గవర్నర్ వ్యాఖ్యలపై మండిపడ్డ దేవందర్ గౌడ్
posted on Aug 4, 2012 @ 4:59PM
ఫీ రియంబర్స్‌మెంట్ ఆపాల్సిందే అంటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవందర్ గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న ఫీజు రియంబర్స్‌మెంట్‌పై పూర్తి అవగాహన లేకనే ఆయన అలా మాట్లాడారని అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు చదువుకోకూడాదా అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో మంత్రులు కోట్ల రూపాయలు దోచుకున్నారని దానిపై గవర్నర్ ఎందుకు మాట్లాడలేదని దేవేందర్ గౌడ్ విమర్శించారు.