డీఎన్ఏ రిపోర్ట్: రోహిత్ తండ్రి ఎన్డీ తివారీయే
posted on Jul 27, 2012 @ 5:22PM
ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్ డీ తివారీ డీఎన్ఏ పరీక్షల నివేదికను విడుదల చేసింది. రోహిత్ శేఖర్ తండ్రి తివారీ అని డీఎన్ఏ పరీక్షలో తేలింది. దీంతో రోహిత్ తండ్రి తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరి డీఎన్‌ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. అయితే ఈ డీఎన్‌ఏ రిపోర్ట్ బయటకి రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారు, కాని రోహిత్ తల్లి ఉజ్వలశర్మ విజయం సాధించారు. తివారీని తన కన్నతండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ 2008లో పిటిషన్ దాఖలు చేశారు. తివారీ, రోహిత్, అతని తల్లి ఉజ్వల శర్మ డిఎన్ఎ పరీక్షలు నివేదికను హైదరాబాదుకు చెందిన డిఎన్ఎ ఫింగర్‌ప్రింట్స్, డయాగ్నస్టిక్స్ కేంద్రం ఇటీవల సమర్పించింది.