చంద్రబాబు పై కెటిఆర్ ఫైర్
posted on Jul 28, 2012 @ 3:54PM
బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. బైరెడ్డి వ్యాఖ్యల వెనక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించారని, ఇప్పుడు మూడు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇస్తే రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఇవ్వాలని అడుగుతామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు. తాము ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఉంటే రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని, విభజించదలిస్తే మూడుగా విభజించాలని ఆయన అన్నారు.