బోట్లు వెలికి తీసేందుకు కాకినాడ నుంచి మరో బృందం తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో కచ్చులూరులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కచ్చులూరులో బోటును వెలికి తీసే పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ బృందం కచ్చులూరుకు చేరుకుంటుందని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా కచ్చులూరులో బోటును వెలికి తీసే పనిలో నిమగ్నమైంది ధర్మాడి సత్యం బృందం. బోటుకు లంగరు వేసి బయటకు లాగి కొట్టింది గోదావరి ఒడ్డు నుంచి రెండు వందల మీటర్ల దూరంలో నూట ఇరవై అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించింది ధర్మాడి సత్యం బృందం. సత్యం బృందంలో దాదాపు ఇరవై ఐదు మంది అనుభవజ్ఞులతోనూ, మరికొంతమంది మత్స్యకారులున్నారు పూర్తి సాంప్రదాయ పధ్ధతిలోనే బోటును వెలికితీయాలని భావించింది ధర్మాడి సత్యం బృందం. కానీ తాజాగా అధికారుల ఆదేశాలతో బోటు వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి .ఇంతకీ అధికారులూ ఆపరేషన్ వశిష్టను ఎందుకు నిలిపివేశారు, అధికారు లు వచ్చే వరకు పనులు ఎందుకు నిలిపివేయమన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.ఖచ్చితంగా ఈ రోజును బయటకు తీసే పట్టుదలతో ఉన్న సత్యం బృందానికి పది పదిహేను పది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో అధికారులకు ఆ ఒక మెసేజ్ ఐతే వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి నిపుణుల వస్తున్నారు వారు వచ్చే వరకు కూడా ఎక్కడ పనులు అక్కడే ఆపి ఉంచాలని చెప్పి చెప్పడం తొట్టి వీరందరూ కూడా ఈ పనులు నిలిపివేశారు. మూడు గంటల వరకు కూడా వారు రాకపోవడంతో పనులు మళ్లీ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ఆలోచనలో పడ్డారు బృందం సిబ్బంది. మూడు గంటల తరువాత అంటే దాదాపు గంటా రెండు గంటలకు మించి అంటే ఐదు గంటల తరవాత ఇక్కడ  లైటింగ్ సహకరించదని మళ్లీ ఆపరేషన్ మొత్తం పూర్తిగా నిలిపి వేసి దేవీ పట్నానికి వెళ్లి పోయేటువంటి పరిస్తితి ఉంటుంది బృందం వెల్లడిస్తోంది. ఇలాంటి సందర్భంలో పూర్తిగా కూడా ఈ రోజు పనులన్నీ కూడా ఆగిపోవటంతో రాయల్ వశిష్ట  బోటు వెలికి తీసే కార్యక్రమం ఆగిపోవచ్చని వెల్లడిస్తున్నారు సత్యం బృందం. కాకినాడ పోర్టు నుంచి ఎందుకు నిపుణులును ఇప్పుడు రమ్మంటున్నారో వారు వచ్చే వరకు ఎందుకు పనులను నిలిపివేయ్యాలంటున్నారు అనేది ప్రశ్నార్ధకరంగా మారింది.ఎంత త్వరగా బోటును బయటకు తిసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న సత్యం బృందానికి ప్రభుత్వం ఎందుకు ఆటంకాలు తలపెడుతోందో తెలాల్సి ఉంది. ప్రభుత్వం వైఖరికి తీవ్రంగా మండి పడుతున్నారు బాధిత కుటుంబాలు.అసలు బోటు బయటకు వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మిగలనుంది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి అందుకోసమే వెళ్ళారా..?

  చూడబోతే చుట్టాలూ రమ్మంటే కోపాలు అన్న సామెతను తలపించేలా ఉందట హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డికి అందిన ఆహ్వానం వ్యవహారం. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు వర్గాలు ఆధిపత్య పోరు మామూలే అన్నట్టుగా ఉంటుంది, సొంత పార్టీ నేతలే ఒకరి మీద మరొకరు నేరుగానే విమర్శ చేసుకుంటారు. బహిరంగ వేదికల మీదే తిట్టిపోస్కుంటారు. మామూలుగా అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు. అదేమంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటారు, ఎవరు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ తమ పార్టీలో ఉంటుందని చెబుతారు. కాంగ్రెస్ లోని ఈ బలహీనతలే ఎదుటి పార్టీకి బలంగా చెప్తారు. ఎన్నికల్లోనూ వారిని వారే ఓడించి కుంటారని అపవాదుంది కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లేమో గాని హస్తం పార్టీ నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. అయితే కలహాల విషయంలో రాజీ అవ్వకపోయినా ఎన్నికలొస్తే మాత్రం కలిసి పని చెయ్యడానికి రెడీ అవుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేళ హస్తం పార్టీ నేతలు తమ మధ్య విభేదాలను పక్కన బెట్టి ఐక్యతను ప్రదర్శిస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు హుజూర్ నగర్ కు తరలివెళ్లారు, వారు మండలాల వారీగా మోహరించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నారు, అధికార టీ.ఆర్.ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ శ్రేణులను రంగంలోకి దింపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతి నిధులు తమ బలగంతో వెళ్ళి పల్లెపల్లెనా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తామే దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి ప్రచారాన్ని సాగిస్తున్నారు, ఇక తన సొంత నియోజక వర్గం కావడం ఆయన సతీమణి పోటీలో ఉండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నేతలందరినీ ఆయనే సమన్వయం చేస్తున్నారు, ఇంత వరకు బాగానే ఉన్నా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా జరిగింది. ఆయన ప్రచారానికి వెళ్లకపోవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి హుజూర్ నగర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత పరిణామాలు పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. ఏకంగా ఉత్తమ్ ను టార్గెట్ చేయడంతో పార్టీలోని సీనియర్లంతా ఏకమయ్యారు. రేవంత్ రెడ్డి మీద మాటల దాడి చేశారు, దీంతో పార్టీలో సీన్ ఉత్తమ్ వర్సెస్ రేవంత్ గా మారిపోయింది. పీసీసీ చీఫ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న రేవంత్ వ్యవహారంపై ఉత్తమ్ కూడా గుర్రుగా ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేవంత్ వెళ్తారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి రేవంత్ ను ఉత్తమ్ ఆహ్వానిస్తారా అనే సందేహాలు కూడా తలెత్తాయ్. దీనిపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుండగానే రేవంతరెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల పధ్ధెనిమిది, పంతొమ్మిది తేదీల్లో ఆయన ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారట. మొత్తమ్మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఉత్తమ్, రేవంత్ మధ్య గ్యాప్ ఏర్పడడం ఒకరినొకరు పలకరించుకోకుండా ఉండటం వంటివి జరిగాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం విషయమై ఎవరు మెట్టుదిగారు, రేవంత్ రెడ్డిని హుజూరునగర్ ప్రచారానికి ఎవరైనా ఆహ్వానించారా లేక ఆయనే వెళుతున్నారా అనే విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నేతలు స్వచ్ఛందంగా వెళ్లి ప్రచారం చేస్తున్నారని అలాగే రేవంత్ రెడ్డి కూడా వెళుతున్నారని ఉత్తమ్ వర్గం చెబుతోంది. అయితే యూత్ లో రేవంత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ పద్మావతిని స్వయంగా ఇంటికెళ్లి ఆయన ప్రచారానికి రావాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇంటికొచ్చి మరీ ఆహ్వానించడంతో రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళాలని అనుకున్నట్లు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతల మధ్య వచ్చిన యూనిటీ ఆ తరవాత కూడా అలానే ఉంటుందో లేదో చూడాలి . 

పన్నెండేళ్ల క్రితం వైఎస్సే పక్కన పెట్టాడు.. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా?

  నిన్న జరిగిన ఎపి క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై దేవినేని ఉమ మాట్లాడుతూ, నిన్న క్యాబినెట్ లో ఒక తీర్మానం చేయబడింది అని 2007లో ఆనాటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ జీవో ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాస్తే ఐఎంపీఆర్ సంబంధిత శాఖ కోర్టులో కేసులు వేసే విధంగా, ప్రాసిక్యూట్ చేసే విధంగా ఆనాడు జీవో తీసుకొచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా, స్థానిక మీడియా ప్రధాన ప్రతిపక్షాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోజు పోరాటం చేస్తే ఆ జీవోను పక్కనబెట్టారు అని ఉమ అన్నారు. మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారం నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, ఈటీవీ, టివీ5 ఇవన్నీ ఎల్లోమీడియా అని వాటి సంగతి తేలుస్తా అని జగన్ అన్నారని దాంట్లో భాగంగా నాలుగు నెలలులోనే తండ్రి ఇచ్చిన జీవోకే నగిషీలూ చెక్కాడన్నారు దేవినేని ఉమ. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కొత్త కొత్త అర్ధాలిచ్చే విధంగా ఎవరు అయినా వార్తలు రాస్తే సంబంధిత శాఖ అధికారులు పరువు నష్టం దావా వేయాలని, కోర్టుకెళ్లాలని, ప్రాసిక్యూట్ చేయాలని జగన్ సూచించారని అన్నారు. దీనిపై నిన్న క్యాబినెట్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధిత శాఖలు, ప్రిన్సిపల్ సెక్రెటేరియట్స్ అందరికీ అధికారాన్ని ఇస్తూ తీర్మానం చేశారని ఇది చాలా దురదృష్టకరమని, ప్రతి సామాన్యుడు ఈరోజున ఎటువంటి అన్యాయం జరిగినా మీడియా ద్వారానే నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అలా ప్రశ్నించే వారి అందరిపై జగన్ కేసులు పెట్టాలని చూస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. 

ఏపీలో కార్మికులకు వరాల జల్లు కురిపిస్తున్న జగన్ సర్కార్.....

  ఏపీలో ఆర్టీసీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది జగన్ సర్కార్. ఇప్పటికే సంస్థను ఆర్టీసీ విలీనం చేసిన ప్రభుత్వం తాజాగా వెయ్యి కోట్లతో కొత్త బస్సులను కొనాలని నిర్ణయించింది. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. ఆర్టీసీ బలోపేతం పై నిఘా పెట్టింది ఏపీ సర్కార్. సంస్థల్లో కొత్త బస్సులను కొనాలని నిర్ణయించారు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పాడైపోయిన బస్సుల స్థానంలో మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కొత్త బస్సులు తీసుకువాలని నిర్ణయించారు. ఇందు కోసం వెయ్యి కోట్ల టాంబ్ లోన్ తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్న అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ బలోపేతంపై చర్చించారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేల సాయం, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం పది వేలకు పెంచాలని నిర్ణయించారు. నిపుణుల కమిటీ సూచనలతో ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. డిసెంబర్ ఇరవై ఒకటిన వైఎస్సార్ నేతన్న హస్తం పేరుతో పథకం ప్రారంభించనుంది. మరోవైపు లా కోర్సులు చేసి కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టే జూనియర్ లాయర్ లకు నెలకు ఐదు వేల స్టైఫండ్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది జగన్ సర్కార్  . బార్ అసోసియేషన్ లో నమోదైన మూడేళ్లలోపు ఉన్న జూనియర్ లాయర్లకు ప్రోత్సాహం ఇవ్వనుంది ప్రభుత్వం. మరోవైపు హోంగార్డుల జీతాలను నెలకు పధ్ధెనిమిది వేలు నుంచి ఇరవై వేల మూడు వందలకు పెంచేందుకు కేబినెట్ ఒప్పుకుంది.ఆర్టీసీ బలోపేతానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి జగన్ సర్కార్ కార్మికుల మనసు దోచుకుంటోంది అనే చెప్పుకోవాలి. ఇవి కేవలం మాటలకే పరిమితమవుతాయా లేక నిజంగా చేతల్లోకి వస్తాయా అనేది మాత్రం వేచి చూడాలి. 

పొలిట్ బ్యూరోలో పలు కీలక అంశాలపై చర్చించనున్న టీడీపీ నేతలు...

  భవిష్యత్ కార్యాచరణ కోసం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. కోడెల శివప్రసాద్ తో పాటు గోదావరి పడవ ప్రమాదం మృతులకు సంతాపం తెలపనున్నారు తెలుగు తమ్ముళ్ళు. అలాగే తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న నేతలు.. ఈ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చలు జరపనున్నారు నేతలు. వీటితో పాటు భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చలు జరపనున్నారు.  పార్టీ సంస్థా గత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ కమిటీలు మండల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ కమిటీలను నియమించాలని కొద్ది రోజులుగా పార్టీ అధినేత కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యనాయకులతో భేటీలు కూడా జరుగుతున్నాయి. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఈ సారీ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలనే ఒక కొత్త ఆలోచన తలపెట్టిన నేపధ్యంలో దానికి సంబంధించి ఒక ఎన్నికల కమిటీని కూడా నియమించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించుకుందని, దానిలోని ఆంక్షలను ఈ రోజు పొలిట్ బ్యూరోలో ప్రధానంగా చర్చించనున్నారు పార్టీ నేతలు.  వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటునటువంటి కొన్ని నిర్ణయాలపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా కొన్ని ఆందోళన కార్యక్రమాలను, కొన్ని నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టింది. కొన్ని పథకాలను నిలిపి వేయడం వల్ల ప్రజలపై భారం పడుతుందనేటువంటి ఆలోచనతో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇకముందు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారు.వీటితో పాటు రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల పరంగా ఎటువంటి పనులతో ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉందనే అంశంపై కూడా ప్రధానంగా పొలిట్ బ్యూరోలో చర్చిస్తారని సమాచారం.  ముఖ్యంగా నిర్మాణ రంగంలోని  ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి నెలకొంది. రియలెస్టేట్ పడిపోయినటువంటి కారణంతో మొత్తం రెవిన్యూ పడిపోయినటువంటి పరిస్థితి వచ్చిందని ఇలా ప్రభుత్వం తీసుకుంటునటువంటి నిర్ణయాల వల్ల ప్రజలపై ఎటువంటి భారం ఉంటుందని ,ప్రభుత్వం ఏరకంగా నష్టపోతుందనే అంశాలపై చర్చలు జరపనున్నారు నేతలు. రాష్ట్రం ఏరకంగా నష్టపోతుందనే అంశాలపై కొంత లోతుగా చర్చించేందుకు ఈ రోజు పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం పధ్ధెనిమిది మంది పొలిట్ బ్యూరో సభ్యులకు గానూ పదమూడు మంది దాదాపు ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. కొంతమంది అనారోగ్య కారణాలతో ఈ రోజు మీటింగ్ కి రాలేకపోయారు. దాదాపు రెండు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది.మొత్తం మీద ఈ భేటీలో చాలా ముఖ్యమైన అంశాల పై చర్చలు జరపబోతున్నారని సమాచారం.

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్టీ

    ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది పోలవరం ప్రోజెక్టు వ్యవహారం. నిర్మాణ పనులు మొదలై ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి, అయినా నేటికీ అసంపూర్తిగానే మిగిలింది. ఆర్ధిక సాంకేతిక కారణాల సంగతెలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడింది, ఈ తరుణంలో పోలవరం పనులను కొలిక్కి తెచ్చేందుకు టిడిపి ప్రయత్నం చేసింది. అప్పటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాయి. అవన్నీ తట్టుకొని దాదాపు డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది కదా అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి.టిడిపి ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పైపెచ్చు ప్రాజెక్టు పనుల్లో అనేక అక్రమాలు జరిగే భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు గుప్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. పోలవరం విషయంలో తామేదో గొప్పలు సాధించినట్టు అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పలు పోతున్నారు కానీ, ప్రజల్లో మాత్రం అనేక సందేహాలు తలెత్తాయి. ప్రాజెక్టు పనులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయో అనేది సస్పెన్స్ గా మారింది రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుందా లేక కేంద్రానికి వదిలేస్తుందో అన్న సంశయం అటు అధికారవర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చోటుచేసుకుంది. ఇదంతా ఒకెత్తయితే కేంద్రం మాత్రం పోలవరం పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదికలు రప్పించుకుంటూనే మరో పక్క బీజెపీ రాష్ట్ర నేతల ద్వారా కూడా సమాచారం రాబడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు పోలవరంలో అనేక అక్రమా లు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీనికి తోడు వర్షాకాలం కావడంతో పనులను ఆపేస్తున్నామని మళ్లీ నవంబర్ లోనే తిరిగి నిర్మాణం మొదలవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కానీ, ఎక్కడా ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని ప్రతి పక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొంతకాలంగా బీజేపీ నేతలు చేపడుతున్న పోలవరం యాత్రలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టులో బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు పోలవరాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులతో కాంట్రాక్టు ఏజెన్సీలతో సమావేశమై ప్రాజెక్టు స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం పర్యటనకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పార్టీ అధిష్ఠానానికి పంపించారు. ఈ నెలలో బిజెపి రాష్ట్ర బృందం మరోసారి పోలవరం యాత్రను చేపట్టింది. కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లిన ఈ బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పలు వివరాలు సేకరించారు, ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి ఒక నివేదిక అందజేశారు. ఈ నివేదికలో పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి, ఎప్పటి నుంచి పనులు నిలిపివేశారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వంటి పలు అంశాలను ఈ నివేదికలో వారు పొందుపరిచారట. ఆ నివేదికనే అప్పటికప్పుడు అధ్యయనం చేసిన కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారుకు తాఖీదులు పంపారు. తాజా పరిస్థితులలో ఈ నెల ఇరవైయ్యవ తేదీ తరువాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించాలని కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇదిలా ఉంటే బిజెపి నేతలు పోలవరం టూర్ చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసపెట్టి కమలనాథులు ఎందుకు పోలవరం యాత్ర చేస్తున్నారు, దీని వెనకున్న మర్మం ఏంటి, అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో అని అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు టిడిపి వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మాకి ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయితే చాలని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బలంగా కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఎప్పుడు ఊపందుకుంటాడేయో.  

భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఏపీ పోలీసులు...

  ఈ మధ్య కాలంలో మత్తు ద్రవ్యాల విక్రయం అధికమవుతోంది. ప్రభుత్వం ఎన్ని సోదాలు, ఎన్ని తనిఖీలు చేపట్టినా మత్తు ద్రవ్యాల రవాణాకు అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రభుతం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ద్రవ్యాల రవాణా తగ్గుముఖం పట్టదని స్పష్టమవుతోంది.సాధారణంగా మనకు ఎక్కువ మోస్తారు లో పట్టుబడేది గంజాయి. కృష్ణా జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.  ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్ పరిధిలోని పొట్టిపాడు టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా టెంపో ట్రావెల్స్, మినీ బస్ లో గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబట్టారు. అరకు నుండి కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు వెళ్తున్న టెంపో ట్రావెలర్స్ మినీ బస్ లో గంజాయి తరలిస్తున్నారు. దాదాపు రెండు వందల నలభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పది మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు గన్నవరం పోలీసులు.  మరో వైపు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నలభై కేజీల గంజాయి పట్టుబడింది. దీనిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.వీరి పై కఠిన చర్యలు చేపట్టి ఇలాంటి మత్తు పదార్ధాలు ఎంతటి ప్రమాదకరమో తెలియజేసే చర్యలు చేపట్టేలా పోలీసుల చర్యలు తీసుకోవాలి. పోలీసులు తనిఖీలు ఇంకాస్త ముమ్మురం చేయ్యాలని ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు చేపడితే కానీ వీటిని నిష్క్రమించలేమని వెల్లడవుతోంది.ఇక జగన్ సర్కార్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

కేశవరావు తో సీఎం కేసీఆర్ ఆర్టీసీ పై చర్చలకు సిద్ధంగా ఉన్నారా?

  నేడు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పార్లమెంటరీ పార్టీనేత కే కేశవరావు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి మరి కేసీఆర్తో సమావేశమయ్యారు కేకే. తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్న ఆర్టీసీ సమ్మెపై ఇద్దరు చర్చించనట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్ఎస్ నేతల్లో కేకే ఒక్కరే మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం కార్మికుల మధ్య చర్చలు జరగాలన్నారు. చర్చలకు మధ్యవర్తిగా ఉంటానని ఆయన ప్రకటించారు. కేసీఆర్, కేకే మీటింగ్ లో హోమ్ మంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. సీఎం చాంబరులో కేశవరావుతో పాటు హోం మంత్రి మహమద్ అలీ సమావేశమయ్యారు.  ఉదయం సీఎం ఆఫీసు నుంచి కేకే కు పిలుపు రావడంతో కేకే ప్రగతి భవన్ కు వెళ్లారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ తరపున టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు చాలా మంది సీనియర్లు మంత్రుల ఎంతమంది ఉన్నప్పటికీ చర్చలు జరగాలి చర్చకు మధ్యవర్తిగా వహిస్తానని ముందుకొచ్చింది మాత్రం కేశవరావు ఒక్కరే. కాని కేశవరావు ముందుకొచ్చిన తర్వాత కార్మికుల నుంచి మంచి ఫలితం వచ్చింది. కార్మికులు కేశవరావు మధ్యవర్తిగా ఉంటే మాకేం అభ్యంతరం లేదు చర్చకు మేం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.కానీ ప్రభుత్వం నుంచి కేశరావుకి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఆయన సీఎంను కలిసేందుకు సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినట్టుగా కూడా కేశవరావునే స్వయంగా చెప్పారు. కానీ సీఎం అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆ చర్చలు జరగలేదు. మంచి జరుగుతుందంటే తను ఇప్పుడు కూడా చర్చ జరిపేందుకు మధ్యవర్తి వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేశవరావు వెల్లడించారు.ఇక చర్చలు జరిగి సమ్మేకు ఒక పరిష్కారం వస్తోందో లేదో వేచి చూడాలి.