Read more!

కేసీఆర్ తో కోమటిరెడ్డి భేటీ, టీఆర్ఎస్ లోకి జంప్?

 

 

 

 

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ తో తెలంగాణ ఉద్యమ భవిష్యత్ పరిణామాలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నా, ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. కోమటిరెడ్డి మొదట జగన్ పార్టీలో చేరాలని భావించినా తెలంగాణ పట్ల ఆ పార్టీ వైఖరి స్పష్టంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.



ప్రస్తుత పరిస్థితులలో టీఆర్ఎస్ లో చేరడమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. నల్లగొండ జిల్లాలో గట్టి పట్టున్న కోమటిరెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆ పార్టీ నల్లగొండలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుంది.  మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన తెలంగాణ రాష్ట్రం తన లక్ష్యంగా పోరాడుతున్నారు.