నీలిమ గచ్చిబౌలి ఇన్ఫోసిస్ కి ఎందుకు వెళ్ళింది?
posted on Aug 4, 2012 @ 4:25PM
నీలిమ హైదరాబాద్ ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లింది? మూడు వారాలు సెలవు పెట్టి అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చిన నీలిమ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఏమి లేదు. అమెరికా నుంచి వచ్చిన పది రోజుల తరువాత ఇన్ఫోసిస్ కార్యాలయానికి వచ్చిన ఆమె పాత మిత్రులను ఎవరినీ కలుసుకోలేదని అంటున్నారు. హైదరాబాదులో నీలిమ చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన పని ఏదీ లేదని, ఆమె ప్రాజెక్టులో పనిచేస్తున్నవారు అమెరికాకు, పూణేకు చెందినవారేనని తెలుస్తోంది.
సిసిటివీ కెమెరా చిత్రాలను బట్టి చూస్తే 9.30 నిమిషాలకు కంపెనీలోని బిల్డింగ్ నెంబర్ 18, 19లోకి వెళ్లినట్టు గుర్తించామని పోలీసులు అంటున్నారు. బిల్డింగ్ నెంబర్ 18, 19లో ఆమె చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన పని కూడా ఏమీ లేదని చెబుతున్నారు. అయితే ఆమె వెంట తెచ్చుకున్న హ్యాండ్‌బ్యాగ్ పదో అంతస్థులో పడి ఉంటే, ఏడో అంతస్థులో ఆమె కాలి చెప్పును గుర్తించామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లిందనేది తెలిస్తే మృతి మిస్టరీ విడిపోతుందని అంటున్నారు.