మోడీతో కేసీఆర్ భేటీ
posted on Feb 16, 2015 @ 5:11PM
భారత ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో కేసీఆర్ మోడీని కలిశారు. ప్రధానితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలు, రాయితీలు, ప్యాకేజీల మీద చర్చించడానికే కేసీఆర్ ప్రధానిని కలిశారని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ, మోడీ - కేసీఆర్ భేటీ వెనుక వున్న ప్రధానోద్దేశం ఎన్డీయే ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి కావడమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీఆర్ఎస్‌కి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం వుందని, దాని గురించి చర్చించడం కోసమే కేసీఆర్ మోడీని కలిశారని అంటున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఎన్టీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరడం ఖాయమని జాతీయ మీడియా చెబుతోంది.