భర్తపై భార్య పోరాటం
posted on Aug 4, 2012 @ 3:00PM
భర్తకోసం ఓ ఎన్‌ఆర్‌ఐ భార్య పోరాటం చేస్తోంది. కానీ ఆయన మాత్రం ఆమె పేరున ఉన్న కోట్ల విలువైన ఆస్తిపై కన్నేసాడు. చెన్నైకి చెందిన యామిని.. హైదరాబాద్ కి చెంది కార్తిక్ మూడేళ్ల క్రితం మాట్రిమోనీ ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. చాలా ఏళ్లు ఆస్ట్రేలియాలో ఉండి కోట్లరూపాయలు సంపాదించిన యామిని ఆస్తిని తన పేరుపై మార్చాలని కార్తీక్ పోరు మొదలుపెట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. చెన్నై.. హైదరాబాద్ కోర్టులలో వీరిద్దరి మధ్య కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే భర్త కోసం యామిని నిన్న హైదరాబాద్‌కి రాగా... ఇంటికి తాళంవేసి ఉండటంతో ఆమె భర్తకోసం పోలీసులను ఆశ్రయించింది.