ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికల్లో ముగిసిన ఓటింగ్
posted on Jul 29, 2012 @ 3:51PM
హోరాహోరిగా జరిగిన ఫిల్మ్‌ఛాంబర్ ఓటింగ్ ముగిసింది. ఈ సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. ఛాంబర్ చరిత్రలో రెండు ప్యానల్స్ హోరాహోరీ పోటీపడటం ఇదే మొదటిసారి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్‌తో స్రవంతి రవికిశోర్ టీమ్, చిన్న నిర్మాతలను కలుపుకుంటూ తమ్మారెడ్డి భరద్వాజ మరో ప్యానల్ తరపున పోటీపడ్డారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సాయంతో ఎన్నికలు నిర్వహించారు. తెలుగు నిర్మాతలు అగ్ర నిర్మాతల పక్షమా, చిన్న నిర్మాతల పక్షమా అన్నది మరి కొద్ది గంటల్లో తేలనుంది!