ఢిల్లీ నుంచి బొత్స సత్యనారాయణకు పిలుపు
posted on Aug 18, 2012 @ 4:32PM
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఆయన తక్షణమే హస్తిన రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. దీంతో బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి ధర్మాన వ్యవహారంతో పాటు, రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై కలవరపడ్డ అధిష్టానం బొత్సకు కబురు పెట్టినట్లు తెలుస్తోంది.
సీబీఐ చార్జ్‌షీట్‌తో మనస్తాపం చెందిన ధర్మాన ప్రసాదరావు పదవికి రాజీనామా చేయడం సహచర మంత్రుల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ఆయనతో విడివిడిగా, సామూహికంగా భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో సీఎం వ్యతిరేక వర్గ నేతలంతా ధర్మానను కలుస్తున్నారు. ఈ తరుణంలో బొత్స ఢిల్లీ ప్రయాణం ఆసక్తి రేకెత్తిస్తోంది.