ఎన్టీఆర్ విగ్రహ౦ ఏర్పాటుకు డిమాండ్
posted on Aug 24, 2012 @ 5:20PM
పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గఢ గఢ లాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతామారరాజు విగ్రహాల ఏర్పాటు చేయాలని హిందీ అకాడమీ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న సమయంలో ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలకు అనుమతి లభించినా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించలేదని యార్లగడ్డ విమర్శించారు.