శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!

కొలెస్ట్రాల్ శరీరానికి చాలా అవసరమైన పదార్థం.  కొలెస్ట్రాల్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్,  గుడ్ కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి.  శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.  అలా కాకుండా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఫ్యాటీ లివర్,  గుండె సంబంధ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  ఈ లక్షణాలను బట్టి కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు.. కొలెస్ట్రాల్ అంటే.. కొలెస్ట్రాల్ అనేది శరీరం అనేక ముఖ్యమైన విధులు నిర్వర్తించడానికి సహాయపడే ఒక లిపిడ్.  ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ శరీరానికి ఎంత అవసరమో.. చెడు కొలెస్ట్రాల్ శరీరానికి చేసే చేటు అంతకంటే దారుణంగా  ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు.. కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఛాతీ నొప్పి వస్తుంది. లేకపోతే ఛాతీ భాగంలో  ఒత్తిడి కూడా ఉంటుంది.  ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వైద్యులను కలవడం, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎప్పుడూ అలసటగా అనిపించడం,  శరీరంలో శక్తి లేనట్టు ఉండటం  కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగాయనడానికి సంకేతం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పాదాలు, చీల మండలలో వాపు ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పరచడం వల్ల  ఇలా పాదాలలో వాపులు వస్తాయి. కంటి చూపు మందగించడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ ఉండటాన్ని సూచిస్తుంది. కంటి చూపు మసకగా ఉండటం, దృష్టి విషయంలో తేడాలు ఉండటం మొదలైనవి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చర్మం పై మచ్చలు వస్తాయి.  చర్మం పై మచ్చలు ఏర్పడుతుంటే వైద్యులను సంప్రదించాలి.                                                   *రూపశ్రీ.

ఈ ఐదు రకాల సమస్యలున్న వారు జీడిపప్పు తినకూడదట..!

జీడిపప్పు చాలామంది ఎక్కువగా తినే డ్రై నట్.  జీడిపప్పును స్వీట్స్ లోనూ,  వంటల్లోనూ, తీపి, కారం అనే తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ఉపయోగిస్తుంటారు.  వీటిని బేక్ చేసి లేదా వేయించి స్నాక్స్ గా తినేవారు కూడా ఉంటారు.  అయితే జీడిపప్పును అందరూ  తినడం ఆరోగ్యమేనా అంటే లేదు అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల వ్యక్తులు జీడిపప్పు తినకూడదట.  ఇంతకీ వీటిని ఎవరు తినకూడదో తెలుసుకుంటే.. జీడిపప్పులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.  వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నా సరే.. ఇప్పటికే శరీరంలో అధిక కొలెస్ట్రాల్  సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు జీడిపప్పును తినకూడదు.  ఇది కొలెస్ట్రాల్ సమస్యను మరింత పెంచుతుంది. ఈ కాలంలో మైగ్రేన్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారు జీడిపప్పును అస్సలు తినకూడదు. జీడిపప్పు తింటే మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది. గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం.. కొందరికి గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడుతుంటాయి.  ఇలాంటి వారు జీడిపప్పు తినకుండా ఉండటం మంచిది.  లేదంటే గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది. జీడిపప్పులో సోడియం అధికంగా ఉంటుంది.  ఈ కారణంగా అధిక రక్తపోటు లేదా హై బీపీ ఉన్నవారు జీడిపప్పును తినకూడదు. ఇవి తింటే హై బీపీ సమస్య మరింత పెరుగుతుంది. కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా జీడిపప్పును తినకుండా ఉండటమే మంచిది.  జీడిపప్పులో ఉండే సమ్మేళనాలు  కిడ్నీ సమస్యలను మరింత పెంచుతాయి. పొట్ట సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అలాంటి వారు జీడిపప్పు తినకపోవడం మంచిది.  పొట్ట సంబంధ సమస్యలున్న వారికి జీడిపప్పు సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.                                              *రూపశ్రీ.

చిన్నవయసులోనే జుట్టు బాగా రాలిపోతోందా? పోషకాలు లోపించినట్టే..!

   జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. యువత కూడా దీని బారిన పడుతున్నారు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా జుట్టు బలహీనత,  జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.  కుటుంబంలో ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారికి జన్యుపరంగా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, జీవనశైలి,  ఆహారానికి సంబంధించిన సమస్యలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతాయి. ముఖ్యంగా కొన్ని పోషకాలు లోపిస్తే జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. పోషకాలు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్-డి,  విటమిన్-బి7 లేదా బయోటిన్, విటమిన్-ఇ,  విటమిన్-ఎ వంటి పోషకాలు జుట్టుకు సమతుల ఆహారంగా పనిచేస్తాయి. వీటి లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు బాగా రాలిపోయి బట్టతల కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టు వేగంగా రాలుతున్నా, జుట్టు బాగా రాలిపోతున్నా ఆహారంలో పోషకాలను తనిఖీ చేసుకోవాలి.  దీని వల్ల జుట్టు రాలడానికి ఏం చేయాలి? ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఏం తినాలి అనే విషయాల మీద అవగాహన పెరుగుతుంది. బయోటిన్ లోపిస్తే.. బయోటిన్ లేదా విటమిన్-బి7 లోపిస్తే జుట్టు, చర్మం, గోళ్లకు చాలా నష్టం కలుగుతుంది.  జుట్టు, చర్మం, గోళ్ళ ఆరోగ్యానికి బయోటిన్ అవసరం.  బయోటిన్ కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.  ఇది జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి అవసరం. అలాగే బయోటిన్ లోపిస్తే వెంట్రుకలు పల్చబడటం,  చిట్లడం కూడా జరుగుతుంది.   తరచుగా మహిళలు గర్భం దాల్చడం,  కొన్ని రకాల మందులు ఉపయోగించడం,  కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బయోటిన్ పుష్కలంగా ఉన్న ఆహారం, లేదా బయోటిన్ విటమిన్-ఎ లోపిస్తే.. జుట్టు గ్రంధులలో సెబమ్ ఉత్పత్తిని పెంచడంలో విటమిన్-ఎ సహాయపడుతుంది.  ఇది జుట్టును,  స్కాల్ప్ ను తేమగా ఉంచడానికి అవసరం అవుతుంది.  విటమిన్-ఎ లోపం ఉన్నవారిలో జుట్టు పొడిబారడం వల్ల జుట్టు బలహీనపడి జుట్టు రాలడం జరుగుతుంది.  అయినప్పటికీ విటమిన్-ఎ లోపం అధికంగా ఉండటం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది.  మరొక విషయం ఏమిటంటే విటమిన్-ఎ శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నా జుట్టు రాలడం జరుగుతుంది.  కాబట్టి విటమిన్-ఎ సరైన మోతాదులో తీసుకోవాలి.  

తామర పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా? దీంతో ఎన్ని లాభాలంటే..!

టీ అనేది భారతీయులకు పెద్ద ఎమోషన్. ఉదయం చాయ్ తో మొదలయ్యే పనులు పూర్తయ్యే వరకు మద్య మద్యలో చాయ్ పడుతూనే ఉండాలి చాలామందికి.  చాయ్ తాగితే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కొందరికి. మరికొందరు ఆఫీసులలోనూ,  పనులలోనూ బ్రేక్ తీసుకోవడానికే చాయ్ ని సాకుగా చూపెడుతుంటారు. టీ అంటే టీ డికాక్షన్,  పాలు, పంచదార మాత్రమే కాదు. కొన్ని చోట్ల బ్లాక్ టీ తాగుతారు. మరికొన్ని చోట్ల గ్రీన్ టీ తాగుతారు. కానీ లోటస్ ప్లవర్ టీ గురించి తెలిసినవారు తక్కువ.  తామర పువ్వుల టీ చాలా చర్చగా మారింది.  ఈ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటో తెలుసుకుంటే.. తామర పువ్వుల టీ రుచిగా ఉండటం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ తామర పువ్వుల టీ తాగుతుంటే చాలా అద్బుత ప్రయోజనాలు ఉంటాయి. మొదట దీన్నెలా చేయాలంటే.. తామర పువ్వుల టీ తయారుచేయడం చాలా సులభం.  ఒక గిన్నెలో గ్లాసు నీరు పోయాలి.  ఈ నీటిని మరిగించాలి.  ఈ నీటిలో ఎండిన లేదా తాజా తామర పువ్వులు వేసి మూత పెట్టి  కొన్ని నిమిషాలు ఉడికించాలి.  ఆ తరువాత స్టౌవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన ఉంచాలి.   తామర పువ్వులు ఉడికిన నీరు చల్లారిన తరువాత దాన్ని స్టైయినర్ తో ఫిల్టర్ చేయాలి.  ఈ నీటిలో కొద్దిగా కెమికల్స్ లేని, స్వచ్చమైన రోజ్ వాటర్ జోడించవచ్చు.  ఇందులో రుచి కోసం కాసింత తేనె కూడా కలుపుకోవచ్చు. అంతే తామర పువ్వుల టీ తాగడానికి సిద్దమైనట్టే. ప్రయోజనాలేంటంటే.. తామర పువ్వులలో  అపోమోర్పిన్, న్యూసిఫెరిన్ వంటి పోషకాలు ఉంటాయి.  ఇవి ఒత్తిడి, నిరాశ,   ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. తామర పువ్వుల టీ తీసుకుంటే కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధ సమస్యలు, వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మహిళలు తమ పీరియడ్స్ సమయంలో తామర పువ్వుల టీని రోజుకు ఒకటి నుంి రెండు కప్పుల వరకు తీసుకుంటే నెలసరి అసౌకర్యాల నుండి ఉపశమనం ఉంటుంది.                                             *రూపశ్రీ.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా..

పేదవాడి యాపిల్ గా పిలుకునే జామపండులో చాలా పోషకాలు ఉంటాయి. కేవలం పేదవాడి యాపిల్ అని పిలుపులోనే కాదు, యాపిల్ తో సరితూగే పోషకాలు కూడా జామపండులో ఉంటాయి. బాగా ఆకలిగా అనిపించినప్పుడు ఒక్క జామ పండు తింటే చాలాసేపు ఆకలి అనే పదం మరచిపోతారు. అయితే ఎప్పుడూ జామ పండ్ల గురించేనా జామ ఆకుల గురించి తెలుసుకోవద్దా.. కాయలు లేకపోయినా సరే చెట్టుకు ఆకులైతే ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున జామ ఆకులను తింటే అద్బుతమైన ప్రయోజనాలుంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను తింటే జీర్ణసంబంధ సమస్యలు అన్నీ చిటికె వేసినట్టు మాయం అవుతాయి. జీర్ణాశయాన్ని శుద్ది చేయడంల, జీర్ణక్రియ పనితీరు మెరుగుపరచడంలో జామ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. జామ ఆకులలో ఫైబర్ చాలా ఉంటుంది. వీటిని ఉదయాన్నే నమిలి తింటే అద్బుతం జరుగుతుంది.  కాంప్లెక్స్ స్టార్స్ను చక్కెరగా మార్చడాన్ని జామఆకులు నిరోధిస్తాయి. ఈ కారణంగా ఇవి శరీరంలో అదనపు చక్కెరలు, అదనపు కొవ్వుల నిల్వను అరికడుతుంది. దీని ఫలితంగా అధికబరువు ఉన్నవారు బరువు తగ్గడానికి జామ ఆకులు తోడ్పడతాయి. ఉదయాన్నే జామ ఆకులు నమిలి తినడం లేదా జామ ఆకులతో టీ తయారుచేసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా నెలరోజుల పాటు చేస్తే శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలలో అతిసారం ఒకటి. అతిసారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.  ఒక గ్లాసు నీటిలో ఒక గుప్పెడు జామ ఆకులు వేసి బాగా మరిగించాలి.  ఈ ద్రావణాన్ని రోజులో రెండుసార్లు కొద్దికొద్దిగా తాగాలి.  ఇలా చేస్తే లూజ్ మోషన్స్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మధుమేహం ఉన్నవారికి జామకాయలు చాలామంచివి అనే మాట వినే ఉంటాం.  అయితే జామఆకులు కూడా చాలామంచివి. జామఆకులు శరీరంలోని సుక్రోజ, మాల్టోస్ శోషణను నిరోధిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 10నుండి 12వారాలపాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ ఇత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జామ ఆకులను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే ఇమ్యునిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలను చాలా సులువుగా అధిగమించేలా  రోగనిరోధకశక్తి పెంచుతుంది. జామఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకులను బాగా కడిగి, మిక్సీ పట్టి పేస్ట్ చెయ్యాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఉదయాన్నే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకులు నమలడం వల్ల కొద్దిరోజులలోనే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోవడానికి కూడా జామ ఆకులను ఉపయోగించవచ్చు. జామ ఆకులను పేస్ట్ చేసి ముఖం మీద మొటిమలు, మచ్చలు ఉన్నచోట రాయాలి. దీనివల్ల మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి.                                                              *నిశ్శబ్ద.

నాడీపతి లో ప్రత్యామ్నాయ చికిత్సలు...

కప్పింగ్ తెరఫీ... కప్పింగ్ తెరఫీ యునానిలో అత్యంత పురాతన మైనదని అంటారు. ముఖ్యంగా శరీరంలో వచ్చే నొప్పులు. ముఖ్యంగా వీపు, వెన్ను నొప్పులు, కండరాలు,నరాల లో వచ్చేనోప్పులు లేదా వాపులు రక్తప్రసారం లేనందువల్ల,ఊపిరి తిత్తుల్లో  తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్య దీర్హకాలంగా ఉండే  సమస్యలకు కప్పింగ్ తెరఫీ ఒకచికిత్చ సులభమైన ప్రాత్యామ్నాయ చికిత్చ గా పేర్కొన్నారు. కుప్పింగ్ తెరఫీ విధానం... శరీరంలో పీల్చేసామర్ధ్యం ఉన్న రకరకాల కప్పింగ్ పద్దతులను వాడుతూ ఉంటారు. నాడీ పతిలో చాలా రకాల ఎలిమెంట్స్ వాడుతూ ఉంటారు.మననమ్మకం ప్రకారం కప్పింగ్ తెరఫీ ద్వారా రక్తప్రవాహం పెంచడం ఇతర సమస్యల నివారణకు దోహదం చేస్తుంది. కప్పింగ్ తెరఫీ వల్ల లాభాలు... నెప్పి నివారణ ను ఉపసమనం కలిగించడం. శరీర భాగాలలో మనకి కనపడని కండరాలు ఇతర కణాలు, మనకదలికలకు సహకరించే మెత్తటి కణజాలం శరీరంలో ఒక్కోసారి కదలకుండా ఉండిపోతాయి. ఒక్కోసారి ఊపిరితిత్తులు లేదా చెస్ట్ లో తీవ్రమైన నొప్పి కదలిక లేకపోవడం వంటి సమస్యలు లింఫ్ ద్వారా విడుదల అయ్యే ఫ్లూయిడ్స్ ను శుద్ధిచేయడం రక్తప్రశ్రారం చేస్తాయి. వీటికి శరీరం ద్వారా వ్యర్ధ పదార్ధాల బయటికి తరలించడం.ఒక్కోసందర్భం లో మీనరాలను మత్తుగా తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది.కప్పింగ్ పద్దతిద్వారా శరీరంలో కి శక్తి ని పంపించడం ద్వారా అవిసరిగా పనిచేసే విధంగా కప్పింగ్ పద్ధతి ఉపయోగ పడుతుందని ముఖ్యంగా వెన్నుపూసలో ఊపిరితిత్తులలో పేరుకు పోయిన ఫ్లూయిడ్స్ ను బయటికి తీసేందుకు కప్పింగ్ పద్ధతి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సీడ్ తెరఫీ... నాడీ పతి చికిత్చాలలో సీడ్ తెరఫీ ని నిత్యం వినియోగిస్తూ ఉంటారు. శరీరం పై సీడ్ తెరఫీ ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.సీడ్ తెరఫీ ద్వారా నరాలలో రక్త ప్రసారం పెంచడం శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడం సీడ్ తెరఫీ దోహదం చేస్తుంది.ముఖ్యంగా నాడీ పతిలో దీర్ఘకాలిక డయాబెటీస్ కు రోగులకు ద్రాక్ష విత్తనాన్ని వినియోగిస్తారు. ఇక సంజోక్ తెరఫీ లోను ప్రతి అవయవానికి ఒక్కో పండు,కూర గాయల  విత్తనం వాడడం  గమనించ వచ్చు.శరీరం లో ఉన్న రేఫ్లేక్స్ పాయింట్స్ లేదా సుజోక్ పాయింట్స్ పై విత్తనాలను పేస్తే చేసి విజయం సాధించినట్లు తెలిపారు.ఉదాహరణకు వాల్ నట్స్ అది మన మెదడు ఆకారాన్ని పోలిఉండడం వల్ల అది మన మెదడులో ఉన్న వివిదరకాల సమస్యలకు ఉపయోగ పడతాయి.మా పరిశోదన లో వివిదరకాల విత్తనాల ను వాడడం ద్వారా ఉపయోగం ఉండగలదని నిపుణులు పేర్కొన్నారు. రాజ్మా విత్తనాలు... కిడ్నీ,పొట్ట సమస్యలకు వాడవచ్చు. వెన్నునొప్పి-కీళ్ళ నొప్పులు  కంటికి సంబందించిన సమస్యలకు.. బ్లాక్ పెప్పర్-నల్ల మిరియాల విత్తనాలు. డయాబెటీస్ కు-ద్రాక్ష,గోధుమ విత్తనాలు,పెసలు విత్తనాలు. వినికిడి సమస్యకు-పెసలు విత్తనాలు. అన్నిరకాల విత్తనాల వాడకం ద్వారా శక్తిని పెంచవచ్చు.తద్వారా శక్తివంతమైనవిగా భావించవచ్చు.             

బ్లడ్‌ గ్రూప్‌ బట్టి గుండెపోటు!

  వినడానికి చిత్రంగా ఉంది కదా. కానీ లక్షలమందిని పరిశీలించిన తరువాతే ఈ మాట చెబుతున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. నెదర్లాండ్స్‌కు చెందిన టెస్సా అనే పరిశోధకురాలు తేల్చిన ఈ వివరం ఇప్పుడు వైద్యలోకంలో సంచలనం సృష్టిస్తోంది.   గుండెజబ్బులకీ బ్లడ్‌గ్రూపుకీ ఏ మేరకు సంబంధం ఉందో తెలుసుకునేందుకు ఏకంగా పదమూడు లక్షలమందిని పరిశీలించారు. ఇందులో myocardial infarction, coronary artery disease, ischaemic heart disease, heart failure వంటి గుండె సమస్యలు ఉన్నవారిని బ్లడ్‌ గ్రూప్ ఆధారంగా విభజించారు. వీరిలో O గ్రూప్ రక్తం ఉన్నవారితో పోలిస్తే ఇతర బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారిలో గుండె సమస్యలు దాదాపు 9 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.   O గ్రూప్ రక్తం వారికీ, ఇతరులకీ మధ్య ఇంత వ్యత్యాసం ఉందన్న విషయం మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు కారణాలని ఊహిస్తున్నారు.   - O గ్రూప్ కాని వ్యక్తులలో von Willebrand అనే ప్రొటీన్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందట. ఈ ప్రొటీను వల్ల రక్తం త్వరగా గడ్డకడుతుంది. ఏదన్నా గాయం అయినప్పుడు ఇలా రక్తం గడ్డకట్టడం మంచిదే అయినా... కొన్ని సందర్భాలలో అది గుండెపోటుకి దారితీసే ప్రమాదం ఉంది.   - A గ్రూప్‌ రక్తంవారిలో ఉండే కొన్ని జన్యువుల వల్ల, వారిలో కొలెస్టరాల్‌ పేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలా కొలెస్టరాల్‌ పేరుకోవడం వల్ల గుండె ధమనులు పూడుకుపోతాయన్న విషయం తెలిసిందే కదా!   - O గ్రూపు కాని వ్యక్తులలో galectin-3 అనే ప్రొటీన్‌ ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీర భాగాలలో వాపుని (inflammation) నియంత్రిస్తుంది. ఈ ప్రొటీన్‌ కారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో సమస్యల మరింత తీవ్రతరమైపోతుందట.   మొత్తానికి O గ్రూప్ వారితో పోలిస్తే ఇతరులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు. ఇక మీదట వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగులకి చికిత్స చేసేటప్పుడు వారి బ్లడ్‌ గ్రూప్‌ని దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. - నిర్జర.

మనిషికి పొటాషియం పెరిగితే ఏమవుతుంది?

పొటాషియం మన శరీరానికి అత్యవసరమైన అల్కలైట్ అదే సోడియం పొటాషియం  ఎలక్ట్రో లైట్స్ ఎక్కువైనా ఇబ్బందే తక్కువైనా ఇబ్బందే అని అంటున్నారు నిపుణులు.ఒక కేస్ స్టడీ లో శరీరం లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఒక్కో సారి పొటాషియం ఎక్కువైతే పాక్షవాతం,లేదా గుండె పోటు కు కూడా దారి తీయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక కేసును కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎన్ పాపారావు మాట్లాడుతూ ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడని కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడని అసలు కాలు కదపడం లేదంటే ఏదైనా న్యూరో సమస్య ఉండి ఉండవచ్చని భావించి ఎం అర్ ఐ స్పైన్ బ్రెయిన్ స్కాన్  పరీక్షలు  చేయించా మని అక్కడ ఏ రకమైన సమస్య బయట పడలేదని అయితే  ఇక మిగిలింది రక్త పరీక్ష చేయించగా రక్తం లో పొటాషియం శాతం ఎక్కువగా ఉందని గమనించి నట్లు డాక్టర్ పాపారావు వివరించారు.   ముఖ్యంగా పొటాషియం పెరగడాన్ని వైద్యులు హైపెర్ కలేమియా గా నిర్ధారించా మని తెలిపారు.కాగా పొటాషియం లెవెల్స్ రక్త్గం లో  పెరగడం వల్ల అది కార్డియో వాస్క్యులర్ అంటే గుండె రక్తనాళా లలో సమస్యలు వస్తాయని డాక్టర్ పాపారావుపేర్కొన్నారు.ఒక్కో సారి పొటాషియం ప్రతి వ్యక్తికి 4,7౦౦ ఎం  జి తీసుకోవాల్సి ఉంటుందని పాపారావు వివరించారు.ప్రతి గంటకు పొటాషియం శాతం మానీటర్ చేస్తూ పొటాషియం పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలు రాకుండా నిత్యం నిపుణులైన విద్యుల పర్య వేక్షణలో ఉండాలని సూచించారు.పొటాషియం పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్ యుర్ కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారుహై పర్ కేల్మియా వల్ల కిడ్నీ పనుచేయదని కిడ్నీ సరిగా పనిచేయకుంటే శరీరం నుండి పొటాషియం తొలగించలేదని అన్నారు కాగా హైపర్ కెల్మియా చాలా సహజమైన సమస్య అని అన్నారు వాస్తవానికి కిడ్నీ పొటాషియం ను నియంత్రిస్తుంది.అలాగే శరీరాన్ని పొటాషియం ను సమతౌ లయం గా ఉంచుతుంది. కిడ్నీ సరిగా పనిచేయానట్లితే అదనపు పొటాషియం ఫిల్టర్ చేయాలేదు.రక్తం లో చేరిన పొటాషియం తొలగించలేదు.కిడ్నీ లోని ఆల్టో స్టేరాన్ ఎప్పుడు పొటాషియం ను తొలగించాలో చెబుతుంది.ఒక వేళ ఆల్టో స్టేరాన్ ఉత్పత్తి తగ్గితే అడిసన్స్, వ్యాధి సోకే అవకాశం ఉందని.అది హైపర్ కేల్మియా కు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేసారు. హైపెర్ కీల్మియా సమస్యలు... *రక్త కణాలు పనిచేయకుండా పోవడం.హేమోలసిస్.అని అంటారు. *కండరాలు కణాలు రబ్బో మయోసిస్ వంటి సమస్య వస్తుంది. *కాళ్ళలో మంటలు కణాలు ప్రమాదం బారిన పడతాయి. *డయాబెటీస్ నియంత్రణ సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నారు.        రక్తనాళా లలో పొటాషియం శాతం పెరిగితే మూత్ర నాళం ద్వారా బయటికి పోతుందని అయితే పొటాషియం పెరగడం వల్ల అలసట నాజియా గుండె హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా పొటాషియం వల్ల కండరాలలో నొప్పులు అలాగే పాక్షవాతానికి దారి తీస్తుందని డాక్టర్ పాపారావు వెల్లడించారు.కాగా కాళ్ళు వేళ్ళు స్పర్స కోల్పోవడం,పొట్టలో పట్టి నట్లు గా ఉండడం.విరేచనాలు,కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలేత్తుతాయాని పొటాషియం సమస్యను సకాలం లో గుర్తించ కుంటే రోగులు కోమాలోకి చేరతారని ఈ విషయాన్ని పూర్తిగా గమనించాలని తగిన విధమైన చికిత్స సకాలం లో అందిస్తే రోగిని తీవ్రత నుండి కాపాడ వచ్చని డాక్టర్ పాపారావు స్పష్టం చేసారు. ఆహారం లో పొటాషియం తగ్గడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపారు.ఒక్కో సారి కిడ్నీద్వారా ఫిల్టర్ కావాల్సిన రక్తం  పనిచేయకుంటే డయాలసిస్ చేయాల్సి ఉంటుందని. నిపుణులు పేర్కొన్నారుఅదనంగా వచ్చి చేరిన పొటాషియం తగ్గించాలంటే .పొటాషియం బైన్ డర్స్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.లేదా బీటా బ్లాకర్స్ వాడాల్సి ఉంటుంది. శరీరానికి కావాల్సిన పొటాషియంఅంటే సమతౌల్యం గా ఉండాలంటే. అవకాడో, టమాటా, ఆలు, కొత్తిమీర,పాలకూర కివి పళ్ళు,అరటి పళ్ళు,వంటివి మన శరీరంలో పొటాషియం  ను సమతౌల్యం లో ఉంచుతాయి.                                           

పసుపు పాలు ఎవరు ఎలా తాగాలి? ఎలా తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయంటే..

పసుపు పాలు రోజూ తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది సహజ యాంటీబయాటిక్గా పరిగణించబడుతుంది. అయితే కాల్షియం, ప్రోటీన్ తో సహా  అనేక విటమిన్లు పాలలో ఉంటాయి. పసిపిల్లల నుండి వృద్దుల వరకు పాలు తాగడం ఎంతో అవసరమని వైద్యులు ఎన్నో ఏళ్ళ నుండి చెబుతూనే ఉన్నారు. ఇలా ఔషద గుణం కలిసిన పసుపు, ఆరోగ్యం చేకూర్చే పాలు రెండింటిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి డబుల్ ప్రయోజనాలు పొందవచ్చని సాధారణంగా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకం ఉంది. అది నిజం కూడా.. కానీ రోజూ  రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఇమ్యూనిటి మాత్రమే కాదు ఇంకా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుండే రాత్రి పూట పసుపుపాలు తాగడం మొదలెట్టేస్తారు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలను ఎలా తయారుచేసుకోవాలో.. పసుపుపాలు కేవలం ఇమ్యూనిటికే కాకుండా ఇంకా ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుంటే.. రాత్రిపూట నిద్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగాలని కొందరు సలహా ఇస్తారు.  ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పసుపు పాలు తాగాలి. ఇది  బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.  పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పూట పసుపు పాలు తాగడం  ద్వారా దగ్గు, జలుబు , జ్వరం వంటి సమస్యలు  నివారించవచ్చు. బోలెడు వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  సీజన్ ఏదైనా  తప్పనిసరిగా పసుపు పాలు తాగడం మంచిది. పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి పసుపు పాలు దివ్యౌషధం. ఇది వాపు,  నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పసుపు పాలు తాగుతుంటే కీళ్ళు, ఎముకల సమస్యలు మెల్లిగా తగ్గుతాయి. పసుపును వందల ఏళ్ళ నుండి  చర్మ సంరక్షణలో  ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల  చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలు ఎలా తాగాలంటే.. సాధారణంగా ఇమ్యునిటీ కోసం తాగాలని అనుకుంటే ముందుగా పాలు మరిగించాలి. రుచికి చిటికెడు పసుపు, పంచదార లేదా బెల్లం  జోడించాలి. అసలు తీపి జోడించకపోయినా పర్లేదు. పడుకునే ముందు వేడిగా లేదా గోరువెచ్చగా తాగాలి.  మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పసుపు పాలలో  చిటికెడు జాజికాయ కూడా  కలిపి తాగవచ్చు. ఇది చక్కగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు  పసుపు పాలు తయారుచేసేటప్పుడు  కొన్ని జీడిపప్పులను కూడా కలుపుకోవచ్చు. లేదంటే జీడిపప్పు పొడిగా చేసి పాలు మరిగేటప్పుడు కొద్దగా జోడించవచ్చు. పసుపు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి మరిగించి తాగితే   గొంతు నొప్పి,  ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయి.                                                *నిశ్శబ్ద.

షుగర్ వ్యాధిగ్రస్తులకు గుమ్మడి గింజల మేలు తెలుసా...

గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?  పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ, ఈ చిన్న గింజల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు చాలా పెద్దవి. సాధారణంగా మనమందరం గుమ్మడికాయను సాంబారుకు వాడేటపుడు గింజలను పక్కన పెట్టి చెత్తబుట్టలో వేస్తాం! కానీ గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్లు, ప్రొటిన్లు, మినరల్స్ గురించి తెలుస్తే...గింజలను తప్పకుండా డైట్ లో చేర్చుకుంటారు. ముఖ్యంగా మధుమేహవ్యాధిగ్రస్తులు, అధిక బీపీతో బాధపడేవారికి గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి.  గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం... అధిక బీపీ:   ఈ రోజుల్లో, రక్తపోటు వ్యాధి సాధారణంగా 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా శరీరంలోని ప్రధాన అవయవాలు ప్రభావితమవుతాయి. అన్నింటికీ మించి, గుండె కొట్టుకునే పని సామర్థ్యంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. కాలేయం ప్రభావం చూపుతుంది. రక్తపోటు వల్ల మన శరీరంలోని కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు డాక్టర్ సూచించిన మాత్రలు వేసుకోవడంతో పాటు గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రక్తపోటు అదుపులో ఉంటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. మధుమేహం ఉన్నవారికి: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి! డయాబెటిస్‌తో బాధపడుతున్న చాలా మందికి భోజనం లేదా అల్పాహారం తర్వాత అకస్మాత్తుగా చక్కెర స్థాయి పెరగడం సమస్యగా మారుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుమ్మడి గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఈ చిన్న గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన మూలకాలు మనం తినే ఆహారంలో చక్కెర కంటెంట్, అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లను ప్రాసెస్ చేస్తాయి. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండెకు మంచిది: ఈ చిన్న గింజల్లో వెజిటబుల్ ప్రొటీన్, మెగ్నీషియం, జింక్,  ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా శరీర రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఈ కారకాలన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా, గుమ్మడికాయ గింజల్లో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉన్నందున, ఇది హృదయ స్పందన పనితీరుతో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారిస్తుంది. గుమ్మడికాయ గింజలను ఎలా తినాలి? వేయించిన గుమ్మడి గింజలను తినడం నిజంగా ఆరోగ్యకరమైనది. అయితే దీనికి ఉప్పును కలపకూడదు. ఎందుకంటే ఉప్పు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు సాయంత్రం స్నాక్స్ సమయంలో కొన్ని వేయించిన గుమ్మడి గింజలను తినడం అలవాటు చేసుకుంటే, అది చాలా మంచిది

విటమిన్ బి 12 క్యాన్సర్ ముప్పు?

విటమిన్ బి 12 అధికంగా వాడడం వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. 1 )విటమిన్ బి సహజంగా జంతువుల ఉత్పత్తుల నుండే లభిస్తుంది. ఎవరైతే సప్లిమెంత్స్ వాడుతున్నారో వారికి ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఇది మనం కళ్ళు తెరవాల్సిన విషయం శాస్త్రజ్ఞులు 7౦,౦౦౦ మంది పై చేసిన పరిశోదనలో విటమినలో విటమిన్ బి వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. 2)విటమిన్ బి గురించి చేసిన పరిశోదన ఏం చెపుతోంది? విటమిన్ బి పై చేసిన పరిశోదన క్లినికల్ ఆంకాలజీ లో ప్రచురించారు.విటమిన్ బి6 విటమిన్12 సప్లిమెంట్ ను వాడడం.మల్టి విటమిన్ ౩౦% నుండి 4౦%ఊపిరి తిత్తుల క్యాన్సర్ పురుషులకు వస్తుందని.బి6 బి12 వాడకం ఫోలేట్ లంగ్ క్యాన్సర్ రిస్క్ స్త్రీలలో ఉంటుందని అంటున్నారు. ౩) 2౦2౦ లో    లంగ్ క్యాన్సర్ 2 మిలియన్ల ప్రజల ప్రాణాలను హరించింది... ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం 2౦2౦ లో 2 మిలియన్ల ప్రజలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో మరణించారని. గణాంకాలు వెల్లడించింది.ఆ సంవత్సరం లో క్యాన్సర్ తో మరణించిన వారి సాంఖ్య అధికంగా ఉందని అదే సంవత్సరం లో 2.21 మిలియన్లు గా ఉందని అది బ్రస్ట్ క్యాన్సర్ తో మరణించారని.భారత్ లో లంగ్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువే అని 59% అన్నిరకాల క్యాన్సర్స్ కాగా 8.1%క్యాన్సర్ మరణాలు జరిగాయని ఇది ఆందోళన కరమని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది. 4)విటమిన్B1 ఎంత కావాలి? శరీరానికి విటమిన్ బి1ఎంత మోతాదులో వాడాలి అన్నది మరో ప్రశ్న. విటమిన్ బి1- 1.5 ఎం జి. విటమిన్ బి2 -1.7 ఎం జి వాడాలని సూచించారు. 5)గుర్తుంచుకోవాల్సిన అంశాలు... పరిశోదనలో పాల్గొన్న చాలామంది యు ఎస్ సూచించిన దానికన్నా విటమిన్ బి1 అధికంగా వాడారని. విటమున్ బి12 వాడిన వారిలో డి ఎన్ ఏ యు ఎస్ లో మార్పులు జీన్స్ లో మార్పులు నిలకడగా లేవని కార్సినో జనసిస్ నిలకడగా లేకపోవడాన్ని గమనించినట్లు గమనించా మని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ముఖ్యంగా పొగ తాగే వాళ్ళు,విటమిన్ బి ,విటమున్ బి12 వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్  పెరుగుతుందని పరిశోదనలో వెల్లడించారు. 

కడుపు ఉబ్బరానికి అసలు కారణాలు ఇవే...

ఈకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది జీర్ణానికి సంబంధించినదే ఎక్కువ. చాలామంది తమకు తిన్న ఆహారం జీర్ణం కావడం లేదని, కడుపు ఉబ్బరంగా ఉంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది?? ఇలాంటి సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి విషయాలు తెలుసుకుంటే ఈ సమస్యను అధిగమించడం పెద్ద సమస్య ఏమి కాదు.  మొదటగా కడుపు ఉబ్బరం సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. కడుపు ఉబ్బరం రావడానికి గల కారణాలు:-  మలబద్దకం సాధారణంగా మలబద్దకం సమస్య ఉన్నవారిలో కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలు ఎక్కువ. మలవిసర్జన అనేది సరిగా జరగకపోతే అది కడుపులో పేగుల మధ్య గట్టిగా మారిపోయి జీర్ణవ్యవస్థను గందరగోళం చేస్తుంది. తిన్న ఆహారం తింటూనే ఉంటే ఒకవైపు మలవిసర్జన కూడా దానికి తగ్గట్టు జరిగిపోతుండాలి. లేకపోతే కడుపులో వాయువులు, వ్యర్థాలు పెరిగి అది ఉబ్బరానికి దారితీస్తుంది. వేగంగా తినేవారికి ఆహారాన్ని మెల్లగా బాగా నమిలి తినాలి. అలా చేస్తే ఆహారం చాలావరకు పిండి పదార్థంగా మారి జీర్ణశయంలోకి వెళుతుంది. అప్పుడు జీర్ణ రసాలు తగినంత ఉత్పత్తి అయ్యి ఎంతో సులువుగా జీర్ణక్రియ జరుగుతుంది. కానీ చాలామంది పరిగెత్తాలనే తొందర ఉన్నట్టు వేగంగా తింటారు. దీనివల్ల ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు సరైన విధంగా జీర్ణక్రియకు అనువుగా ఉండవు. ఫలితంగా కడుపు ఉబ్బరం చోటుచేసుకుంటుంది. దంత సమస్యలు ఉన్నవారిలో దంతాల సమస్యకు కడుపు ఉబ్బరానికి సంబంధం ఏమిటి అని చాలా మంది అనుకుంటారు. అయితే దంతాల సమస్య ఉన్నవారిలో  రక్తం కారుతూ ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. ఇలా దంతాల వద్ద రక్తం కారడం జరిగినప్పుడు సహజంగా  తినే పదార్థాలతో, తాగే ద్రవాలతో కలసి జీర్ణశయం చేరుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. ఆహార వేళలు ఆహారం తీసుకోవడమే కాదు, ఆహార వేళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అస్తవ్యస్తమైన ఆహార వేళలు పాటించడం వల్ల జీర్ణశయం తీరు సరిగా ఉండదు. ఈ కారణం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. నోటి శుభ్రత జీర్ణాశయనికి సంబంధించి ఏ సమస్యకు అయినా ఎక్కువ శాతం నోటి శుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. నోరు సరిగా శుభ్రం చేసుకోకుండా తినడం, తాగడం చేస్తే నోటిలో ఏర్పడ్డ బాక్టీరియా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.  పై కారణాల వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం పరిష్కారానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారం జీర్ణం అవడంలో ఎలాంటి సమస్యా ఉండదు.  కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తున్నప్పుడు గ్లాసుడు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. రోజులో రెండు నుండి మూడు సార్లు ఇలా చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది.  దంతాల సమస్యలు ఉన్నవారిలో ఆహారం నమలడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగేస్తుంటారు. కాబట్టి ఆ సమస్యలకు వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. నోటి శుభ్రత లేకుండా ఆహారం తీసుకోకూడదు. పండ్లు, భోజనం, బేకరీ పదార్థాలు అన్ని కలిపి ఒక్కసారి తీసుకోకూడదు. కొన్ని పదార్థాలు చాలా సులాభంగానూ, మరికొన్ని అలస్యంగానూ జీర్ణమయ్యే వాటిని కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది.  కడుపు ఉబ్బరానికి పైన చెప్పుకున్న జాగ్రత్తసలు పాటించినా సమస్య  తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.                                      ◆నిశ్శబ్ద.

అలసట,ఒళ్ళు నొప్పులు నివారణ!!

  శరీరం లో స్వల్పకాలిక, దీర్ఘ కాలిక ఒళ్ళు నొప్పులకు, అలసటకు అందుబాటులో ఉన్న ఇంటి చికిత్స మేలైనదని నిపుణులు చేసిన పరిశోదనలో వెల్లడించారు. శరీరంలో ప్రతి రోజూ నొప్పి వస్తుంది. అలసట మిమ్మల్ని  వేదిస్తుంటే వెంటనే సహజంగా ఇంట్లో లభించే నివారణా మార్గాలు ఉన్నాయని నిపుణులు నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు.యూరిక్ యాసిడ్ లేదా పోషక ఆహార లోపాలు ఉండవచ్చు. ఆయా సందర్భాలాలో కండరాల్ నొప్పులు అలసట వంటి సమస్యలు సహజంగానే ఉన్నట్లు చెబుతూ ఉంటారు. అయితే ఒంటి నొప్పుల నుండి ఉపసమనం కోసం వాడే మందులు తాత్కాలికంగా ఉపసమనం మాత్రమే అని అంటున్నారు నిపుణులు. నొప్పులకోసం వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లో భాగం గా కడుపులో తిప్పినట్లుగా ఉండడం. లేదా కడుపులో వికారం గా కూడా ఉండడం వంటివి గమనించవచ్చు. మనలను సహజంగా వేదించే ఒళ్ళు నొప్పులు అలసట కు ఇంట్లో అందుబాటులో ఉండే సహజ నివారణ ఉపాయాల ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తో బయట పడవచ్చని ఒక పరిశోదనలో తేలింది. ఈ పరిశోదన ద్వారా శారీరకంగా వచ్చే అలసట లేదా శరీరం సహకరించక పోవడం వల్ల వచ్చే సమస్యలకు ఉపాయాలాను నిపుణులు సూచించారు. సహజంగా ఇంట్లో లభ్యమయ్యే నివారణా ఉపాయాలు నోప్పిని నివారిస్తాయా? అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మన శరీరం ఎదుర్కునే సమస్యలు... ఆర్తరైటిస్. బర్ సైటిస్ టిండి సైటిస్. కండరాలను అధికంగా వినియోగించడం. ఫ్లూ,లేదా ఇతర అనారోగ్యం. ఫైబ్రో మైలేజియా. ఇలాంటి సమాస్యలకు మనకు ఇంట్లో లభ్య మయ్యే నివారణ ఉపాయాలను మీరు వాడి చూడండి. ఎవరైనా సరే శరీరం సరిగా సహకరించని వారు సైతం మీకు మంచి ఫలితాలు ఇస్తాయని నిపుణులు అంటున్నారు.  పసుపు... సహజంగా మన ఇళ్ళలో ఎవరి ఇంట్లో అయినా వంటింట్లో పూజా మందిరంలో వంట గదిలో ఉండేది పసుపు. ఇంట్లో వాడే పసుపు భారాతీయుల ప్రతి వంటలలో తప్పనిసరిగా వినియోగించే స్పైస్ పసుపు. మంచి సువాసన రుచికి రుచి మంచి వైద్య మూలికకూడా. పసుపులో ఉండే కుర్కు మిన్ అనే పదార్ధం ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. నొప్పి నివార కల్పించడం లో పసుపు దోహదం చేస్తుంది. పసుపును టీ లో సప్లిమెంట్ గా వాడుతున్నారు. మనం అయాకాలాలలో పసుపు పొడిని కొనవచ్చు. నొప్పినివా రణలో నల్ల మిరియాలు,పసుపు వాడితే చాలా ప్రభావ వంత్గంగా పనిచేస్తుంది.  హాట్ వాటర్ ప్యాక్స్... సహజంగా ఒళ్ళు నొప్పులు ఉన్న వారిలో సాంప్రదాయంగా హాట్ వాటర్ బ్యాగ్స్, వాడడం కొన్ని ఏళ్లుగా వస్తున్న ప్రత్యామ్నాయా మార్గాలలో అదీ ఒకటి. ఇప్పుడు హాట్ వాటర్ బాటిల్స్, హీటింగ్ ప్యాడ్స్, పోత్తపైన పెట్టుకుంటే అత్యంత ప్రభావ వంతంగా పనిచేస్తుందని ముఖ్యం గా ప్రీ మెన్స్ టోరి యల్ సిండ్రోం కు హాట్ వాటర్ ప్యాడ్స్ ఉపకరిస్తాయి. ఐస్ తెరఫీ... నొప్పి నివారణకు మరో చక్కని ఉపసమన మార్గం ఐస్ క్యుబ్స్ తో ముఖ్యంగా పోస్ట్ సర్జరీ తరువాత శరీరంలో వచ్చే నొప్పులకు ఐస్ బ్యాగ్స్ లేదా ఐస్ ప్యాక్ లు వాడడం వల్ల నొప్పి నివారణకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో నేడు ఫ్రిజ్ లేని ఇల్లి అంటూ ఉండదు. ఖర్చులేకుండా ఇంట్లోనే దొరికే ఐస్ ముక్కలతో ఐస్ బ్యాగ్ ను ఉపయోగించి వేడి చల్ల తనం నొప్పి ఉన్న ప్రాంతం లో ఐస్ బ్యాగ్ వాడడం వల్ల నోప్పులు ప్రభావ వంత మైన చికిత్స గా పేర్కొన్నారు. నిపుణులు.ముఖ్యం గా నొప్పి ఉన్న ప్రాంతం లో కదల కుండా ఉన్న శరీర భాగాల పై 2౦ నిమిషాల పాటు ఐస్ ముక్కలు పెడితే నొప్పులు తగ్గుతాయి.అని ప్రత్యామ్నాయ నివారణా పద్దతిని ఆచరించి మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. శరీరంలో నోప్పులు అలసట తగ్గాలంటే ఏం చేయాలి?... శరీరంలో నొప్పులు పెరగడానికి చాలా కారణాలు ఉండచ్చు. కాని శరీరానికి కావాల్సిన స్వల్ప వ్యాయామం చేయాలి చేతులు పైకి చాచడం లేదా స్ట్రెచ్ చేయడం. లేదా ద్వారా శరీరంలో నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నడవడం ఈత కొట్టడం వల్ల ప్రత్యేక లాభాలు ఉన్నాయని. ముఖ్యంగా వెన్నునొప్పి కీళ్ళ నొప్పులకు ఉపయోగ పడుతుందని అంటున్నారు నిపుణులు. ముంచేతులు భుజాలను చుట్టూ తిప్పడం వంటి వ్యాయామ ప్రక్రియ సహాయ పడతాయి. వాటి వల్ల భుజాల నొప్పులు తగ్గుతాయి. ప్రత్యామ్నాయం గా ఐస్,హీట్ తెరఫీ లు సత్వరం ఉపసమనం కలిగిస్తాయి. అలాగే జాయింట్ పెయిన్స్ జాయింట్ల లో నొప్పులు ఉన్నప్పుడు వేడి నీళ్ళ స్నానం వల్ల సత్వరం వెన్నునొప్పి పోతుంది అని సూచిస్తున్నారు నిపుణులు. అలసట నీరసం నుండి ఉపసమనం పొందాలంటే... అలసట, నీరసం శరీరంలో రావడం సహజం. దీనికి చాలా రకాల కారణాలు ఉండవచ్చు. నిద్ర లేమి, గుండె సమస్యలు, దీర్ఘ కాలంగా అలిసిపోయే ఫ్యాటి గో సిండ్రోం. అలసట కు కారణం కండరాల బలహీనత మీ శరీరాన్ని మీరే స్వీయ రక్షణ చేసుకోవాలి. అలసట నుండి బయట పడడానికి సహజమైన ఇంటి చిట్కామీ మెదడుకు శక్తి నిస్తుంది.మీ మూడ్ స్వీయరక్షణ పద్దతులు అమలు చేయాలి. *ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. *ప్రతిరోజూ మంచి నిద్ర పోవడానికి అలవాటు చేసుకోవాలి. * రాత్రి పూట మందు అంటే ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలి. *పౌష్టిక ఆహారం తీసుకోవాలి. *హైడ్రేడ్ కాకుండా చూసుకోవాలి. *యోగా,మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. కండరాల నొప్పులు అలసటకు పోష్టిక ఆహారం...పళ్ళ రసాలు.. ఇతరాలు వాటి వల్ల ఉపయోగాలు... బెర్రీ జ్యూస్... బెర్రీ జ్యూస్ లో అంతోసియానిన్స్ నీటి శాతం ఇంఫ్లా మేషన్ ను తొలగించే పదార్ధాలు ఉంటాయి.  కాఫీ... కాఫీ లో కెఫీన్ ఉంటుంది. అలసటను తాతకాలికం గా నివారిస్తుంది. కాఫీ త్వరగా సేవించడం వల్ల నిద్ర లేమి నివారించ వచ్చు. కాఫీ గుండె సమాస్యల నివారణకు కాఫీ సహకరిస్తుంది. గుడ్లు... నీరసాన్ని అలసటను తగ్గించడం లో ప్రోటీన్ ను అందించేది ఆరోగ్య కర మైన ఫ్యాట్స్ లియో సిన్,ఏమ్యినో యాసిడ్ వల్ల కండరాలలో వచ్చే క్రామ్స్ నీరసం నుండి త్వరగా కోలు కుంటాయి. నీరు... శరీరం లోని కండరాలకు నీరు అత్యవసరం. మీ శరీరం కండరాలు పైన చర్మం మాంసము తో కప్పబడి ఉంటుంది. సరైన హై డ్రేషన్ అవసరం నీటివల్లశరీరానికి ఎలక్ట్రో లైట్స్ సమం గా ఉంటాయి. కండరాలలో వచ్చే క్రామ్స్ ను నీరసాన్ని తగ్గిస్తుంది.  అరటి పండు... అరటి పండులో పొటాషియం ఎలక్ట్రో లైట్స్, మినరల్స్, పొటాషియంమీ నరాలు, కండరాలు సరిగా పనిచేసేందుకు సహక రిస్తాయి.ఇవి సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అలసటను కొంత మేర నివారించవచ్చు అన్నది నిపుణుల సూచన ఆచరించండి ఆరోగ్యంగా ఉండండి. డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?... మీ శరీరం గురించి మీకు బాగా తెలుసు ఒళ్ళు నొప్పులు త్వరాగా తగ్గవు. రోజూ దీర్ఘకాలంగా వేదిస్తునే ఉంటాయి.అప్పుడు మీరు సంప్రదించడం అవసరం. నెప్పి తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఇంటి చికిత్సకు లొంగ కుంటే ఉపసమనం ఇవ్వకుంటే. డాక్టర్ ను సంప్రదించాలి. నిర్ధారణా పరీక్షల లోనూ బయట పడకుంటే అనీమియా రక్త హీనత డయాబెటిస్, వల్ల అలిసి పోతారు. రోజూ అలసట గా ఉండడం అంటే మీరు తీసుకున్న మందులు కూడా కావచ్చు. అప్పుడు మీ డాక్టర్ ప్రాత్యంనాయ మండులనూ సూచించవచ్చు. స్వల్పంగా ఉండే నొప్పులకు ఇంటి లో లభించే నివారణను ఉపయోగించండి మండులపై ఎల్లప్పుడూఆధార పడకండి.

ఎసిడిటీ సమస్య ఎందుకు వస్తుంది?? దీనికి జాగ్రత్తలు, నివారణలు ఏంటంటే..

ఎసిడిటీ.. దీన్ని అసిడిటీ.. ఎసిడిటీ అని సంబోస్తూ ఉంటారు. ఇది సాధారణ కడుపు సమస్యలలో ఒకటి. పేరుకు తగ్గట్టుగానే ఇది కడుపులో అధిక యాసిడ్ ఉత్పత్తి కావడం వల్ల కలిగే సమస్య. ఈ ఆమ్లం కడుపులోని గ్రంధుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటీ వల్ల కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్, అజీర్ణం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అసిడిటీ ఎందుకు వస్తుంది? సాధారణంగా వేళతప్పిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల అసిడిటీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మాంసాహారం, మసాలా, నూనె ఎక్కువగా ఉండే ఆహారం కూడా ఎసిడిటీని కలిగిస్తుంది. కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంధులు అదనపు యాసిడ్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు ఆమ్లత్వం ఏర్పడుతుంది. ఆహారం జీర్ణం కావడానికి యాసిడ్ అవసరం అవుతుంది. అందుకోసమే ఇది కడుపులో ఈ వ్యవస్థ కూడా ఉంది. కడుపులో ఆమ్లాకు ఎక్కువైనప్పుడు అది  సాధారణంగా మూత్రపిండాల ద్వారా శరీరం నుండి తొలగించబడుతుంది. అయితే మరీ అధికంగా ఆమ్లాలు ఉత్పత్తి అయినప్పుడు అనేక ఉదర సంబంధ సమస్యలు ఏర్పడతాయి. అసిడిటీ మందులతో నయమవుతుంది, మరీ ముఖ్యంగా దీన్ని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి.  అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని సాధారణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే అసిడిటీని అరికట్టవచ్చు. ఈ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం. యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమయ్యే ఆహారాలను మానేయాలి.. మసాలా, కాఫీ, కార్బోనేటేడ్ పానీయాలు, ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలను నివారించాలి. ఒత్తిడి, ఆమ్లాల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి భోజనాన్ని 4-5 చిన్న భాగాలుగా విభజించి 2-3 గంటల వ్యవధిలో తినాలి.  తిన్న వెంటనే పడుకోకూడదు.. తిన్న తర్వాత పడుకోవడం చాలామంది అలవాటు. అయితే ఈ అలవాటు వల్ల ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు తినేయాలి. బరువు తగ్గడం.. అధిక కొవ్వు పొత్తికడుపు అవయవాలపై ఒత్తిడి తెస్తుంది, దీనివల్ల గ్యాస్ట్రిక్ రసాలు అన్నవాహికలోకి ప్రవహిస్తాయి. అధిక బరువు ఉన్నవారిలో ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. సొంతంగా మందులు వాడొద్దు.. కొన్ని OTC మందులు కూడా అసిడిటీని కలిగిస్తాయి, ప్రతి డాక్టర్ రోగి పరిస్థితిని బట్టి మందులు రాసాడు. కానీ సొంత అవగాహనతో మందులు వాడితే అవి అసిడిటీ పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోకండి. కొన్ని ఇంటి చిట్కాలు.. అసిడిటీ అనిపిస్తే కింది ఇంటి చిట్కాలు ఫాలో అవ్వచ్చు.. అరటి, యాపిల్.. అరటిపండ్లు సహజంగా యాంటాసిడ్‌లను కలిగి ఉంటాయి, ఇవి అసిడిటీతో పోరాడుతాయి. పడుకునే ముందు కొన్ని ఆపిల్ ముక్కలను తినడం వల్ల గుండెల్లో మంట లేదా రిఫ్లక్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని pH స్థాయి ఆల్కలీన్‌గా మారుతుంది. కడుపులో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. శ్లేష్మం అధిక యాసిడ్ ఉత్పత్తి తీవ్రమైన ప్రభావాల నుండి కడుపుని రక్షిస్తుంది. ఇది కాకుండా, కొబ్బరి నీళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఇది కాకుండా, రోజూ తగినంత నిద్రపోవాలి.. కనీసం 7-8 గంటల నిద్ర అన్నివిధాల ఆరోగ్యం.                                  ◆నిశ్శబ్ద.

వెన్నునొప్పి నుండి ఉపశమనం లభించాలంటే ఇలా చేయండి..!

వెన్ను నొప్పి ఈ మధ్య కాలంలో చాలా సాధారణ సమస్యగా మారింది.  జీవనశైలి, ఆహారంలో మార్పులు, అధిక శ్రమ లేదా అసలు శ్రమ లేకపోవడం,  ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వంటి కారణాల వల్ల వెన్నునొప్పి వస్తుంది.  మరీ ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది వెన్ను నొప్పి బారిన పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వెన్నునొప్పి నుండి ఉపశమనం లభించాలంటే కొన్ని టిప్స్ చాలా బాగా సహాయపడతాయి. బలాసనం.. బలాసనాన్ని వేయడానికి వజ్రాసనం భంగిమలో కూర్చోవాలి.  మోకాళ్ల మీద నుండి ముందుకు వంగి చేతులను ముందుకు చాపాలి. తలను నేలకు ఆనించి ఈ పొజిషన్ లో 20 సెకెన్లు ఉండాలి. మార్జాలాసనం.. మార్జాలాసనం వేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది.  చేతులు, మోకాల్ల పై కూర్చోవాలి.  మణికట్టును భుజాల కింద,  మోకాళ్లను తుంటి కింద ఉంచాలి.  వీపును నిటారుగా ఉంచి పిల్లి రిలాక్స్ అయ్యే పొజిషన్లో వీపును కిందకు వంచి తలను పైకెత్తాలి.  ఈ పొజిషన్లో లోతుగా శ్వాస తీసుకోవాలి. సేతు బంధాసనం.. నేలపై వెల్లికిలా పడుకోవాలి.  నడుమును పైకి, కిందకు కదుపాలి.  ఇలా చేస్తే వెన్ను నొప్పి నుండి తొందరగా ఉపశమనం ఉంటుంది.  ఇదే పొజిషన్లో వీపును పైకెత్తి పాదాల మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి.  ఈ సందర్భంలో శరీర బరువు తల మీద కూడా ఉంటుంది.  ఛాతీ నుండి నడుము వరకు శరీరం పైకి లేచి ఉంటుంది.  ఈ పొజిషన్లో 20 సెకెన్లు ఉండాలి.                                      *రూపశ్రీ.

కాళ్లు చేతులలో జలదరింపు, చీమలు పాకిన ఫీలింగ్ ఉందా? ఇదే కారణం..!

  శరీరంలో అనారోగ్యం లేదా ఏదైనా లోపం ఉంటే అది వివిధ రూపాలలో బయట పడుతూ ఉంటుంది.  శరీరంలో ఎక్కడైనా ఉంటే అది ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. కానీ శరీరానికి ఎంతో  అవసరమైన విటమిన్లు లోపిస్తే అది శరీరంలో మార్పులు,  లక్షణాల ద్వారా బయట పడుతుంది.  కొందరికి కాళ్లు చేతులు తరచుగా జలదరిస్తుంటాయి.  విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు,  నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి కాళ్లు, చేతుల మీద చీమలు పాకినట్టు, చీమలు కుట్టినట్టు, ఏదైనా పిన్నీసు తీసుకుని పొడినట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.  ఇదంతా విటమిన్ల లోపం కారణంగా జరుగుతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకూ ఈ సమస్యకు కారణమయ్యే విటమిన్ ఏది? ఆ విటమిన్ ఏ ఆహారాలలో లభ్యమవుతుంది? తెలుసుకుంటే.. విటమిన్-బి12.. శరీరంలో విటమిన్-బి12 అవసరం చాలా  ఉంటుంది.  ఇది నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం.  విటమిన్-బి12 లోపిస్తే నరాల పనితీరు దెబ్బతింటుంది.  నరాల పనితీరు సరిగా లేకుండా శరీరంలో నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.  దీని కారణంగానే చేతులు, కాళ్లలో జలదరింపు,  చీమలు పాకిన ఫీలింగ్, తిమ్మిర్లు ఎదురవుతూ ఉంటాయి. విటమిన్-బి12 ఆహారాలు.. విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. మాంసాహారులు.. సాధారణంగా విటమిన్-బి12 మాంసాహారంలో ఎక్కువగా లభ్యమవుతుంది.   చేపల్లో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది.  సాల్మన్, సార్టినెస్, ట్రౌట్ వంటి చేపలలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది.  వీటిలో వారంలో కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. గుడ్లు కూడా విటమిన్-బి12 ను అందిస్తాయి.  ముఖ్యంగా గుడ్లలో ఉండే పచ్చ సొనలో విటమిన్-బి12 ఉంటుంది.  దీంతోపాటు విటమిన్-బి2 కూడా ఇందులో ఉంటుంది. వారంలో కనీసం 3 లేదా 4 సార్లు  గుడ్లను ఆహారంలో తీసుకోవాలి. మాంసాహారులు విటమిన్-బి12 మెరుగ్గా పొందడానికి చికెన్ మంచి మార్గం.  వారానికి కనీసం ఒక్కసారి అయినా చికెన్ తీసుకుంటే మంచిది. శాకాహారులు.. శాకాహార ఆహారాలలో కూడా విటమిన్-బి12 లభ్యమవుతుంది. పాలలో విటమిన్-బి12 లభిస్తుంది. కేవలం విటమిన్-బి12 మాత్రమే కాకుండా ప్రోటీన్, కాల్షియం, విటమిన్-డి కూడా పాల నుండి లభిస్తాయి. విటమిన్-బి12 లోపాన్ని అధిగమించాలంటే తృణధాన్యాలు బాగా తీసుకోవాలి.  వీటిని తీసుకుంటే శరీరానికి విటమిన్-బి12 బాగా అందుతుంది. పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విటమిన్-బి12 సమృద్దిగా అందుతుంది. పెరుగులో విటమిన్-బి12 మాత్రమే కాకుండా ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహకరిస్తాయి. బీట్రూట్ లో కూడా విటమిన్-బి12 ఉంటుంది.  బీట్రూన్ ను జ్యూస్,  సలాడ్,  స్మూతీ గా మాత్రమే కాకుండా.. కూరలలో కూడా భాగం చేసుకోవచ్చు.                                                          *రూపశ్రీ.  

డయాబెటీస్‌కు పెరటి వైద్యం

డయాబెటిస్ సమస్య చాలా పెద్దసమస్య ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి చక్కర వ్యాధి సమస్యతో బాధపడుతూనే ఉంటారు.అయితే ఇది మీకు తెలుసా డయాబెటీస్ కు పెరటి వైద్యం తోనియంత్రించ వచ్చు. మన ఇంట్లో లభించే గృహవైద్యం తో అంటే మీ పెరట్లో మీ ఇంటి సమీపం లో లభించే మామిడి ఆకులకషాయం,తులసి ఆకులు తీసుకుంటే డయాబెటీస్ ను నియంత్రించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా మామిడి చెట్లు మీఇంటికి సమీపంలో లేదా మీపెరట్లో పెంచుకుంటూ ఉంటారు.అలాగే మీ పెరట్లో అత్యంత పవిత్రంగా భావించే తులసి చెట్టును చాలా భక్తి శ్రద్ధలతో మహిళలు పెంచుకుంటూ ఉంటారు.అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే వాస్తవానికి మామిడి ఆకుల కషాయం, తీసుకుంటే డయాబెటీస్ ను నియంత్రించవచ్చని నిపుణులు అంటునారు. మామిడి ఆకుల్లో ఎంతో సయిడిన్ పేరుతో టైనిన్ అనే పదార్ధం ఉంటుంది.డయాబెటీస్ చికిత్సకు ఇది సహాయ పడుతుంది. మామిడి ఆకులు ఇన్సూలిన్ ను ఉత్పత్తి చేస్తాయి గ్లూకోజ్ ను పంచడం ఇన్సూలిన్ ను సరిగా పనిచేయించడం లో మామిడి ఆకులు ఉపయోగ పడతాయి. మామిడి ఆకులను ఎలా వాడాలి... బ్లడ్ షుగర్ నివారించాలంటే 1౦ నుండి 15 మామిడి ఆకులు తీసుకోండి.ఒక గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించండి.మరిగించిన రాత్రి నీటిలో ఆకులను వేయండి. నాన పెట్టిన ఆకుల రసాన్ని మర్నాడు ఉదయం పరగడుపున నీటిని వడకట్టి తాగండి నియమిత పద్దతిలో నీటిని సేవిస్తే బ్లడ్ షుగర్ నియంత్రించ వచ్చు. తులసి ఆకులతో డయాబెటీస్ ను నియంత్రణ... తులసి ఆకుల ప్రభావం సత్వరం ఉంటుంది.మీరు డయాబెటీస్ ను నియంత్రించ వచ్చు.మీరు డయాబెటిస్ తో సతమత మౌతుంటేమనకు అందుబాటులో ఉన్న పెరటి వైద్యం లేదా హెర్బల్ వైద్యం అందించడం ద్వారా మీ డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. ప్రాధాన అంశాలు... తులసి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటీస్ నియంత్రించ వచ్చు.ఉదయానే పరగడుపున తులసి ఆకులను తినడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయని హెర్బల్ వైద్యులు పేర్కొన్నారు. మీ పెరట్లో మీకు అందుబాటులో ఉన్నవాటితో చికిత్స... డయాబెటీస్ తీవ్రమైన సమస్య దీనిని అంత సులభంగా తీసుకుని అంటే సామాన్యుడి పరిభాష లో లైట్ తీసుకోకండి.తప్పు చేయకండి.ఎవరైతే డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారో దానితో సహజీవనం సాగిస్తున్నారో.డయాబెటీస్ కు చికిత్స లేదని అంటున్నారు.దీనిని పూర్తిగా నివారించాలేము.అయితే పైన పేర్కొన్న ప్రాత్యామ్నాయ విధానాలనుఅనుసరించడం ద్వారా డయాబెటిస్ ను నియంత్రించ వచ్చు.అందుకోసం మీరు తీసుకునే ఆహారం విషయం లో కాస్త శ్రద్ధ అవసరం.  ఇంట్లో మీకు అందు బాటులో ఉండేఔషద మొక్కలను వినియోగించడం ద్వారా డయాబెటీస్ ను నివారించవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో లభ్యమయ్యే తులసి ఆకుల ను తీసుకోవడం ద్వారా  డయాబెటీస్ ను నియంత్రించ వచ్చు.  ఆధ్యాత్మిక పరంగా తులసి చెట్టును చాలా పవిత్రం గా భావిస్తారు.ఇంట్లో ఉండే కుండీలలో తప్పనిసరిగా పెంచుతారు.అలాగే ప్రతిరోజూ తులసి కోటకు పూజ చేసి దీపం పెట్టనిదే ఉదయం స్త్రీల కార్యక్రమాలు ప్రారంభం కావు.ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంచుకోవడం శుభంగా భావిస్తారు.తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత వాటి మహాత్మ్యం గురించి మీకు తెలుసా. అలాగే తులసి లో ఉన్న ఔషద గుణాలు ఉన్న మొక్కగా భావిస్తారు.మీకు ఎటువంటి భయంకరమైన అనారోగ్య సమస్య ఉన్న పోరాడ వచ్చు.తులసిలో యాంటి బాయిటిక్ ప్రాపర్టీ ఉటుంది.   ముఖ్యంగా ఉదర సంబందిత సమస్యలకు సంబందించిన తులసి లో పోరాడే తత్వం ఉందని నిపుణులు పేర్కొన్నారు. తులసితో పలు అనారోగ్య సమస్యలు పంచేంద్రియాల లో సమస్యలు,కడుపులో మంట,పి సి ఓడి వంటి సమస్యలు తగ్గించడం లో తులసి సహకరిస్తుంది.దీంతో పాటు మరికొన్ని ఔషద తత్వాలు లభిస్తాయి.ముఖ్యంగా ప్యాంక్రి యాటిక్ బీటా సేల్స్,ఇన్సూలిన్ ప్రక్రియ ప్రారంభ మౌతుంది.ఉదయం లేవగానే పరగడుపున తులసి ఆకులు నమలండి.లేదంటే తులసి ఆకుల రసం కూడా తాగవచ్చు. అలా చేయడం ద్వారా బ్లడ్ షుగర్ స్థాయి తగ్గుతుంది. ఉదయం పరగడుపున తులసి ఆకులు తినడం వల్ల లాభాలు... *ఇమ్యునిటి పెరుగుతుంది. *గుండెకు లాభం. *పంచేంద్రియాలకు లాభం. *జలుబును నివారించడం లో దోహదం చేస్తుంది. *క్యాన్సర్ ను నివారించేందుకు తులసి సహకరిస్తుంది. *జలుబు దగ్గుకు ఉపయోగం. దయాబిటిస్ నియంత్రించడం లో  మామిడి ఆకుల రసం,తులసి ఆకులు దోహదం చేస్తాయని అనడం లో సందేహం లేదు.                                                            

ఉసిరికాయ రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ఉసిరికాయను అమలకి అని కూడా అంటారు. దీన్ని సాధారణంగా వంటలలో వాడుతుంటారు.  పచ్చళ్లు, పానీయాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు.  అయితే ఉసిరికాయ ఆరోగ్యానికి చేకూర్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ కనీసం ఒక ఉసిరికాయను తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  అయితే ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి.  అవేంటంటే.. పోషకాలు.. ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ వంటి గుణాలు ఉన్నాయి.  ఇందులో పైబర్ కంటెంట్ కూడా ఎక్కువే.. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,  మలబద్దకాన్ని నివారిస్తుంది.   రోగనిరోధక శక్తి.. ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే యాంటీ బాడీస్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మధుమేహం.. ఉసిరిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీన్ని తేనెతో కలిపి సేవించడం వల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణక్రియ.. ఉసిరిలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే గుణాలు కూడా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. తేనె,  ఉసిరి రెండూ కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. జుట్టు.. జుట్టు మందంగా,  ఆరోగ్యంగా, నల్లగా పెరగడంలో ఉసిరికాయ సహాయపడుతుంది.  ఉసిరికాయ రసాన్ని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.  జుట్టు సంబంధ సమస్యలు తగ్గుతాయి. చర్మం.. ఉసిరిలో విటమిన్-సి, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖం మీద మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తాయి.                                            *రూపశ్రీ.

బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ వాడేవారు ఈ నిజాలు తెలుసుకోవాలి..!

  ఆపిల్ సైడర్ వెనిగర్  ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతోంది.  దీన్ని ముఖ్యంగా బరువు తగ్గడానికి  ఉపయోగిస్తారు.  ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం మాత్రమే కాకుండా చర్మం,  జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.  హార్మోన్లను బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.   అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడేవారు దాన్ని సరైనా పద్ధతిలోనే వాడుతున్నారా లేదా అనేదాన్ని బట్టి పై ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని తప్పుగా వాడితే ప్రయోజనాలు చేకూరడానికి బదులు హాని కలుగుతుంది. అసలు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎలా వాడాలంటే.. ప్రయోజనాలు.. ఆపిల్ సైడర్ వెనిగర్  కొలెస్ట్రాల్ స్థాయిని  నియంత్రిస్తుంది. రోజూ 1 స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను గ్లాసుడు వేడి నీటిలో కలిపి తీసుకోవాలి.  ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో,  ఇన్ఫెక్షన్ ల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది.  ఆపిల్ సైడర్ వెనిగర్ రోజూ తీసుకుంటే  జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.  చర్మం మీద  మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇది రక్తంలో  చక్కెర స్థాయిని  అదుపులో ఉంచుతుంది. జుట్టు పెరగడం, చుండ్రు,  దురద వంటి సమస్యలను తొలగించడానికి, 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఒక మగ్ నీటిలో కలపాలి. తలస్నానం చేసేటప్పుడు ఈ నీటిని మీ జుట్టుపై పోసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎలా తాగాలి.. 3 నెలల పాటు ప్రతిరోజూ 1 నుండి 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ మొత్తం కంటే ఎక్కువ ఆపిల్ వెనిగర్  జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.  దంతాలు కూడా పసుపు రంగులోకి మారుతాయి.                                                   *రూపశ్రీ.