లుకేమియా లక్షణాలు నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు!

లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ వస్తే శరీరంలో కొన్ని రకాల సంకేతాలు చూపిస్తుంది. ఎవరికైనా ఇవి సాధారణం కావచ్చు. లుకేమియా ఎలాంటి వ్యాధి అంటే వ్యక్తి లో బోన్ మ్యారో లింఫాటిక్లో బ్లడ్ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బోన్ మ్యారోలో లుకేమియా కణాలు త్వరగా పెరుగుతాయి. దీనివల్ల శరీరంలోని అవయవాలు అంగాలు తిష్యులో కలిసే ఆక్సిజన్ అందించడంలో సమస్యలు ఎదురౌతాయి. లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు చాలా సహజంగా సదా సీదాగా ఉంటారు ఏ మాత్రం లక్షణాలు ఉన్నట్లు కనపడరు. ఈలక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రింద పేర్కొన్న కొన్ని లుకేమియా లక్షణాలుకావచ్చు.. అలిసిపోవడం లేదా సుస్తీగా ఉండడం.. మీరు 7 నుండి 8 గంటలు నిద్రపోయినా తరువాత కూడా మీరు తీవ్రమైన అలసటకు గురియితే మాత్రం దీనికి చాలానే కారణాలు ఉండవచ్చు. డాక్టర్ ను సరైన సమయం లో సంప్రదించి వైద్యపరీక్షలు చేయించడం అలసటకు కారణం తెలుసుకోవం ముఖ్యం. అలసట లుకేమియా లక్షణం కావచ్చు. బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. చర్మం పై నీలపు రంగుల చారలు.. సహజంగా చర్మం పై నీలపు రంగు గుర్తులు దెబ్బతగిలినప్పుడు కనిపిస్తాయి. అలాగే మీ చర్మం పై నీలిరంగు చారాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే అది బ్లడ్ క్యాన్సర్ లక్షణం కావచ్చు. బ్లడ్ ఇన్ఫెక్షన్ కు సంకేతము కావచ్చు. ఆయాసం గా ఉండడం... శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం. కొద్దిపాటి పనిచేసిన ఆతరువాత మీరు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటె ఇది లుకేమియా లక్షణం కావచ్చు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా శరీరం లో పనిచేసే శక్తి తగ్గిపోతుంది . 8 నుండి 1౦ మెట్లు ఎక్కగానే మీరు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటి సమస్య తరచుగా ఎదుర్కుంటే మీ సమీపంలోని డాక్టర్ ను సంప్రదించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. జ్వరం,చలి మిమ్మల్ని తరచుగా వేదిస్తోందా... త్గారచుగా మీకు జ్వరం వస్తూ ఉంటె చలివేయడం వంస్తే అది వైరల్ జ్వరంగా భావిస్తారు.ఒక్కోసారి జ్వరం రెండురోజులు చికిత్చ తరువాత తగ్గలేదంటే మీరు మీ డాక్టర్ నుసంప్రదించడం అవసరమైన పరీక్షలు చేయించడం చలివేయడం అంటే లుకేమియా లక్షణంగా చెప్పవచ్చు. చిగుళ్ళలో వాపులు... చిగుళ్ళలో వాపులు వస్తున్నాయంటే చాలా మంది దంతసమస్యలు నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా దంతాలు చిగుళ్ళలో వాపులు వస్తే ఇతర సంకేతాలు వస్తే వెంటనే సత్వరం డాక్టర్ ను సంప్రదించండి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకారి కావచ్చు.         

బ్లడ్ థిన్నర్స్ తో ప్రమాదం సుమా!

ఆ స్ప్రిరిన్ ,వార్ ఫారిన్ మందులతో రక్త శ్రావం నిపుణుల పరిశోదనలో వెల్లడి.. ఒకవేళ మీరు రక్తం పల్చబడేందుకు వాడే మందులు అవసరం లేదని.వాస్తవానికి సహజంగా రోగులకు ఇచ్చే బ్లడ్ తిన్నర్స్ అస్టిలిన్ ను తీసుకోవడం మానాలని దీనివల్ల అధిక రక్తశ్రావం  జరగడం వల్ల వచ్చే పరిణామాలు నియంత్రించ కుంటే ముప్పే.7౦౦ మందిపై జరిపిన పరిశోదనలో మిచిగన్ లోని క్లినిక్ లో వీనస్ త్రాంబో  ఎంబాలిజం లేదా గడ్డ కట్టడం లేదా ఆర్టియాల్ ఫైబ్రి లేషన్ లో గుండె సరిగా కొట్టు కోక పోవడం వల్ల గుండె పోటు వస్తుంది. రోగులకు సాధారణంగా లభించ్గే బ్లడ్ తిన్నేర్స్ వార్న్ ఫారిన్ గుండె సమస్య లేకపోయినా ఆస్ప్రిన్ తీసుకునే వారు అని పరిశోదనలో వెల్లడించారు.మనకు తెలిసిన విషయం  ఏమిటి అంటే ఆస్ప్రిరిన్  పెనేషియా డ్రగ్ కాదని కొంతమందిలో ఎక్కువశాతం రక్త్గ శ్రావం జరిగింది.అయితే క్లినిక్స్ లో అస్ప్రిరిన్ వినియోగం  తగ్గించే ప్రయాత్నం చేశామని పేర్కొన్నారు.  ఎవరికి అయితే అవసరం లేదో వారికి అస్ప్రిరిన్ ఇవ్వలేదని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్దియలజిస్ట్ హెల్త్ ఫ్రాంకల్ కార్డియో వాస్క్యులార్ సెంటర్ కర్దియలజిస్ట్ డాక్టర్ జాఫ్రీ బార్నేస్ అన్నారు.పరిశోదనలో ఎస్ప్రిరిన్ వినియోగం తగ్గించామని 46.6 % తగ్గించడం వల్ల రక్త శ్రావం తగ్గించగలిగామని రక్తశ్రావం ౩2.౩% వినియోగం తగ్గిందని వివరించారు. ప్రతి వెయ్యి మందిలో ఆస్పిరిన్ మానివేయడం వల్ల రక్త స్రావం తగ్గిందని పేర్కొన్నారు.అస్పిరిన్ ఆపడం వల్ల వచ్చిన ఫలితాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు.మేము పరిశోదన ప్రారంభించగానే అప్పటికే వైద్యులు అస్ప్రిరిన్ వినియోగం తగ్గించారని మాపరిశోదనలో రక్త శ్రావం వంటి సంఘటనలు పరిణామాలు తీవ్ర రక్త శ్రావం ఆపడం ద్వారారోగులను కాపాడగలిగా మని ఇంటర్నల్ మెడిసిన్ స్కూల్ జనరల్ ఫిజీషియన్లకు ఆరోగ్య శాఖ సిబ్బందికి  రోగుల కు బ్లడ్ తిన్నర్ గా అస్టిలిన్ ను వినియోగించరాదనిపరిశోధకులు సూచించారు. ఆస్టిలిన్ వాడే వారి కొంతమేర తక్కువ స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇందులో  రక్తం పల్చబడితే ఇతర మందులతో పాటు ఎస్ప్రిరిన్ ను పరిసీలించినట్లు తెలుస్తోంది.మరో పరిశోదనలో వార్ ఫారిన్ తీసుకుంటున్న రోగులలో అస్పిరిన్ అర్తియాల్ ఫైబిలేషణ్,వి టి ఇ వీనస్ త్రాంబో ఎంబాలిజం లో రక్త శ్రావం ఎక్కువగా ఉందని వార్ ఫారిన్ తీసుకున్న వారిలోనూ రక్తశ్రావం జరగడం గమనించారు.అస్పిరిన్ తీసుకునే వారిలో ఇలాంటి సమస్యలు గమనించమని అయితే రక్తం గడ్డకట్టడం కన్నా రక్త శ్రావం ఎక్కువజరిగిందని పరిశోధకులు వెల్లడించారు.కొంత మందికి అస్టిలిన్ ప్రాణాలు రక్షిస్తే కొంతమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉందని గుండెపోటు అవసరమైన సమయంలో గుండెకు స్టంట్ పెట్టాల్సిన  పరిస్థితి వచ్చిందని రక్త ప్రవాహం పెరగడం గుండె సంబంధిత రక్త్గానాళా లలో సమస్యలు ఉన్నవారికి అందించడం అత్యవరం లాభం. మనం ఎదుర్కున్న సవాలు ఏమిటి అంటే గుండె సంబందిత సమస్యలు లేనివారు సైతం అస్పిరిన్ తీసుకుంటే యాంటి కాగులెంట్ గా సూచించవచ్చని ప్రముఖ హేపటాలజిస్ట్ ప్రొఫెసర్ జోడాన్ స్చేఫెర్ జనరల్ మెడిసిన్ వివరించారు.ప్రాధమిక స్థాయిలో నివారణకు అస్పిరిన్ వాడతారని గుండెపోటుకు చాలా తక్కువ ప్రభావం ఉంటుందని వార్ ఫారిన్ వాడినట్లైతే గుండె పోటును ఎదుర్కునేందుకు వాడరాదని అస్పిరిన్ పై సమీక్షించాలని మీసంరక్షణ చూసేవారు లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ వీటి ప్రభావం నుండి బయట పడితే కొంతమేరా ప్రాణ హాని తీవ్ర రక్త్గశ్రావాని నివారించవచ్చు. 

సురక్షితం కాని మందులు ఇవ్వడం ఘోర తప్పిదం!

ప్రపంచఆరోగ్య సంస్థ సురక్షితం కానిమందు లను వాడడం ఘోరతప్పిదం గా పేర్కొంది. సురక్షితం కాని మందులను వివిద్ధ స్థాయిలలో ఇవ్వడం వైద్య రంగాని బలహీన పరుస్తుందని దానివల్ల అలసట వాతావరణం సరిగా లేకపోవడం అలాకాక కొన్ని సందర్భాలలో సిబ్బంది కొరత కూడా ఏర్పడవచ్చని డబ్ల్యు హెచ్ ఓ ఒకప్రకటనలో పేర్కొంది. ప్రపంచరోగుల పరిరక్షణ సంరక్షణ లో హానికారక మైన అంశాలు ఉండరాదని సురక్షితం కానిమందులను ఇవ్వడం ఘోర తప్పిదం కాగలదని దీనికారణంగా ఒక్కోసారి తీవ్రమైన అంగవైకల్యానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని ఒక్కోసారి మరణానికి దారితీస్తుందని సురక్షితం కాని వైద్యం సాధన వల్ల సంవత్సరానికి 42 యు ఎస్ మిలియన్ డాలార్లు ఖర్చుచేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దిగువ-మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాలు దక్షిణ ఆశియా ప్రాంతాలలో రోగులు వారిపట్ల సరైన సంరక్షణ లేనందు వల్లే 1౩4 మిలియన్ల వ్యతిరేక ఫలితాలు దీనివల్ల 2 -6 మిలియన్ల మరణాలు చోటుచేసుకుంటున్నాయని డబ్ల్యు హెచ్ ఓ దక్షిణ ఆశియ ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనం కేత్రవాల్ సింగ్ అన్నారు. అసురక్షిత వైద్యం చేయడం వంటి తప్పిదాలు వివిదస్తాయిలలో ఉంటుందని అది వైద్య రంగాన్ని బలహీన పరుస్తుందని దీనివల్ల అలసట సరైన వాతావరణం లేకపోగా పనిచేసే వారి సంఖ్య తగ్గిపోవడం వంటివి ఉంటాయాని ఒకకధనం లో పేర్కొన్నారు.        

యాంటి బయోటిక్స్ అతిగా వాడితే!

  మోతాదుకి మించి యాంటి బయోటిక్స్ వినియోగించిన భారత్...లాన్సేట్ నివేదికలో వెల్లడి. కోవిడ్ మొదటి రెండవ విడతలో మోతాదుకు మించిన యాంటి బయోటిక్స్ , ఐ సి యు లో మోతాదుకు మించి మత్తు మందులు వినియోగించి నందువల్లె స్ట్రోక్స్ వచ్చి చనిపోయరాని, అసలు కోవిడ్ సమయంలో ఏమందులు ఎంత మోతాదులో వాడాలో నియంత్రణ లేకుండా విచ్చల విడిగా స్టెరాయిడ్స్, ఇతర ఇంజక్షన్లు రేమిడి సివిర్ లాంటి ఇంజక్షన్లు ఇష్టారీతిన వాడినందువల్లె బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ వంటి సమస్యలు బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు తో కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడిన కధనాలు మనం చూసాము,చదివాము.  ఇందులో ఎంతవాస్తవమో మనందరికీ తెలుసు.అయితే లాన్సేట్ రిపోర్ట్ లో 2౦19 సంవత్సరంలో భారత్ లోని ప్రైవేట్ వైద్యులు 47%యాంటి బయోటిక్స్ వినియోగించారంటు నివేదికలో పేర్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య ఎస్ ఎన్ సి ఎం స్టాండింగ్ నేషనల్ కమిటీ మేదిసిన్స్ ఉపాధ్యక్షుడు సీనియర్ ఫర్మాకాలజిస్ట్ వై కే గుప్తా లాన్సేట్ నివేదికను తీవ్రంగా తప్పుపట్టారు. ఈమేరకు లాన్సేట్ నివేదిక అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూర్ డవీయ  విజ్ఞప్తి మేరకు వై కే గుప్తా వివరణ ఇస్తూ అత్యవసర మందుల లిస్టు ను తయారు చేసి ఇస్తామని ఫార్ములాను ఆయా రాష్ట్రాల నియంత్రణ మండలి డ్రగ్ ఆధారిటీ అనుమతితోనే వెలువడతాయని పేర్కొన్నారు.  లాన్సేట్ నివేదికలో ఆమోదం పొందని ఫార్ములా అన్న పదం వాడారని అంటే దాని ఆర్ధం సి డి ఎస్ సి ఓ కాదాని ఈ ఫార్ములాలు ఆయా రాష్ట్రాల డ్రగ్ రెగ్యులేటరీ అధారిటీ ఆమోదించినవే అని అందుక ఈ విషయం లో ఆమోదం పొందని అన్న పదం ప్రయోగించడం పై వై కే గుప్తా తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ బాడీ ఫార్మా రంగం లో ఉందని తెలిపారు. లాన్ స్టడీ రిపోర్ట్  చదివిన తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరణ కోరారని గుప్తా తెలిపారు. లాన్సేట్ రేపోర్ట్ ను ఉటంకిస్తూ యాంటి బాయిటిక్స్ అతిగా వాడారని అనడం సరికాదాని అభిప్రాయపడ్డారు. ఈమేరకు బ్రెజిల్,రష్యా,యురప్ దేశాలతో పోలిస్తే యాంటి బాయిటిక్స్ వాడకం తక్కువే గానే వినియోగించినట్లు గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్లో యాంటి బయోటిక్స్ వినియోగం లో అగ్రభాగాన నిలిచిందని నివేదికలో పేర్కొనడం సరికాదని గుప్తా వెల్లడించారు. భారత్ లో రోజుకు 1౦౦౦ డోస్ లు వాడితే ప్రపంచవ్యాప్తంగా 1౦.4 ఎక్కువగా వినియోగించారని గుప్తా స్పష్టం చేసారు. కాగా 2౦15 లో 1౩ .6% వినియోగించారని లాన్సేట్ నివేదిక ప్రకారం దేశంలో యాంటి బయోటిక్స్ వినియోగం,నియంత్రణ, అమ్మకాలు నిలువరించాల్సిన అవసరం ఉందని గుప్తా అభిప్రాయపడ్డారు. యాంటి బాయిటిక్స్ పై మరిన్ని పరిశోదనలు అవసరమని పేర్కొన్నారు.2౦19 లో అజితో మైసిన్ విరివిగా వాడారని యాంటి బయోటిక్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. మార్కెట్ లో నేడు 1౦% ఫార్ములాలు ఉన్నాయని అదనంగా మరో 5౦ % పైగా ఫార్ములాలు ఉండడం వల్ల యాంటి బయోటిక్స్ వాడినట్లు కనిపిస్తోందని అజిత్రో మైసిన్ 5౦౦ ఎంజి ,అమోక్సిలిన్ 5౦౦ ఎం జి,125 ఎం జి సిసిక్షిన్ 2౦౦ ఎం జి విరివిగా వాడారని వాటి పై అవగాహన కల్పించాలని గుప్తా అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మార్కెట్ లో ప్రైవేట్ రంగం అమ్మకాల సమాచారం మాత్రమే అని ఇంకా పూర్తి వివరణాత్మక సమాచారం కావాలని గుప్తా విజ్ఞప్తి చేసారు. రోగుల సంరక్షణ వారికి వైద్యులు ఎలాంటి ప్రిస్కిప్షన్ లో ఎలాంటి యాంటి బాయిటిక్స్ వాడారు అన్న సమాచారం. మైక్రో బయాలాజికల్ టెస్ట్ లు యాంటి బయోటిక్స్ వినియోగం వంటి నిశితంగా పరిశీలించాల్సి ఉందని ప్రిస్కిప్షన్ సూక్ష్మం గా పరిశీలించడం అసాధ్యమని అత్యవసర సమయాలలో ఎలా వినియోగించారన్నది అంచనా అసాధ్యమని గుప్తా వివరించారు. ఫర్మా ట్రాక్ సాంపిల్ కవర్స్, స్టాకిస్టులు 6౦% మంది మాత్రమే ఉన్నారని.ప్రైవేట్ రంగంలో ఫర్మా అమ్మకాలపై లక్ష్యంగా చేసుకుని నివేదిక చేసినట్లు ఉందని గుప్తా విమర్శించారు.ప్రభుత్వ శాఖాలలో మందుల ప్రోక్యుర్మేంట్ జాతీయ,లేదా అయా రాష్ట్ర స్థాయలో నిర్ణయించిన లిస్ట్ మేరకు మందులు మాత్రమే అని వివరించారు. యాంటి బయోటిక్స్ వినియోగం పై అవగాహన అవసరమని ప్రస్తుతం యాంటి బాయిటిక్స్ ప్రభావం ఉందని కొత్త యాంటి బయోటిక్స్ వాడే అధికారం ఉందని తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉంటె కోవిడ్ సమయంలో లేదా యురిన్ ఇన్ఫెక్షన్ సమయంలో గనక యాంటి బయోటిక్స్ వినియోగించడం పై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతాదుకు మించి యాంటి బయోటిక్స్ వాడడం వల్ల శరీరంలో అత్యవర సమయంలో యాంటి బయోటిక్స్ పనిచేయవని శరీరంలో మెటాబాలిజం దెబ్బతిని ఇతర హార్మోన్ సంబంధిత సమస్యలు వస్తాయని మన శరీరంలో మంచి బ్యాక్టీరియా చనిపోతుందని చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని యాంటి బాడీలు ఇమ్యునిటి వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని  నిపుణులు పేర్కొన్నారు. కాగా శరీరతత్వాన్ని బట్టి మాత్రమే యాంటి బయోటిక్స్ మోతాదును డాక్టర్ సలహా మేరకు వాడాలె తప్ప మరే ఇతర సమాచారం ఆధారంగా యాంటి బయోటిక్స్ వాడరాదని సూచించారు.

నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తింటే ??

  మీకు నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తినాలని ఉందా తినేసయ్యండి. హాయిగా నిద్ర పొండి. సుఖంగా నిద్రపోవాలంటే సహకరిస్తుంది. లేదా ఏదైనా చిరుతిండి తింటే నిద్రవస్తుందా అంటే నిద్ర వస్తుంది అంటున్నారు నిపుణులు. వాస్తవానికి మనిషి అన్న వాడు 7 నుండి 8 ఘంటలు  నిద్రపోవాలి.మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. కాని ప్రపంచంలో 3 వ వంతు అమెరికన్లు  సరిపడా చాలినంత నిద్ర పోవడం లేదని నిపుణులు గమనించారు. అల్లా ఒక సారి నిద్ర లేమి సమస్య దీర్ఘకాలంగా ఉంటె వ్యక్తి శారీరకంగా మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది.  ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. ప్రతి రోజు నిద్రపోవడం పడుకునే ముందు టి .వి ఫోన్ ,లి మీ నిద్రను పెంచుతాయి. మీఆహారం లో కొద్ది పాటి  మార్పు చేసుకుంటే నిద్ర సరిపోతుంది ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.సాయంత్రపు గాలులు తగ్గ్గిన వెంటనే  నిద్రకు ముందు ఏదైనా స్నాక్ తీసుకుంటే నిద్ర మత్తు వస్తుంది.దీనివల్ల మీనిద్ర సమయాన్ని కొంతవరకు  మీరే స్వయంగా అలవాటు చేసుకో వచ్చు.దీనివల్ల మీరు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  మీరు నిద్ర పోయే ముందు వెచ్చటి పాలు గ్లాసుడు తీసుకుంటే నిద్రకు సహకరిస్తుంది. అయితే  ఇది పాత పద్దతే కావచ్చు ఇది పాత బడిపోయిన సలహా అని మీరు ఎద్దేవా చేయచ్చు. వివిధ రకాల  నట్స్,సీడ్స్,బలమైన ఆహారం సేరోటో నిన్ ను ఉత్పత్తి చేస్తాయి,అమినోయాసిడ్స్నిద్ర పోయేలా చేస్తాయి. ఆల్మండ్స్ బాదం పీనుత్స్ పల్లి పప్పులు మెలటోనిన్ పదార్ధాని ఇస్తాయి. ఈ హార్మోన్ శరీరాన్ని నిద్రపోయే పద్ధతి ని అలవాటు చేస్తుంది.       

కోవిడ్ మరణాల నివారణలో ఘోరంగా విఫలం - లాన్సెట్ నివేదిక వెల్లడి

కోవిడ్ 19 ప్రపంచ వ్యాప్తంగా స్పందించడంలో మరణాలను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యామని లాన్సెట్ రిపోర్ట్ వెల్లడించింది. లాన్సెట్ వెల్లడించిన రిపోర్ట్ ఆధారంగా ఐ హెచ్ ఎం ఇ అంచనాప్రకారం 417 మిలియన్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్ కాగా 1.6 మిలియన్ల మంది భారతీయులు మరణించారని ఇది జూలై 1-2౦21 నాటి నివేదికలో పేర్కొన్నారు. మొదటి రెండు సంవత్చరాల కోవిడ్ 19 ప్యాండమిక్ ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేక పోయారని ప్రజలు ఏమిజరుగుతుందో ఆర్ధం కాక ప్రాణాలు నిలిపులోక పిట్టల్ల రాలిపోయిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేకపోయారని న్యూ లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఈ ఫలితాలు వెలువరించింది. ఒక అంచనా ప్రకారం 17.2 మిలియన్ల మంది మరణించారని కొన్ని మరణాలు నమోదు చేయలేదని కొన్ని చేర్చలేదని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్పందించడంలో ఎప్పుడైతే విఫలమయ్యామో అభివృద్ధి మరింత కుంటుపడిందని పురోగమనం నుంచి తిరోగమనం వైపుకు చేరామని వివరించింది. ఇందుకు ఉదాహరణగా యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి లక్ష్యాలు ఎస్ డి జి ఎస్ చాలా దేశాలాలో వారి లక్షాలు కోవిడ్ దెబ్బకు అతలాకుతలం అయ్యాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.నూతన లాన్సెట్ కోవిడ్19 కమిషన్ రిపోర్ట్ ప్రకారం చాలా కష్టం మీద అంగీకరించింది.  కోవిడ్ 19 సమయం లో ప్రపంచ వ్యాప్తంగా స్పందించిన తీరు ఆశాజనకంగా లేదని కోవిడ్19 విస్తృత వ్యాప్తిని నివారించడంలో విఫలమయ్యామని పారదర్శకత,జాతి దురహంకారం, ప్రధానంగా ప్రాజారోగ్యం ఆచరణాత్మకంగా నిర్వహించడంలో అంతర్జాతీయంగా పరస్పర సాహకరాం సయోధ్య కోరి నందు వల్లే దాని ఫలితంగా 17.7 మిలియన్ల ప్రజలు మరణించారని నివేదికలో పేర్కొనడం గమనార్హం. చాలా జాతీయ ప్రభుత్వాలు విపత్తును ఎదుర్కునేందుకు సన్నద్ధంగా లేవని ఆయా దేశాలలో స్పందన అంతంత మాత్రంగానే ఉందని బాదితుల పట్ల కనపరాచాల్సిన శ్రద్ధ తూ తూ మంత్రంగా ఉందని తెలుస్తోంది. సమాజం లో వివిద వర్గాలు అంతార్జాతీయంగా శాస్త్రజ్ఞుల మధ్య పరస్పర సహకారం లోపించిందని అందుకు సాక్ష్యంగా కొత్త ఎపిదమాలజికల్ గా,ఆర్ధికంగా,ఆధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కొన్ని సూచనలు చేసారు.కోవిడ్19 అత్యవసర సమయం లో పరస్పర సహకారం తోనే కోవిడ్ కు ముగింపు మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఆరోగ్యపరమైన సవాళ్ళను,విపత్తులను ఎదుర్కోడంలో మనకు ఒక గునపాటం గా పేర్కొన్నారు దీర్ఘకాలిక ప్రణాళిక తోనీ సామాజిక ఆరోగ్యాన్ని అందిస్తూ అభివృద్ధి సాగించాలని లాన్సెట్ నివేదికలో పేర్కొంది.

కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరిస్తోంది-జరభద్రం!

కోవిడ్19 కొత్తవేరియంట్ ఒమైక్రాన్ బి ఏ 4.6 గురించి 1౦ మాటలు. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. బిఏ .4.6 ఒమైక్రాన్ గా పేర్కొన్నారు. ఈ సమయంలో ఇది ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది?అన్న ప్రశ్నలకు పూర్తి సమాచారం లేదు. అందిన సమాచారం ప్రకారం ఒమైక్రాన్ వేరియంట్ మాదిరి గానే ఉందని తేల్చారు. ఒమైక్రాన్ కు మరో కొత్త వేరియంట్ బి ఏ 4.6 వచ్చింది. అమెరికాలోని పలు రాష్ట్రాలలో త్వరిత గతిన విస్తరిస్తోంది. ప్రస్తుతం యుకే లో సైతం ఇది దాని ప్రతాపం చూపుతోంది.అని సమాచారం. ఈ వేరియంట్ సౌత్ ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాలలో విస్తరించిందని నిపుణులు వెల్లడించారు. కొత్తవేరియంట్ బి ఏ 4.6 గురించి 1౦ అంశాలు.. 1) ఒమైక్రాన్ కొత్తవేరియంట్ బి ఏ 4.6 బి ఏ 4 నుండి వచ్చినదే  బహుశా దీని సబ్ వేరియంట్ గా చెప్పవచ్చు. 2) ఒమైక్రాన్ వేరియంట్ బి ఏ4 మొదటిసారి జనవరి 2౦22 లో దక్షిణ ఆఫ్రికాలో గుర్తించారు. ఆ తరువాత బి ఏ5 వేరియంట్ తో పాటు ప్రపంచంలోని చాలా చోట్ల విస్తరిస్తోంది. ౩) అయితే బి ఏ 4.6 వచ్చింది అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే అప్పటికే ఈ వేరియంట్ బారిన పడి ఉండవచ్చు. 4) బి ఏ 4.6 చాలా నెలలుగా బిఏ 4 వేరియంట్ లాగానే ఉందని ఇది స్పైక్ ప్రోటీన్ గా మారవచ్చు.వైరస్ మాదిరి గానే ఒక ప్రోటీన్ అది మన ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుందని నిపుణుల అంచనా. 5) ఇది దీని ఉప వేరియంట్ గా మారి R ౩461 ను ఇతర వేరియంట్స్ లో చూసి ఉండవచ్చు. వేరియంట్ మీ ఇమ్యునిటిని బోల్తాకొట్టించే పనులు చేస్తుంది. అంటే అది వ్యాక్సిన్ కు ముందు అయిన ఇన్ఫెక్షన్ ద్వారా లభించిన యాంటీ బాడీలు బోల్తా కొట్టించడం లో వైరస్ కు సహాయపడుతుంది. 6) మరో మంచి విషయం ఏమిటి అంటే ఓమై క్రాన్ ద్వారా వ్యాపించిన వ్యాధి సహజంగా చిన్న చిన్న అనారోగ్యం మాత్రమే వస్తుందని ఇప్పటివరకూ ఒమైక్రాన్ ద్వారా జరిగిన మరణాల గణాంకాలు గతం కన్నా తక్కువగానే నమోదు అవుతుండటం విశేషం. 7) ఇప్పటి వరకూ ఈ వేరియంట్ తో ఉన్న వారి లక్షణాలు ఇంకా తెలియలేదు.ఎలా సోకుతుంది దీనికిగల కారణాలు దీని ప్రభావం వల్ల వచ్చే లక్షణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 8) బి ఏ 4.6 నుండి పరిరక్షణ పొందాలంటే బి ఏ 5 తో పోలిస్తే కొంత మేర మెరుగే అని ఇప్పుటి వరకు బి ఏ 5 డామినేట్ వేరియంట్ గా నిపుణులు పేర్కొన్నారు .  9) ఆక్స్ ఫార్డ్ విశ్వవిద్యాలయం అందించిన రిపోర్ట్ ఆధారంగా ఎవరైతే ఫైజర్ వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నారో బిఏ 4 బిఏ 5 తో పోలిస్తే బి ఏ 4.6 లో యాంటి బాడీలు తక్కువే ఉత్పత్తి అవుతాయని ఇది ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొన్నారు. దీనిద్వారా బిఏ 4.6 కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ అత్యంత ప్రభావంతమైనదని నిపుణులు అభిప్రాయ పడ్డారు.బి ఏ 4.6 తో పాటు ఇతర వేరియంట్లు పుట్టుకురావడం కొంత ఆందోళన కలిగిస్తోంది కోవిడ్ ను ఎదుర్కునేందుకు వైరస్ కట్టడికి పోరాడేందుకు వ్యాక్సిన్ బ్రహ్మాస్త్రమని ఉత్తమ ఆయుధమని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్తమ ఆయుధం అని నిపుణులు పేర్కొన్నారు.                            

అలసట.. నీరసానికి గల కారణాలు ఒక అధ్యయనం...

అలిసిన కండరాలు... అదేపనిగా కండరాలను ఉపయోగించడం వల్ల శక్తి ఉడిగిపోయిందని అనిపిస్తుంది. అలసట ముఖ్యంగా క్రికెట్, ఫూట్ బాల్,లేదా వాలి బాల్ ,లాంటి ఆటలు ఆడిన తరువాత పెరటి తోటలో కలుపు తొలగించి,చెట్ల కు పాదులు చేయడం చేసేటప్పుడు పట్టే సమయం. ఇల్లుమారే సమయం లో పెద్ద పెద్ద డబ్బాలు వస్తువులు స్వయంగా మోసినప్పుడు. స్వయంగా అలసి పోతారు.అలసట కారణంగా కండరాలు ఇంతకు ముందులాగా కండరాలు సంకోచించక పోవడాన్ని గమనించ వచ్చు. మనం శ్రమిస్తున్నప్పుడు కండరాలలో లాస్టిక్ యాసిడ్ పేరుకు పోవడం తో అవి అలసటకు గురి అవుతాయి.శరీరానికి అవసరమైన శక్తి అందుబాటులో లేనప్పుడు ఆక్సిజన్ లభించనప్పుడు లాస్టిక్ యాసిడ్ పరిణామం పెరుగుతుంది. మనశరీరం అధికంగా శ్రమిస్తున్నప్పుడుకండరాలలో ఆమ్ల తత్వం పెరిగి పి హెచ్ 6.4 నుంచి 6.6 వరకు పెరుగుతుంది.సహజంగా మనం నిద్ర పోతున్నప్పుడు క్షారత్వం 7.15 గా ఉంటుంది.పోటేన్షియల్ హైడ్రోజన్ ౦--14 మధ్య సూచిక గా రెండిటికీ మధ్య 7 కంటే ఎక్కువ తతస్తంగానూ ఉంటుందని. ఆరోగ్యంగా ఉండే వ్యక్తిలో క్షారత్వం కొంచం అమ్లత్వం ఉంటుందని. దీనికన్నా ఎక్కువ తక్కువలు ఉంటె అనారోగ్యంగా ఉన్నట్లు సూచికగా గుర్తించాలి.అలిసిన కండరాలకు అందించగల ప్రాధమిక చికిత్చ నీళ్ళు తాగడమే అని నీళ్ళు తాగడానికి దాహం వేసే దాకా నీళ్ళు తాగడానికి ఎదురు చూడనవసరం లేదు.శరీరం కష్టపెట్టక శ్రమించాక నీళ్ళు తాగడం కండరాల అలసటను తీర్చడానికి నీళ్ళు తోడ్పడతాయి. నీళ్ళు తాగని పక్షం లో కండరాలు తిమ్మిరేక్కుతాయి. నీరసించే నాడీ వ్యవస్థ... మన శరీరంలో నీరస పడడాన్ని సెంట్రల్ ఫాటిగ్యు అని అంటున్నారు వైద్యులు.కేంద్ర నాడీ వ్యవస్థ మెదడులో సేరోటినిన్ ట్రిప్టో ఫన్ అనే ఎమినో యాసిడ్ పరిమాణం పెరగడం వల్లే అలిసిపోయిన భావన కలుగుతుందని పరిశోదనలో వెల్లడి అయ్యింది.అలసట కారణం గా కాస్త విశ్రాంతి కావాలని, నిద్రపోవాలన్న బలమైన కోరిక కలిగిస్తుంది. దీర్ఘాకాలం పాటు ఫాటిగ్యు సిండ్రోమ్ సి ఎఫ్ ఏ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇది సంకేతమని వైద్య నిపుణులు సూచిన్స్తున్నారు. ట్రిప్టో ఫన్ ఎక్కువగా తాయారు కావాడానికి కారణం సిరో టోనిన్ అధికఉత్పత్తికి దారి తీస్తుంది.సేరోటోనిక్ నాడీ కణాల్ మధ్య సందేశాలను మోసుకు పోయే రసాయనం గా పేర్కొన్నారు  నిపుణులు. సెరోటోనిన్ కారణంగానే ఆకలి, జీర్ణం, నిద్ర, లైంగికవాంచ ,మానసిక స్థితి శరీరంలో రోజు వారీ పనులు క్రమబద్దీకర చేస్తుంది. సెరో టోనిన్ ఆరోగ్య కరమైన శారీరక స్థితి, విశ్రాంతి, నిద్రకు తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ అలసిపోవడానికి కారణం శరీరంలో గ్లైకోజన్ పరిమాణం పెరగ డాన్ని నిపుణులు గుర్తించారు.పలు అధ్యనాలు ఇప్పటికే కేంద్ర నాడీ మండలపు అలసటను ప్రేపిస్తుందని ఆఅధ్యయనం లో వెల్లడించారు.గ్లైకోజన్ లోటును పూడ్చి ప్రమాదాల బారిన పడకుండా తోడ్పడుతుందని నిపుణులు విశ్లేషించారు. అలసటకు కారణాలు ఇవే... మన శరీరం లోని కండరాలు నాడీ మండల అంటే మెదడు అలసట సమస్యను ఎదుర్కోవచ్చు. మీరు మీ శరీరం అదే పనిగా అలిసి పోతూ ఉండడం తీవ్రమైన అనారోగ్య సమస్య కు సంకేతమని అది హెచ్చరిక గా గుర్తించాలి.మీరు తీవ్ర మైన అలసటకు గురి అవుతున్నారన్న విషయం గుర్తిస్తే ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.వైద్య పరమైన అత్యవసర పరిస్థితికి దారి తీయకుండా మున్డుజాగ్రత్త తో వ్యవహరించడం అవసరం. రక్తహీనత /ఎనిమియా.... రక్త హీనత మొదటి లక్షణం అలసట. రక్త హీనత అంటే కొన్ని ఎర్ర రక్తకణాలు లేకపోవడం. ఎర్ర రక్త కణాలలో సరిపడా హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను రవాణా చేసే ప్రోటీన్ ఉండకపోవడం గమనించవచ్చు. రక్త హీనత వల్ల శరీరంలో అవయవాలు వాటిలోని కణాలకు ఆక్సిజన్ అందదు.గ్లోకోజ్ ఉన్న ఆక్సిజన్ కొరత వల్లశారీర కణాలు దానిని వాడుకోలేవు. కొద్ది పాటి శ్రమకే అలసట ఏర్పడుతుంది.తత్ఫలితంగా ఊపిరి అందదు, చాతీ లో నొప్పి వస్తూ ఉంటుంది.అది తీవ్రమైన గుండె నొప్పికి దారి తీయవచ్చు. హార్మోన్ సమస్యలు... మనం త్వరగా అలిసిపోవడానికి కారణం హార్మోన్ లో లోటు పాట్లు కీలపాత్ర పోషిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని హార్మోన్లు విపరీతంగా పెరిగినా,తగ్గిన హైపో థైరాయిడిజం, మదుమేహం అడిసన్స్ డిసీజ్ వ్యాధులు వస్తాయని భారత్ లో పదిహేను కోట్ల మందిలో హైపో ధైరాయిడిజం  ఉన్నట్లు అంచనా ఇందులో చాలా మందికి ధైరాయిడ్ సమస్య ఉన్నట్లు కూడా తెలియదు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలోవిశాఖ,చెన్నై, బెంగ ళూరు లో నివసిస్తున్న వారికంటే సముద్రానికి దూరంగా కొండ ప్రాంతాలలో హైదరాబాద్ వరంగల్ బెంగుళూరు లో నివసిస్తున్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది.ముఖ్యంగా పురుషులకంటే స్త్రీలు ఈ వ్యాధిబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తమ అధయనం లో వెల్లడించారు. జీవ ప్రక్రియను నియంత్రించేది ధైరాయిడ్ హార్మోన్లు మాత్రమే అది మనశారీరపు ఉష్ణోగ్రతను గుండె కొట్టుకోవడాన్ని ఆహారం ద్వారా శరీరానికి అందిన కాలరీలను ఎలా ఖర్చు చేయాలో నిర్ధారిస్తుంది. పోషకాహారం లేకుంటే మనశరీరం తగిన శక్తి పొందలేదు అందుకు బలహీనపడి నిస్సతువ నీరసానికి దారితీస్తుంది. మల్టి పుల్ స్క్లేరోసిస్... మల్టిపుల్ స్క్లేరోసిస్ తీవ్రమైన సమస్య ఈకారణంగానే వెన్నెముకలోని నాడీ కణాలు క్రమంగా తమ సహజ సామార్ధ్యాన్ని కోల్పోతూ ఉంటాయి.దీనిప్రభావాం వివిధ అవయవాల్ తాలూకు స్పందన చలన  శక్తి దెబ్బతిని శరీరం మోద్దుబారడం. ఈ కారణంగానే కన్దారాల్ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఈ సమస్య తీవ్రమైతే మానసికంగా కృంగి పోతారు.ఎమె ఎస్ ఇటీవలి కాలం లో యువకులపై తీవ్రప్రభావం చూపిస్తోందని అధ్యనాలు వెల్లడిస్తున్నాయి.ఈ వ్యాధి బారిన పడిన వారిలో 8౦% మంది 18 -౩5 సంవత్స రాల వయసులో వారే అని అఖిల భారాత వైద్య విజ్ఞానసంస్థ బాల బాలికలు వృద్ధులలో వ్యాధి బారిన పడినవారు ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. ఎం ఎస్ బారిన పడిన వారిలో యువతీ యువకుల కంటే మధ్య వయస్సులో ఉన్న మహిళలు ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళలు ఎక్కువగా దీనిబారిన పడుతున్నారని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు.ముఖ్యంగా ఎం ఎస్ కు గురయ్యే వారు పొగతాగే అలవాటు ఉన్న పురుషులు తేలికగా గురి అవుతున్నారని అధయనం లో పేర్కొన్నారు.కొన్నికుటుంబాలలో   వంశపారం పర్యంగా దారి తీస్తున్న విషయాన్ని నిపుణులు గుర్తించారు.ఇప్పటికీ ఖచ్చితమైన కారాణాలు ఇవి అని నిర్దారించనప్పటికీ వారి వారి అలవాట్లు ఎం.ఎస్ వ్యాధికి దారి తీసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు వెల్లడించారు. కాగా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు వాతావరణ అలవాట్లు వివిధ రకాల అంటువ్యాధులువిటమిన్ డి లోపం  ఎం.ఎస్ కు దోహదం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. మల్టి పుల్ స్కేరోసిస్వ్యాదివల్ల వచ్చే నీరసం అలసట అసాధారణ స్థాయిలో ఉంటుంది.దీనికి తోడు ఇతర లక్షణాలు   తోడైతే మీరు  మరింత తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు. క్యాన్సర్... క్యాన్సర్ వ్యాధి ప్రారంభంలో నే బద్దకం అలసట వంటి లక్షణాలు ఉంటె మామూలుగా రక్తంలో కైటో కిన్స్ పరిమాణం పెరగడం వల్లే ఇలాంటి స్థితి ఉంటుందని ఆకలి మందగించడం అలసట మందగించి నంత మాత్రాన క్యాన్సర్ అన్న అభిప్రాయానికి రాకండి. క్యాన్సర్ కారణాలు మరిన్ని లక్షణాలు ఉంటె క్యాన్సర్ గా అవమానం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. గుండె వ్యాధులు.. గుండె వ్యాధుల పై జరిగిన అనేక అధ్యయనాలలో వాటికి శారీరక అలసట మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు వెల్లడించారు.కాగా గుంబ్దే పోటు కు మూడు నెలల ముందే మూడింట రెండు వంతుల మంది కి ముందే తీవ్రమైన అలసట ప్రత్యేకంగా వృద్ధులు మహిళల లో గుండె వ్యాధులు బయట పడ్డాయని.  పైగా గుండెపోటుకు గురి కావడం గురికవదాన్ని వైద్యులు నిపుణులు గుర్తించారు. మరో అంశం లో దీర్ఘకాలిక సి ఎం .ఎస్ ఫ్యాటిగ్యు సిండ్రోమ్ ను గురించి తెలుసుకుందాం.                 

అలసటకు కారణాలు!

ఈ శరీరం అలిసిపోయింది వంట్లో శక్తి లేదు ఏదో బతుకు బండిని భారంగా ఈడుస్తున్నాను అని చాలామంది అంటూ ఉంటారు.ఇది కేవలం వృద్ధాప్యం లో ఉన్నవారి మాటలలో మాత్రమే ఒకప్పుడు వినిపించేది అయితే ఈ పరిస్థితి పోస్ట్ కోవిడ్ తరువాత అన్ని వర్గాలలో వినిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటికి వచ్చి మళ్ళీ శక్తి ఉత్సాహాలాను పుంజుకోవాలని అనుకుంటున్నారు కోవిడ్ భారిన పడ్డ బాధితులు. అలసట తో అలిసిపోతున్నామని అంటున్నారు. అలసట ఇది మనందరికీ తెలిసిన పదమే అప్పుడప్పుడూ చిన్న చిన్న జ్వరాలు వచ్చి పోయినప్పుడు మనల్ని హలో అని పలకరిస్తుంది.ఒక్కోసారి వయసు మీద పడి తీవ్ర అనారోగ్యానికి గురి అయిన వారిలో,శస్త్ర చికిత్స జరిగి కోలుకుంటున్న కొందరిలో త్వరగా అలిసిపోవడం  మాములుగా పైకి కనిపిస్తున్నా తీవ్రమైన అలసట ఎక్కువగా ఉండడం సహజంగా కనిపిస్తుందని బాధితులు పేర్కొంటున్నారు. ఇంకొందరిలో  నడవలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం ఆయాసం వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయాని రోగులు తమ తోటి వారితో వాపోయిన ఘటనలు ఈ మధ్యకాలం లో తరచుగా వింటూనే ఉన్నాము. దీనినే వైద్య పరిభాష లో క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ సి ఎఫ్ ఎస్ ను కనుగొనేందుకు గల కారాణాలు ఏమిటి అని కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య శాస్త్రం లో పరిశోదనలు జరుతున్నాయని  నిపుణులు వెల్లడించారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సి.ఎస్. ఎఫ్.  వల్ల బాధపడుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోవడం గమనించవచ్చు. సి ఎస్. ఎఫ్ వల్ల సంపాదన పనుల వల్ల కుటుంబాలు దేశాలు అసాధారణ స్థాయిలో ఆదాయాన్ని ఉత్పాదకతను కోల్పోతున్నాయి దశాబ్దాల పాటు ఆరోగ్య భీమా రంగాలలో దీనిని పట్టించుకొని పశ్చిమ దేశాలు ఇటీవల సి.ఎస్. ఎఫ్. ను వ్యాధిగా గుర్తించి చికిత్సను భీమా పరధిలోకి తీసుకు వచ్చినట్లు గ్రంధ రచయిత పరిశోధన సారాన్ని మనకు అందించిన రచయిత రామ్మోహన్ అప్పరసు స్పష్టం చేసారు.అసలు సి.ఎస్. ఎఫ్. వ్యాధికి కారణాలను కనుగొనే పరిశోదన ద్వారా చికిత్చా విధానం వరకూ సి .ఎస్. ఎఫ్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మీరు అలిసిపోతున్నారంటే అది సాధారణమైనదే అయిన సి.ఎఫ్.ఎస్ ప్రస్తుతం చేయగలిగింది దానిని అర్ధం చేసుకోవడం ఎదుర్కోవడమే. మీరు ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా చేసే ప్రయత్నం వల్ల ఆశక్తులను చేసే నీరసం అలసట చక్రబంధం నుంచి బయట పడగలుగుతారు. వాస్తవానికి అలసట పై చేసే పోరాటం అంత కష్టతరమైంది ఏమి కాదు అని అంటున్నారు నిపుణులు. మనం నిత్యజీవితంలో ఎలాంటి సందర్భాలలో అలిసిపోతారు అన్న విషయం తెలుసుకుందాం... రోజంతా వృత్తి,ఉద్యోగాలలో ఉన్నవారు,తీవ్రంగా క్రీడలలో పాల్గొన్నవారు అలిసిపోవడం సహజమే అని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఎవరైనా కుటుంబాలతో దూర ప్రాంతాలు,విహార యాత్రలు వందలకిలోమీటర్లు కలిసి ప్రయాణం చేయడం.వల్ల అసలు శరీరంలో శక్తి లేనంతగా అలసట ఉంటుంది. ఇలాంటి సమయంలో  కొద్ది గంటలో,లేదా  కొన్ని రోజుల్లో విశ్రాంతి తీసుకుంటాం. మళ్ళీ రెట్టించిన ఉత్సాహం తో తిరిగి రోజువారి కార్యక్రమాలతో మళ్ళీ బిజీ అయిపోతాం. అయితే కొన్ని సందర్భాలలో అలసట ఒక పట్టాన తీరదు. ఒకరెండు సంవత్సారాల క్రితం జరిగిన అధ్యయనంలో రోజూ ఏదు గంటల పాటు నిద్రపోయిన వారు సైతం వారిలో 45%  మంది అలసటతో గడుపుతున్నట్లు నిపుణులు గమనించారు. నేటి కాలమాన పరిస్థితులలో వివిధ రంగాలలో అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు,వృత్తి నిపుణులు, పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న జనాభ మాత్రమే దీని బారిన పడుతున్నారని,ఇందులో పురుషులు మాత్రమే ఎక్కువగా ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ పరిస్థితి అంటే ఫాటిగ్ యు సింగ్ ద్రోహం నుండి బయట పది శక్తి ఉత్సాహాలను తిరిగి పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు మానసిక నిపుణులు చేస్తున్న ప్రయత్నం అలసట మన కండరాలను మజిల్ ఫ్యాటీ యు నాడీ వ్యవస్థను సెంట్రల్ ఫ్యామిలీ యును తీవ్రంగా ప్రాభావితం చేస్తోంది అని నిపుణులు నిర్ధారించారు.అసలు అలసటకు కారణాలు ఏమిటో అత్యధికంగా నిస్సాత్తువ నిస్తేజం మనలను ఎందుకు ఆవరిస్తోందో మీకు తెలిపే ప్రయాత్నం చేస్తున్నారు రామ్మోహన్ అర అప్పరసు గారు మీరు ఒంటరి కాదని చెప్పేందుకే ఈ ప్రయత్నమని పరిష్కారం అందించే దిశగా ప్రయాత్నాలు చేస్తున్నారని ఫలితం వస్తుందని ఆశిద్దాం.

వంధ్యత్వం జయించామోచ్!

వంధ్యత్వం అనేది ఒక వ్యక్తి జీవితానికి ఒక శాపం.అదే కుటుంబాలను కూల్చేసింది. ఒకరినుండి ఒకరికి దూరం చేసేసింది. వంధ్యత్వంన్ని అడ్డుపెట్టుకున్న కొంతమంది వైద్యులు చికిత్చ పేరుతో ప్రజలను దోచేశారు. ఇక తండ్రికావడం కలేనని అనుకున్న వారికి ఇటీవలి పరిశోదన విజయం సాధించడం తో వారి జీవితానికి ఊపిరి పోసినట్లై అయ్యింది. అంటే వందత్వాన్ని జయించడం అనేది వైద్య రంగం లో గొప్ప విజయంగా భావిస్తున్నారు శాస్త్రజ్ఞులు. వంధ్యత్వానికి చికిత్స చేసే ప్రోటీన్‌...  మైయా శాస్త్రవేత్తలు వంధ్యత్వానికి చికిత్స చేయగల ప్రత్యేకమైన ప్రోటీన్‌ను కనుగొన్నారు, దానికి మాతృత్వం దేవత పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు వంధ్యత్వానికి మెరుగైన గర్భనిరోధక చికిత్సకు మార్గం సుగమం చేసే ప్రత్యేకమైన ప్రోటీన్‌ను కను గొన్నారు. వంధ్యత్వానికి సంబంధించిన నిర్ధారణ మరియు చికిత్సలో సహాయపడే స్పెర్మ్-ఎగ్ అడెషన్ మరియు ఫ్యూజన్ సమయంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు మొదటిసారిగా కనుగొన్నారు. కొత్త ఆవిష్కరణ మెరుగైన గర్భనిరోధకాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రోటీన్ కి మాతృత్వం  గ్రీకు దేవత మైయా అని   పేరు పెట్టారు.  చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీకి చెందిన కటీనా కొమ్‌స్కోవా నేతృత్వంలోని అంతర్జాతీ య బృందం నిర్వహించిన పరిశోధనలో మానవ ఓసైట్ ప్రోటీన్ల "ఉత్పత్తి" కోసం సెల్ కల్చర్‌ల అభివృద్ధిని కూడా హైలైట్ చేస్తుంది.సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, గేమేట్ ఫ్యూజన్ అనేది క్షీరదాల ఫలదీకరణం క్లిష్టమైన సం ఘటన, బృందం ఒక కీలకమైన స్పెర్మ్ ప్రోటీన్‌తో బంధించే మానవ గుడ్డుపై కొత్త ఎఫ్‌సి రిసెప్టర్ లాంటి ప్రోటీన్ 3ని కనుగొంది. ప్రోటీన్, సంశ్లేషణ పరస్పర చర్య మానవ స్పెర్మ్-అండ కలయిక మరియు జీవితం యొక్క సృష్టికి దారితీస్తుంది. "ఇది దాదాపు రెండు దశాబ్దాల పరిశోధన, విస్తృతమైన అంతర్జాతీయ సహకారం  ఫలితం, ప్రచురణలో యుకె,యుఎస్‌  జపాన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 17 విభిన్న అనుబంధాలు ఉన్నాయి" అని కొమ్‌స్కోవా ఒక ప్రకటనలో తెలిపారు. మొదట్లో యునై టెడ్ కింగ్ డమ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్‌లోని హ్యారీ మూర్ ల్యాబ్‌లో ఈ అధ్యయనం ప్రారంభమైంది.కణితులకు కారణమయ్యే ఉత్పరివర్తనాల కోసం బృందం వన్-బీడ్ వన్-కాంపౌండ్ (ఓబిఓసి) పరీక్షా పద్ధతిని ఉపయోగిస్తోంది, ఈ సమయంలో పరస్పర భాగస్వాములు ప్రత్యేక పూసలతో బంధిస్తారు మరియు గుడ్డు కణం యొక్క ఉపరితలంపై గ్రాహకాల కోసం వెతకడం ప్రారంభించారు, ఇవి కీలక కారకాలు. స్పెర్మ్ సంకర్షణలో మరియు ఇప్పటికీ సైన్స్‌కు తెలియనివి."మేము వందల వేల వేర్వేరు పూసలను సృష్టించాము, ఒక్కొక్కటి దాని ఉపరితలంపై ప్రోటీన్ భాగాన్ని కలిగి ఉంటుంది. మేము ఈ పూసలను మానవ స్పెర్మ్‌తో పొదిగించాము, ఒకదానితో ఒకటి సంకర్షణ చెందే వాటిని వేరు చేసాము. అనేక ప్రయోగాల తర్వాత, మేము అభ్యర్థి కలయికను గుర్తించగలిగాము.  ప్రోటీన్," కొమ్స్కోవా వివరించారు.పరిశోధన కోసం నైతిక కమిటీ ఆమోదం ఎలా పొందాలి అనేదానితో సహా అనేక సవాళ్ల ద్వారా బృందం చర్చలు జరపవలసి వచ్చింది, ఎందుకంటే ప్రోటీన్ మానవులలో మాత్రమే కనుగొనబడుతుంది. పరిశోధన కోసం మానవ గుడ్లు, స్పెర్మ్‌లను ఉప యోగించడానికి ఆమోదం రెండు సంవత్సరాలు పట్టింది."మేము గుడ్డును అనుకరించే ప్రత్యేక కణ సంస్కృతులను కూడా అభివృద్ధి చేసాము. ఈ కణాలు సాధారణంగా మానవ గుడ్డు యొక్క ఉపరితలంపై కనిపించే ప్రోటీన్‌లను 'ఉత్పత్తి' చేయగలవు, ఇది మాకు అనేక రకాల ప్రయోగాలను నిర్వహించడం సాధ్యం చేసింది" అని ప్రధాన పరిశోధకుడు పేర్కొన్నారు.వారు కనుగొన్న ప్రోటీన్‌కు చెందిన సిగ్నల్‌తో కప్పబడిన మానవ గుడ్డు ఉపరితలంపై మైక్రోవిల్లిని గుర్తించగలిగారు.  ప్రోటీన్ ఆవి ష్కరణ వంధ్యత్వ చికిత్స పద్ధతులను మెరుగుపరచడంతో పాటు భవిష్యత్తులో గర్భనిరోధకాల అభివృద్ధికి దారితీస్తుం దని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు."ఫలదీకరణం అనేది మానవ జీవితంలో ఒక కీలకమైన క్షణం, అయినప్పటికీ దాని గురించి మనకు ఇంకా చాలా తెలియదు. శారీరక ప్రక్రియల అవగాహనకు దోహదపడే ఇటువంటి కొత్త పరిశోధనలు మానవ వైద్యంలో ప్రత్యక్ష అనువర్తనాన్ని కనుగొన గలవు" అని కొమ్ర్స్కోవా అన్నారు.

సింపుల్‌గా బరువు తగ్గాలంటే..

అందరినీ వేదించే సమస్య ముఖ్యంగా యువతను వేదిస్తున్న సమస్య ఊబ కాయం అంటే ఒబెసిటీ. దీనికోసం తిరగని చోటంటూ ఉండదు .  వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. సక్షన్లు, నాన్ లైపోసక్షన్లు. ప్రత్యేకంగా దీనికోసమే ఉన్న ఆసుపత్రులు. ప్రత్యేక సర్జన్లు. ఇలా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావడం  గమనించ వచ్చు.చేతి వాడిని ఒదిలి కాలివాడిని పట్టుకున్నట్లు మనం పాటించాల్సిన కనీస  నియమావళిని అమలు చేయకుండా స్వీయ నియంత్రణ  లేకుండా ఊబ కాయాన్ని తగ్గించలేమని అంటున్నారు వైద్యులు.మీ శరీరం బరువు తగ్గాలంటే రాత్రి వేళ ఈ పది సూత్రాలు అమలు చేయండి.మీరు మీ శరీర బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ప్రతిరోజూ వర్క్ అవుట్ తప్పని సరిగా  చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు చేసి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరు నాజూకుగా స్లిమ్ముగా కనపడడానికి దోహదం చేస్తాయి. రాత్రి సమయమే సరైన సమయం... మన శరీర బరువు తగ్గించే ప్రయత్నం చేస్తు ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటూనే వర్క్ అవుట్ చేస్తూ ప్రతిరోజూ ప్రత్యేకమైన  విషయాలు అనుసరించాలి.అందులోను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ రాత్రివేళ ప్రయత్నించండి మీరు స్లిమ్ గా మారచ్చు .సాయంత్రం వేళ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. సాయంత్రం వేళ మిమ్మల్నిమీరు ఒక వ్యాపకం వైపుకు మళ్లించండి. కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చెయడం బోరింగ్ మీరు ఫిట్ గా ఉండాలంటే నిద్ర పోయే ముందు కొంత పని చేయాల్సి ఉంటుంది. కొంచం సేపు నడవడం, చాట్ చేయడం, వ్యాసాలు రాయడం, మీమిత్రులతో పంచుకోవడం. లేదా కొన్ని పుస్తకాలు చదవడం వల్లమీరు  ఆహారం పెద్దగా తీసుకోరు. ఒక కొత్త అలవాటు ఒక్కొఅంశం పైన ఆశక్తి పెంచుకోడం వల్ల పెయింటింగ్ వేయడం. సంగీతం పాడడం లేదా ఏదైనా వాయిద్యం వాయించడం. అల్లికలు చేయడం వంటి పనుల వల్ల ఆహారం తినాలన్న కోరిక తగ్గిపోతుంది. మళ్ళీ తినా లన్నా కాంక్ష బోర్ గా ఉంటుంది. సరిగా నిద్రపోవాలి... సాయంత్రం వేళలో  కాస్త వ్యాయామం కొంత మేర మీకు సహాయ పడుతుంది. అది ఎక్కువ సేపు వ్యాయామం చేయకూడదు. విరామం లేకుండా చేసే వ్యాయామం చెయడం వల్ల నిద్ర పోవడం కొంచం కష్టంగా ఉంటుంది. మరీ ఆలస్యంగా వర్క్ అవుట్ చేయకండి. నిద్రపోడానికి రాత్రివేళ గంట ముందు  వ్యాయామం ఆపేయండి ఆతరువాతే నిద్రకు ఉపక్రమించండి. నిద్రపోయే ముందు తినకండి... నిద్రపోయే ముందు మీరు డిన్నర్ తీసుకుంటారా? అల్పాహారం అంటే టిఫిన్ తీసుకుంటారా? ఏదైనా మీరు మీఅహారాని నిద్రకు ముందే ముగించేయ్యాలి. అలాకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీఆహారం తీసుకుంటే అది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. అయితే మీరు మీ బరువు తగ్గాలన్న ప్రయత్నం విఫలం కావచ్చు. సరైన సమయం, అంటే ఏ సమయంలో ఆహారం తిన్నారు అన్నది విషయం కాదు. చాలా మంది రాత్రి వేళలో  ఆహారం తీసుకునే వాళ్ళు పైగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అర్ధ రాత్రి భోజనం ,అల్పాహారం తీసుకోడం వల్ల  నిద్రపోలేరు. దీనివల్ల మళ్ళీ బరువు పెరుగుతారు. కొన్ని గంటల పాటు వంట గది నుంచి బయటికి రండి. నిద్రపోయేముందు నుంచి మరుసటి రోజు ముందు వరకు మేల్కుని ఉంటారు. మీ మధ్యాహ్న భోజనాన్ని రేపటికి ప్యాక్ చెయ్యండి... ప్రతి రోజూ మీరు మాధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్తున్నారా? అయితే కొంత పొడుపు చేయండి. రాత్రికి ముందే మీ లంచ్ ను ప్యాక్ చెయ్యండి. బయట తినడము అంటే  అందులో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, సోడియం ఉంటుంది మీ ఆహారాన్ని మీరే  ప్యాక్ చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఇచ్చే బాదాం, టర్కీస్లై సెస్, హోల్ గ్రైన్, తక్కువ కొవ్వు ఇచ్చే  పాల ఉత్పత్తులు చాలా రకాల పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. మీరు మీ సమయ పాలనకు కట్టుబడి ఉండండి... రాత్రి వేళ మీరు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని గమనిస్తే అంటే దాని ఆర్ధం ఉదయం వేళ మీరు సరిపడే ఆహారాన్ని తీసుకోలేదని అర్ధం. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మీ భోజనం మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరకంగా మీ శరీరానికి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో  తెలుస్తుంది. మాధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ మధ్య స్నాక్ తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నం చేయడం అది మీరు ఎక్కువగా చేయకండి. టి వి ని కట్టెయ్యండి... రాత్రి వేళ ఆహారం తీసుకుంటూ టివి చూసే అల వాటు మీకు ఉంటె మీరు ఆహారం తీసుకునే సమయం టి వి చూసే సమయం ఆమధ్యలో మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాసం ఉంది.రాత్రి ఆహారం తీసుకున్నాక మీ చిగుళ్ళను పళ్ళను బ్రష్ చేయండి. రాత్రి వేళ మీరు తీసుకునే ఆహారాన్నిపూర్తిగా తగ్గించాలంటే మీరు మీపళ్ళను  చిగుళ్ళను శుబ్రం చేసుకోండి. ఒక వేళ మీ పళ్ళు శుభ్రంగా ఉంటె నిద్రపోవడానికి ముందే అల్పాహారం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి. పళ్ళు శుభ్రం చేయడానికి 6౦ నిమిషాలు ఆలోచించండి. ప్రత్యేకంగా మీరు యాసిడ్స్ లాంటివి అంటే నిమ్మరసం, ద్రాక్ష పళ్ళు, సోడా లాంటివి తీసుకుంటే 6౦ నిమిషాలు  ఆగాలి అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని సులభంగా జయించవచ్చు... మీరు ఒత్తిడిని ఎదుర్కుంటూ న్నట్లైతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి వేళ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. లోపలి సుదీర్ఘ శ్వాస తీసుకునే పద్దతులు అవలంబించండి. లేదా మెడిటేషన్ ధ్యానం చెయడం ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని అలా చేయడం వల్ల నాణ్యతతో కూడుకున్న నిద్ర ను పొందవచ్చు. ఇక చివరగా రాత్రివేళ నిద్ర పోయే ముందు లైట్లు తీసి వేయండి.. చీకాట్లో నిద్రపోవడం చాలా మందికి అల వాటు. అలా చేయడం వల్ల మాంచి నిద్ర పడుతుంది.మీరు బరువు తగ్గించు కోవాలన్న ప్రయత్నాం చేయడం ద్వారా మీ కిటికీలు మూసి వేయండి. కర్టెన్లు వేసుకోండి. ఫోన్లు ల్యాబ్ టాబ్ కు దూరంగా ఉండండి. పడు కునేందుకు ముందు 3౦ నిమిషాలు వాటికి దూరంగా ఉండండి. కంటి మీద మాస్క్ వేసుకుంటే సహాయ పడుతుంది.

దీర్ఘకాలంగా మిమ్మల్ని వాపు వేధిస్తోందా!?

మిమ్మల్ని నెమ్మదిగా ప్రాణాలు హరిస్తుంది.మీరు దీర్ఘకాలంగా ఇంఫ్లామేషణ్ అంటే వాపు తో బాధ పడుతూ ఉన్నారా మిమ్మల్ని మీ ప్రాణాలే నెమ్మదిగా తీసుకుపోతుంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే నిపుణులు నిర్వహించిన అధ్యయనం లో వాపు వైద్య పరిభాషలో చెప్పే ఇంఫ్లామేషణ్ వ్యాధి కాదని నిర్ధారించారు. వాపు ఇంఫ్లామేషణ్ లక్షణాలు ఉండి వేదిస్తూ ఉంటుందని అది ఒక అనారోగ్య స్థితిగా పేర్కొన్నారు. బహుశా మీకు చెడు కొలస్ట్రాల్ గురించి విని ఉండవచ్చు.మీ గుండెలో రక్త ప్రవాహం సరిగా లేనందువల్ల వాపు ఇంఫ్లామేషణ్ ఉండవచ్చు.మీకు ప్రతిరోజూ పొగతాగే అలవాటు ఉన్న వారు జీవన శైలి వల్ల క్యాన్సర్ వల్ల వచ్చే ఇంఫ్లామేషణ్ శరీరంలో లివర్ లో కొవ్వు పేరుకు పోయి లివర్ లో వాపు ఉండడం గమనించవచ్చు మీరు తరచుగా మీరు ఇంఫ్లామేషణ్ అన్న పదం వినిఉండ వచ్చు లేదా అసలు విని ఉండక పోవచ్చు.దీనికి కారణం ఎన్నో అనారోగ్య సమస్యలు కారణం అయ్యిఉండవచ్చు.అని నిపుణులు అంటున్నారు.హార్వర్ల్ద్ మెడికల్ జర్నల్ లో దీర్గ్గ కాలిక తాకువ స్థాయి వాపు లేదా ఇంఫ్లామేషణ్ ఉంటె అది మిమ్మల్ని నిశ్సబ్దంగా మిమ్మని మీ ప్రాణాలే హరిస్తుంది.అని నిపుణులు గుర్తించారు. ఇంఫ్లామేషణ్ లేదా గుండె సంబంధిత సమస్యలు క్యాన్సర్, టైపు2  డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటాయని అజర్నల్ లో ప్రచురించారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 5 మందిలో ౩ ముగ్గురికి ఇంఫ్లామేషణ్ వాపు వాపు బారిన పడుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు . ఇంఫ్లామేషణ్ లో రకాలు... ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వాస్తవం చెప్పాలంటే ఇంఫ్లామేషణ్ ను రెండు భాగాలుగా విభజించారు. దీర్ఘ కాలిక లేదా తీవ్రమైన ఫ్లామేషణ్ కారణంగా కణాలు నాశనం అవుతాయి.దీనికి కరానం అనుకోకుండా గాయాలు కావడం. కొద్ది కాలం లోనే అది తీవ్రమైన ఇంఫ్లామేషణ్ గా మారవచ్చు.ఇంఫ్లామేషణ్ కొన్ని సార్లు వస్తూ ఉంటుంది.  దీర్ఘ కాలంగా వచ్చే వాపులు ఇంఫ్లామేషణ్ చాలా ఖతినంగా ఉంటుంది.మనం ఇంఫ్లామేషణ్ ను గుర్తిన్చేలోపే తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. దీర్ఘ కాల ఇంఫ్లామేషణ్ వల్ల ఏమౌతుంది... ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ దీజార్దర్ తో బాధ పడే ప్రతి వ్యక్తిలో ఉన్న వ్యాధినిరోధక శక్తి ఆరోగ్యంగా ఉన్న కణాలను వ్యతిరేకంగా పనిచేసినప్పుడు. లేదా ఇతర రాసాయ నాలు టాక్సిన్స్ కు లోనై నప్పుడు ఉదాహరణకు వాతావరణ కాలుష్యం, పారిశ్రామిక వ్యార్ధాలు కాలుష్యం కారణం కవ్వచ్చని నిపుణులు అంచానా వేస్తున్నారు. కాగా ఒక్కోసారి దీర్ఘ కాలిక ఇంఫ్లామేషణ్ లేదా వాపుకు దారితీస్తుంది.కొన్ని పరిశోధనలలో తీవ్రాత్తిది పొగత్రాగడం లేదా మాద్యం తాగడం వల్ల ఇంఫ్లామేషణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి . దీర్ఘ కాలిక ఇంఫ్లామేషణ్ లక్షణాలు... కొన్నిరకాల లక్షణాలు ఉంటె దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ వస్తుంది. మీరు ఏదయినా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ఈ స్థితికి చేరితే ఇంఫ్లామేషణ్ ఉన్నట్లయితే కొన్ని లక్షణాలు ఉండచ్చు ఉండక పోవచ్చు. *దీర్ఘకాలంగా అసహజమైన భరించలేని నొప్పి  *దీర్ఘకాలంగాఊపిరి తిత్తులలో నొప్పి చెస్ట్ పెయిన్ . *దీర్ఘకాలంగా త్వరగా అలిసి పోవడం . *పలుమార్లు జ్వరం రావాడం. *దీర్ఘకాలంగా చర్మం పై దద్దుర్లు ఇతర లక్షణాలు గుర్తించిన వెంటనే మీరు ఇంఫ్లామేషణ్ బారిన పడ్డాట్లు సంకేతం . దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ ప్రాణాంతకం కవచ్చు... జోన్ వాప్కిన్స్ మెడిసిన్ జర్నల్ లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పరిశోధకులు గుర్తించిన పలు అంశాలు ఏమిటి అంటే తీవ్రస్తాయి లో ఉన్న ఇంఫ్లామేషణ్ ను మీరు గుర్తించి నట్లయితే గుండె పోటు వచ్చే అవకాశం ఉందని దీనికి క్లినికల్ స్టడీస్ నిర్వహించిన డాక్టర్ కంబాస్ ఇంఫ్లామేషణ్ వల్ల కొలస్ట్రాల్ శాతం స్థాయి లో మార్పు లేకుండా వాపు  ప్రభావం ఎక్కువగా ఉంటుంది.అయితే ఇంఫ్లా మెటరీ సమస్యకు యాంటి ఇంఫ్లా మేటరీ చికిత్చ కు మందులు వాడవచ్చని వాస్తవానికి ఇంఫ్లామేట రీ వచ్చిందంటే గుండెకు చికిత్చ చేయడం అవసరం నిపుణులు విశ్లేషించారు.ఒక్క విష్యం మాత్రం వాస్తవం ఇంఫ్లామేషన్ కు మార్గం ఉందని నిపుణులు పేర్కొన్నారు.ఒకసారి దీర్ఘ కాలిక ఇంఫ్లామేసన్ ను గుర్తిస్తే వాపును గుర్తిస్తే ఇంఫ్లామేట రీ హెర్బ్స్ కొన్నిరకాల మూలికలు స్తేరాయిడ్ లేని యాంటీ ఇంఫ్లామేటర్ మందులు కొన్ని కేసులలో స్తేరాయిడ్ ఇంజక్షన్ ఒక్కక్ విషయం మాత్రం నిజం ఇంఫ్లామేషన్ వాపులకు తప్పనిసరిగా చికిత్చ చేయాలి .

దివ్యాంగులైన మహిళలు ఆరోగ్యం పై పూర్తి అభద్రత!

అన్నీ అవయవాలు సరిగా ఉంటేనే మనిషి జీవితం పై నమ్మకం సన్నగిల్లడం. లేదా బతకలేమని బతుకు పై ఆశలు  వదులుకోవడం పోటీ ప్రపంచంలో తాము విజయం సాధించడం సాధ్యం కాదని నిరాశా నిస్పృహలకు లోను కావడం మనం చూస్తున్నాము. ఇటీవలి కాలం లో చాలామంది యువత కోవిడ్ తరువాత వారి జీవన శైలిలో మార్పు వచ్చింది. ఆశావహ దృక్పదం వదిలి కొందరు ఆత్మహాత్యలకు ప్పాల్పడుతున్నారు.ఈనేపధ్యంలో మహిళల లో అంగవైకల్యం వారి మనోధైర్యాని దెబ్బ తీస్తుంది. వారి ఆరోగ్యం పట్ల అభాత్రత భావం కలిగిఉన్నారని సి సి డి పపి వెల్లడించింది. సిసిడి పి సి నిర్వహించిన సర్వేలో 18-44 సంవత్సరాల వయస్సు ఉన్న ౩,57౦ మంది మహిళలతో సర్వ్ నిర్వహించారు.అయితే ఇందులో కొందరు కంటి చూపు కోల్పోయిన వారు, కొంతమంది బధిరులు అంటే వినికిడి శక్తి లేని వారు కొంతమంది పూర్తిగా అంగవైకల్యం తో నడవలేని వారు అసమార్ధులు ఉండడం గమనార్హం.అమెరికాకు చెందిన ఎన్వర్ద్యు స్కూల్ ఆఫ్ గ్లోబల్ పుబ్లిక్ హెల్త్ ద్వారా నిర్వహించిన ఒక నూతన అధ్యయనం లో దివ్యాంగులైన మహిళల లో వారి ఆరోగ్యం పై పూర్తి అభద్రత కలిఉన్నత్లు నిపుణులు గుర్తించారు. కాగా వారు తీసుకునే భోజనం లో సరైన పోషక విలువలు ఉన్నాయో లేదో అన్న భయం వారిని అవరించాదాన్ని అధ్యయనం లో కనుగొన్నారు.సామాన్యులతో పోల్చినప్పుడు వైకల్యం కలిగిన వారిలో రెండు రెట్లు అభద్రతా ఉంటున్బ్దని ఆ ఆధ్యయనంలో ఈ అధ్యయనం నిష్కర్శ ఎకాడమి ఆఫ్ న్యుట్రీషియన్ అండ్ డైటిక్స్ పత్రికలో ప్రచురించారు. ఎల్వర్ద్యు స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ సాధారణ ప్రజల పోషణ ప్రొఫెసర్ చేసిన అధ్యయనం చేసిన ప్రముఖ రచయిత ఇండియా డియర్ లీస్ చెప్పిన పద్ధతి ప్రాకారం చాలా అనారోగ్యాల నుండి రక్షిమ్పబడా లంటే పౌష్టిక ఆహారం చాలా అత్యవసరం. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళల విష్యం లో గర్భస్థ సమయం లో మంచి పౌష్టిక ఆహారం తల్లి బిడ్డలకు అవసరం అది తల్లి బిడ్డకు ఆరోగ్యం గా ఉంచడం తో పాటు అద్భుతంగా పనిచేస్తుంది.ఆరోగ్యంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆహారం విష యం లో ఖర్చుతో కూడుకున్నండున శరీరానికి శక్తి అవసరం. దివ్యాంగులు,వికలాందులు  అలా చేయాలేదు అన్గావైకాల్యం తో బాధ పడుతున్న మహిళలు ఆహారం ఎలా ఉండాలో తెలిపేందుకు 2౦1౩-2౦18 సంవత్సారాల మధ్య న్యుట్రీషియన్  సర్వ్ లో గణాంకాలు వెల్లడించారు.ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు ప్యాక్ చేయబడి ఉంటాయి. బెక్ చేసిన ప్యాక్ చేసి ప్యాక్ చేసిన ఆహారం, అల్పాహారం స్నాక్స్ చిరుతిళ్ళు నిల్వుంచిన ఫ్రిజ్ లో నిల్వుంచిన పానీయాలు చక్కర స్థాయి ఎక్కువగా ఉంటుంది. తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాని వేదిచేసే విధంగా తయారు చేస్తారు. ఈ ఆహారంలో మనకు కావల్సిన దానికన్నా ఎక్కువ స్థాయిలో చక్కర ఉంటుంది లేదా అధిక స్థాయిలో ఉప్పు ఉండడం గమనించవచ్చు. విటమిన్లు పీచు పదార్ధాలు తక్కువగా ఉంటాయి. భోజన తయారీకి అవసరమైన ప్రానలిక భోజనం కొనుగోలు లేదా ఇంట్లో వంట చేసే పూర్తి బాధ్యత మహిళల డే అయితే వీరే అన్నినిర్నయాలు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.సి డి సి సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెంక్షన్ సంస్థ నిర్వహించిన సర్వేలో 18-44 సంవత్సారాల వయస్సు ఉన్న ౩,579 మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు సంస్థ వెల్లడించింది.వీరిలో కొంతమంది కి కంటి చూపు లేని అంధులు, కొంతమంది బధిరులు, వినికిడి సమస్య ఉన్నవారు కొంతమంది శారీరకంగా అంగవైకల్యం తో నడవలేని అసమర్ధులు ఉన్నారు.ఇందులో కొంత మంది డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు వారికి రోజూ భోజనం తరువాత అడిగి తెలుసుకున్నారు.వారి వారి లక్షణాలు అనారోగ్య సమస్యల ఆధారం గా వారిని వివిధ స్థాయిలో గణాంకాలు రూపొందించి విశ్లేషించారు. అన్గావైకల్యం తీవ్రత,గర్భిణీ సమస్యలు  అనారోగ్య సమస్యలు వారిలో ఆత్మధైర్యం కోల్పోకుండా వారికి తిరిగి జీవితానికి బద్రత కల్పించాలి.                                      

మైగ్రేయిన్ అవగాహన వారోత్సవాలు...

మై గ్రెయిన్ వచ్చిందంటే భరించలేని తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తీవ్ర మైన నొప్పి తలతిరగడం తల పట్టేయడం ఒక్కసారి వదల గానే వాంతులు. రావడం తో నరకం చూస్తున్నామని వారు వాపోవడం గమనించవచ్చు.మై గ్రెయిన్ కు అలోపతిలో అందరికీ పనిచేయక పోవచ్చు. మై గ్రెయిన్ తో బాధ పడేవారు ఒక్కోసారి ఆత్మహాత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మైగ్రేయిన్ ఒక న్యూరో లాజికల్ సమస్యగా డాక్టర్స్ పేర్కొన్నారు. మైగ్రేయిన్ పై అవగాహనా వరాన్ని సెప్టెంబర్ నెలలో ప్రతియేటా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5 వ తేదినుండి 1 4 తేది వరకూ మైగ్రేయిన్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి మామూలు సాధారణ మైన తలనొప్పి కాదు చాలా తీవ్రమైన తలనొప్పి తో పాటు తల నొప్పి తీవ్రమై నప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం వినికిడి సమస్య రావడం గమనించవచ్చు. మైగ్రెయిన్ వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు వైద్యం చేయవచ్చు వీటివల్ల కొంతమేర మై గ్రెయిన్ తీవ్రత తగ్గి ఉపసమనం కల్పిస్తుంది. మైగ్రెయిన్ అట్టాక్ నుండి కొంత మేర ఉపసమనం కలిగించే 8 ఉపాయాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. లేవెండర్ ఆయిల్ తో లాభం... లేవెండర్ ఆయిల్ ను రాయడం ద్వారా మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి కొంతమేర ఉపశమనం ఉపశమనం కలుగుతుంది.  లేవెండర్ ఆయిల్ ను వేరే నూనెలో కలిపి రాయవచ్చు. లేవేండర్ నూనెను మీ మెదడుపై మృదువుగా వ్రాయవచ్చు. పెప్పర్ మెంట్ ఆయిల్... పెప్పర్ మెంట్ ఆయిల్ లో కనుగొన్న మెంతాల్  రసాయనం మైగ్రైయిన్ ను నిలువరించే నిరోదించేందుకు సహకరిస్తుంది ఈ విషయం పై పలు పరిశోదనలు నిర్వహించారు. అల్లం... కళ్ళు తిరగడం మైగ్రేయిన్ స్థితికి కారణం కావచ్చు. దీనినుండి బయట పాడేందుకు అల్లం కొంతమేర ఉపసమనం కలిగిస్తుంది. అల్లం వాడకం వల్ల మైగ్రేయిన్ కు కొంతమేర ఉపసననం తోపాటు లాభం చేకూర వచ్చు  యోగాతో మైగ్రేయిన్  కు అడ్డుకట్ట... మైగ్రేయిన్ నుండి ఉపసమనం పొందడానికి యోగ దోహదం చేస్తుంది. యోగాలో శ్వాస తీసుకునే పద్దతులు ధ్యానం సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. 2౦ 15 లో జరిగిన పరిశోదనలో యోగాతో మై గ్రెయిన్  అటాక్ తీవ్రతను తగ్గించవచ్చని తేలింది. ఆహారం లో మెగ్నీషియం పెంచండి... శరీరంలో మెగ్నీషియం తగ్గడం వల్ల మైగ్రేయిన్ నొప్పి మరింత తీవ్రంగా ఉండవచ్చు. అసలు మెగ్నీషియం తలనొప్పికి సంబంధం ఉందని అంటున్నారు. అందుకే మీ ఆహారం లో బాదాం, అవిసగింజలు, ఆకు కూరలు,నట్స్,పీనట్ బట్టర్, ఓట్ మీల్, గుడ్లు,పాలు, ఎక్కువగా తీసుకోండి. ఒత్తిడి నియంత్రించే ప్రయత్నం చేయండి... అమెరికన్ మైగ్రెయిన్ ఫెడరేషన్ సమాచారం మేరకు మైగ్రేయిన్ తోబాద పడుతున్నవారు దాదాపు 8౦%మందిలో ఒత్తిడి కారణం గానే మైగ్రేయిన్ కు కారణంగా నిపుణులు పేర్కొన్నారు. మీరు ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటేనే  మైగ్రేయిన్ అటాక్ తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచండి... అమెరికన్ మైగ్రేయిన్ ఫౌండేషన్ సూచన ప్రకారం మైఇగ్రేయిన్ బారిన పడిన వారిసంఖ్య 1/౩ డీహైడ్రేషన్ వల్లే మైగ్రేయిన్ వస్తుందని డీ హైద్రెషన్ నుండి రక్షింప బడాలంటే నీరు తీసుకోవాలి ప్రత్యేకంగా వ్యాయామం చేయాలి ఎండాకాలం లో నీరు మరింత ఎక్కువ తాగాలి. రాత్రి నిద్రపోఎందుకు ప్రయత్నం చేయాలి... నిద్ర మరియు డీ హైడ్రేషన్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న విష్యం తెలియరాలేదు అయితే 2౦16 లో వచ్చిన రిపోర్ట్  ఆధారం గా మైగ్రేయిన్ అట్టాక్ మళ్ళీ మళ్ళీ వస్థూ ఉంటె నిద్రలేకుంటే దీనికి సంబంధం ఉందని తేల్చారు. అందుకే రాత్రి సంపూర్ణంగా నిద్రపోయే ప్రాయాత్నం చ్ఘేయాలంటే నిద్రాపోఎముండు కాఫీ, లేదా టీ తీసుకుంటే నిద్రారాడు దీనివల్ల మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.మైగ్రేయిన్ పై ఉన్న భిన్నమైన అఫాలు అనుమబాలకు సందేహాలకు సెప్టెంబర్ లో మైగ్రేయిన్ అవగాహన వరాన్ని నిర్వహించడం కొనసాగుతోంది. 

పచ్చి పాలు తాగితే ప్రమాదమా?

పచ్చిపాలు తాగితే చాలా లాభాలు సురక్షితం అనికొందరు.  కాదు కాదు పచ్చిపాలు ఆరోగ్యానికి హానికరం అని ఇంకొందరు అంటున్నారు మరి అందులో నిజం ఏది? అనితేలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల లోకి వెళ్తే మనం ప్రతిరోజూ పాలు ఎదో రూపం లో వాడుతూ ఉంటాము.మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు పాలు లాభదాయకంగా ఉంటుంది. అని అందరూ అంగీకరిస్తారు.మరి మీరు తేల్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పచ్చిపాలు లాభదాయకమని లేదాపేస్టూ రైజ్డ పాలు లాభమా అన్నది ప్రశ్న. మీరు రోజూ పాలు తాగుతారా ?అయితే ఇది చదవడం అత్యవసరం.పాలు మనం ప్రతిరోజూ ఎదోరూపం లో వాడతాము.అసలు పాలు లేకుండా రోజు గడవడం కష్టం.అంటే పాలు లేకుండా ఉండడం కొంచం కష్టం.మీ ఇమ్యునిటీ నిపెంచడం దగ్గరనుంచి ఎముకలు,పళ్ళు బలంగా ఉండేందుకు మెటాబాలిజం పెంచేందుకు పాలు దోహదం  చేస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే మీరు పాలను సరైన పద్దతిలో తాగాకుంటే పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు లేకుండా మీ శరీరానికి ఉపయోగ పడదు. పచ్చిపాలు తాగ వచ్చా? ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదు మనశరీరానికి పచ్చిపాల లో ఉన్న పోషక తాత్వాలను అందిస్తుంది.ఎందుకంటే గడ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు. పాల వల్ల లాభాలు... కొన్ని ఏళ్లుగా పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చెపుతూనే ఉన్నాము.నష్టాలు గురించి తక్కువే చెప్పుకుంటాము పాలలో కాల్షియం,పోస్ఫరస్,విటమిన్ బి,పొటాషియం,విటమిన్ డి,వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి.దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది.మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి.కణాలు టిష్యులు రీజేనేవేషన్,లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.? పాలు తాగాలంటే సరైన పద్ధతి ఏమిటి? పాలను వినియోగించాలంటే మిల్క్ షేక్,స్మూదీ,టీ,మిటాయి, ఎక్కడైనా ఏరూపంలో ఐనా వాడతారు.ప్రతివ్యక్తి పాలను వాడే సరైన పద్ధతి వేరు వేరుగా ఉంటుంది. కాని చాలామందికి పచ్చి పాలు  తాగడం ఇష్ట పడతారు.ఇది ఏ మాత్రం కలుషితం లేనిదని పవిత్ర మైనవిగా భావిస్తారు. పచ్చిపాలను తాగడం మంచిదేనా? సురక్షితమా? కొన్ని ఏళ్ళుగా ఒక పరంపరగా పచ్చిపాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని ధర్మంగా భావిస్తారు.వీటిలో ఏ రకమైన పదార్ధాలు తీయకుండా నేరుగా తాగడం కాలాను గుణంగా ఆలోచనలు పెరిగి మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చిపాలు తాగడం సురక్షితం కాదని నిర్ధారించారు. పచ్చి పాలు తాగితే ఏమౌతుంది? పచ్చి పాలు తాగడం వల్ల హానికలగ వచ్చు ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా లిస్టేరియా,ఈ కోలి,కాక్సిఎలా ,సాల్మనేల్ల,కేండి లో బెక్టర్,యార్సినియా,ఆరోగ్యం పంచెంద్రియాల పై సమస్యలు సృష్టించ వచ్చు. ఒక వేళ ఆయా ఆవులు గేదేలలో శరీరం లో ఏమైనా వైరస్ సంక్రమించి ఉంటె సమస్యలు వస్తాయి. గర్భవతులు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

ఆస్తమాను కంట్రోల్ చేసే పళ్ళు.. కూరగాయాలు...

అస్తమా వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే ఊపిరి తీసుకోవడం లో కష్టంగా ఉంటుంది. ఇందుకోసం ఎన్నొఏళ్ళుగా అనేక  రకాల ఇంహేలర్లు మందులు వాడుతూనే ఉంటారు. వాతావరణం మారిందా ఆస్తమా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ప్రతి ఏటా వరల్డ్ అస్తమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా అస్తమా పై అవగాహన కొన్ని రకాల  అస్తమా లక్షణాలను తగ్గించడం లో కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు సహకరిస్తయన్న విషయం మీకు తెలుసా. పిల్లల నుండి పెద్దలు అంటే వృ ద్దుల వరకూ అస్తమా బారిన పడుతూనే ఉన్నారు.అస్తమా వచ్చిన వారిలో శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం తీవ్రమైన దగ్గు.ఊపిరి పీల్చుకోవడం గుండెల్లో మంట,వంటి సమస్యలు వస్తాయి. చికిత్సలో భాగం గా ఇన్హేలర్ లు వినియోగిస్తారు.అలాగే కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు అస్తమా లక్షనాలను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది. సిమ్లా మిర్చి... సిమ్లామిర్చి యాంటి ఆక్సిడెంట్ గా ను,విటమిన్ సి ఫైటో న్యుట్రీ యంట్స్ గుణాలు సంపూర్ణంగా ఉంటాయి అది మీఅరోగ్యానికి పూర్తిగా సహకరిస్తుంది. దానిమ్మ పండు.. ఇందులో విట మిన్ సి పీచుపదార్ధము యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటాయి.ముఖ్యంగా శ్వాస నాళం  నాశనంకాకుండా సహకరిస్తుంది.వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో రక్తం శాతం తగ్గినప్పుడు. దానిమ్మ జ్యూస్,లేదా దానిమ్మ గింజలు ఆరోగ్యవంతులను చేసేది దానిమ్మ పండే అస్తమాతో ఇబ్బడి పడుతూ నీరసించి పోయేవారికి అద్భుత మైన ఔషదం గాసంజీవని గా  పనిచేస్తుంది. అల్లం... అల్లం లో యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది.ఒత్తిడిని నియంత్రిస్తుంది.శరీరంలో డి ఎన్ ఏ కు ఎలాంటి నష్టం జరగ కుండా నిలువరించడం లో అల్లం సహాయ పడుతుంది.బ్లడ్ ప్రేషర్,గుండె పోటు.శ్వాస నాళా లలో ,ఊపిరి తిత్తులలో ఎలాంటి అనారోగ్యం తో నైనా పోరాడే విధంగా అల్లం సహాయ పడుతుంది.ముఖ్యంగా శ్వాస నాళాలలో మనకు అడ్డం పడే కళ్ళే ను తొలగించడం లో అల్లం మనకు సహాయ పడుతుంది. పాల కూర... పాల కూరలో ప్రోటీన్,ఐరన్,విటమిన్ మినరల్స్,పొటాషియం మెగ్నీషియం,వంటి విటమిన్ పీచు పదార్ధం పాస్పరస్,తయా మిన్ విటమిన్ ఇ, వంటి పోషకతాత్వాలు ఉంటాయి.పాల కూర వాడకం వల్ల జుట్టు,ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గించడం లో మీకు సహక రిస్తుంది. టమాట రసం... విటమిన్ సి విటమిన్ బి పొటాషియం సంపూర్ణంగా టమాటా లో ఉంటుంది.లైకో పిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభించడం వల్ల గుండె అనారోగ్య సమస్యల నుండి క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుండి తగ్గించడం లో సహకరిస్తుంది. యాపిల్... యాపిల్ సంపూర్ణ పోషకాలు ఉన్న పళ్ళలో సంపూర్ణంగా పీచుపదార్ధం ఉండడం వల్ల.శరీర బరువు తగ్గించడం లో ఊపిరి తీసుకోవడం లో సహకరిస్తుంది. అయితే యాపిల్ డయాబెటిస్,గుండె సంబంధిత క్యాన్సర్,దీర్ఘకాలిక రోగాలను నిలువరించడం లో సహకరిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు అని న్యూ ట్రీషియనిస్ట్ లు అంటున్నారు. బీన్స్... బీన్స్ లో విటమిన్ ఏ,సి పోలక్ట్ యాసిడ్ ,కాల్షియం,ఫైబర్,సంపూర్ణంగా ఉంటుంది.బీన్స్ ఎముకలను పటిష్టంగా బలంగా ఆరోగ్యంగా ఉంచేందుకు. ఎముకలు విరగడం వంటి ప్రమాదాల నుండి కాపాడ డం లో కీలక పాత్ర పోషిస్తుంది.బీన్స్ లో విటమిన్ బి,డిప్రెషన్ ను తగ్గించడం లో మీకు బీన్స్ సహాయ పడుతుంది. కమలా పండు... సంత్రా... విటమిన్లు ,ఖనిజ లవణాలు యాంటి ఆక్సిడెంట్ తో నిండిన పోషక తత్వాలు ఖజానా ఉంటుంది.పైన పేర్కొన్న పండ్లు కూరగాయాలు శ్వాస కొస సంబంధిత సమస్యలను నిలువరించడం లో సహాయ పడుతుంది.  

గర్భవతులకు - పోషకాహారం!

ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు - * గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో బిడ్డ పుడుతుంది. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల తల్లీ,బిడ్డల మరణాలకు దారి తీస్తాయి. * పాలిచ్చే తల్లులు  సంపూర్ణ ఆహారం తీసుకుంటే శిశువుకు కావలసినంతగా పాలు ఇవ్వగలరు. గర్భవతిగా వున్నపుడు రోజు తీసుకోవలసిన ఆహారం: 1) ఐదు నెల నుంచి తప్పకుండ ఆహారంలో క్యాలరీస్ ఉండేలా చూసుకోవాలి. 2) గర్బవతికి రోజుకి 300 క్యాలరీస్  శక్తి అవసరం అవుతుంది 3)అదనంగా 15 గ్రాముల మాంసకృత్తులు 4)10 గ్రాముల  కొవ్వుపదార్దాలు ఉండేలా చూసుకోవాలి. గర్బిణీలు కాల్షియం వున్న ఆహారం తప్పకుండ తీసుకోవాలి. దీనివల్ల బిడ్డకి ఎముకలు, దంతాలు దృడం గా  రూపొందుతాయి అలాగే  తల్లికి పాలు కూడా సమృద్దిగా వుంటాయి.  ఐరన్ కూడా తప్పకుండా తీసుకోవాలి. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.  గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి :  * రోజుకు మూడు కన్నా ఎక్కువ సార్లు భోజనం చెయ్యాలి. * మొలకెత్తినధాన్యాలు,ముడిధాన్యాలు ఆహారం తీసుకొవాలి. * పాలు, మాంసము, కోడిగుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. * ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. * ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభభించి తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి. * టీ, కాఫీ ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది ఇవి శరీరానికి కావలసినంత ఐరన్ అందకుండా చేస్తాయి . ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభభించి తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి. * టీ, కాఫీ ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది ఇవి శరీరానికి కావలసినంత ఐరన్ అందకుండా చేస్తాయి.

జలగల వైద్యం గురించి మీకు తెలుసా?

ఒకడు మనల్ని పట్టి పీడిస్తుంటే వీడెవడండి బాబు జలగల పట్టుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు అంటే జలగలా మనిషే పట్టి పీడిస్తే ఇక అసలైన జలగ మనశరీరం మీద ఉంటె అబ్బో ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదు.అయితే జలగ చేసే తత్వం తెలుసు కాని జలగ చేసే మేలు చేసే మరో కోణం ఉందని అంటున్నా రు నిపుణులు. ముఖ్యంగా యునాని వైద్యం లో ముఖ్యంగా బోదకాలు, వేరికోస్ వైన్స్ వంటి వాటికి జలగ చికిత్స చేయవచ్చని ఇది నాడీ వైద్యం లో కూడా దీని ప్రస్తావన ఉందని నిపుణులు డాక్టర్ యునాని వైద్యురాలుడాక్టర్ ఎస్ జి వి సత్య, నాడీ తెరఫీ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు.  హృద్రోగంలో జలగ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ  ప్రైం హాస్పిటల్ కు చెందినా హృద్రోగ నిపుణుడుఇంటర్ వెంష్ణల్ కార్డి యలజిస్ట్  డాక్టర్ రఘు అన్నారు. ఇటీవలి కాలం లో ముఖ్యంగా కోవిడ్ తరువాత రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె రక్త నాళాల లో సమస్యలు వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. గుండె నాళా లలో గడ్డ కట్టడం వల్ల తరచూ సమస్యలు వస్తూ ఉంటాయి.   రక్తాన్ని పలుచగా చేసేందుకు వాడే మందులు తక్కువే అందుకే హిరు డిస్ అనే మందును జలగల నుండి ఉత్పత్తి చేసి వాడతారని జలగ నుండి మందు తీయడం కష్టం కాబట్టి ఈ మందుకు ప్రత్యామ్నాయాలు చేసి ఉపయోగిస్తారని డాక్టర్ రఘు వివరించారు. జలగతో వైద్యాన్ని హిరుడో తెరఫీ అంటారు. జలగా సాంకేతిక నామం హిరుడోస్ వీటి గురించి పందొమ్మిది శ తకలాలో  జలగలను వైద్యానికి ఉపయోగ పడతాయని మొట్ట మోదట సారి చెప్పింది హిప్పో క్రాట్స్ శరీరంలో మలినాలు పెరిగినప్పుడు. అనారోగ్యం సంభవిస్తుంది. ఆకాలం నాటి వైద్యులు వైద్య శాస్త్రాన్ని నమ్మేవారు ఎవరికైనా తీవ్ర అనారోగ్యం వచ్చిందో జలగాలతో వైద్యం పెట్టి రోగి రక్తం పీల్చేసే వారని ప్రాచీన వైద్యం లో జలగ అత్యంత కీలక వైద్య విధానంగా జలగ చికిత్స గురించి పందొమ్మిదో శతకం లో వివరించిన అనంతరం ప్రాచుర్యం లోకి వచ్చిందని అంటున్నారు ఇంటర్ వెంష్ణల్ కార్డి యెలజిస్ట్ డాక్టర్ రఘు అన్నారు.జలగ వ్యాపారం చేసే వాళ్ళ లో కోట్లకు పడగలెత్తిన వాళ్ళూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అసలు జలగ చికిత్స సురక్షితమా ? జలగ ఒక జీవిని పట్టుకున్నప్పుడు అశరీర భాగం లో స్పర్శ లేకుండా రసాయన పదార్ధాలు వసులుతుంది ఫలితంగా నొప్పి తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. రక్తం పోతున్నా ఆ వ్యక్తికి నొప్పి తెలియదు.ఈ విధానాన్ని ఉపయోగించి అతి సున్నితమైన ప్రాంతలాలో వైద్యం చేయడానికి జలగను వాడే వారు అని అంటున్నారు. హిరూడిన్ రసాయన ప్రభావం వల్ల రక్తం గడ్డ కట్టదు. జలగకు వైద్యానికి సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు... జలగను ఆంగ్లం లో  గ్రాంధిక పదం లెస్, లెస్ నుండే ఆంగ్లం లో లీచ్ అనే పదం వచ్చిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ లో బ్రిటన్ లోని వైద్యులు సైతం చర్మం గడ్డ కట్టిన కత జలగాను లేఅచ్ ను వాడుతున్నట్లు తెలిపారు.ఊడి పోయిన చెవి ముక్కు  వెళ్ళాను మోకాలి చిప్పలు అరిగిపోయి నప్పుడు. జలగను  వినియోగిస్తున్న విషయం గమనించ వచ్చు. ఏది ఏమైనా జలగ చేసే మేలు వేరేది చెయ్యదు. అని అంటారు డాక్టర్ రఘు.                              

యువత మీ హృదయం కాస్త  జాగ్రత్త...

యువతరానికి గుండెపోట ఇదేమిటి అప్పుడే గుండెపోటు ఏమంత వయసు అయ్యిందని యువత గుండెపోటుకు గురిఅవుతున్నారు అన్నది అందరినీ సందిగ్ధం లో పడేసింది. ఇక్కడ దీనికి సంబంధించి ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి ఎం పి బండారు దత్తా త్రేయ కుమారునికి 21 సంవస్త్సరాలు యువకుని పేరు వైష్ణవ్ గుండెపోటు తో మరణించినట్లు సమాచారం. అందరూ ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురియారు.పైగా వైష్ణవ్ ఒక వైద్య విద్యార్ధి కావడం గమనార్హం. చిన్నవయస్సులో గుండెపోటు కు గురికావడం పట్ల సర్వత్రా ఉలిక్కి పడ్డారు అప్పుడే మొదలయ్యింది చిన్నవయస్సులో గుండెపోటు ఏమిటి? ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రాకుండా నివారించాలేమా? అసలు అంత చిన్న వయస్సులో గుండెపోటు ఎందుకు వస్తోంది అన్న అంశాల పై దృష్టి సారించారు నిపుణులు.మనదేశం లో అత్యధిక మరణాలు గుండెజబ్బుల మూలంగానే అని అనడం లో అతిశయోక్తి లేదు.ఒకవైపు ఆధునికత, మరోవైపు పోటీ తత్వం వృత్తి పరంగా,విద్య లో పోటీ పెరగడం తో విపరీతమైన   ఒత్తిడి పెరగడం తో శరీరం లో ని ప్రతి అవయవమూ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అని అంటున్నారు నిపుణులు ఒత్తిడి కారణంగానే రకరకల రోగాల్ బారిన పడడం గమనించవచ్చు.అవే వారి పాలిట మృత్యు ఘంటి కలుగా మారుతున్నాయి. వాటిలో ప్రధాన మైనది క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్... క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లో గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతుంది.శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని గుండె సరఫరా చేయలేకపోవడం వైద్యులు అంటూ ఉంటారు. ఫలితంగా నీరసం,ఆయాసం, శరీరం లో ని పదాలు చీలమండలాలలో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాగే కొంతకాలం కొనసాగితే గుండె కండరం బలహీన పడడం లేదా బిగుతుగా మారడం వల్ల గుండె కొట్టుకునే సామర్ధ్యం తగ్గి రక్త ప్రసరణ లో వేగం తగ్గుతుంది. కొంత కాలానికి అది ప్రనాన్తకంగా మారుతుంది. ఆర్టరీ డిసీజ్ కు కారణాలు... గతంలో గుందేసమస్యలు కేవలం 5౦ సంవత్సరాలు వచ్చిన వారిలోమాత్రమే కనిపించేది.కనీ ఇప్పుడు25 సంవత్సరాల నుండి 4౦ సంవత్సరాల వయస్సు ఉన్న వారిని సైతం గుండెపోటు కు గురికావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆందోళనకు గురి చేస్తోంది.ప్రాణాలను హరిస్తోంది.గుండె సమస్య ఏదైనా సరే కారణాలు చాలానే ఉంటాయి. చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణాలలో ముఖ్యమైనది సరైన జీవన శైలి లేకపోవడమే,లేదా చెడు అలవాట్లు, ముఖ్యంగా పొగ తాగడం, ఒత్తిడికి గురికావడం, కీలక పరిణామం గా వైద్యులు పేర్కొంటున్నారు.గతంలో ఎన్నడూ లేనివిధం గా యువత లో ఒత్తిడికి గురి అవుతున్నారని ఒత్తిడి ఉన్న కనిపించకుండా ఉండేవారని. ఇప్పుడు సహజంగానే జీవితం లో వస్తున్న మార్పులు జీవితం లో కావాల్సిన అవసరాలు పెరగడం ఆశలు పెరగడం తగిన విధంగా పని చేయాల్సి రావడం తో తీవ్ర ఒత్తిడికి కాక తప్పడం లేదు.పిల్లలలో వారి స్థాయికి మించి ఆశించడం వల్ల బాల్యంనుండే పిల్లలు ఒత్తిడికి గురిఅవుతున్నారు.అలా వయస్సు పెరిగే కొద్దీ మరింత బాధ్యతలు పెరిగి ఒత్తిడిని ఎదుర్కోవడం వల్లే ఒకవైపు గుండె సమస్యలు లేదా ఆత్మహాత్యలకు పాల్పడడం మనం చూస్తున్నాము. జీవన శైలి లో మార్పులు కరనమేనా ... ఏ వృత్తిలో ఉన్నవారైనా శారీరక శ్రమ తగినంత ఉండడం లేదు. తగిన వ్యాయామం చేయడానికి తగిన సమయం దొరకడం లేదు. వీరు తీసుకునే ఆహారం కూడాసమతులంగా ఉండకపోవడం చాలా మందిలో అధిక బరువు స్థూలకాయం సాధారణం గా కనిపిస్తుంది. శరీర బరువు కూడా ఒకకారణ మైతే ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణా లకు ప్రాధాన కారణం ఊబకాయామే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఇప్పుడు చాలా మంది యువకులలో చాలా మంది రాత్రి పూట మేలుకునే ఉద్యోగాలాలో ఉంటున్నారు. ఇలాంటి వారిలో స్లీప్ ప్యాత్రాన్ సరిగా లేకపోవడం రకరకాల అనారోగ్యాలకు పరోక్షంగా గుండె కిడ్నీ వంటి ముఖ్యమైన అన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అని నిపుణులు పేర్కొన్నారు.ఒత్తిడి ని తగ్గించే క్రమం లో రక రకాల అలవాట్లకు యువత పాల్పడుతోంది.తాత్కాలిక ఉపసమనం కోసం చేసుకునే అలవాట్లు ప్రతిరోజూ అలవాటుగా మారి దీర్ఘకాలం లో శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవాట్లు వ్యసనాల కారణంగా బిపి రక్త నాళాల పైన తీవ్రమైన ఒత్తిడి నష్టం చేస్తుంది.ఈ కారణంగానే కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలు,హార్ట్ ఎట్టాక్ వచ్చే అవకాశాలు ఉన్న్నాయి. హార్ట్ ఎట్టాక్ వచ్చిన వారిలో గుండె కండరం దెబ్బతినడం,లేదా హార్ట్ ఫైల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.పుట్టుకతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా హార్ట్ ఎట్టాక్ కు కారణమౌతాయి. నివారణ సాధ్యమేనా?... గుండె జబ్బులు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి లక్షణాలు కనపడ్డ వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకు ప్రమాదం కాకుండా జాగ్రత్త పడడం అత్యవసరం. దీనికోసం చిన్నపాటి జాగ్రతలు పాటించడం అవసరం... వీలైనంత మేరకు ఒత్తిడికి గురి కాకుండా ఉండడా నికి దూరంగా ఉండే ప్రయాత్నం చేయాలి. ఇందుకోసం యోగా ధ్యానం చేయడం ఉత్తమం... ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం తప్పని సరిగా చేయడం అలవాటు చేసుకోవాలి... సమతుల పోషక ఆహారం పాలు,కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,ఆహారం లో భాగం చేసుకోవాలి... కుటుంబ సభ్యులతో కాస్త గడపడం వల్ల ఒత్తిడి ని అధిగమించ వచ్చు.ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ప్రాణాపాయ స్థితి నుండి మిమ్మల్ని కాపాడ తాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న దేశానికీ అవసరం, మీ ప్రాణం అత్యంత విలువైనది. అని గ్రహించండి. మీ ఆరోగ్యం మీగుందే మీచేతుల్లోనే ఉందని గుర్తించండి.  ప్రధాన కారణం ఊబకయమే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.