మంత్రాలకు చింతకాయలు రాలతాయా?
posted on Oct 16, 2012 @ 12:05PM
వైసిపి పార్టీ అధ్యకుడు జగన్ జైల్లోనూ, తల్లి జయమ్మకు ఆర్ధ్రయిటిస్ ఉండటం వల్ల పార్టీ భాధ్యతలను జగన్ సోదరి షర్శిల తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆమె ఈనెల 18 నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే తన పాదయాత్రకు స్పెషాలిటీ ఉండాలనే ఉద్దేశ్యంతోనూ, క్యాడర్ కోరిక మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షర్మిల వెళ్ళిన ప్రతి జిల్లాలోనూ మిగతా పార్టీల నుండి వలసవచ్చే పెద్దనాయకులను తమ పార్టీలోకి తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఇదివరలో చెంచల్ గూడ జైలు కెళ్ళి జగన్ కలసి తరువాత విజయమ్మదగ్గర పార్టీలో చేరేవారు. ఇకపై అలాకాకుండా పాదయాత్ర చేపడుతున్న ప్రాతంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలందరి ముందే తమ పార్టీలోకి ఆహ్వానించాలని వారు యోచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలలో కలకలం పుట్టించాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం. అదే సమయంలో పార్టీ క్యాడర్లో ఆత్మస్ధయిర్యం పెంచాలని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా శరీరం కాంగ్రెస్ లోనూ ఆత్మ వైసిపిలోనూ వుండే సబ్బం హరిని పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.