ఎస్... అంతా ధోనీయే చేశాడు...
posted on Feb 16, 2015 @ 4:14PM
ఐపీఎల్ వేలంలో క్రికెటర్ యువరాజ్‌సింగ్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ సంస్థ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపిక కాలేదన్న బాధ ఆయన అభిమానుల్లో వుంది. ఈ నేపథ్యంలో ఆయన ఐపీఎల్‌లో ఆడటానికి భారీ మొత్తం పొందటం ఆయన అభిమానులకు ఊరట కలిగిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ధోనీ మీద మాటల దాడి చేశారు. యువరాజ్ సింగ్‌కి భారత జట్టులో స్థానం దక్కకపోవడానికి ధోనీ నడిపిన రాజకీయాలే కారణమని విమర్శించారు. యువరాజ్ సింగ్‌కి వ్యతిరేకంగా రాజకీయాలు నడపడానికి గల కారణాన్ని తనకు ధోనీ నుంచి తెలుసుకోవాలని వుందని ఆయన అన్నారు. యువరాజ్ క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా దేశం కోసం శ్రమించి ఆడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత ప్రపంచ కప్‌లో యువరాజ్ ఆల్ రౌండ్ ప్రతిభను కనబరిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడని, కానీ ఈసారి వరల్డ్ కప్‌లో యువీకి ధోనీ అసలు స్థానమే లేకుండా చేశాడని యోగ్‌రాజ్ సింగ్ ఆరోపించారు.