బిసిలపై కాన్సట్రేషన్ చేస్తున్న బాలకృష్ణ
posted on Aug 20, 2012 @ 4:21PM
నందమూరి బాలకృష్ణ తాజాగా బిసిలపై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఆ వర్గాలు మళ్లీ టిడిపి వైపు భారీగా మొగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు బాలకృష్ణ తన ఫ్యాన్స్‌ను పార్టీకి అటాచ్ చేసే విధంగా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. నందమూరి అభిమానులలో ఎక్కువగా బిసిలు ఉన్నారు. దీంతో బాలయ్య బిసిలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. బాలయ్య త్వరలో రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అయితే బాలయ్య ఏ పదవితో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వెళ్లాలా లేక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వెళ్లాలా అనే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయని అంటున్నారు.