పేరుకే ప్రజాస్వామ్యం పెత్తనం బడా పారిశ్రామిక వేత్తలదే
posted on Oct 29, 2012 @ 2:03PM
పేరుకే మనది ప్రజాస్వామ్యం కాని పరిపాలించేది మాత్రం బడా వ్యవాపారవేత్తలే అది నిన్నటి క్యాబినేట్ విస్తరణలో మరో సారి రుజువయ్యింది. అందులో రిలయన్స్ కనుసన్నల్లో రెండు జాతీయ పార్టీలు ఉన్నట్లు రాజకీయనాయకులే కాక మేధావులు, పారిశ్రామిక వేత్తలు ఒప్పుకుంటున్నారు. అదే మరో మారు నిజం అయ్యింది. అదీ జైపాల్ రెడ్డిని పెట్లోలియం శాఖనుండి తప్పించడం ద్వారా. అంతకు ముందు ఇదే శాఖలో పని చేసిన మణిశంకర్ అయ్యర్ కూడా రిలయన్స్ బారిన పడి మంత్రిగా తప్పుకోవలసి వచ్చింది. దేశం లో నెంబర్ వన్ కుబేరుడి గా ఉంటానికి రిలయన్స్ చేసే ఆగడాలకు అంతేలేకుండా పోయింది. పుంఖాను పుంఖాలుగా విమర్శలు వెల్లువెత్తినా దర్వాప్తుకు ఆదేశించడమో, వివరణ కోరడమో లాంటి కార్యక్రమాలేకాదు అవి వింటానికి కూడా ప్రభుత్వానికి భయమే. మల్టీ బిలియన్లను ఒక్కపెట్రోలు ద్వారానే సంపాదించి దేశానికి మిలియన్ల బిలియన్లు నష్టం తెచ్చారన్నది జగమెరిగిన సత్యం. అందులో భాగంగానే జైపాల్ రెడ్డి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రిలయన్స్ గ్యాస్ తవ్వకాలపై దర్యాప్తు చేయించడం, గ్యాస్ ధరలను అడ్డుకోవడం, దానిపై కాగ్ తో ఆడిటింగ్ కోరడంతో రిలయన్స్ సంస్థలకు జైపాల్ కొరకరాని కొయ్యగా మారారు. ఆయనను తమ దారికి తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నించి ఆఖరుకు సోనియా ద్వారా అడ్డు తప్పించుకున్నారని మీడియా కోడై కూస్తుంది. మరి కొత్తగా మంత్రి పదవి చేపట్టిన వీరప్పమొయిలీ ఏ దారిన నడుస్తారో మరి కొద్ది రోజుల్లో తేలనుంది ఏది ఏమైనా దీంతో మన దేశంలోని ప్రజాస్వామ్యం డొల్లతనం దీని ద్వారా తెలుస్తుంది. అవినీతి రహిత దేశంగా ఉండాలన్న క్రేజీవాల్ లాంటి వారు కనీసం వందమందయినా రిలయన్స్ ను నిలువరించగలరా అని నేటి ప్ర.జల ప్రశ్న.