ఒలింపిక్స్ లో గుత్తా జ్వాల జోడి ఓటమి
posted on Jul 28, 2012 @ 3:38PM
ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు మొదటి మ్యాచ్లోనే ఎదురు దెబ్బ తగిలింది. గుత్తా జ్వాల,దిజు జోడి మిక్స్ డ్ డబుల్స్ లో ఓటమిపాలయింది. ఇండోనేసియాకు చెందిన లిలియానా నాత్సిర్ - అహ్మద్ తొంతోవి కేవలం 25 నిమిషాల్లోనే గుత్తా జ్వాల జోడిని మట్టి కరిపించారు. గుత్తా జ్వాల జోడి కనీస పోరాట పటిమ కూడా లేకుండా 16-21 12-21తో పరాజయం పాలయ్యారు.