రాష్ట్రంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
posted on Aug 10, 2012 @ 2:03PM
రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి శోభ సంతరించుకుంది. సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకుని కృష్ణున్ని దర్శించుకుంటున్నారు. భజనలు, కీర్తలతో ఆలయం మారుమోగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు రానున్న సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద మెటర్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు.