మాజీ జడ్జి పట్టాభిరామారావు కి నో బెయిల్
posted on Aug 17, 2012 @ 10:11AM
కాగా బెయిల్ ముడుపుల కేసులో ప్రధాన నిందితుడైన మాజీ జడ్జి పట్టాభిరామారావు బెయిల్ పిటిషన్‌ను ఎసిబి ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. వాదనలు విన్న అనంతరం జడ్జి జగన్నాథం దర్యాప్తు అధికారులతో ఏకీభవించారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరిని విచారించాల్సి ఉన్నందున పట్టాభికి బెయిల్ ఇవ్వడం సరికాదని ఎసిబి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించారని, పట్టాభి వయస్సు, అనారోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని డిఫెన్స్ లాయర్ వాదించారు.