రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన చిరంజీవి
posted on Jul 30, 2012 @ 3:38PM
నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 47మంది మృతి చెందారు. అయితే ప్రమాద స్థలాన్ని ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చిరంజీవి పరామర్శించారు. వారికీ అన్ని విధాల ప్రభుత్వ సహయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.