విద్యుత్ సౌధ వద్ద టీఆర్ఎస్ ధర్నా, పరిస్థితి ఉద్రిక్త౦
posted on Aug 21, 2012 @ 11:58AM
కరెంట్ కోతలకు నిరసనగా విద్యుత్ సౌధ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైరతాబాద్ నుంచి విద్యుత్ సౌధ కు ర్యాలీగా వచ్చిన టీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, కార్యక్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. అక్కడ జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే హరీష్‌రావు కిందపడి పోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.