బంజారాహిల్స్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద టెన్షన్ టెన్షన్
posted on Aug 10, 2012 @ 12:35PM
బంజారాహిల్స్‌రోడ్డు నెంబర్.12 వద్ద టెన్షన్ వాతావరణం నెలొకొంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భూముల వ్యవహారంపై మంత్రి దానం నాగేందర్ మరి కాసేపట్లో మౌన దీక్ష చేపడతారని వార్తలు రావడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మంత్రికి వ్యతిరేకంగా బజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాగా ఆలయం వద్ద ఆందోళన దిగుతారని భావించిన మంత్రి దానం నాగేందర్ ఇస్కాన్ ఆలయం వెలుపల కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్నారు. మరోవైపు ఇస్కాన్ దేవాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. కృష్టుని విగ్రహాలు ఆలయానికి చేరుకున్నాయి.