రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయా..,
posted on Oct 29, 2012 @ 2:05PM
రాష్ట్రంలో పదకొండు మంది కేంద్ర మంత్రులు ఉండటంతో ప్రజలు మంచిరోజులొస్తాయని ఎదురు చూస్తున్నారు. గతంలో ఉన్న మంత్రులతో పెద్దగా ఒరిగిందేమీలేదని నాయకులు, ప్రజాసామ్యవాదులు పెదవి విరిచారు. గ్యాస్ కెటాయింపుల విషయం వచ్చాక పెట్రోలియం మంత్రి కొంత మేరకు రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ చిత్తశుద్దితో ఆదీవాసీల హక్కుల కోసం వారి భద్రత కోసం పనిచేస్తున్నారు. వీరు మినహా మిగతా మంత్రులెవరూ ఆశించిన రీతిలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదు. ఇదివరలో రైల్యే సహాయ మంత్రిగా పనిచేసిన దత్తాత్రేయ కూడా పెండింగ్ ప్రాజెక్టులకోసం పట్టించుకోనేలేదు. ఇకనైనా కీలక పదవులన్నీ మన రాష్ట్రానికే వచ్చినందున మన ప్రయోజనాలకు ప్రాముఖ్యత నివ్వాలని ముఖ్యమంత్రితో సహా అందరూ కోరుకుంటున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు,కర్ణాటక పశ్చిమ బెంగాల్ ను చూసి మన రాష్ట్రమంత్రులు నిధులు రాబట్టటంలోనూ, కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తరలించడంలోనూ ప్రావీణ్యత చూపాలని కోరుతున్నారు. మొన్నటివరకు మంత్రులుగా ఉన్న పనబాక, పురంధేశ్వరి, పల్లంరాజు, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం. ఇకనైనా మన మంత్రులంతా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిద్దాం.