ఉప్పల్ టెస్ట్: 438 పరుగులకు భారత్ ఆలౌట్
posted on Aug 24, 2012 @ 4:30PM
భారత్ న్యూజిలాండ్‌ల మధ్య నగరంలోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం టీమ్ ఇండియా తొలి ఇన్సింగ్స్లో 438 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ పుజారా 159 పరుగులు చేయగా, ధోని 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అశ్విన్ 37 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జీతన్ పటేల్ 4, బౌల్ట్ 3 వికెట్లు తీశారు.