మంత్రి పార్థసారథికి సీఎం కిరణ్ అండ
posted on Jul 28, 2012 @ 9:37AM
మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాజీనామా గండం నుంచి గట్టెక్కారు. సీఎం కిరణ్ ఆయనకు అండగా నిలిచారు. ఆర్థిక నేరాల కోర్టు సారథికి జైలుశిక్ష, జరిమానా విధించడంతో.. ఆయన నుంచి రాజీనామా తీసుకోవాలని రాష్ట్రపార్టీ పెద్దలను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. దీంతో సీఎం ఢిల్లీ పెద్దలతో శుక్రవారం మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీ వర్గానికే చెందిన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే జైలులో ఉన్నారని, మరో బీసీ మంత్రితో రాజీనామా చేయిస్తే ఆ వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని కిరణ్ ఢిల్లీ నేతలతో చెప్పినట్లు తెలిసింది. సీఎం ఒత్తిడితో అధిష్ఠానం పునరాలోచనలో పడినట్టు సమాచారం.