గంజాయి మత్తులో కార్లకు నిప్పంటించిన యువకులు
posted on Dec 11, 2025 @ 3:23PM
హైదరాబాద్ నగరంలో కొంతమంది యువకులు నడిరోడ్డు మీద హంగామా సృష్టించారు. యూసుఫ్ గూడా రహమత్ నగర్ కార్మికనగర్‌లోని ఎస్వీఎస్ గ్రౌండ్‌లో గురువారం మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ నిలిపి ఉంచిన పలువురు వ్యక్తులకు చెందిన కార్లు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అలజడి చెలరేగింది. క్షణాల్లో మంటలు ఎగసిపడుతూ వరుసగా వాహనాలను చుట్టుముట్టాయి.
ఈ మంటలో మూడు కార్లు, ఒక ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బందిఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సుమారు కొన్ని గంటల ప్రయత్నాల తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చినా అప్పటికే పలువురు కార్లు ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గంజాయి మరియు మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు నడి రోడ్డుపై హల్ చల్ చేస్తు...అక్కడ నిలిచిన కార్లకు ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన గ్రౌండ్‌లో సెక్యూరిటీ లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారకులైన యువకులను పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగించారు.