కాశీ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులు
posted on Aug 6, 2012 @ 11:40AM
భారీ వర్షాల కారణంగా వరదలు ఉత్తర భారత దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ వరదలలో ఆంద్రప్రదేశ్ కి చెందిన యాత్రికులు కూడా చిక్కుకున్నారు. కాశీ యాత్రకు వెళ్లిన ఇరవై మంది గుంటూరు, కృష్ణా జిల్లా వాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. ఉత్తర కాశీ వద్ద రెండు జిల్లాలకు చెందిన ఇరవై మంది భక్తులు గంగోత్రి వెళ్లేందుకు మూడు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం దక్కడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే తమకు సహాయ చర్యల అందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.