టెస్ట్‌ల్లో అగ్రస్థానంలోకి దక్షిణాఫ్రికా
posted on Aug 21, 2012 @ 12:08PM
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లోఆతిథ్య జట్టు ఇంగ్లండ్ 0-2తో ఘోరపరాజయం పాలైంది. లార్డ్స్‌లో జరిగిన చివరి టెస్టులో అతిథ్య జట్టు ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తయింది. 346 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిన ఇంగ్లండ్ 82.5 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో ఫిలండర్‌కు ఐదు వికెట్లు దక్కాయి. దీంతో టెస్ట్‌ల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌ను కోల్పోవడంతో పాటు ఆ ర్యాంక్‌ను దక్షిణాఫ్రికాకు అప్పగించింది.