లివర్‌ను నాశనం చేసే 9  రకాల ఆహారాలు ఇవే...

మనశరీరం,లో కీలక మైన మరో అవయవం లివర్ అయితే లివర్ లో ఎప్పుడు సమస్య వస్తుందో,ఎలా ఎప్పుడు ముంపు పొంచి ఉందొ అంచనా వేయడం అసాధ్యం. అయితే మీరు తీసుకునే ఆహారం విహారం వ్యాయామం వంటి అంశాలు మీ లివర్ కు ప్రమాద కారిగా మారవచ్చు. హెపటైటిస్ వల్ల మీ లివర్ తీవ్రంగా దెబ్బ తింటుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కర శాతం పెరిగిందా లివర్ డ్డ మాల్ ... మీకు చక్కెర  ఎక్కువగా తీసుకునే అలవాటు మీకు ఉందా?అది మీ పళ్లకు మాత్రమే నష్టం కాదు. మీ లివర్ ను కూడా నాశనం చేస్తుంది.హై ఫ్యాక్టోస్  కార్న్ సిరప్ కూడా ఫ్యాట్ కొవ్వును తయారు చేస్తుంది.అదే మీ లివర్ డిసీజ్ కారణంగా చెప్పవచ్చు. మీరు పెద్దగా ఊబకాయం తో లేకపోయినా ఆహారం పై నియంత్రణ అవసరమని నిపు ణులు హెచ్చరిస్తున్నారు.ఉదాహరణకు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం సోడా వేసిన చల్లని పానీయాలు,దాహం తీరడానికి నిమ్మషోడా, రాత్రి కి మధ్యంలో షోడా, తియ్యగా ఉండే పెష్ట్రీలు,క్యాన్డీలు, చక్కెరను పెంచుతాయి. హెర్బల్ సప్లిమెంట్స్... సహజమైన ప్రక్రుతినుండి లభించినవి కూడా కాదు.మెనోపాజ్ ఉన్న వారు కావా కావా మూలికను తీసుకుంటారు. ఇది వాడితే కాస్త ఉపసమనం  ఉంటుందని అనుకుంటారు. అయితే అది మీ లివర్ ను సరిగా పనిచేయనివ్వదనే విషయం మీకు తెలుసా?. ఈ విషయం ఒక పరిశోదనలో వెల్లడించారు.కోవకోవ ను సప్లిమెంట్ ను విరివిగా వాడితే అది మీలివర్ ఫైల్యూర్ కు దారి తీస్తుంది.కోవా కోవా హెర్బ్ మూలికను కొన్ని దేశాలు ఇప్పటికే నిషేదించాయి.అయితే అమెరికాలో కోవా కోవా ఇప్పటికీ అందు బాటులో ఉండడం గమనార్హం.ఈ మూలికను వాడే ముందు మీరు మీ డాక్టర్ ను సంప్రదించడం అవసరం.కోవో కోవా మూలిక సురక్షితమా కదా అన్న విషయం తెలుసుకోండి. అదనపు బరువులు... మీ లివర్ లో అదనంగా కొవ్వు చేరుతుంది. అయితే అది ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గా చెప్పవచ్చు. ఇక్కడ మీ లివర్ కు వాపు వచ్చి ఉండవచ్చు. అది గట్టిగా ఉండవచ్చు. లివర్ కణాల పై ఒక మరక ఉంటుంది దీనిని వైద్యులు సిరోసిస్ అని అంటారు. మీరు అధిక బరువు,ఊబకాయం మధ్య వయస్సుల వారు అయ్యి ఉంటె డయాబెటిస్ వచ్చి ఉంటె మీరు  మీ ఆహారం వ్యాయామం చేస్తే వ్యాధికి కొంత స హకరించ వచ్చు. అతిగా విటమిన్ ఎ వాడకూడదు... మీశరీరానికి విటమిన్ ఎ అవసరమే అయితే కొన్ని రకాల చెట్లనుండి. లేదా తాజా పళ్ళు ముఖ్యంగా ఎర్రగా ఉండే ఆరంజ్,దానిమ్మ, పసుపు పచ్చగా ఉండే పళ్ళు  ,కూరగాయాలుబీట్ రూట్,క్యారెట్ లలో ఉండే సప్లిమెంట్స్ వాడడం వల్ల విటమిన్ ఏ లభిస్తుంది. అతిగా విటమిన్ ఎ వాడడం వల్ల మీ లివర్ సమస్యకు కారణం అవుతుంది. మీ లివర్ ను పరీక్షించిన తరుబాత మాత్రమే సంప్రదించండి.విటమిన్ ఎ ను వాడడం బహుశా అవసరం రాకపోవచ్చు. శీతల పానీయాలు ... అసలే ఎండాకాలం ఎండలు ముదురు తున్నాయి. ఎండ వేడిమి భరించలేక ఏదైనా చల్లగా తాగాలని అనిపిస్తుంది ముఖ్యంగా ఎవరికైతే శీతల పానీయాలు వాడే అలవాటు ఉందొ వారికి నాన్  ఆల్కా హాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అయితే పరిశోదనలో శీతల పానీయాల వల్ల లివర్ వ్యాధి వచ్చింది అనేది నిరూపితం కాలేదు. అయితే అతిగా షోడాలు వాడితే సోడా లేకుండా పానీయాలు తీసుకుంటే పరవాలేదు.అయితే షోడా ఎక్కువగా తీసుకున్నారో మీలివర్ ను నాశనం చేస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండడం ఉత్తమమని గ్యాస్ట్రో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసిటో మినోపెన్... మీరు తీవ్రమైన తల నొప్పి,జలుబు  లేదా మీ తల వేనుకభాగం వెన్నుపూస వీపు వెనుకభాగం, లో తీవ్రమైన నొప్పి తో బాధ పడుతూ ఉన్నారా ? అయితే మీ నొప్పి తగ్గాలంటే  ఉపసమ నానికి మీరు తప్పనిసరిగా అసిటో మినోపెన్ అధిక మోతాదులో కాకుండా సరైన మోతాదులో తీసుకుంటే నొప్పులు, జలుబుకు వాడవచ్చు.జలుబు కోసం మీరు అసిటో మినోపెన్ మాత్రను వాడితే మీ లివర్ నాశనం కావడం ఖాయం అంటున్నారు వైద్యులు.మీ డాక్టర్ ను సంప్రదించి ఏమోతాదులో వాడాలో వారి సూచనలమేరకు ఒకరోజు వాడవచ్చు. అది మీకు మేలు చేస్తుంది. సూచన మేరకే వాడండి అది మీకు మంచి చేస్తుంది లేదా అదే పనిగా అసిటో మేనోఫిన్ వాడితే మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొవ్వు పదార్ధాలు... ట్రాన్స్ ఫ్యాట్స్ అవి మనం తయారు చేసిన కొవ్వు పదార్దాలే అందులో కొన్ని మనం ప్యాక్ చేసిన పదార్దాలే. అయితే అందులో కొంత హైడ్రోజన్ ఉంటుంది.దీనివల్ల కొంత బరువు పెరుగుతారు. అది మీలివర్ కు మంచిది కాదు. ఆ పదార్దాలాలో కొవ్వు ౦% అని ఉన్నా ట్రాన్స్ ఫ్యాట్ చిన్న మొత్తంలో ఉన్నా అది మరింత పెంచుతుంది అందుకే ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా కొవ్వు పెంచే పదార్ధాలకు దూరంగా ఉండాలని అలాకాకుండా మీరు తీసుకునే కొవ్వు పదార్ధాలు అటు మీ గుండెకు ఇటు మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చ్చరిస్తున్నారు. తప్పులు జరిగాయి... కొన్ని సందర్భాలాలో నర్సులు రోగికి వారు ఇస్తున్న ఇంజక్షన్ చట్ట పూర్వకంగా కావచ్చు చట్ట విరుద్ధంగా కావచ్చు. ఈ సమయంలో నీడిల్ వాడినా సమస్య సూది కాదు అది హెపటైటిస్ సి రక్తం ద్వారా చేరవచ్చు. ఇది ఒక్కసారి జరిగినా మీరు పెనుప్రమాదం లో ఉన్నట్లే ఒకవేళ మీకు హెచ్ ఐ వి లేదా హెపటైటిస్ గర్భిణీలు అయితే మీరు పరీక్షలు చేసుకోవాలి అయితే 1945 -1965 లోపు ఉన్న వాళ్ళు లివర్ ఫంక్షన్  పరీక్ష చేసుకోవాలి. మద్యాన్ని తక్కువగా తీసుకోవాలి... మీకు మాద్యం తాగే అలవాటు ఉందా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మధ్యం తీసుకుంటే అది మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వద్యులు హెచ్చరిస్తున్నారు.అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే  అతిగా మధ్యం తీసుకో కూడదని అది మీలివర్ ను పూర్తిగా నాశనం చేస్తుంది.అన్న విష్యం కనీసం మీ మిత్రులలో ఒకరికైనా వచ్చిఉంటుంది అయినా మద్యానికి బానిస అయ్యి మీరు తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగాలని భావిస్తే అంతే చాలు మీరు చాలా గ్లాసులు తాగినట్లే ఇదు ఔన్సులు మధ్యం లిక్కర్ తీసుకుంటే అది హుందాగా పెద్దమనిషి లక్షణంగా ఉంటుంది. స్త్రీలు అయితే ఒకటి పురుషులు అయితే రెండు అవున్సులు లేదా రెండు కప్పులు తీసుకోవచ్చు. ఏమైనా మీ లివేర్ను నాశనం చేసే వీటిపై జాగ్రత్త అని అంటోంది తెలుగు వన్ హెల్త్.  హెపటైటిస్ సి గనక వస్తే ప్రమాదమే,హెపటైటిస్ సి ఉంటె మీకు పచ్చకామెర్లు వాచ్చే అవకాశం ఉంది. అనుకే లివేర్ను అశ్రద్ధ చేయద్దు కొన్ని సార్లు లివర్ ట్రాన్స్ ప్లాంట్ కు వెళ్ళాల్సి రావచ్చు.   

ఎనర్జీ డ్రింక్స్ తో ప్రమాదమే!

ఎనర్జీ డ్రింక్ తక్షణ శక్తి నిచ్చే పానీయం వల్ల 6 రకాల ప్రమాదాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఎనర్జీ డ్రింక్స్ ను యురప్ లో 1987 లో తీసుకువచ్చారు.ఆతరువాత దీనికి పాపులారిటీ పెరిగిపోవడం తో ప్రపంచ వ్యాప్తంగా తక్షణ శక్తి  నిచ్చే పానీయాలకు ప్రజలు అలవాటు పడ్డారు.తక్షణ శక్తి నిచ్చే పానీయాలు నష్టం కలిగిస్తాయని విషయం మీకు తెలుసా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇది ఒక పెద్ద ప్రపంచం ప్రజలకి కొంచం ఓపిక తక్కువే ఇప్పుడు వారికి తక్షణం ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అంటే శక్తి నిచ్చే పానీయం చాలా మందికి ఒక ఫ్యాషన్ గా మారింది.ఇది ఎలా పనిచేస్తుంది దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏమిటో తెలుసా.? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ ను ఆమోదించలేదు.ప్రజలు ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని అయితే మీకు తక్షణ శక్తి నిస్తాయి.అనడం లో సందేహం లేదు అయితే దీర్ఘ కాలం లో వాడితే నష్టమే అని అంటున్నారు నిపుణులు. 1)కేఫెన్ డోస్ ఎక్కువైతే... కేఫెన్ మోతాదు ఎక్కువైతే హై బిపి వస్తుందా?-- తక్షణ శక్తి నిచ్చే పానీయాల లో కేఫెన్ అధిక మోతాదులో ఉంటుంది.చింతించాల్సిన విషయం ఏమిటి అంటే ఎనేర్జీ డ్రింక్స్ లో దాదాపు 2౦౦ గ్రాముల కెఫేన్ ఉంటుంది. ఒక్కోసారి దీనిస్తాయి 5౦౦ గ్రాములు ఉంటుందని అవసరమైన దానికంటే అధిక మోతాదులో కేఫెన్ ఉంటె హై బిపి పెరుతుందని. ఈకారణంగా గుండె వేగం గా కొట్టుకుంటుంది. కాల్షియం తగ్గడం  కూడా కారణం కావచ్చు. 2)టైప్2 దయా బెటిస్ వస్తుందా... మీరు తీసుకునే ఎనేర్జీ డ్రింక్స్ లో కేఫెన్ ఎక్కువ మోతాదులో ఉంటుబ్ది.ముఖ్యంగా ఇంజక్షన్ తో పాటు చక్కర అధికంగా పెంచుతుంది.ఈ కారణంగానే బరువు పెరగడం మరో సమస్యకు దారి తీస్తుంది.శక్తినిచ్చే పానీయాలలో అరలీటరు లో 22౦ క్యాలరీల ఉంటుంది.అది దయాబిటిస్ కు దారితీన్ సే ప్రామాడం  పొంచి ఉందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ౩) మనస్సులో ఆందోళన-అసహనం... కొంతమందిలో జనటిక్ సమస్యలు ప్రారంభమౌతాయి.ఏండోక్రైన్ రెసేప్టర్స్ లో ఏరకమైన మార్పులు వస్తాయి. ఈకారణంగా వారిలో ఆందోళన రేకెత్తిస్తుంది.అవసర మైన దానికన్నా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే అందులో ఎక్కువ మోతాదులో కెఫీన్ ఉండడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 4)కేఫెన్ తో పంటి సమస్యలు.... శక్తినిచ్చే పానీయాలలో అత్యధిక చక్కెర శాతం ఉంటుందని దృవీకరించారు.చక్కెర మీ దంతాలు పంటి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.ఇందులో ఉండే చక్కెర మోతాదు కారణంగా పళ్ళపై ఉండే ఎనామిల్ పోతుంది.ఈ కారణం గానే పళ్ళ లో హైపెర్ సెన్సిటివిటీ తోపాటు కేవిటీ సమస్యలు ప్రారంభమౌతాయని దంత వైద్యులు పేర్కొన్నారు. 5) శరీరంలో నీటి శాతం తగ్గి బలహీన పడతారు... ఎనర్జీ డ్రింక్ ఉపయోగించడం వల్ల శరీరంలో సత్వరం శక్తి నిచ్చేందుకు సిద్ధం అవుతుంది.ఈ కారణంగా నే ప్రజలు దీనిని వర్క్ అవుట్ చేసేటప్పుడు లేదా క్రీడా కారులు ఆడే సమయం లో ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం సహజం.మీరు ఎనర్జీ డ్రింక్ ను మంచినీటికి బదులుగా ఎనర్జీ డ్రింక్ తీసుకుంటారు.దీని ప్రభావంతో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.కేఫెన్ హెచ్చు స్థాయిలో ఉంటె మీ కిడ్నీ పై తీవ్ర ప్రభావం చ్చూపిస్తుంది ఏమాత్రం అశ్రద్ధ చేసినా కిడ్నీ నాశనం అవుతుంది.శరీరంలో డీ హైడ్రేషన్ ప్రారంభ మౌతుంది. కేఫెన్ తీసుకోవడం  మీశరీరానికి అలవాటుగా మారుతుంది.ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే మరోనష్టం ఏమిటంటే శరీరంలో కెఫెన్ పేరుకుపోతుంది.ముఖ్యంగా నేటి యువతరం వర్క్ అవుత  సెషన్ కు ముందే ఒక్కోబోటిల్ తాగాల్సి ఉంటుంది.సమయానుకూలంగా మీరు తీసుకునే డ్రింక్స్ లేకుండా పని చెయడం కష్టంగా ఉడే స్థితికి చేరతారు. 

మీకూ ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుందా... అయితే ఇది తప్పక చదవాల్సిందే..

బాగా గమనిస్తే ఆఫీసులలో చాలా మంది నిద్రమత్తుతో ఉంటారు. ఇలాంటి  సమస్యలతో మీరు కూడా  ఇబ్బంది పడుతుంటే దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు. ఇది  ఉద్యోగాలు చేస్తున్న జనాభాలో కనీసం 15శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది.  ఆఫీసులో నిద్రపోవడం కేవలం ఆఫీసులో తోటి ఉద్యోగస్తులు, బాస్ ముందు పరువు తీయడమే కాదు.. ఇది చెయ్యాల్సిన వర్క్ మీద కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తుంది.  అయితే ఆఫీసు వేళల్లో నిద్రపోవడానికి కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పగటిపూట లేదా ఆఫీసులో  నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమే. ప్రతి ఒక్కరికీ  6-8 గంటలు నిద్ర అవసరం. అంత సమయం నిద్రపోకపోతే, లేదా ఈ నిద్రాక్రమం అస్తవ్యస్తమైతే.. దీని కారణంగా  పగటిపూట కూడా నిద్రపోయేలా అనిపించవచ్చు. అంతే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని వ్యాధుల కారణంగా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం లేదా ఎక్కువగా పగటి సమయంలో నిద్రపోతుండటం జరుగుతుంది. కొన్ని శారీరక  ఆరోగ్య  పరిస్థితులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు దీనికి  కారణమని భావించవచ్చు. డిప్రెషన్-ఆందోళన, స్కిజోఫ్రెనియా, లూపస్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్,  హైపోథైరాయిడిజం మొదలైన వ్యాధుల ప్రమాదం ఇలా పగటి సమయంలో నిద్రపోవడం అనే ప్రక్రియ కారణమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇవి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. న్యూరోలాజికల్,  న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు.. నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు  ఉన్నప్పుడు  పగటిపూట కూడా నిద్రపోవడం జరుగుతుంది. నార్కోలెప్సీలో మెదడు నిద్రమేల్కొనే చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. నార్కోలెప్సీ ఉన్నవారు అధికంగా లేదా అకాల నిద్రపోవడానికి ఇదే కారణం. ఇది కాకుండా, వృద్ధులలో డిమెన్షియా లేదా పార్కిన్సన్స్ వ్యాధుల కారణంగా,  పగటిపూట అధికంగా  నిద్రపోయే సమస్య కూడా ఏర్పడుతుంది. ఆహారంలో ఆటంకాల వల్లా..  పగటిపూట  నిద్రపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు  మధ్యాహ్నం భారీ భోజనం తీసుకోవడం దీనికి ఒక కారణం. షుగర్ అధికంగా ఉన్న  స్నాక్స్, సోడా, వైట్ బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా  నిద్ర బాగా వస్తుంది. దీనికి పరిష్కారం కావాలంటే తేలికపాటి ఆహరం తీసుకోవాలి.  ఆరోగ్యకరమైన. పోషకమైన ఆహారాన్ని తినడం వల్ల  శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా,  శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది  నిద్రలేమిని తగ్గిస్తుంది. నిద్రను దూరం చేయడానికి ఏమి చేయాలంటే..  ఆఫీసులో పదే పదే నిద్రపోతున్నట్లు అనిపిస్తే దాన్ని వదిలించుకోవడానికి తక్కువ మొత్తంలో కెఫిన్‌తో కూడిన పదార్థాలు తీసుకోవచ్చు. కెఫీన్  మెదడు  నాడీ వ్యవస్థలో కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. కాఫీ-టీ నిద్రను దూరం చేస్తుంది. ఇదిమాత్రమే  కాకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా  నిద్ర వస్తుంది. అందుకే పనిచేసే  స్థలం నుండి అప్పుడప్పుడు లేచి  తిరగడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది, శరీర నీరసం పోతుంది. నిద్ర కూడా నియంత్రణలో ఉంటుంది.                                                                    *నిశ్శబ్ద.

మహిళల గుండెకు ముప్పు పొంచి ఉందా ?

పురుషుల కన్నా మహిళల్లో నే గుండెపోటు సమస్యతో మరనిస్తున్నారు .సహజంగా స్త్రీలకు ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద చూపరు. ఎచిన్న సమస్యకైన మళ్ళీ వస్తే చూద్ద్దాం అన్న ధోరణిలో ఉంటారు.అదే వారి పాలిట శాపం గా మారుతుంది ఒక కేసు విష యం లో రోగి పరిస్థితి చూసిన డాక్టర్ చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ ఇన్ని రోజుల నుండి రాకుండా ఏమి చేసారు. ఇప్పుడు చూడండి 7౦% బ్లాక్స్ ఏర్పడ్డాయి.కోపంగా మందలించారు.చెమట పడుతుంటే వేడి ఎక్కువగా ఉంది కదా అని అనుకున్నా మెట్లు ఎక్కు తుంటే ఆయాసం వస్తుంటే పనెక్కువ అయ్యిందని అందుకే అలసట వచ్చిందని అనుకున్నా. గుండె నొప్పి నాకు ఎందుకు వస్తుంది? అని సరి పెట్టుకున్నా కాని ఇలా జరుగుతుందని అనుకోలేదు. అని అన్నది ఆమె.కన్న బిడ్డకు చిన్న జలుబు చేసినా కంగారు పడిపోతారు.భర్తకు చిన్న జ్వరం వచ్చినా హడావిడి చేస్తారు. ఇంట్లో ఎవరికీ ఏం జరిగినా కంగారు పది పోయే డి ఆ ఇంటి మహాలక్ష్ములే. అదే మహిళలు తమ అనారోగ్య గురించి మాత్రం పట్టించుకోరు అందుకు చాలా సందర్భాలాలో జబ్బు బాగా ముదిరి పోయే దాకా చికిత్సకు వెళ్లరు. ఇక గుండె జబ్బు విషయానికి వస్తే అదేదో మగ వాళ్ళకు మాత్రమే వచ్చే జబ్బుగా అనుకుంటారు. గుండె జబ్బుకు స్త్రీలు, పురుషులు అన్న పక్ష పాతం ఉండదు. ఆ కులము ఈ కులము అన్న వివక్ష ఉండదు. ఈ మతము ఆమతము అన్న పక్ష పాత ధోరణి గుండెకు ఉండదు. ఎవరు అన్నారు గుండె జబ్బులు పురుషులకు మాత్రమే వచ్చే వని స్త్రీలకు భావోద్వేగాల ను భరించే శక్తి సహనం ఎక్కువే. ఓర్పు ఒర్చుకోవడం స్త్రీ ల ప్రవృత్తి. అందుకే ఆమె గుండె గట్టిది. అంటూ ఉంటారు. అందుకే మన వాళ్ళు ఆడవాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవని ఉన్నా అతి తక్కువే అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం గా చెప్పవచ్చు. నిజానికి పురుదులతో పాటు సమానం గా మహిళలలో కూడా గుండె జబ్బుల అవకాశం  ఎక్కువే సాధారణంగా మహిళలలో క్యాన్సర్ బాధితులు అదీ రోమ్ముక్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ,ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది వాస్తవమే అయినప్పటికీ క్యాన్సర్ల కన్నా గుందేజబ్బుల వల్ల మరణించిన వాళ్ళే ఎక్కువ అని ఒక అద్యయనం లోతేలింది. స్త్రీలను వేదించే సమస్యలలో క్యాన్సర్ కన్నా 6 వంతులు ఎక్కువ అవకాశం గుండె పోటు కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.ముఖ్యంగా స్త్రీలు ౩౦ సంవత్సరాలు దాటగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించి క్యాన్సర్ స్క్రీనింగ్ కు వెళుతూ ఉంటారు.అయితే పనిలో అనిగా గుండెకు సంబందించిన పరీక్షలు చేయించుకోడం లో మాత్రం ఎందుకో తాత్సారం చేస్తారు. తమ గుండె గట్టిదనే నమ్మకం తో ధీమా తో ఉంటారు.విద్యా వంతులైన మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండడం అంత క్షేమం కాదు. గుండె పోటు మహిళ్ళలో రావడానికి కారణాలు... గుండె పోటు అంటే అది మగవాళ్ళకు మాత్రమే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు అపోలో ఆసుపత్రికి చెందినా  ప్రముఖ హృద్రోగ నిపుణులుడాక్టర్ ఎ  శ్రీనివాస్. ఇప్పటికే చాలా మందిలో అదే ఆపోహ కలిగి ఉండడం విచారకరం అనారు వైద్య నిపుణులు.చాతిలో నొప్పి అని అనిపించినా అది గ్యాస్ నొప్పో,మరేదైనా నొప్పి గా భావిస్తారు. తప్ప గుండె నొప్పిగా అనుమానించరు. ఆడవాళ్ళలో గుండేనొప్పి తక్కువ కాబట్టి నాకు గుండె జబ్బు రావడం ఏమిటి నాకు అస్సలు గుండె నొప్పి వచ్చే అవకాశం లేదని విశ్వాశం తో ఉంటారు స్త్రీలు. స్త్రీలకూ గుండె జబ్బు ఉండనే విషయాన్ని గుర్తించడం లో మిస్ అవుతూ ఉంటారు .ముఖ్యంగా స్త్రీలు మెనోపాజ్ తరువాత మరణిస్తున్న మహిళల లో ప్రాధాన కారణం గుండె పోటే అయి ఉంటుంది.సాధారణంగా మెనోపాజ్ దశలో ఊపిరాడక పోవడం,బలహీనం గా ఉండడం, గుండె దడ నీరసం, లాంటివి ఎక్కువగా ఉంటాయి. స్త్రీలలో గుండె సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి చాలా మంది వీటిని గుర్తించలేరు అని అంటారు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్.దాదాపు మెనోపాజ్ లో ఉండే సమస్యలే కదా అని అనుకుంటారు. అందుకే చాలా సందర్భాలలో  తమకు గుండె జబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించలేక పోతారు.కొన్ని సార్లు స్త్రీలలో వచ్చే ఆయాసాన్ని ఆస్తమాగా పోప్రబడతారు. లేదా నీరసం గా ఉన్నాం కదా అందుకే ఆయాసం గా ఉందేమో అనుకుంటారు.చాలా సంఫర్భాలలో మహిళలు గుండె నొప్పిని గుర్తించక పోవడానికి ఇదే కారణం. అయితే గుండె నొప్పి లక్షణాలు కూడా మహిళ ల్లో వేరు వేరు గా ఉంటాయి అని శ్రీనివాస్ విశ్లేషించారు.సాధారణ గుండేనొప్పి లాగా నొప్పి పాకుతూ ఉంటుంది. సాంప్రదాయిక గుండె నొప్పి లక్షణాలు ఏవి ఉండక పోవచ్చు. ఆయాసం గా ఉండడం, చమట పట్టడం వంటి లక్షణాలు గుండె నొప్పి అన్న విషయాన్ని కలిగించవు. నీరసం,బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు అన్న అనుమానాన్ని కలిగించవు. నీరసం బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు లక్షనమం గానే బహిర్గతం అవుతాయి కాని అవి సాధారణ అనారోగ్యపు లక్షణాలుగా పర్గానించడం వల్ల ఒక్కోసారి గుండె జబ్బును కనిపెట్టడం మిస్ అవుతారు.ఇలాంటి సమయం లో చిన్న బ్లాక్ ఉన్నా అది హటాత్తుగా  విచ్చినం చెందవచ్చు. దాంతో అకస్మాతుగా గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఫలితం గా ప్రాణాల మీదకు వస్తుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలా అకాస్మాతుగా గుండె పోటుకు గురి అయ్యే అవకాశాలు ఉండవు. అందుకే మెనో పాజ్ దశలో లక్షణాల లో అశ్రద్ధ చేయవద్దని 4౦ ఏళ్ళు దాటినా గుండెకు సంబందించిన అన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయిన్చుకోవాలి.అవగాహన ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కోసం పాప్స్మియర్ టెస్ట్ లు మమ్మో గ్రామ్ మామో గ్రఫీ, చేయించు కోవడం లేదు. చాలా మందికి మొదటి సారి గుండెపోటు రావడమే ప్రాణా పాయానికి  దారి తీస్తుంది.  పరీక్షల్లోనూ వేరుగా ఉంటాయి... సాధారణ లక్షనాలాతో గుండె జబ్బును కనిపెట్టడం కష్టం. కాబట్టి మహిళ ల్లో డయాగ్నిస్టిక్ పరీక్షలు కీలకం అవుతాయి. కొన్ని సార్లు ఈ పరీక్షలలో కూడా గుండె జబ్బు ఉన్నా లేనట్లుగా తేలే అవకాశాలు లేకపోలేదు. అందు వల్ల మహిళలు గుండెజబ్బు గుర్తించడం లో వైద్యుల నైపుణ్యం తో పాటు అన్ని రకాల పరీక్షలు ప్రాధాన పాత్ర వహిస్తాయని వాటి అన్నిటి సమీకృత ఫలితాలను బట్టే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.నిపుణులైన డాక్టర్లు మాత్రమే కేస్ హిస్టరీ ని బట్టి పరీక్షలు చేయిస్తారు. ఈ పరీక్షలలో ముఖ్యంగా ఇ సి జి ఎకో పరీక్షలు మార్పులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి .ఒక్కోసారి టి ఎం టి పరీక్ష కూడా తప్పుగా చూపించ వచ్చు. జబ్బు ఉన్న లేదని లేకున్నా ఉందని రావొచ్చు. కాబట్టి ఒకే పరీక్ష ఆధారం గా చెప్పలేము. ఈ పరీక్ష లన్నిటికీ బెరేజు వేసుకుని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది.ఆంజియో గ్రామ్ లో కూడా మహిళల డి ప్రత్యేకతే. పురుషులకన్న మహిళల శరీర నిర్మాణం చిన్నదిగా ఉంటుంది. అదే విధంగా రక్త నాళాలు సైతం చిన్నవిగా ఉంటాయి. అన్జియో గ్రామ్ చేసేటపుడు ఉపయోగించే చేయి లేదా  కాలి రక్త నాళాలు కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి అన్జియో గ్రామ్ చాలా జాగ్రతగా చేయాలి. నైపుణ్యం లేకుండా అన్జియోగ్రామ్ చేస్తే సరైన ఫలితాలు రావు.మహిళ ల్లో గుండె రిస్క్ ఎక్కువ... కొలస్ట్రాల్ పేరుకుపోయి అదేరో స్క్లిరో సిస్ రావడం సర్వ సాధారణం కాని మహిళలలో రక్త నాళాలు స్పాసమ్ అంటారు రక్త నాళాలు పట్టేసినట్లు. అయిపోవడంవల్ల కుంచించుకు పోతాయి.తద్వారా రక్త ప్రసరణ కష్టం అవుతుంది. రక్త నాళాలు పెద్దవైతే జబ్బు మొదలై నప్పటికీ రక్తం ప్రసరించడానికి ఇంకా చోటు ఉంటుంది. కాబట్టి అడ్డంకి పెద్దది అయ్యే వరకూ జబ్బు ముదరదు. కాని రక్త నాళం చిన్నదిగా ఉండడం వల్ల చిన్న అడ్డకి ఏర్పడినా సమస్య ఎక్కువ అవుతుంది. అందు వల్ల ఒకే సైజు బ్లాక్ పురుషులలో అద్దంకి కాక పోయినా మహిళలలో మాత్రం పెద్ద సమాస్య అయి కూర్చుంటుంది. మహిళల లోనే రిస్క్ ఎక్కువ. పురుషుల కన్నా మహిళల్లో రక్త నాళాల పరిణామం చిన్నదిగా ఉండడం వల్ల చికిత్స విధానం లో కూడా వేరుగా ఉండడం వెర్రిలో రక్త నాళాలు మూసుకు పోయే అవకాశం చిన్న సైజు స్టెంట్ వాడాల్సి ఉంటుంది. పెద్ద రక్త నాళాలలో మళ్ళీ అడ్డంకులు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది.చిన్న రక్త నాళాలు ఉన్నప్పుడు స్తేన్టింగ్ సరిగా చేయకుండా మళ్ళీ క్లోత్స్ రక్తం గడ్డ కట్టే అవకాశం లేదా అడ్డాకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రక్త నళాలలో అడ్డంకులు ఏమేరకు ఉన్నాయో తెలుసుకోడానికి వాడే పరికరాలు కూడా మరింత ఆధునిక సంతరించుకుని అందుబాటులోకి వచ్చాయి ఇంట్రా వాస్క్యులార్ అల్ట్రా సౌండ్ ఆప్టికల్ కోహారెన్స్ టమో గ్రఫీ ద్వారా చికిత్సకు ముందు తరువాత అడ్డంకులు ఎలా ఉన్నాయి అన్నది పరిశీలిస్తారు. అయితే ఆధునిక పరిజ్ఞానం తో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడం కూడా ప్రాధాన అంశం. గుండెపోటు వస్తే... మహిళల లో కూడా మరణాల రేటు ఎక్కువ మగ వాళ్ళ కన్నా మూడు వంతులు ఎక్కువ సాధారణ మొదటి సారి గుండెపోటు వచ్చిన తరువాత చికిత్సచికిత్స చేయించు కోకుంటే పురుషులలో 2౦% రిస్క్ ఉంటె మహిళ లలో 5౦% రిస్క్ ఉంటుంది. రక్త నాళాలు చిన్న సైజువి కాబట్టి బైపాస్ లో కూడా రిస్క్ ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి స్టెంట్ సరిగా పెట్టక పోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. సమర్దులైన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోక పోతే పంపింగ్ సామర్ధ్యంభయపడాల్సిన అవసరం లేదు.జబ్బు ఉందన్న విషయాన్ని సకాలం లో గ్రహించకుండా తెలిసి నిర్లక్ష్యం చేసినా ఎటువంటి చేయించుకోక పోతే గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఇటీవలే అందు బాటులోకి వచ్చిన బై వెంట్రీ క్యులర్ పెసింగ్ అన్న విధానం సత్ఫలితాలు ఇస్తుంది. గుండె పంపింగ్ సా మర్ధ్యం పెరగడం కోసం ఇక మరో దారి లేదనుకున్నప్పుడు దీనిని వాడతారు. నివారణా ఉపాయాలు... సమస్య ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లో మందులు జాగ్రత్తగా వాడుకుంటే గుండె జబ్బును అదిగా మించ వచ్చు.అయితే నివారణ అన్నది అన్నిటికన్నా ఉత్తమం.గుండెను కాపాడు కోవాలంటే ప్రధానంగా జీవన శైలి లో మార్పులు చేసుకోవడం అవసరం.ఒత్తిడి తగ్గించుకునే ప్రయాత్నం చేయాలి దైనందిన వైవాహిక జీవితం లో సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ చేసుకోవాలి.బిపి షుగర్ కొలస్ట్రాల్ రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒక వేళ ఈ సమస్యలు వచ్చినా అదుపులో ఉంచుకోడానికి డాక్టర్ సలహా మేరకు తప్పని సరిగా సలహా తీసుకోవాలి.సూచించిన విధంగా మందులు వాడుకోవాలి.స్థూల కాయం మధుమేహం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.                                                 

మీ లివర్ వంద సంవత్సరాలు ఉంటుందని మీకు తెలుసా?

పరిశోదనా శాస్త్రజ్ఞులు యు ఎన్ ఓ ఎస్ పద్ధతి ద్వారా అంటే నెట్ వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ విధానం ద్వారా లివర్ ట్రాన్స్ ప్లాంట్ నూతన పద్దతిలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ లు విజయవంత మయ్యాయి. అసలు లివర్ ఎన్నాళ్ళు  జీవిస్తుంది,దానివయస్సు ఎంత? లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఏ వయస్సువారికి చేయాలి? ట్రాన్స్ ప్లాంట్ తరువాత 1౦౦ సంవత్సరాలు బతక గలదా?2,5౩,4౦6 లివర్ ట్రాన్స్ ప్లాంట్ ను 199౦-2౦22-25 లో లివర్ 1౦౦ సంవత్చరాలు జీవించి ఉండడాన్ని గమనించారు.యూనివర్సిటి ఆఫ్ టెక్సాస్ కు చెందినసౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్,డల్లాస్, ట్రాన్స్ మేడిక్స్, ఆండో వర్స్ మసాచుట్స్ చలాచిన్నదే అయితే లివర్ పెరుగుదల ట్రాన్స్ ప్లాంట్ 1౦౦ సంవత్సరాలు జీవించడం అన్నదే ఇక్కడ కీలకం.శాస్త్రజ్ఞులు లివర్ గుర్తించడం,లక్షణాలు అవయవము స్థిరంగా నిశ్చలంగా ఉంటాయి. ఇతరులు దానం చేసిన లివర్ సైతం దీర్ఘకాలం ఉంటుంది.వ్యక్తికివయస్సు వచ్చిన లివర్ వయసులో మార్పు రాదా ?సైంటిఫిక్ ఫోరం ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ క్లినికల్ కాంగ్రెస్ 2౦22 బృందం పరిశోదనలు నిర్వహించింది. పరిశోధకులు ఇందుకోసం యు ఎన్ ఓ ఎస్ యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ విధానం లో ఒక పద్ధతి నియమ నిబందనల ప్రకారం అనుసరించి లివర్ ను 1౦౦ సంవత్చరాలు జీవించి ఉండే విధంగా సిద్ధం చేయచ్చు. ట్రాన్స్ ప్లాంట్ తరువాత వారు జీవించి ఉండడం ముఖ్యం.లివర్ దానం చేసిన దాతల వయస్సు లివర్ ఎన్ని సంవత్సరాలు లివర్ తీసుకున్న వ్యక్తి జీవించగలగడం ముఖ్యమని పరిశోదనకు సారధ్యం వహించిన యాష్ కోడాకియా సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ స్కూల్ కి చెందిన విద్యార్ధి. లివర్ పై పరిశోదనలు చేసి 1౦౦ సంవత్చరాలు జీవిస్తాయని నిర్ధారించారు.ఇందులో ట్రాన్స్ ప్లాంట్ కీలక మని ఇది చాలా అరుదైన పద్దతిని అనుసరించడం వల్ల లివర్ 1౦౦ సంవత్సరాలు జీవిస్తుంది. 1౦౦ సంవత్సరాలు ఉన్న లివేర్స్ వ్రుద్దులనుంచి వచ్చినవే... సెంచూరియన్ లో 1౦౦ సంవత్సరాలు జీవించిన లివర్ దాతల వయస్సు 84.7 సంవత్చరాల పైనే ౩8 --55 సంవత్సరాలు వారికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కొన్ని వంద సంవత్సరాలు జీవించి ఉంటాయని గుర్తించారు వృద్ధులు వయసు మళ్ళిన దాతల వయస్సు ఆరోగ్యంగా ఉన్న వారిని వీరిలో డయాబెటిస్,ఇన్ఫెక్షన్ తక్కువే అని గుర్తించారు.గతం లో వయస్సు మళ్ళిన వారి వద్ద నుండి లివర్ వినియోగించేందుకు సిగ్గు పడేవారని సెప్టెంబర్ 2౦ 22  నాటికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది.వయస్సు మళ్ళిన వారి లివర్ చాలా ఫలవంతంగా లివర్ దాతలను పెంచగాలిగా మన్నారు. పరిశోదన వివరాలు... సెంచూరియన్ లివర్ దోనార్స్ ట్రాన్స్ మీటర్ ఎంజాయిం లు లివర్ లో కీలక పాత్ర పోషిస్తుంది ట్రాన్స్ మినేషణ్ చేయడం వల్ల లివర్ లో సమస్యలు వస్తాయని మరల లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలి సెంచూరియన్ లివర్ దాతలు 17 నుండి 22 మంది ఉంటారు.ఇందులో రోగులకు అత్యవసరంగా ట్రాన్స్ ప్లాంట్ అవసరమైన వారే ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు. దాతలను తగ్గించి... లివర్ పొందే వారి సంఖ్య ను సగానికి తగ్గించి మేలే పద్ధతి మంచి ఫలితాలు ఇచ్చిందని డాక్టర్ కడాకి యా వెల్లడించారు.సెంచూరియన్ గ్రూప్ ఎలాంటి గ్రాఫ్టింగ్ చేయలేదని ప్రాధమికంగా గుండె పనిచేయక రక్తనాళాలు సరిగా లేకపోవడం ఇతర బైలేరి సమస్యలు లేకుండా ఉండాలని లివర్ ట్రాన్స్ ప్లాంట్ తిరస్కరించిన దాఖాలాలు తక్కువే అని సెంచూరియన్,నాన్ సెంచూరియన్ గ్రాఫ్ట్ లలో వ్య్సత్యాసం గమనించిన ప్పుడు సెంచూరియన్ విభాగం లో ఎలా గ్రాఫ్ట్ విజయవంతంగా నిర్వహించ గలిగామని అన్నారు రోగులు బతికి బట్ట కట్ట గలిగారు. ఆలో గ్రాఫ్ చేసిన 1౦౦ సంవత్సరాలు పాతవే అయినా ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.లివర్ సహజంగానే దీర్ఘకాలం పాటు మన్నుతుంది డాక్టర్ కోడాక్ మేము పాతకాలం నాటి దాతలు ఇందుకోసం ఉత్తమ సర్జరీ పద్దతులు అవలంబిస్తున్నాము ఇమ్యునో సర్ప్రస్ లోఆధునిక పద్దతులు దాతలు పొందే వారి లివర్ ను పొంతన చేయడం పోల్చి చూస్తే లివర్ పొందే వారిని పూర్తిగా పరీక్షిస్తాము. దీనిద్వారా మంచిఫలితాలు ఉంటాయి.                                                                                      

పిల్లలకు పారాసిట్ మాల్ వాడుతున్నారా అయితే జాగ్రత్త!

ఇండో నేషియా దేశం లో పసి ప్రాణాలు   మొగ్గలోనే రాలిపోయాయి. ఈ విషయానికి సంబంధించి ఇండో నేషియా ఆరోగ్య శాఖ అధికారులు నాడియా తర్మిజీ మాట్లాడుతూ ఎక్యుట్ కిడ్నీ ఇంజురీ బారిన 189 మంది శిశువులు దీనిబారిన పడ్డారని. ముఖ్యంగా 5 సంవత్చారాల లోపు పిల్లలు ఫెటర్న టేస్ ఉండడం గమనార్హం. ఇండోనేషియాలో 74 మంది పిల్లలు ఎక్యుట్ కిడ్నీ ఇంజురీ గాంబియా లోనే 7౦ మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.  పిల్లలు తీవ్ర జ్వరం తో బాధపడుతూ ఉండడం తో. స్థానికంగా ఉత్పత్తి చేసిన పరాసిట్ మాల్ సిరప్ కారణం గానే మరణించారా అన్న అనుమానం వ్యక్త మౌతోంది. ఈ మందులో డై తిలిన్,గైకాల్, ఎతిలిన్ వంటివి దగ్గుమందులల్లో గుర్తించారు న్యుడిల్లికి చెందిన ఫర్మా కంపెనీ రూపొందించిన మందులు గాంబి యాలో అమ్మినట్లు తెలుస్తోంది అయితే పిల్లల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిదేశాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇండో నేషియా ప్రభుత్వ అధికారులు ఆహారం మందుల ఉత్పాదతకత సంస్థ దక్షిణ ఆశియాలో అందు బాటులో లేవని ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ నిషేదించారని తెలుస్తోంది. ఇండోనేషియా ఆరోగ్య శాఖ అధికారి సిటి నాదియా తర్మిజీ మాట్లాడుతూ ఎక్యుట్ఇంజురీ బారిన పడిన వారి ని 189 కేసులను ఇండోనేషియాలో కనుగొన్నట్లు ఇందులో 5 సంవత్స్చారాల లోపు పిల్లలు 74 మంది శిశువులు పూర్తిగా దీనిబారినజనవరి నుండే  పడుతున్నప్పటికీ గ్రహించకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. దీనికి గల కారణాలు ఏమిటి అని ఇంకా గుర్తించ లేదని ఇంకా పూర్తివివరాలు అందాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. పిల్లల మరణాల పై గతవారం లోనే ఒక నిపుణుల కమిటీ విచారణకు అదేసిన్చామని నాదియా తర్మినీ అన్నారు. ఈ విచారణ కమిటీలో ఇండోనేషియా ఆరోగ్య ఆధికారులు,పిల్లల వైద్యనిపుణులు,పిడియాట్రిక్ అసోసియేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులను విచారణ చేస్తారని అధికారులు వెల్లడించారు. మంత్రిత్వ శాఖ పిల్లలకు ఇచ్చిన మందుల వివరాలను సేకరించాలని ఏమోతాదులో వాడారో తెలుసుకోవాలి డబ్ల్యు హెచ్ ఓ గంబియాలో విచారణ జరుపుతుందని అన్నారు.ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేస్తూ విచారణ పూర్తియ్యేవరకూ సిరప్ అమ్మకాలు నిలుపుదల చేసింది. కారణం ఏదైనా పిల్లల మరణాలకు కారణం సరైన మందుల,లేక నిషేదిత మందులా అన్నది తెలాల్సి ఉంది.                               .    

జున్ను తింటున్నారా? ఇది చదవండి అయితే!

జున్ను తినలేదు ఇప్పటి వరకు అని ఎవరైనా చెప్పారు అంటే అది నిజంగా చాలా పెద్ద వింత అనుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో విరివిగా దొరికే జున్ను చాలా మంచి పౌష్టికాహారం అని అంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే… నాణేనికి రెండవవైపు వాదించేవారు ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే.. జున్ను ఆరోగ్యానికి హానికరం అని. ఇంకా జున్ను గురించి చాలా విషయాలు అనుమానాలుగానే ఉండిపోతున్నాయి అందరికీ. వాటిని నివృత్తి చేసే సమాచారం ఇదిగో ఇదే… జున్నుని అని సంస్కృతంలో పీయూషం అని అంటారు. అలాగే పన్నీర్ అని హిందీలో అంటారు. ఇంకా ఇంగ్లీష్ లో అయితే చీజ్ అని అంటారు. ప్రస్తుతం చీజ్ ఆధారిత వంటలు రోడ్ సైడ్ నుండి రెస్టారెంట్ల వరకు ఒకటే హల్చల్ చేస్తుంటాయి. అయితే అదంతా కృత్రిమమైనది.  నిజమైన జున్ను అంటే.. ఆవులు లేదా గేదెలు ఈనిన మూడు నుంచి వారం రోజుల వరకూ వచ్చే పాలు ఇస్తాయి. ఈ పాలను 'ముర్రుపాలు' అంటారు. వీటిలో పచ్చదనం ఎక్కువ వుంటుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలుంటాయి. ఇలా ఆవులు, గేదెలు ఈనిన మూడు నుండి వారం రోజుల లోపు ఇచ్చే పాలను పల్లె ప్రాంతాలలో ఆ దూడలు తాగగా మిగిలిపోయేవాటిని పిండి తమకు తెలిసిన ఇళ్లకు పంచుతుంటారు. ఈ పాలలో పంచదార లేదా బెల్లం, మిరియాల పొడి, యాలకులు పొడి వేసి స్టవ్ మీద కాచినప్పుడు ఆ పాలు గట్టిగా అవుతాయి. గడ్డ పెరుగులా… ఎంతో రుచిగా ఉంటుంది ఈ జున్ను.  జున్నులో ఏముంది? జున్నులో 355 కేలరీలు ఉంటాయి. అదే పాల నుండి మనకు లభించే వెన్నలో 716 కేలరీలు ఉంటాయి. పాల నుండి లభించే మీగడలో 204 కేలరీలు ఉంటాయి. ఇలా మూడింటిని పోల్చి చూసుకుంటే, పాల మీగడకు, వెన్నకు మధ్యగా జున్నులో కేలరీలు ఉంటాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే… ఎక్కువ కేలరీలు అవసరమయ్యే వారు మాత్రమే జున్నును ఆహారంలో భాగంగా తీసుకోవద్సమ్ మంచిది. మరీ ముఖ్యంగా షుగర్, కీళ్ల వాతం జబ్బులు, అధికబరువు గలవారు, వాతం సమస్యలు ఉన్నవారు జున్నును దూరంగా ఉంటే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు జున్ను తీసుకుంటే అనారోగ్య సమస్యలు సులువుగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ప్రొటీన్ల కథ : జున్నులో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉంటుంది. ఇది నాణ్యమైన ప్రొటీన్, శరీరానికి త్వరగా చక్కగా వంటబట్టే ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. పైన చెప్పుకున్నట్టు వెన్న, మీగడతో పోల్చి చూస్తే వెన్నలో, మీగడలో ప్రోటీన్లు చాలా తక్కువ ఉంటాయి. అదే జున్నులో అయితే వీటన్నికంటే ఎక్కువగా ఉంటుంది.  జున్నులో ఉండే ప్రోటీన్ల కంటెంట్ జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వంటి ఖరీదైన పప్పులకన్నా ఎక్కువగా ఉంటుంది.  దీన్ని బట్టి చూస్తే ప్రోటీన్ లోపంతో బాధపడేవారికి  చిక్కి శల్యమై పోతున్నవారికీ, టీబి, ఎయిడ్స్ వంటి శరీర సామర్థ్యాన్ని క్షీణింపచేసే వ్యాధులతో బాధపడే వారికి జున్ను చాలా మేలు చేస్తుంది.  కొవ్వు: కొవ్వు శాతం పోలిస్తే.. వెన్నలో 81 శాతం కొవ్వు వుంటే, జున్నులో 26.9%, మీగడలో 20% కొవ్వు వున్నాయని తెలిసింది.  కాబట్టి వెన్న కన్నా జున్నులోనే  తక్కువ కొవ్వు ఉంది.  పై విషయాలు అన్నీ గమనిస్తే.. జున్నును తినకూడని పదార్థంగా భావించాల్సినంత ప్రమాదం ఇందులో ఏమీ లేదు. అయితే అతి అనేది అన్నింటిలోనూ ప్రమాదమే కాబట్టి జున్నును కూడా మితంగా తీసుకోవడం మంచిది.  జున్ను వల్ల లాభాలు:- జున్ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అన్నివిధాలా పోషకాలు, కొవ్వులు, ప్రోటీన్లు తగినమొత్తంలో ఉండటం వల్ల శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి జున్ను మేలు చేస్తుంది.శారీరకంగా చాలామంది అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి శరీరవేడిని తగ్గిస్తుంది. పైత్యం చేసి ఇబ్బంది కలిగే వారు జున్ను తీసుకుంటే పైత్యం తగ్గిపోతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్త సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండెకు మంచి చేస్తుంది. గొంతు సంబంధ సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు నయం చేస్తుంది.  సహజంగానే జున్నులో ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, జీర్ణమవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. జీర్ణశక్తి సరిగా లేనివారు  దీన్ని తిన్నప్పుడు అది సరిగా అరగకపోగా వాతదోషం కఫదోషాలు పెరిగి, శరీరం బరువెక్కడం, మలబద్దకం, కడుపునొప్పి, కడుపులో  బరువు ఏదో తెచ్చిపెట్టినట్లు అనిపించడం... వంటి బాధల్ని కల్గిస్తుంది. వాతదోషం పెరిగి, కాళ్ళు చేతులు నొప్పులు, కీళ్ళు వాచిపోవడం, నడుంనొప్పి, శరీరం కదలకుండా బిగుసుకు పోయినట్లవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకని, జున్నుపాలు కాచేప్పుడే అందులో కొద్దిగా మిరియాల పొడిని కలిపి జున్ను తయారుచేస్తారు. దీనివల్ల తేలికగా అరిగేందుకు ఈ మిరియాల పొడి సహకరిస్తుంది. వాతకఫ దోషాలను పెరగకుండా అదుపులో వుంచుతుంది. ఈ బాధలున్నవారు జున్నును పరిమితంగా తినాలి. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే, పాత రోగాలు తిరిగి మొదలయ్యేలా చేస్తుందని జున్ను గురించి హెచ్చరిస్తారు వైద్యులు. ఇదీ జును రహస్యం...                                    ◆నిశ్శబ్ద

వేధించే కీళ్ల నొప్పులను తరిమేయాలంటే ఈ నాలుగు మార్పులే ముఖ్యం..

శరీరంలో వివిధ భాగాలను అనుసంధానం చేస్తూ కీళ్లు ఉంటాయి. కొన్నేళ్ళ క్రితం వరకు ఓ వయసు దాటిన తరువాత మాత్రమే కీళ్ల నొప్పుల సమస్య ఉండేది. కానీ ఇప్పుడు నిండా ముప్పై ఏళ్లు కూడా లేనివారు కీళ్ల నొప్పులు అంటూ ఉంటారు. జీవనశైలి మారడం నుండి ఆహారం కలుషితం కావడం వరకూ ప్రతి ఒక్కటీ కీళ్లమీద ప్రభావం చూపిస్తుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12వ  తేదీని ప్రపంచ ఆర్థరైటిస్ డే గా జరుపుకుంటారు. ఈరోజున కీళ్ల ఆరోగ్యం, కీళ్ల అరుగుదల, కీళ్లు దృఢంగా ఉండాలంటే తీసుకోవలసిన  జాగ్రత్తలు మొదలైన విషయాల మీద చర్చిస్తారు. కీళ్ల వ్యాధుల మీద  అవగాహన కల్పిస్తారు. ఉదయం నిద్ర లేవగానే కీళ్లలో నొప్పి, వాపు, నడవడంలో ఇబ్బంది, కీళ్లు బిగుసుకుపోవడం కీళ్ల జబ్బులలో  ప్రధాన లక్షణాలు. 50 కంటే ఎక్కువ రకాల ఆర్థరైటిస్ వ్యాధులు ఉన్న కారణంగా  ఆర్థరైటిస్ కు ఖచ్చితమైన కారణాలను కనుక్కోవడం ద్వారా మాత్రమే దాని పరిష్కారం గురించి ఆలోచించవచ్చు.  కీళ్లనొప్పులు నయం చేయలేని వ్యాధి అన్నది నిజమే కానీ  జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే అది మరింత తీవ్రం కాకుండా నిరోధించవచ్చు. జీవనశైలిలో కేవలం నాలుగు అలవాట్లను మార్చుకోవడం వల్ల కీళ్లనొప్పులను చాలావరకు తగ్గించుకోవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. ఎక్కువసేపు కూర్చోవడం మానేయాలి.. కార్పొరేట్ సంస్కృతి కారణాన  పనివేళలు బాగా పెరిగిపోవడంతో ఎక్కువ గంటలు సిస్టమ్ ముందు ఉండాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితిలో, సర్వైకల్ స్పాండిలైటిస్,  కీళ్ల దృఢత్వం  సమస్యలు ముందుగానే దాడి చేస్తున్నాయి.  పనులు ఆపుకోవడం సాధ్యం కాదు, కానీ పని మధ్యలో కాస్త చిన్న విరామాలు తీసుకుంటూ ఉండాలి. 40నిమిముషాలకు ఒకసారి అయినా సీట్ నుండి లేచి పది అడుగులు వేస్తుండాలి.   రోజులో  30 నుండి 40 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి . ఇందుకోసం  సైక్లింగ్ , స్విమ్మింగ్ , బ్రిస్క్ వాక్  మొదలైనవి ఫాలో కావచ్చు. వ్యాయామం రక్త ప్రసరణను పెంచడమే కాకుండా కీళ్లకు కూడా మంచిది.  కండరాల బలాన్ని పెంచుతుంది. ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న  రోగులలో  వ్యాయామం,  యోగా ఉపశమనాన్ని అందిస్తాయి. ధూమపానం మానేయాలి.. ఆర్థరైటిస్ వేగాన్ని 5 రెట్లు పెంచడానికి ధూమపానం ఒక  కారణం. ధూమపానం ఆర్థరైటిస్‌ను మరింత తీవ్రతరం చేస్తుందని వైద్య పరిశోధనలలో కూడా నిరూపించబడింది.  ఇది శరీరానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరోధకాలను సృష్టిస్తుంది.  దీని కారణంగా, గుండె సంబంధిత జబ్బులు కూడా పెరుగుతాయి. ఆర్థరైటిస్ రోగులు ధూమపానం మానేసి మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. చక్కెర వద్దు.. పండ్లు ముద్దు..  కీళ్లనొప్పులు తీవ్రంగా మారకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ ఎంచుకోవాలో తెలుసుకోవాలి.   ఆర్థరైటిస్‌లో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.   ఆహారం ద్వారా దీన్ని పూర్తిగా నియంత్రించలేనప్పటికీ, ఇది చాలా వరకు తీవ్రం కాకుండా చేయవచ్చు. ప్రతిరోజు యాంటీఆక్సిడెంట్  అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ పరిమాణంలో ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉండే దానిమ్మ వంటి కొన్ని పండ్లను  రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవాలి. అదేవిధంగా పసుపు, దాల్చినచెక్క ,  మెంతి గింజలు కూడా కీళ్ళనొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవాలి.   కానీ రెడ్ మీట్, సీ ఫుడ్, శీతల పానీయాలు, ప్యాక్డ్ ఫుడ్,  ప్రాసెస్ చేసిన ఆహారాలను ఖచ్చితంగా నివారించాలి. తద్వారా కీళ్ళనొప్పులు ఎక్కువ కావు. బరువు పెరగకండి.. భారతదేశంలో  క్రమంగా  స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది.  అందుకే మధుమేహం కేసులు కూడా పెరుగుతున్నాయి. మీ BMI 24 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ అధికంగా ఉందని, ఇది సైటోకిన్‌లను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తుంది.  దీని ఫలితంగా ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. అధిక బరువు ఉన్న రోగులకు ఆర్థరైటిస్‌ను నియంత్రించడానికి ఎక్కువ మందులు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం ఉన్న రోగిలో CRP స్థాయి 20 వరకు  ఉంటే అది సాధారణం. దీని కారణంగా, గత కొన్ని సంవత్సరాలుగా మోకాలి మార్పిడి  కేసులు కూడా పెరిగాయి. పై నాలుగు అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటే కీళ్ళనొప్పులను నియంత్రణలో ఉంచడం సాధ్యమే..                                               *నిశ్శబ్ద.

కడుపు ఉబ్బరంగా ఉంటుందా? దానికి అసలు కారణాలు ఇవే..!

కడుపు ఉబ్బరం చాలామందిని వేధించే సమస్య.  దీని వల్ల రోజులో చేయాల్సిన చాలా పనులలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే కడుపు ఉబ్బరంగా ఉంటే ఏ పని మీదా ఆసక్తి కలగదు. అదే విధంగా ఏమైనా తినాలన్నా, తాగాలన్నా కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈ కడుపు ఉబ్బరం సమస్యకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, జీవనశైలి ఆరోగ్యకరంగా లేకపోవడం కూడా కారణం అవుతుంది.  ఈ కడుపు ఉబ్బరం కాస్తా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. కడుపు ఉబ్బరానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే.. ఆహారపు అలవాట్లు.. పెద్ద మొత్తంలో భోజనం లేదా కొవ్వు ఫైబర్ లేదా కృత్రిమ స్వీటెనర్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను ఆలస్యమవుతుంది. ఈ కారణంగా  గ్యాస్ ఏర్పడి ఉబ్బరం పెరుగుతుంది. వేగంగా తినడం,  చూయింగ్ గమ్ నమలడం లేదా కార్బోనేటేడ్ పానీయాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోకి అదనపు గాలి చేరి పొత్తికడుపు అసౌకర్యం,  డిస్టెన్షన్‌కు మరింత కారణం అవుతుంది. ఈ అలవాట్లు జీర్ణశయాంతర వ్యవస్థ  సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తాయి, ఇది ఉబ్బరం లక్షణాలకు దారితీస్తుంది. చిన్న మొత్తాలలో భోజనం తీసుకోవడం, ఆహారం తినేటప్పుడు శ్రద్దగా ఏం తింటున్నామనే విషయం మీద ఏకాగ్రత ఉంచడం.  ఆహారపు పద్ధతులు ఆరోగ్యకరంగా ఉండటం,  కార్బొనేషన్ లేని పానీయాలను ఎంచుకోవడం వంటివి ఉబ్బరం తగ్గించడానికి,  జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. లాక్టోస్ అసహనం.. లాక్టోస్ అసహనం గ్లూటెన్ సెన్సిటివిటీ లేదా ఇతర ఆహార అసహనం ఉన్న వ్యక్తులు కొన్ని పదార్ధాలను సరిగ్గా జీర్ణం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇాలాంటి వారు కడుపు ఉబ్బరం సమస్యకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.  లాక్టోస్ అసహనం ఉన్నవారికి పాల ఉత్పత్తులు లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి గ్లూటెన్ కలిగిన ధాన్యాలు వంటి  ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంతో సహా జీర్ణశయాంతర అసౌకర్యం ఏర్పడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు.. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS), ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (IBD) లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) వంటివి  జీర్ణక్రియ పనితీరుకు భంగం కలిగిస్తాయి. ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. కడుపు నొప్పి, ఆహారపు  అలవాట్లు మారిపోవడం కూడా ఉబ్బరం కలిగిస్తాయి. జీర్ణాశయంలోని వాపు అతిసారం లేదా మలబద్ధకంతో పాటు మరిన్ని సమస్యలు  ఉబ్బరాన్ని కలిగిస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య కూడా కడుపు ఉబ్బరం,  అసౌకర్యానికి కారణం అవుతుంది. కడుపులో నీరు చేరడం..  హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఋతుస్రావం లేదా గర్భధారణ సమయంలో కడుపు పెద్దగా ఉండటం వంటివి కడుపులో నీరు చేరడాన్ని సూచిస్తాయి.  సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో  ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది, ఉబ్బరం కలిగిస్తుంది.  కార్టికోస్టెరాయిడ్స్ లేదా హార్మోన్-ఆధారిత గర్భనిరోధకాలు వంటి కొన్ని మందులు  కూడా కడుపులో నీరు చేరడానికి, కడుపు  ఉబ్బరానికి కారణం అవుతాయి. ఒత్తిడి.. మానసిక ఒత్తిడి ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది గట్-మెదడు పనితీరుకు  అంతరాయం కలిగిస్తుంది.  ఉబ్బరానికి దారితీస్తుంది. ఒత్తిడి గట్ కదలికలను  మారుస్తుంది.  జీర్ణశయాంతర అసౌకర్యానికి సున్నితత్వాన్ని పెంచుతుంది. గట్,  మెదడు రెండూ రెండు  వైపులా  కమ్యూనికేట్ చేయడం వలన ఇది ఉబ్బరం లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.                   *నిశ్శబ్ద.

క్వినోవా  తింటే కలిగే లాభాలు ఏంటో తెలుసా?

ఆరోగ్యకరమైన ఆహారం లిస్ట్ లో చాలా రకాల ధాన్యాలు ఉంటాయి. వాటిలో క్వినోవా కూడా ఒకటి. క్వినోవా ఈమధ్య కాలంలో ఆదరణ పొందింది. ఇది  అండీస్ పర్వతాల నుండి వచ్చిన పురాతన ధాన్యం. క్వినోవా రుచిలో నట్స్ ను పోలి ఉంటుంది. ఇక దీంట్లో పోషకాలు కూడా ఎక్కువే..   దీంతో విభిన్న రకాల వంటలు తయారుచేస్తారు. అయితే కేవలం రుచికి, పోషకాల కోసమే కాకుండా క్వినోవా తింటే బోలెడు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రొటీన్స్ కు పవర్ హౌస్.. చాలా ధాన్యాల మాదిరిగా కాకుండా క్వినోవా పూర్తి ప్రోటీన్‌గా పరిగణించబడుతుంది. అంటే ఇది  శరీరానికి అవసరమైన మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఈ అమైనో ఆమ్లాలను శరీరం సొంతంగా ఉత్పత్తి చేయలేదు.  అందుకే ఇది శాకాహారులకు, ప్రోటీన్ తీసుకోవాలని అనుకునేవారికి, ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతున్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఒక కప్పు వండిన క్వినోవాలో లభించే ప్రోటీన్ మాంసానికి ధీటుగా ఉంటుంది. గ్లూటెన్ రహితమైనది.. గ్లూటెన్ అసహనం లేదా ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి పోషకమైన,  రుచికరమైన ధాన్యాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అలాంటి ధాన్యాలు అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన ధాన్యాలలో క్వినోవా ఒకటి. ఇది సహజంగా గ్లూటెన్ రహితమైనది. ఇది గోధుమ,  బార్లీకి  మంచి  ప్రత్యామ్నాయంగా మారుతుంది. క్వినోవాతో కాల్చిన రొట్టెలు, ఇతర ఆహారాలు, సలాడ్ లు ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఫైబర్.. క్వినోవాలో డైటరీ ఫైబర్ అద్భుతంగా ఉంటుంది. ఒక కప్పుకు 5 గ్రాముల  ఫైబర్ ఉంటుంది. ఇది  ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.  మైక్రోబయోమ్‌లోని మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో సహకరించడం  ద్వారా గట్ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను,  కొలెస్ట్రాల్‌ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఖనిజాలు.. క్వినోవాలో  మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్,  ఐరన్ తో సహా అవసరమైన ఖనిజాలన్నీ ఉంటాయి.  ఎముక ఆరోగ్యం,  శరీరానికి శక్తి సమకూర్చడం,  జీవక్రియ నుండి నరాల పనితీరు,  ఆక్సిజన్ రవాణా వరకు వివిధ శారీరక విధులలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. క్వినోవా  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  రోజువారీ ఖనిజ అవసరాలు సులభంగా తీర్చుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్.. క్వినోవా కేవలం పోషకాల పవర్‌హౌస్ కాదు. ఇందులో క్వెర్సెటిన్,  కెంప్ఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆహారంలో క్వినోవాను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది.                                                   *నిశ్శబ్ద.  

పిస్తా పప్పు తినే అలవాటుందా? వీటిని రోజూ తింటే కలిగే లాభాలివీ..!

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాము. వాటిలో  డ్రై ఫ్రూట్స్ చాలా ముఖ్యమైనవి. డ్రై ఫ్రూట్స్ లో బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అంజీర్, ఖర్జూరం ఇలా అన్ని రోజూ తీసుకోవడం చాలా మంచిదని అంటూ ఉంటారు. అయితే వీటిలో ఒకటైన పిస్తా పప్పులు చాలా ప్రత్యేకం. పైన గవ్వల్లాంటి షెల్ తో వచ్చే పిస్తా పప్పులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. పిస్తా పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. పోషకాలు.. పిస్తా పప్పు చిన్నగా ఉన్నా.. అందులో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు,  ఫైటోన్యూట్రియెంట్‌లతో సహా అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. అంతేకాదు విటమిన్ B6 కూడా ఇందులో ఉంటుంది. ఇది జీవక్రియకు,  నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం. అలాగే పొటాషియం, భాస్వరం,  మెగ్నీషియం వంటి ఖనిజాలు, కండరాల పనితీరుకు,  ఎముకల ఆరోగ్యానికి  చాలా సహాయపడతాయి.  ఇకపోతే పిస్తాపప్పులలో  యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. పాలీఫెనాల్స్,  కెరోటినాయిడ్స్ వంటి మొక్కల సమ్మేళనాలు కూడా పిస్తా పప్పులో ఉంటాయి. కంటి ఆరోగ్యం.. లుటిన్,  జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పిస్తా పప్పులో  పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమ్మేళనాలు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేయడం ద్వారా,  రెటీనాపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వయస్సు సంబంధంగా వచ్చే కంట్లో మచ్చలు,  కంటిశుక్లం మొదలైనవాటి నుండి  కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.  ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం వల్ల కంటి చూపును రక్షించుకోవచ్చు.  వయస్సు పరంగా వచ్చే కంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్.. పిస్తాలలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి   చాలామంచివి. మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచుతూ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను (LDL) తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక వీటిలో ఉండే లుటీన్,  గామాటోకోఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు క కొలెస్ట్రాల్  ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి సంతులిత ఆహారంలో భాగంగా పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా నూ,  హృదయనాళ పనితీరు మెరుగ్గానూ ఉంటుంది.  బరువు.. క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ పిస్తాలు  బరువు మెయింటైన్ చేయడంలో సహాయపడతాయి. వాటిలోని అధిక ప్రొటీన్,  ఫైబర్ కంటెంట్ ఆకలి తీరిన ఫీల్ పెంచుతుంది. పదే పదే తినాలనే కోరికలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల  బరువు తగ్గడంతోపాటు నడుము చుట్టుకొలత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీఆక్సిడెంట్స్.. పిస్తాపప్పులలో  లుటిన్, జియాక్సంతిన్,  ప్రోయాంతోసైనిడిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, కణాలను దెబ్బతీసే హానికరమైన అణువులతో పోరాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించడంలో  దోహదం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా శరీర కణాలను రక్షిస్తాయి.                                                *నిశ్శబ్ద.  

త్రిఫల చూర్ణం రోజూ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

భారతీయ మహర్షులు అందించిన గొప్ప బహుమతిగా ఆయుర్వేదాన్ని చెప్పవచ్చు. అల్లోపతి వైద్యం పుట్టకముందు, అది భారతదేశానికి పరిచయం కాకముందు ఆయుర్వేదమే అందరికీ మూలాధారం. అల్లోపతి వైద్యం బాగా ప్రాచుర్యం పొందాక ఆయుర్వేదం కుంటుపడింది. కానీ ప్రస్తుతకాలంలో ఆయుర్వేదం మళ్లీ ప్రజల్లో ఆదరణ పెంచుకుంది. ఆయుర్వేదం  ప్రసాదించిన ఔషదాలలో త్రిఫల చూర్ణం కూడా ఒకటి. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయల మిశ్రమం అయిన త్రిఫల చూర్ణం ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అసలు త్రిఫల చూర్ణం రోజూ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుంటే.. జీర్ణ ఆరోగ్యం.. త్రిఫల జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి, మలబద్ధకం నుండి ఉపశమనానికి,  జీర్ణశయాంతర అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది సినర్జిస్టిక్‌గా పనిచేస్తుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది.   డిపెండెన్సీని కలిగించకుండా క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది.   జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండటంలోనూ, జీర్ణవ్యవస్థలోని విషాన్ని బయటకు పంపడంలోనూ సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్..                                                                                        పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్,  విటమిన్ సి పుష్కలంగా ఉన్న కారణంగా  త్రిఫల  చూర్ణం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే  యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్,  హానికరమైన అణువులను తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడటంలోనూ,  వృద్ధాప్యాన్ని,  వివిధ వ్యాధులకు దూరం చేయడంలోనూ దోహదం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా త్రిఫల ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.   రోగనిరోధక శక్తి.. త్రిఫల చూర్ణం రోగనిరోధక శక్తిని పెంచుతుందని  ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఉసిరి, కరక్కాయ, తానికాయల కలయిక రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలు,  ఫైటోన్యూట్రియెంట్ల ను అందిస్తాయి. త్రిఫల చూర్ణాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో  సహజ రక్షణ వ్యవస్థ  మెరుగవుతుంది.  ఇది అంటువ్యాధులు,  అనారోగ్యాలు రాకుండా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నోటి ఆరోగ్యం.. నోటి పరిశుభ్రత,  దంత సంరక్షణ కోసం ఆయుర్వేద వైద్యులు  త్రిఫలను చాలా కాలంగా సిఫార్సు చేస్తున్నారు. త్రిఫలలో ఉండే  ఆస్ట్రింజెంట్ లక్షణాలు చిగుళ్ల కణజాలాన్ని బిగించి, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో  సహాయపడతాయి, చిగుళ్ల వ్యాధి,  వాపు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు నోటి బాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. కావిటీస్, ప్లేక్ బిల్డప్,  చెడు శ్వాసను నివారిస్తుంది. బరువు.. త్రిఫల బరువు బ్యాలెన్స్ గా ఉంచడంలోనూ,  ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించడంలోనూ సహాయపడతాయి.  ఇది జీర్ణక్రియకు, అధిక బరువు తగ్గించడంలోనూ   సహాయపడుతుంది.   ఆరోగ్యకరంగా బరువును మెయింటైన్ చేయడానికి ఇవి చాలా సహాయపడతాయి. జీర్ణక్రియకు,  నిర్విషీకరణకు సపోర్ట్  ఇవ్వడం ద్వారా త్రిఫల పోషకాల శోషణను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది.  కొవ్వుల విచ్ఛిన్నంలో సహాయపడుతుంది. ఇంతేకాకుండా ఇందులో ఉండే తేలికపాటి భేదిమందు ప్రభావాలు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి,  బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలామందిలో మలబద్దకం సమస్య ఉంటుంది. దాన్ని  త్రిఫల చూర్ణం పరిష్కరిస్తుంది.                                                 *నిశ్శబ్ద.                              

థైరాయిడ్ క్యాన్సర్ అంటే తెలుసా?

  ఎం టి సి మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్  చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్  గ్రంధిలో వచ్చే క్యాన్సర్. ధాయ్ రాయిడ్ క్యాన్సర్ సమ స్య వివిదరూపాలలో వచ్చి క్యాన్సర్ గా మారు తుంది. ఇది వివిధ రకాల కణాల ద్వారా ఫరా ఫాలిక్యులర్ సి సెల్ ద్వారా పుడుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ చాలా చిన్న గ్రంధి. మన మెడకు ముందు భాగం లో ఉంటుంది. శరీరానికి అవసరమైన హార్మోన్లనుథైరాయిడ్ క్యాన్సర్ ఉత్పత్తి చేస్తుంది.ధై రాయిడ్ లో ఒకరకమైన కణాల ఉత్పత్తి ఎప్పుడైతే ప్రారంభమౌతాయో క్యాన్సర్ మొదలవుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటి థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ పై ఆధార పడి క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. మొ డ్యులరీ ధై రాయిడ్ క్యాన్సర్ చాలా అరుదైన క్యాన్సర్. ప్రతి 1౦౦౦ మందిలో 3 నుండి 4% ధైరాయిడ్ క్యాన్సర్లు వస్తున్నాయి. మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు చికిత్స వంటి అంశాలు చూద్దాం...థైరాయిడ్ గ్రంధి గురించి... మన మెడ పై సీతాకోక చిలుక ఆకారం లో థైరాయిడ్  గ్రంధి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్బ్లను ఉత్పత్తి చేసి శరీరానికి మెటాబా లిజం ను పెంచు తుంది.థైరాయిడ్ గ్లాండ్స్ లో రెండు రకాలు ఉంటాయి. సెల్స్ ఫాలిక్యులర్ సి సెల్స్ పరా ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఫాలిక్యులర్ సెల్స్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. పరా ఫాలిక్యులర్ సెల్స్ కాల్సిటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ ద్వారా శరీరంలో కాల్షియం ను నియంత్రిస్తుంది. ఎం టి సి ఇతర క్యాన్సర్ల కన్నా వేరుగా ఉంటుంది.  ఎం టి సి ఫరా ఫాలిక్యులర్ సెల్స్ ద్వారా వృద్ది అవుతుంది. ఎం టి సి ని కొందరు మోడ్యులరీ థైరాయిడ్ కార్సినామా అనికూడా అంటారు. ఎం టి సి ఎన్నిరకాలు... ఎం టి సి ని రెండు రకాలుగా గుర్తించారు. స్పోరాడిక్ , ఫెమిలాల్ గా గుర్తించారు. స్పోరాడిక్ చాలా సహజమైన సమస్య వయస్సు మళ్ళిన వాళ్ళలో ముఖ్యం గా వృ దులలో థైరాయిడ్ లోబ్ లో ప్రభావం చ్గూపిస్తుంది. ఫెమిలాల్ ఎం టి సి కుటుంబం లో వస్తుంది . ఇది బాల్యం నుంచే వృద్ది చెందుతుంది. ఈ రకమైన క్యాన్సర్స్ థైరాయిడ్ లోబ్స్ లేదా ఇతర రకాల కణి తలు ఉంటె మరింత తీవ్రంగా ఉంటుంది. పరా ఫాలిక్యులర్ సి సెల్స్ ఉండే ప్రాంతం లో మోడ్యులా థైరాయిడ్ ఉండే ప్రాంతం లో వస్తుంది.ఒక్కోసారి ఎం టి సి ని గుర్తించడం కష్టం. ఇతరథైరాయిడ్ క్యాన్సర్ లను గుర్తించడం కష్టం. మోడ్యులార్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు... ప్రాధమిక స్థాయిలో ఎం టి సి ని గుర్తించడం కష్టం. ఎం టి సి నెమ్మదిగా పెరుగుతుంది. వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కనపడవు. ప్రధానంగా థైరాయిడ్ గ్రంధి వద్ద ఒక కణిత మేడలో వస్తుంది. ఇది పూర్తిగా కణిత మాంసం ముద్దగా ఉంటుంది పెరిగిన కణిత థైరాయిడ్ లో పెరుగుతుంది. దీనివల్ల మింగడం లేదా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతుంది మాట్లాడడం కష్టంగా ఉంటుంది. మోడ్యులార్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలలో ముఖం ఎర్ర బడడం.బరువు తగ్గడం. డయేరియా లేదా నీళ్ళ విరేచనాలు వంటివి కనిపిస్తాయి . మోడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఎన్ని స్టేజీలలో ఉంటుంది... ఆన్ని క్యాన్సర్ల లాగానే డాక్టర్స్ మొడ్యులారీ థైరాయిడ్ ను స్టేజిలుగా గుర్తించారు. నాలుగు స్టేజీలు ఎలా ఉంటాయో చూద్దాం . వివిధ రకాల కారణాలు అయి ఉంటాయి. ట్యూమర్ పరిమాణం సైజు లింఫ్ నోడ్స్ ను చేరిందా లేదా లేదా ఇతర అవయవాల కు దూరంగా ఉందా ,వ్యాపించిందా ? స్టేజ్ 1. ప్రాధమిక స్థాయి, ఈ దశలో ట్యూమర్ చాలా చిన్నదిగా వ్యాపించదు . ప్రతి స్టేజి లో పెరుగుతూ పోతూఉంటుంది. 4 వ స్టే జిలో క్యాన్సర్ ఏ సైజు లో అయినా ఉండవచ్చు. ప్రతి స్టేజిలో క్యాన్సర్ పెరగడం వ్యాపించడం సంభవిస్తుంది. కారణాలు... ఎం టి సి ఫలితం గా పారా ఫాలిక్యు లర్ సెల్స్ లో మార్పులు చెందుతాయి. ఏది ఏమైనా చాలా కేసులలో స్పోరాడిక్ కు గల కారాణాలు తెలియరాలేదు. 25% ఎం టి సి కేసులలో కుటుంబాలలో వస్తాయిదీని ఆధారం గా రేట్ జీన్ లో మార్పుల కారణంగా పెర్కొంటు న్నారు.రేట్ జీన్ క్రోమో జోములలో ఉంటుంది. ఇది పది రకాలుగా మారుతుంది. అని కణాలు వస్తాయని శాస్త్రజ్ఞులు జీన్ లో మార్పులు వచ్చినట్లు గుర్తించారు. దీనివల్ల స్పోరాడిక్ క్యాన్సర్స్ ఎం టి సి ఈ పరిస్థితిని రేట్ జీన్స్ స్థితి వల్ల మల్టి పుల్ ఎండో క్రైన్ నీమో ప్లాసియా టైప్ 2 లేదా మెన్ 2 , మెన్ 2 ఏ మెన్ 2 బి ఉండవచ్చని అభిప్రయా పడ్డారు. మోడ్యులార్ క్యాన్సర్ నిర్ధారణ... మోద్యులరీ  థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడే ప్రజలు మెడలో కణి తలలో వస్తారు. డాక్టర్ తమ పరీక్షలలో చాలా చాక చక్యం గా లంప్ ను గుర్తిస్తారు. ఇమేజింగ్ టెస్ట్ లలో అల్ట్రా సౌండ్,సిటి లేదా ఎం అర్ ఐ స్కాన్,ధైరాయిడ్ చేయిస్తారు. ఒక వేళ డాక్టర్  థైరాయిడ్ క్యాన్సర్ గా అనుమానిస్తే ఎస్పిరేషణ్ బయాప్సీ పరీక్ష అల్ట్రాసౌండ్, లేదా ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా 6 ఆరు ప్రాంతాలలో కణా లాలో చిన్న కణాలను నీడిల్ ను వినియోగిస్తారు. మరిన్ని పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. మరిన్ని పరీక్షల వల్ల చికిత్స పద్దతులు ఎలా చేయవచ్చు. అని నిర్దారించాలంటే రక్త పరీక్ష చేస్తారు, రక్త పరీక్షలో కాల్సిటోనిన్, కాల్షియం కార్సినోమా ఎం బ్రాయినిక్ యాంటీ జీన్ ఎల్ ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. చికిత్సలు... ప్రాధమిక స్థాయిలో ఎం టి సి సర్జరీ చేస్తారు. దీనిని ధైరోడేక్టమీ అంటారు.ఇందులో  థైరాయిడ్గ్లాండ్ ను పూర్తిగా తొలగిస్తారు.  థైరాయిడ్ గ్రంధి వ్యక్తికి అవసరం. లేదా ఒక వేళ  థైరాయిడ్ గ్రంధి తొలగిస్తే జీవితాంతం హార్మోన్లు మార్చుకుంటూ ఉండాలి. సర్జరీ తో పాటు ఇతర చికిత్సలు చేస్తారు. ప్రత్యేకంగా ఒకవేళ కణిత లేదా ట్యూమర్ ఇతర ప్రాంతాలకు అవయవాలకు వ్యాపిస్తే  థైరాయిడ్ బయట, మెడ బయటి భాగం లో మార్పులు వస్తే సర్జరీ అనువు కాని పక్షంలో ఇతర చికిత్సలు ఎక్స్ టర్నల్ బీం రేడియేషన్ కీమో తెరఫీ లక్ష్యం దిశగా దేరఫీ లు చేస్తారు. క్యాన్సర్ తీవ్రత స్టేజీ ల ఆధారంగా ఉత్తమమైన నిర్ధారణ చికిత్స పద్దతిని ఎంచుకుంటారు. క్యాన్సర్ విస్తరిస్తే తీవ్రమైన చికిత్సలు మల్టిపుల్ స్టేటర్జీ కీమో తెరఫీ చికిత్స ఇతర చికిత్స పద్దతులు చేయాల్సి ఉంటుంది. నివారణ... ఎసి ఎస్ ప్రకారం చాలా రకాల  థైరాయిడ్ క్యాన్సర్ లలో ఎం టి సి లో కుటుంబ చరిత్ర ఉండి ఉండవచ్చు. వారిలో వస్తున్న జీన్ మార్పులు వల్ల వ్యాధి తీవ్రత సూచిస్తుంది. ఒకవేళ వ్యక్తికి హై రిస్క్ ఉంటె డాక్టర్  థైరాయిడ్ యాక్ట మీ క్యాన్సర్ ను నిలువరించ వచ్చు. డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి ?... మేడపై ఏదైనా కణిత ఉన్నట్లు అనిపిస్తే వారు డాక్టర్ ను సంప్రదించాలి. ఎం టి సి శక్తి వంతమైన లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి ఇందులో గాలి పీల్చుకోవడం మింగడం కష్టం ఉన్న లక్షణాలు గమనించాలి. కుటుంబాలలో చరిత్ర ఉంటె ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. డాక్టర్ మాత్రం జన్యుపరమైన పరీక్షలకు సూచించవచ్చు జీన్ లో మార్పులు ఉంటె ఎం టి సి వస్తుంది అన్న విష యం తెలుసుకోవాలి. విశ్లేషణ... ప్రజలలో ఎం టి సి రావడానికి రక రకాల కారణాలు ఉండచ్చు. స్టేజి నిర్ధారణ చికిత్సకు స్పందించడం పూర్తి ఆరోగ్యం గా కోలుకోవడం ముఖ్యం.ఎం టి సి అన్నది ఇతరా క్యాన్సార్ లాంటి దికాదు. దీని సత్వరం నిర్ధారణ చేయడం వల్ల చికిత్స చేస్తే ఫలితాలు ఉంటాయి. అదనంగా బయో మార్కర్స్ గుర్తించడం... కార్సిటో నిన్ సి ఇ ఏ సర్జరీ తరువాత ఎంత ఉందొ తెలుసు కుంటే ఎంతకాలం బతక గలరో అంచనా వేయవచ్చు. ఎం టి సి రావడానికి  థైరాయిడ్ క్యాన్సర్. క్యాన్సర్ నుండి బయట పడ్డ వారి సమాచారం. ముందుగా గుర్తించడం చికిత్స ఫలితాలు చూడాలి.బయో మార్కర్లను నిశితంగా పరిశీలించాలి. మొదటి సంవత్సరం కార్సి టోనిన్ చికిత్స ప్రత్యామ్నాయ మార్గాలు వల్ల మనుగడ సాగడం 2౦17 లో చేసిన పరిశోదన ప్రకారం 1౦ సంవత్సరాలు మనుగడ ఎలా బతికి బట్ట కట్టలేదు. 1)థైరాయిడ్ లో 95 % స్థానిక క్యాన్సర్ మాత్రమే . 2)75 % ఇతర అవయావాల కు విస్తరించకుండా వ్యాధి ధైరాయిడ్ గ్రందికే పరిమితం . 3)2౦ % ఇతర అవయవాలకు విస్తరించడం అదీ లివర్ఊపిరి తిత్తులకు సోకడం గమనించవచ్చు. థైరాయిడ్ లో వాపు మింగలేకపోవడం వాపు ఉంటె ధైరాయిడ్ గ్లాండ్ లో వచ్చిన మార్పుగా గమనించి సత్వరం డాక్టర్ ను సంప్రదించాలి. చికిత్స చేయించుకోవాలి.  

రోజూ మూడు పూటలా తినడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే 24 గంటల్లో మూడు సార్లు ఆహారం తీసుకోవాల్సిందేనని  చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం,  రాత్రి భోజనం ఈ మూడూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో  చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా ఆరోగ్యానికి పెనుముప్పు సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. అసలీ సమస్య ఎప్పుడొస్తుందంటే.. సాధారణంంగా చాలామంది  బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా రోజులో ఏదో ఒక పూట ఆహారాన్ని స్కిప్ చేస్తుంటారు. కానీ   ఇలా చేయడం ద్వారా బరువు తగ్గుతారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. దీనికి బదులుగా ఇలా ఆహారం ఎగ్గొట్టడం అనే అలవాటు చాలా సమస్యలను పెంచుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే, అది  శరీరంలో అనేక వ్యాధుల సమస్యలను పెంచుతుందని  పరిశోధనలు కూడా చెబుతున్నాయి.  ఇలా ఆహారాన్ని స్కిప్ చెయ్యడం వల్ల  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. భోజనం మానేయడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే..  ఏదైనా తిన్న ప్రతిసారీ మీ పిత్తాశయం పైత్యరసాన్ని విడుదల చేస్తుంది, ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అయితే ఆహారం తీసుకోకపోయినా పిత్త రసం అదే విధంగా ఉత్పత్తి అవుతుంది. ఆహారం తీసుకోకపోతే ఆ పిత్తరసం పనిచేయకుండా ఉండిపోతుంది. దీనికారణంగా అది  పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితి పిత్తాశయంలో గట్టిపడిన కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది, ఇది పిత్తాశయంలో రాళ్లకు దారితీస్తుంది.  తరచుగా రోజులో ఒకపూట ఆహారం తీసుకోవడం మానేస్తే.. ముఖ్యంగా ఉదయం పూట, స్థూలకాయం, అధిక రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్ సమస్యలు, మధుమేహం,  మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు మొదలవుతాయి.  గుండె జబ్బుల ప్రమాదం సాధఘారణంకంటే ఎక్కువగా ఉంటుంది.ఇది కార్డియోమెటబోలిక్ ప్రమాదాలకు మూలకారణం అవుతుంది. గుండె జబ్బులను నివారించడానికి,  ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవడం అవసరం. ఇప్పటికే డయాబెటిక్ ఉన్నవారు  ఒక పూట  భోజనం స్కిప్ చేయడం మరింత  సమస్యాత్మకంగా మారుతుంది. ఇది ఆహారం తీసుకోవడం,  ఇన్సులిన్ ఉత్పత్తి మధ్య అసమతుల్యతను ప్రోత్సహిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఇన్సులిన్ లేదా బ్లడ్ షుగర్ తగ్గించే మందులపై ఆధారపడిన మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తులకు, రక్తంలో చక్కెర శాతం ఉన్నపళంగా తగ్గడం చాలా ప్రమాదం.                                                                                                         *నిశ్శబ్ద

మెగ్నీషియం లోపాన్ని తరిమికొట్టాలంటే వీటిని తప్పక తినాల్సిందే!

అన్ని పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యం దృఢంగా ఉంటుందని వైద్యులు, పోషకాహార నిపుణుల నుండి సాధారణ ప్రజల వరకు అందరికీ తెలుసు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉంటాయి.  కానీ మనం తరచుగా మన రోజువారీ ఆహారంలో వాటిలో కొన్నింటిని నిర్లక్ష్యం చేస్తాము. అలా నిర్లక్ష్యం చేసేవాటిలో మెగ్నీషియం ఒకటి. ఈ కీలకమైన ఖనిజం గురించి అందరికీ తెలిసింది, దాన్ని రోజువారీ ఆహారంలో తీసుకునేది తక్కువే..  దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే. మెగ్నీషియం ఎందుకు ముఖ్యమైనదంటే.. మెగ్నీషియం మన శరీరానికి అవసరమైన ముఖ్య ఖనిజాలలో ఒకటి. ఇది మన ఎముకలలో ఉంటుంది. ఎముకలలో 60-70% భాగాన్ని మెగ్నీషియమే ఏర్పరుస్తుంది. అంతేకాదు మన రోజువారీ పనితీరులో కూడా మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కండరాలు, నరాల పనితీరును నియంత్రించడం, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు, ప్రోటీన్, ఎముక, DNA తయారీతో సహా శరీరంలోని అనేక ప్రక్రియలకు మెగ్నీషియం ముఖ్యమైనది. సాధారణంగా, పురుషులు కనీసం 400mg, మహిళలు ప్రతిరోజూ కనీసం 310mg మెగ్నీషియం తీసుకోవాలి.  మెగ్నీషియం లోపం వస్తే.. మెగ్నీషియం చాలావరకు శరీరానికి సులువుగానే అందుతుంది. అయినప్పటికీ మెగ్నీషియం లోపం ముఖ్యంగా జీర్ణశయాంతర వ్యాధులు, టైప్-2 మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారిలో సంభవిస్తుంది. మెగ్నీషియం లోపం ఏర్పడినప్పుడు  ఆకలి లేకపోవడం, వికారం, అలసట, నిద్రలేమి, కండరాల నొప్పులు వంటి లక్షణాలను కనిపిస్తాయి. మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలు.. డార్క్ చాక్లెట్ రుచిగా ఉండే డార్క్ లో మెగ్నీషియంతో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాపర్, మాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటాయి . ఇది గుండెకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఫ్లేవనోల్స్ ఉంటాయి. ఫ్లేవనోల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విత్తనాలు.. చియా, అవిసె, గుమ్మడికాయ గింజలు మెగ్నీషియంను అధికంగా కలిగి ఉంటాయి.  ఈ విత్తనాలలో ఐరన్, మోనోసాచురేటెడ్ ఫ్యాట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చేపలు.. సాల్మన్, మాకేరెల్, హాలిబట్ చేపలలో  మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  ఈ చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా చాలా మొత్తం ఉంటాయి. అరటిపండ్లు.. చవగ్గా సులభంగా లభించేవి అరటిపండ్లు. వీటిలో పొటాషియం కంటెంట్ బాగుంటుంది. పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే అరటిపండ్లు తరచుగా తింటూ ఉండాలి. ఆకు కూరలు.. మెగ్నీషియంతో నిండిన ఆకు కూరలు ఖచ్చితంగా ఆహారంలో భాగం ఉండాలి.  ఆవపిండి, పాలకూర,  బచ్చలికూర వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. తృణధాన్యాలు వీటిలో మెగ్నీషియం మాత్రమే కాకుండా, డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, తద్వారా మీ గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

స్టార్ ఫ్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇతర దేశాల పండ్లు, ఆహారాలు భారతదేశ ప్రజలకు చాలా నచ్చేస్తాయి. పైపెచ్చు మార్కెటింగ్ వ్యాప్తి కారణంగా విదేశీ పండ్లు కూడా పెద్ద నగరాలలో, కొన్ని నిర్ణీత ప్రాంతాలలో లభిస్తాయి. ఇలాంటి వాటిలో స్టార్ ప్రూట్ కూడా ఒకటి. స్టార్ ప్రూట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణ ఆరోగ్యానికి..  ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల  జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో  స్టార్ ఫ్రూట్ ప్రబావవంతంగా ఉంటుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను మెయింటైన్ చేయడంలో  ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా  ఇందులో  ఉండే సహజ ఎంజైమ్‌లు,  ప్రోటీన్లు  కొవ్వుల జీర్ణక్రియలో సహాయపడతాయి.  పోషకాలు సమర్థవంతంగా గ్రహించడంలోనూ,  జీర్ణ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి,  ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఫ్రీరాడికల్స్ అనేవి అస్థిర అణువులు, శరీరంలో కణాల  నష్టాన్ని కలిగిస్తాయి.  క్యాన్సర్స  గుండె జబ్బులతో సహా వివిధ దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణం అవుతాయి.  ఆహారంలో స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదే విధంగా శరీర రక్షణ వ్యవస్థను బలపరచుకోవచ్చు. రోగనిరోధక శక్తి.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి, విటమిన్ ఎ,  జింక్‌తో సహా రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల నిధి. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.  అంటువ్యాధులు,  అనారోగ్యాలను మరింత సమర్థవంతంగా నిరోధించడంలో సహాయపడతాయి. స్టార్ ఫ్రూట్  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  శరీరంలో  సహజంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  సీజనల్ సమస్యలుగా వచ్చే  జలుబు, ఫ్లూ,  ఇతర అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం..  స్టార్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.  పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సోడియం స్థాయిలను నియంత్రించడం,  రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఆహారంలో స్టార్ ఫ్రూట్ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం ద్వారా హైపర్‌టెన్షన్, స్ట్రోక్,  ఇతర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇంకా స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం,  ధమనులలో ఫలకం ఏర్పడకుండా చేయడం కూడా వీలవుతుంది. బరువు నిర్వహణ..  బరువును నియంత్రణలో ఉంచడానికి  ప్రయత్నిస్తున్న వారికి స్టార్ ఫ్రూట్ బెస్ట్ ఆప్షన్. తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్‌తో ఉండటం వల్ల స్టార్ ఫ్రూట్ కడుపు నిండిన ఫీల్ ఇవ్వడంలో సహాయపడుతుంది.   అతిగా తినడాన్ని నియంత్రించి బరువు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో  సహాయపడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ పండులో ఉండే సహజ తీపి చక్కెర కలిగిన స్నాక్స్ తినాలనే  కోరిక కూడా తీరుస్తుంది. ఆహారంలో కేలరీలు తగ్గించాలని అనుకునేవారికి మంచిది.                                             *నిశ్శబ్ద.

పిల్లలు కళ్లజోడు పెడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే అవి అవసరం లేదు..!

కళ్లజోడు ఒకప్పుడు వయసైన పెద్దవాళ్లు వాడే పరికరం. అది కూడా పుస్తకాలు చదువుతున్నప్పుడో,  ఏవైనా తీక్షణంగా చూస్తూ పనులు చేస్తున్నప్పుడో మాత్రమే పెట్టుకునేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో  కంటి సమస్యలు లేనివారంటూ లేరు. చాలాశాతం మంది కళ్లజోడు లేకుండా కనిపించరు. దారుణమైన విషయం ఏమిటంటే చిన్నపిల్లలు కూడా కళ్లజోడుతో దర్శనమిస్తుంటారు.  బూతద్దాల్లాంటి కళ్లజోళ్లు పెట్టుకుని పిల్లలు కనిపిస్తుంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అయితే ఈ సమస్యను ఆహారంతో అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.  పిల్లలలో కంటిచూపుకు పదును పెట్టే  ఆహారాలేంటో తెలుసుకుంటే.. క్యారెట్.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్యారెట్ తీసుకోవడం  చాలా మంచిది. ఇది విటమిన్లు,  యాంటీఆక్సిడెంట్లకు నిధిలాంటిది. అంతే కాకుండా పిల్లల మెదడు ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. క్యారెట్లను ఏదో ఒక రూపంలో పిల్లల ఆహారంలో భాగం చేస్తుంటే కొన్నిరోజుల్లోనే కళ్ల జోడు అవసరం లేకుండా పక్కన పెట్టేస్తారు. చిలగడదుంప.. కంటి చూపును మెరుగుపరచడంలో చిలగడదుంప కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ,  సి లోపాన్ని భర్తీ చేస్తుంది.  కళ్ళజోడు వాడే పరిస్థితిని చాలావరకు తగ్గిస్తుంది. పచ్చని ఆకు కూరలు.. చిన్న వయస్సులోనే  పిల్లల కళ్లు బలహీనంగా మారితే ఖచ్చితంగా ఆకు కూరలు, బచ్చలికూర, పాలకూర, తోటకూర,  మెంతి ఆకులు  మొదలైన వాటిని ఆహారంలో పెట్టాలి. ఇవి చాలా పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయి. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌ను పిల్లల ఆహారంలో ఏదో ఒక రూపంలో చేర్చాలి. దీన్ని వెజిటేబుల్‌గా చేసి ఇచ్చినా లేదా సలాడ్‌లో కలుపుకుని  తీసుకున్నా ఆరోగ్యమే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.                                                   *నిశ్శబ్ద.  

రోజూ 4వేల అడుగులు వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

వాకింగ్ ఆరోగ్యానికి చాలామంచిది. ఎలాంటి ఇతర వ్యాయామ పరికరాలు లేకపోయినా వాకింగ్ ను ఎక్కడైనా, ఎవరైనా చేసేయచ్చు. చాలామంది వాకింగ్ ను బరువు తగ్గడానికి శరీరం ఫిట్ గా ఉండటానికి చేస్తారు. అయితే వాకింగ్ చేయడం వల్ల కేవలం ఇవే కాదు.. మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రోజూ 4వేల అడుగులు వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. రోజుకు 4వేల అడుగులు నడవడం వల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది. మెదడు కణాలకు పోషణ అందించేందుకు ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది. ప్రతిరోజూ 4వేల అడుగులు నడవడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అదే విధంగా ఏకాగ్రత మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవారు తరచుగా మతిమరుపుకు లోనవుతున్నవారు రోజూ 4వేల అడుగులు నడుస్తూ ఉంటే మెదడు పనితీరు విషయంలో చాలా మార్పులు ఉంటాయి. మెదడు వాల్యూమ్, కనెక్టీవిటీ మెరుగవుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి సమస్యల తీవ్రతను, అవిరాకుండా ఉండటంలోనూ సహాయపడుతుంది. సాధారణంగా మెదడు పనితీరు బాలేకుంటే అది మూడ్ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ మెదడు పనితీరు బావుంటే మూడ్స్ కూడా సహజంగానే మెరుగ్గా ఉంటాయి. ఒత్తిడి, నిరాశ, ఆందోళ వంటి సమస్యలు తగ్గించడంలో  రోజూ 4వేల అడుగుల నడక  ప్రభావవంతంగా ఉంటుంది. శరీరం ఒక క్రమ పద్దతిలో చలనానికి లోను కావడం వల్ల శరీరానికి కూడా విశ్రాంతి బాగా తీసుకోవడం సాధ్యమవుతుంది. నిద్ర బాగా పడుతుంది. నడక మెదడులో వివిధ ప్రాంతాలను ఏకకాలంలో పనిమీద దృష్టి సారించేలా చేసే మల్టీ టాస్కింగ్ ప్రదేశం. శరీర కదలికలను  గ్రహించడం నుండి శరీరంలో జరిగే కలిగే వివిధ చర్యల వరకు ప్రతి దానికి స్పందిస్తుంది. దీనికి నాడీ కణాలు సహాయపడతాయి. రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల నాడీ కణాలు బలోపేతం అవుతాయి.  వీటికి మెదడుతో ఉన్న కనెక్షన్లు మరింత బలపడతాయి. రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ వంటి న్యూరోకెమికల్స్ ఉత్పత్తిని సులభతరం చేసే హార్మోన్లు మెరుగ్గా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, ఆలోచనను, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.                                *నిశ్శబ్ద.  

గర్భిణీ స్త్రీలు ఈ ఫుడ్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.!

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దీంతో రకరకాల వ్యాధులు ఎటాక్ చేసే ప్రమాదం ఉంటుంది. గర్బిణీలు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. బ్రోకలీ: బ్రోకోలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా ఈ కూరగాయలో విటమిన్ సి, విటమిన్ కె,  పొటాషియం పుష్కలంగా ఉన్నందున, బ్రోకోలీని మీ ఆహారంలో మితంగా చేర్చుకోవడం మంచిది. తృణధాన్యాలు: గర్భిణీల ఆరోగ్యానికి తృణధాన్యాలు చాలా అవసరం. దీనికి ప్రధాన కారణం ఈ పప్పులలో ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో వీటి పాత్ర చాలా పెద్దది. నానబెట్టిన డ్రైఫ్రూట్స్: నానబెట్టిన ఎండు గింజల్లో అనేక రకాల పోషకాలు, వివిధ రకాల విటమిన్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఆమ్ల ఫలాలు: నారింజ, మాంగోస్టీన్, కివీస్, స్ట్రాబెర్రీ,  ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  కాబట్టి అవి గర్భిణీల రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. అరటిపండు: గర్భిణీలు వైద్యుల సలహాతో  అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. దీనికి ప్రధాన కారణం ఈ పండులో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు: గుమ్మడి గింజల్లో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి గర్భిణీలు ఈ విత్తనాలను మితంగా తీసుకోవడం మంచిది. గ్రీన్ టీ: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని గర్భిణీలు రోజుకు ఒకసారి తాగడం మంచిది.