రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి : గాదె
posted on Jul 29, 2012 @ 4:56PM
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, విభజిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందని రాష్ట్ర మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ నేతలు కూడా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని, విభజిస్తేనే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారని ఆయన తెలిపారు. అందుకే శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అభిప్రాయపడిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సమైక్యత, సమగ్రతలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.