హైదరాబాద్ బిహెచ్ఇఎల్ లో ఉద్యోగిని ఆత్మహత్య..!!

  హైదరాబాద్ బిహెచ్ఇఎల్ లో ఒక ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆర్థిక విషయాలు, కుటుంబ కష్టాలు మరణానికి కారణం కాదని సమాచారం. తోటి ఉద్యోగి నుంచి ఎదురైన వేధింపులే ఆమె బలవన్మరణానికి అసలు కారణం అని సూసైడ్ నోట్ లో ఉంది. ఆత్మహత్యకు పాల్పడిన నేహా చోక్సి రాజస్థాన్ కు చెందిన మహిళ. ఆరు నెలల క్రితం భోపాల్ నుంచి హైద్రాబాద్ బి.హెచ్.ఇ.ఎల్ కు బదిలీ అయ్యారు. కుటుంబంతో కలిసి మియాపూర్ లోని భాను టౌన్ షిప్ లో నివాసముంటున్నారు. ఆఫీసులో డిజిఎం కిషోర్ తో పాటు తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేకే ఆమె చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ లో రాసి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బి.హెచ్.ఇ.ఎల్ లో నేహా అకౌంట్స్ విభాగంలో పని చేస్తుంది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు ఏడుగురు మంది తనను వేధింపులకు గురి చేశారని సూసైడ్ నోట్ లో నేహా పేర్కొంది. విషయం తెలుసుకున్న భర్త తీవ్ర విషాదానికి గురి అయ్యాడు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నాలుగో రోజు కూడా నిరాశ చెందిన ధర్మాడి సత్యం బృందం...

ఆపరేషన్ రాయల్ వశిష్ట ఆగిపోయినట్టేనా, నీళ్లలో మునిగి పోయిన బోటు వెలికి తీయడం అసాధ్యమా, నాలుగు రోజులు శ్రమించిన ధర్మాణి సత్యం బృందం ఏమీచేయలేకపోయిందా, అవును అనే చెప్పాలి కచ్చులూరులోని పరిస్థితి చూస్తుంటే. బోటు ఆపరేషన్ పై ధర్మాణి సత్యం ప్రాంతం నిరాశపడింది, బోటు కోసం వేసిన ఐరన్ రోప్ లు పైకి రావడంతో సత్యం బృందం షాక్ కు గురైంది. ఇప్పుడు విశాఖ నుంచి దుబాసీల వస్తే తప్ప బోటును వెలికి తీసే అవకాశాలు లేవు అంటోంది ధర్మాడి సత్యం బృందం. నాలుగో రోజు కూడా ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. మూడో రోజు చేసిన ప్రయత్నంలో రోప్ లు బయటకు లాగితే బోటు రెయిలింగ్ మాత్రమే బయటకొచ్చింది బోటు మాత్రం నీళ్ల లోనే ఉండి పోయింది. అయితే గజ ఈతగాళ్లు వచ్చి బోటుకు ఐరన్ రోప్ లు తగిలిస్తే గానీ బోటును బయటకు లాగలేమని చెప్తున్నారు ధర్మాడి సత్యం బృందం. ఈ నేపథ్యంలో దుబాసీలు తమకు సాయం చేయమని కోరగా నది లోపలికి వెళ్ళి బోటుకు తాడు కట్టేందుకు వారు సాహసించలేదు. ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యం బృందం సాంప్రదాయ బధ్ధంగా అదే తరహాలో ఒడ్డుకు లాగుతామని చెప్పారు. మరోవైపు మరైన్ కు సంబంధించిన అధికారులు కూడా అదే పధ్ధతిలో బోటును లాగాలని చెప్పి సత్యం బృందానికి సూచించడంతో అదే తరహాలో ప్రయత్నాలు జరుపుతున్నారు. బోటు బయటకు వచ్చేంతవరకూ ఇదే పధ్ధతి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. హుజార్ నగర్ పై ఆశలు వదులుకున్న టీఆర్ఎస్!!

  ఆర్టీసీ సమ్మెతో టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న ఉపఎన్నికల్లో మొదట టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన సిపిఐ ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మద్దత్తును వెనక్కు తీసుకుంది. మరోవైపు.. కార్మికులతో చర్చలు జరపకుండా మొండిగా వ్యవహరించడంతో టిఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోందని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత మొండిగా ఉందని సకల జనులు సమ్మె చేయకుండానే తెలంగాణ వచ్చిందా అని స్థానిక ప్రజలు తమని నిలదీస్తున్నారనీ ప్రచారంలో ఉన్న నేతలు చెప్తున్నారు. సమ్మె ప్రభావం లేదని బయటకు ఎంత చెబుతున్నా గ్రౌండ్ లెవల్ లో మాత్రం వ్యతిరేకత తెలుస్తుందంటున్నారు గులాబీ నేతలు.  ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాలు మద్దతివ్వడం, అధికార పార్టీని మరింత కలవరపెడుతోంది. దీనికితోడు కేసీఆర్, కేటీఆర్ ప్రచారానికి రాకపోవడం కూడా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు.ఈ నెల నాలుగు, పది, పదకొండు, పదిహేను తేదీల్లో కేటీఆర్ ప్రచార సభలు, రోడ్ షోలుంటాయని పార్టీ ప్రకటించింది. కానీ, నాలుగో తేదీ న హుజూర్ నగర్ టౌన్ లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ తిరిగి మళ్ళీ అటు వైపు చూడలేదు. ఇక వర్షం కారణంగా కేసీఆర్ సభ కూడా రద్దయింది. ఉప ఎన్నిక ప్రచారం రేపు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుండగా కేటీఆర్ ప్రచారానికి రాకపోవటం, సీఎం సభ రద్దు కావడం అధికార పార్టీ కేడర్ ను కలవరపెడుతోంది. సీఎం సభలో పాల్గొని మాట్లాడితే కొంతలో కొంత కలిసి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి సమ్మె సెగ హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ కు తాకేలా ఉందని అంటున్నారు.

అస్సంలో కూడా మునిగిపోయి బోటు, అందరి ప్రాణాలు కాపాడామంటున్న అధికారులు.....

  రోజు రోజుకు బోటు ప్రమాదాల సంఖ్య అధికమవుతోంది.గోదావరి బోటు ప్రమాదం జరిగి నెల రోజులు కావొస్తున్న ఇప్పటికి బోటు బయటకు రాలేదు. అచ్చం అలాంటి ఘటనే అస్సాంలో కూడా చోటు చేసుకుంది. అదృష్టవ శాతు ప్రమాదంలో మాత్రం ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. అధికారుల నిర్లక్షాలే ఇందుకు ముఖ్య కారణమా, లేక బోటు యజమాన్యమో తెలీదు కానీ ప్రజల ప్రాణాలతో మాత్రం చెలగాటమాడుతోంది ఈ సిబ్బంది.అస్సాంలో జరిగిన పడవ ప్రమాదంలో అందరినీ రక్షించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. సోనిత్ పూర్ జిల్లాలో జియో భరణి నదిలో ప్రమాదం జరిగింది.  బిహా గావించి తేజ్ పూర్ లోని పంచ్ మహల్ ప్రాంతానికి వెళుతుండగా ఒక్క సారిగా పడవ బోల్తా పడినట్లుగా అధికారులు తెలిపారు. ప్రతి గురువారం ఏర్పాటు చేసి సంత కోసం స్థానికులు పంచ్ మహల్కు వెళ్తుంటారు. కూరగాయలు ఇంటికి అవసరమైన వస్తువుల కొనుక్కుందామని వెళతారు. అలా వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. పడవ ప్రమాదం సమయంలో మోటర్ వాహనాలు కూడా అందులో ఉన్నాయి. పడవలో ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో సుమారు డెబ్బై నుంచి ఎనభై మంది వరకు ఉన్నట్లుగా వదంతులొచ్చాయి. వీరిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు క్షేమంగా వచ్చారు. పడవ ప్రమాదం సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ ప్రమాద సమయంలో పడవలో ఉన్నది యాభైమందేనని తేల్చారు. పడవ చిన్నదవడం అలాగే జనాలతో పాటు సరుకులు భారీగా ఉండటంతో ప్రమాదం జరిగింది. లోతు ఎక్కువ లేకపోడంతో చాలామందిని స్టేట్ రెస్క్యూ టీమ్స్ రక్షించగలిగాయి.  

మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం...

  తాత్కాలిక మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచార యత్నం చేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరిట తెలంగాణా ప్రభుత్వం నడిపిస్తున్న బస్సుల్లో తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు మంచిర్యాల నుంచి ఒక మహిళా కండక్టర్, డ్రైవరు చెన్నూరు వైపు వెళ్లారు. రాత్రి తిరిగి చెన్నూరు నుండి ఏడున్నర గంటల ప్రాంతంలో మంచిర్యాల వస్తుండగా మార్గ మధ్యంలో అటవీ ప్రాంతలో మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్ అత్యాచార యత్నం చేశాడు. చెన్నూరు నుండి మంచిర్యాల దారి మధ్యలో ఉన్న స్టాపుల్లో బస్సులో ఎక్కేందుకు ప్రయాణికులు సిధ్ధంగా ఉన్నా కూడా ఎక్కడా బస్సు నిలపకుండా ఓ పథకం ప్రకారం అతను మితిమీరిన వేగంతో అటవీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెను లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలో బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి అతన్నుంచి తప్పించుకునేందుకు బిగ్గరగా అరవడంతో.. జయపూర్ సమీపంలోని జూనియర్ కళాశాల ప్రాంతంలో స్థానికంగా ఉన్న కొందరు గమనించారు. జయపూర్ బస్టాప్ చేరుకునే సరికి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వారంతా అక్కడికి చేరుకొని మహిళా కండక్టర్ ను కాపాడటం జరిగింది. పోలీసులు వెంటనే డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అత్యాచారయత్నం కాదు అని కేవలం అసభ్యంగా ప్రవర్తించాడని అక్కడి పోలీసులు అంటున్నారు. బాధితురాలు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సంకోచించింది ఎందుకంటే ఈ విషయం బయట తెలిస్తే తనకు పరువు ఏమవుతుందో అని ఆలోచించి వెనుకాడిందని పోలీసులు చెప్తున్నారు.  

ప్లాస్టిక్ ని తుడిచి పెట్టాలాన్న లక్షంతో ఉన్న జిల్లా కలెక్టర్.....

  శ్రీ దేవసేన అధికారులతో కలిసి రంగంపల్లి నుంచి శాంతి నగర్ వరకు రాజీవ్ రహదారి పై ఇరువైపులా ప్లాస్టిక్ ని ఏరివేశారు.స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆస్తమా వ్యాధికి ముఖ్య కారణం ప్లాస్టిక్ వస్తువులేనని పర్యావరణానిని కూడా పాడు చేస్తుంది అని వెల్లడించారు . ప్రతి ఒక్కరూ తమ చుట్టు పక్కల ఉన్న ప్లాస్టిక్ ను ఏరివేసే కార్యక్రమం చేయాలన్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు తనిఖీలు చేసి ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారస్తులకూ ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడినట్లు తేలిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఆస్తమా పెరిగిపోవడానికి సగం కాలుష్యానికి కారణమైతే ఇంకో సగం ఈ ప్లాస్టికే కారణమని కాబట్టి అందరం కలిసి దీన్ని పాటిస్తే మాత్రం మనకి ఇంత పెద్ద పెనుభూతాన్ని పారదోలే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి అందరు కూడా ఎవరి పరిసరాల్లో వాళ్లు ప్లాస్టిక్ ను సేకరించి దాన్ని సురక్షితంగా డిస్పోజల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఏ పనైనా మంచిపని ప్రజలకు ఉపయోగపడే పని, శానిటేషన్ వర్కర్ లు చేయాల్సిన పని అధికారులెందుకు చేయాలనే ప్రశ్న ఇక్కడ రాకూడదని ఎందుకంటే అందరం కలిసి చేస్తేనే ఎవరికి వాళ్ళకి వాళ్ళ బాధ్యత తెలిసి ఎక్కడా ప్లాస్టిక్ అనేది ఈ రకంగా పారేయకుండా ఉంటారు అని ఆయన వెల్లడించారు.టూత్ బ్రష్ నుంచి తల దువ్వుకునే దువ్వెన దగ్గర నుంచి సిమెంట్ కు వాడే బస్తాల దగ్గర్నుంచీ ఇవన్నీ నిజానికసలు భూమిలో పాతుకుపోయిన పరిస్థితి ఏర్పడిందని ఎవరి పరిసరాల్లో వాళ్లని ప్లాస్టిక్ ను నిషేధించి దాని సేకరించి జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని పూర్తిగా అన్ని నాలుగు మున్సిపాలిటీల్ లో అందరు అధికారులు కూడా చేయటం జరుగుతుంది.ఇలాంటి స్వచ్ కార్యక్రమాలను మరికొన్ని చేపడితే కానీ మనం రోగాలను అరికట్టలేమని వెల్లడించారు.  

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు...

  నిన్న మొన్నటి దాకా తమిళనాడు రాష్ట్రమంతటా భారీ వర్షాలతో.. ఊళ్లు సైతం వరదల్లో చిక్కుకు పోవటమే కాక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. మొన్ననే నైరుతి ఋతు పవనాలు వెనక్కు తగ్గాయన్న వాతవరణ శాఖ సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. కానీ రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో అన్నీ నీట మునుగుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో భారీగా వర్షాలు ముంచెత్తాయి. దీంతో వాగులు జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. నీలగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రవాణా స్తంభించి పోయింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఊటీ కొండల్లో భారీ వర్షం కారణంగా మూడు రోజుల పాటు పర్యాటక రైళ్లు రద్దు చేశారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు ఉండటంతో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఇక భవాని సాగర్ డ్యామ్ పూర్తిగా నిండి పోవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ అప్రమత్తం చేశారు. మరోవైపు తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భారీ వర్షాలతో కొడివేరి డ్యామ్ కు వరద నీరు పోటెత్తింది. దీనితో డ్యామ్ అన్ని గేట్లను పైకి ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. వర్షాల బారి నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతారో వేచి చూడాలి.

నేడు హైకోర్ట్ తీర్పు పై ఆధారపడ్ద రేపటి తెలంగాణ బంద్...

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకి ఉధృతంగా మారుతోంది. రోజురోజుకు తమ ఆందోళనలు పెంచుతున్నారు కార్మికులు.ఆర్టీసి జెఎసి నేతలైన కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి, వెంకన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర జెఎసి నేతలను అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. రేపటి తెలంగాణ బంద్ నేపథ్యంలో హైకోర్టుకు బయల్దేరిన ఆర్టీసి జెఎసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.  ఆర్టీసీ సమ్మె నేపధ్యంలోనే రేపు తెలంగాణ బంద్ కు పిలునిచ్చింది జేఏసీ. బంద్ కు తాము సైతం సై అంటున్నారు ఉద్యోగ కార్మిక సంఘాలు. మరోవైపు విద్యార్ధి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ఇవాళ హై కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రేపు బంద్ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. తెలంగాణ బంద్ కు అఖిల పక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. అయితే ఇవాల్టి కోర్టు విచారణలో ఏం తేలుతుందన్న టెన్షన్ నెలకొంది. చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని గతంలో అభిప్రాయ పడిన కోర్టు, ప్రభుత్వం కార్మిక సంఘాలు చర్చించుకుని పధ్ధెనిమిదివ తేదీన సారాంశాన్ని తమ ముందుంచాలని స్పష్టం చేసింది. అయితే కార్మిక సంఘాలు చర్చలకు సిద్ధమని చెబుతున్నా అలాంటి ప్రసక్తే లేదంటున్నారు తెలంగాణ సిఎం కెసిఆర్.మరి కోర్టు విచారణలో ఏం తెలబోతుంది. రేపు బంద్ ఉంటుందా ఆగుతుందా లేదా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. 

పశ్చిమ బెంగాల్ లో అక్రమ సొరంగం కూలి ఒకరు మృతి...

పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది, అసన్సోల్ జిల్లాలో ఉన్న కుల్తీ కోల్ మైన్ లో బొగ్గు పెల్లలు కూలాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు అందులో చిక్కుకున్నారు, వీరిలో ఒకరి మృతదేహాన్ని ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఇటీవల నలుగురు వ్యక్తులు కోల్ మైన్ దగ్గర అక్రమంగా తవ్వకాలు చేపట్టారు, కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా ఎవరూ గమనించలేదు. ఓ సొరంగం తవ్విన తర్వాత దానికి ఎటువంటి ఆధారాన్ని ఉంచలేదు, దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు కుప్పకూలింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు, బయట ఉన్న మరో వ్యక్తి పారిపోయాడు. అయితే ముగ్గురు వ్యక్తులు లోనికి వెళ్ళిన తరవాత మిథేన్ గ్యాస్ ప్రభావంతో స్పృహ కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ తరవాత సొరంగ మార్గం కూలడం జరిగి ఉంటుందని ఈ సీ ఎల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసిన సిబ్బంది మరో ఇద్దరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అక్రమంగా తవ్వకాలు జరిపేవారి గుట్టు రట్టయ్యే అవకాశముంది. అక్రమంగా తవ్వకాలు జరిపి ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తూ అమాయక ప్రాణాలు బలిగొంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకుని వారికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి ఆగడాలకు మరోసారి పాల్పడకుండా చేయాలని కోరుతున్నారు.    

ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా..?

  ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా ఉండదా అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా తీసుకున్న భూముల్లో నిర్మాణాలకు భారీ వ్యయం అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. పైగా భారీ నిర్మాణాలకు ఆ భూములు సరైనవి కావని కూడా మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలోనే ప్రకటించారు. అందుకే రాజధాని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేయడం కోసం నిపుణులతో ఒక కమిటీని నియమించింది ప్రభుత్వం, ఇందు కోసం విధి విధానాలను జారీ చేసింది. నిపుణుల కమిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. సమాచార సేకరణ కోసం అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి అధికారాన్ని కమిటీకీ ఇచ్చింది ప్రభుత్వం. క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి వివిధ వర్గాలతో కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. కమిటీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది ఇతర అవసరాలను సీఆర్డీయే సమకూరుస్తుంది. నిపుణుల కమిటీ ప్రభుత్వానికి మధ్య నోడల్ ఆఫీసర్ గా సీఆర్డీయే అదనపు కమిషనర్ విజయకృష్ణన్ వ్యవహరిస్తారు. కమిటీ తొలి సమావేశం నిర్వహించిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలియజేసింది. రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వం చేసిన నిపుణుల కమిటీ త్వరలోనే రాష్ట్ర మంతా పర్యటిస్తోందని వెల్లడించారాయన. రాజధాని ఎక్కడ వుండాలి, ఎలా ఉండాలో కూడా ఆ కమిటీ సూచిస్తుందన్నారు. ఆ నివేదికపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు బొత్స. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని హై కోర్టు కోసం వినిపిస్తున్న డిమాండ్ లు కూడా అందులో భాగమేనని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స.

మళ్ళీ విచారణకు సిద్దమైన విశాఖ భూ కుంభకోణం కేసు...

ఒకప్పుడు విశాఖ భూ కుంభకోణం కేసు హాట్ టాపిక్ గా హడావిడి చేసింది అన్న విషయం అందరికి తెలిసిందే.విశాఖ భూ కుంభకోణంపై మళ్లీ విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. విశాఖ పరిసర మండలాల్లో భూముల ఆక్రమణలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం సహా పలు అంశాలను పరిశీలించనుంది. రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షునిగా మరో రిటైర్డ్ ఐఏఎస్ వైవి అనూరాధ సభ్యురాలిగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి టి భాస్కర్ రావు సభ్యులుగా నియమించారు. మూడు నెలల పాటు ఈ సిట్ సభ్యుల పదవీకాలం ఉంటుంది. విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించి  గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున భారీ స్థాయిలో  దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి దస్తావేదులు మాయమయ్యాయి. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణ అపట్లో విశాఖ భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం తెరమీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పట్లో మంత్రులు కూడా ఒకళ్ల మీద ఒకళ్లు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి మనకు తెలిసిన విషయమే. మంత్రి గంటా అయితే స్వయంగా విచారణను ఎదురుకోవటానికి సిద్దంగా ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఈ విషయం మీద గంటాని టార్గేట్ చేసి అతని పై కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో అప్పట్లోనే సిట్  ఏర్పాటు చేసి కొంత మేరకు విచారణ జరిగినప్పటికీ అది ఇంకా కొలిక్కి రాని పరిస్థితి.

నేడు కోర్ట్ విచారణ లో జగన్ కు ఊరట లభిస్తుందా?

  అక్రమాస్తుల కేసులో ప్రతి వారం జగన్ కోర్టుకు రావల్సిందే అంటూ సిబిఐ వేసినా కౌంటర్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ మొదలు కాబోతోంది. ప్రతి వారం హాజరు మినహాయింపు కోరుతూ జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే సీబీఐ కోర్టులో రెండు సార్లు, హైకోర్టులో ఒకసారి పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ లను కోర్టులు తిరస్కరించాయి. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికైన తరువాత వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ మరో పిటిషన్ ను సీబీఐ కోర్టులో దాఖలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారనీ ప్రతి వారం కోర్టుకు హాజరు కావడం వీలు కాదని మినహాయింపు ఇవ్వాలని కోర్టును పిటిషనర్ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేసింది. గతంలో అరెస్టై జైల్లో ఉన్నప్పుడే సాక్షుల్ని ప్రభావితం చేయటానికి జగన్ ప్రయత్నించారని అప్పట్లో ఎంపీ మాత్రమేనని ఇప్పుడు సీఎం అయినందున సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోర్టు దృష్టికి సిబిఐ తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ మోహన్ రెడ్డి తరపున దాఖలు చేసిన పిటీషన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దానికి సీబీఐ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ అన్నది ఇప్పుటికే చర్చ నీయాంశంగా మారి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటికి సంబంధించి సీబీఐ కూడా చాలా కౌంటర్ పిటిషన్ లో కొన్ని కీలక అంశాలను హై కోర్టు దృష్టికి తీసుకురావటం జరిగింది. గతంలో పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఏ అంశాలనైతే కోర్టు చెప్పిందో అవి తప్పని సరిగా పాటించాలని సీబీఐ వాదించింది. ఈ రోజు విచారణలో జగన్ కు ఏమైనా ఊరట వస్తుందో లేదో లేక సీబీఐ కౌంటర్లకు కోర్టు విలువనిస్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది. 

కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు సీరియస్.. ప్రజలు తిరగబడితే తట్టుకోలేరు!!

  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సమ్మె ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ఎందుకు ఆపలేకపోయారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అదేవిధంగా ఇంతవరకు ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఇప్పటికే సమర్థుడైన ఇన్‌చార్జి ఉన్నారని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే, ఆయన సమర్థవంతుడు అయినప్పుడు.. ఆయననే ఎండీగా నియమించవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె జరుపుతుంటే ఎందుకు ఆపలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరికొంత మంది ఆర్టీసీకి మద్దతు తెలిపితే ఆందోళనను ఎవరూ ఆపలేరని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులని... వారు తిరగబడితే ఎవరూ ఆపలేరని కోర్టు వ్యాఖ్యానించింది.

పిఎంసీ ఖాతాదారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు...

    పీ ఎం సీ బ్యాంక్ ఖాతాదారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది, బ్యాంకు వితడ్రాలపై రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షలను సవరించాలంటూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పీ ఎం సీ లో నాలుగు వేల మూడు వందల యాభై ఐదు కోట్ల భారీ స్కామ్ జరిగినట్టు ఇటీవల బయటపడింది. దాంతో ఆరు నెలలకు నలభై వేల రూపాయలకు మించి నగదు విత్ డ్రా చేసుకోకుండా ఆర్ బీ ఐ పరిమితులు విధించింది. దాంతో అవసరాలకు తమ డబ్బు బ్యాంక్ నుంచి ఎలా తీసుకోవాలో తెలియక ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర మనోవేదనకు గురి కావడంతో ఖాతాదారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరో ఇద్దరు గుండె పోటుతో మరణించారు. ఈ నేపథ్యం లో బి ఎస్ కుమార్ మిత్ర అనే ఖాతాదారుడు పరిమితిని ఎత్తివేసేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఐదు వందల ఖాతాదారుల తరపున తాను పిటిషన్ వేస్తున్నట్లు సుప్రీం కోర్టు కు తెలిపారు. అయితే ఈ పిటిషన్ ను తాము ఆమోదించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఊరట కోసం ఖాతాదారులు హైకోర్టు ను ఆశ్రయించవచ్చని సూచించింది. దీనిపై ఓ లాయర్ మాట్లాడుతూ ఎన్ని నియమాలు ఉన్నా సరే సుప్రీం తిరస్కరించినా తమ డబ్బు భద్రంగానే ఉంటుందని అన్నారు.  

పిఎంసీ ఖాతాదారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు...

    పీ ఎం సీ బ్యాంక్ ఖాతాదారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది, బ్యాంకు వితడ్రాలపై రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షలను సవరించాలంటూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పీ ఎం సీ లో నాలుగు వేల మూడు వందల యాభై ఐదు కోట్ల భారీ స్కామ్ జరిగినట్టు ఇటీవల బయటపడింది. దాంతో ఆరు నెలలకు నలభై వేల రూపాయలకు మించి నగదు విత్ డ్రా చేసుకోకుండా ఆర్ బీ ఐ పరిమితులు విధించింది. దాంతో అవసరాలకు తమ డబ్బు బ్యాంక్ నుంచి ఎలా తీసుకోవాలో తెలియక ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర మనోవేదనకు గురి కావడంతో ఖాతాదారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరో ఇద్దరు గుండె పోటుతో మరణించారు. ఈ నేపథ్యం లో బి ఎస్ కుమార్ మిత్ర అనే ఖాతాదారుడు పరిమితిని ఎత్తివేసేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఐదు వందల ఖాతాదారుల తరపున తాను పిటిషన్ వేస్తున్నట్లు సుప్రీం కోర్టు కు తెలిపారు. అయితే ఈ పిటిషన్ ను తాము ఆమోదించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఊరట కోసం ఖాతాదారులు హైకోర్టు ను ఆశ్రయించవచ్చని సూచించింది. దీనిపై ఓ లాయర్ మాట్లాడుతూ ఎన్ని నియమాలు ఉన్నా సరే సుప్రీం తిరస్కరించినా తమ డబ్బు భద్రంగానే ఉంటుందని అన్నారు.  

ఆ కీలక పోస్ట్ కు జగన్ ఎవరిని నియమించబోతున్నారు?

  ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల్ని మార్చారు, కీలకమైన పోస్టుల్లో కొత్త వారిని నియమించారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను తీసుకొచ్చారు. ఇతర ప్రాధాన్య పోస్టులలో కూడా కొత్తాధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు ఇప్పటి వరకూ మూడు నాలుగు సార్లు జరిగాయి. కానీ ఒక పోస్టులో మాత్రం ఎవరినీ నియమించడం లేదు. ప్రభుత్వంలో కీలకమైన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మాత్రం ఇంకా ఎవరినీ నియమించలేదు.  అధికారంలోకి వచ్చిన వెంటనే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించాలని సీఎం జగన్ అనుకున్నారు. తెలంగాణ కేడర్ లో ఉన్న స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్ కు తెలంగాణ సర్కారు కూడా అనుమతినిచ్చింది.గౌరవం కోసం కేంద్రాన్ని కూడా జగన్ లేఖల మీద లేఖలు రాశారు. అయితే స్టీపెన్ డిప్యూటేషన్ కు కేంద్ర హోంశాఖ అంగీకారం తెలపలేదు. అప్పట్లో మూడు నెలలు సెలవు పెట్టిన స్టీఫెన్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేరిపోవటం అంతా ఖాయం అని అనుకున్నారు. కాని కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన తిరిగి తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో తనకు కేటాయించిన పోస్టులో చేరిపోయారు.  స్టీఫెన్ రవీంద్ర రాకపోవడంతో నిఘా విభాగాధిపతిగా కీలకమైన పోస్టుకు పలువురి పేర్లను సీఎం జగన్ పరిశీలించినట్లు తెలుస్తోంది. రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న ఆంజనేయలతో పాటు ఇతర ఐపీఎస్ అధికారుల బయోడేటాలూ జగన్ దగ్గరకే వెళ్లాయి. అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ ఓకే చెప్పలేదు. ప్రభుత్వానికి చెవులు కళ్లుగా పని చేసే ఇంటెలిజెన్స్ విభాగానికి బాస్ ను జగన్ ఎందుకు నియమించడం లేదనేది సస్పెన్స్ గా మారింది. ఆరునెలలుగా ఈ పోస్ట్ కు సమర్థవంతమైన అధికారి దొరకడం లేదా లేక కావాలనే ఖాళీగా ఉంచుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. స్టీఫెన్ రవీంద్ర కోసం మళ్లీ కేంద్రస్థాయిలో మరోసారి ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాలి.

వినూత్న ఆలోచనతో జగిత్యాల జిల్లా కలెక్టర్ 'మంకీ ఫ్రూట్ ట్రీస్'...

  హరితహారంలో మొక్కలు అందరూ నాటుతున్నారు. అయితే అందులో కొత్త దనాన్ని వెతికేది కొందరే ఉంటారు.వానలు వాపస్ రావాలి కోతులు వాపస్ పోవాలి ఇది హరితహారంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే చెప్పే మాట. వానలు రావాలంటే మొక్కలు నాటితే సరిపోతుంది. మరీ కోతులు వాపస్ పోవాలంటే ఏం చేయాలి అని అలోచించిన జగిత్యాల జిల్లా యంత్రాంగాం ఒక వినూత్న ఆలోచన చేసింది. అక్కడ ఉన్న వానర సైన్యాన్ని చూస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చేసే చేష్టలు చాలా దారుణంగా ఉంటాయి. ఇళ్లల్లోకి చొరబడి ఆహారాన్ని ఎత్తికెళ్తాయి, ఇల్లు పీకి పందిరి వేస్తాయి, ఇటీవల అడవిలో కంటే ఎక్కువగా ఊర్లలోనే ఉంటున్నాయి. వానలు రావటానికి మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మొక్కలు నాటితే వర్షాలు వాపస్ వస్తాయేమో కానీ కోతులు వాపస్ పోవు కదా. మాములుగా నాటే మొక్కల వల్ల కోతులకు ఆహారం దొరకదు కదా అందుకే ఎన్ని మొక్కలు నాటిన కోతుల బెడద మాత్రం ప్రజలకే తప్పటంలేదు.  జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ వినూత్న ఆలోచనతో కోతులు కోసం మంకీ ఫ్రూట్ ట్రీస్ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకు వంద బ్లాకుల గుర్తింపు జరిగింది. ఒక్కో బ్లాక్ లో మూడు వేల చెట్లు పధ్నాలుగు రకాల పళ్ల మొక్కలు నాటే ఏర్పాటు చేశారు.  అలా జగిత్యాల జిల్లా యంత్రాంగం కోతులు వాపస్ పోవటానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా వంద మంకీ బ్లాక్ లను గుర్తించి వాటి కోసం పళ్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే యాభై అటవీ బ్లాకులు మరో యాభై రెవిన్యూ పరిధిలోని బయట స్థలాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మంచి కార్యక్రమం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అంటున్నారు. వర్షాలు వాపస్ తెప్పించి కోతులు వాపస్ పంపుతామని అంటున్నారు. జగిత్యాల జిల్లాలో మొదటిసారి పెద్ద మొత్తంలో వన పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. కోతులు తినే పధ్నాలుగు రకాల మొక్కలను ఇప్పటికే తెప్పించారు. మరీ జిల్లా యంత్రాంగం చేసిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహన సేవల్లో మార్పులు చేసిన టీటీడీ...

  రోజుకు దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది తిరుమలే. తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం రాత్రి వాహన సేవల సమయంలో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం రాత్రి వాహన సేవలను ఎనిమిది గంటలకు ప్రారంభిస్తుండగా వచ్చే ఏడాది నుంచి రాత్రి ఏడు గంటలకే ప్రారంభించాలని నిర్ణయించింది టిటిడి. వాహన సేవల సమయంలో మార్పుల కారణంగా ఇకపై బ్రహ్మోత్సవాల సమయంలో ఊంజల్ సేవలను రద్దు చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కలియుగ వైకుంఠుడు పవిత్ర పుణ్యక్షేత్రంగా యుగయుగాల నుంచి భాసిల్లుతున్న క్షేత్రం తిరుమల. అందుకే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.  పూజించే వారిని రక్షించే వజ్ర పంజరం గా తన్మయించి స్తుతించే వారి ఆనంద రూపంగా మారింది తిరుపతి క్షేత్రం.అందుకే తిరుమలేశుని కోవెల నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది.సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులూ ఈ క్షేత్రంలో రద్దీ ఉంటూనే ఉంటుంది.  దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీనివాసుని దర్శనం కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటారు. గంటల సేపు క్యూలైన్ లలో నిల్చోని అరవింద దళాక్షుణ్ణి ఆర్తి తీరా దర్శించుకుంటారు. సాధారణ భక్తులే కాదు, సంపన్నులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయవేత్తలు క్యూలు కట్టే క్షేత్రం ఏదంటే అది తిరుమలే. అందుకే తిరుమల గిరులు ఎప్పుడూ జనసంద్రమే, శ్రీవారి దర్శనానికి వచ్చే వారు వస్తుంటే వెళ్లేవారు వెళ్తూంటారు. సాధారణ భక్తులు సర్వదర్శనంతో సంతృప్తి చెందితే కొందరు భక్తులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. మరికొందరు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సహస్ర కలశాభిషేకం, తోమాల, అర్చన, అభిషేకం మొదలైన సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్కొక్క సేవలోను ఒక్కో దివ్యానుభూతి పొందడం జరుగుతుంది. అందుకే వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తారు. చూసిన కనులే మళ్లీ మళ్లీ ఆ దేవదేవుడిని దర్శించుకుంటాయి. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు అన్నట్లుగా. ఎంతటి మహిమాన్విత క్షేత్రంలో ప్రతి రోజూ పండుగే, ప్రతి రోజూ ఉత్సవమే, ఏడాది పొడవునా దాదాపుగా నాలుగు వందల యాభై ఉత్సవాలు జరుగుతాయి.  ఏడాది పొడవునా ఏడుకొండల వాడికి ఎన్ని ఉత్సవాలు జరిగినా సంవత్సరానికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించాలని భక్త కోటి ఉవ్విళ్లూరుతోంది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతూ ఉండటంతో టీటీడీ కూడా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి మూడు నెలల మునుపు నుంచే తిరుమలలో ఏర్పాట్లను ప్రారంభిస్తారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసి భక్తులకు సంతృప్తికరమైన వాహన సేవ దర్శనంతో పాటు త్వరితగతిన మూల విరాట్ దర్శనం కల్పిస్తోంది టీటీడీ. శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో ఉదయం వాహన సేవ తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుండగా రాత్రి వాహన సేవ ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఉత్సవాలలోనే అతి ప్రాముఖ్యమైన గరుడసేవను మాత్రం టీటీడీ ఏడు గంటలకే ప్రారంభిస్తుంది.ఇక బ్రహ్మోస్తవాళల్లో రాత్రి వేళలో కూడా టీటీడీ దర్శనాలకు వాహనాలు తోడవుతాయని చెప్పుకోవచ్చు.

శ్రీశైల పుణ్య క్షేత్రంలో బయటపడ్డ భారీ అవినీతి...

  కర్నూల్ జిల్లాలో పవిత్ర పుణ్య క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో అవినీతికి అడ్డా మారబోతోందా అనేది ఒక ప్రశ్నగా మిగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది.శ్రీశైల దేవస్థాన పెట్రోల్ బంక్ లో అవకతవకలు జరిగాయి. ఆడిట్ లో యాభై లక్షల రూపాయల అవినీతి బయటపడింది. ఈ ఘటన పై ఆలయ ఈవో రామారావుకు తగిన చర్యలకు ఆదేశించారు. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ ఈవో విచారణకు ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానం పెట్రోల్ బంకులో అవకతవకలకు సంబంధించి ఆడిట్ లో యాభై లక్షల రూపాయల అవినీతి బయట పడింది. ఈ అంశానికి సంబంధించి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆలయ ఈవో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద విచారణ ఆదేశించారు.  దీనికి సంబంధించి శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు ఫిర్యాదు ఇవ్వడం తోనే ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు  పై స్థాయి అధికారులు కానీ ఈ అవినీతిలో అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఔట్ సోర్సింగ్ కి సంబంధించిన ఉద్యోగులే కాకుండా వీరికి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి కూడా సంబంధాలు ఉన్నట్టు సమాచారం అందింది. దీనికి సంబంధించి దాదాపు యాభై లక్షల రూపాయలు అవినీతి జరిగినట్టు ఆడిట్ లో బయటకు రావడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని తెలుస్తోంది.  ఔట్ సోర్సింగ్ కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఈ అవినీతికి పాల్పడ్డారో వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో రామారావు ఆదేశించినట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించి గత నాలుగు రోజుల క్రితమే వీళ్లిద్దర్నే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారని తెలుస్తోంది. వీరితో పాటు మరి కొంతమంది ఉన్నారు వీరు ఇద్దరే ఉన్నారా లేకుంటే వీరికి సంబంధించిన పై స్థాయి అధికారులు కూడా ఈ అవినీతి బాగోతంలో ఉన్నారా అనే దానిపైనా పోలీసులు సమగ్రమైన విచారణ చేపడుతున్నట్టు సమాచారం అదుతోంది.