హిందూ,ముస్లీమ్ మతాలపై వైకాపాకు చిన్నచూపు? పెరుగుతున్న విమర్శలు!
posted on Oct 29, 2012 @ 3:28PM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు హిందూముస్లీమ్ మతాలపై చిన్నచూపు ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి వారు అనుసరిస్తున్న విధానాలే అద్దం పడుతున్నాయంటున్నారు. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి (జగన్) హిందూయాత్రా స్థలమైన తిరుపతిలో పెద్ద దుమారం లేపారు. పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (జగన్ తండ్రి) కూడా తిరుపతిలో అన్యమత ప్రచారానికి మూలకారణమయ్యారని వివాదంలో ఇరుక్కున్నారు. వీరిద్దరి తరువాత తాజాగా జగన్ సోదరి షర్మిల తన మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా పరోక్షంగా ముస్లీమ్ వ్యతిరేకతను చాటుకున్నారంటున్నారు. ఆమె ఈ యాత్రలో భాగంగా బూట్లతో పాదయాత్ర చేస్తున్నారు. ఆ బూట్లు వదలకుండానే ముస్లీమ్ పవిత్రస్థలమైన దర్గాకు వెళ్లారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బడన్నపల్లి దర్గాలో ఆమె బూట్లతో మసీదుకు చేరుకున్నారు. వాటిని విడవకుండానే హాజీలు, హాలీమ్‌లు చేస్తున్న ప్రార్ధనలో పాల్గొన్నారు. బక్రీదురోజున షర్మిల ఇలా ప్రార్ధన చేయటం ఇప్పుడు రాష్ట్రంలో పెద్దదుమారం లేపుతోంది. దీన్ని పెద్ద ఇష్యూ చేయకూడదని దర్గా పెద్దలు వదిలేశారు. కానీ, ఇతర ముస్లిం నేతలు తమను ఇలా అవమానించటం బాగోలేదంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతల వైఖరి వల్ల వైకాపా హిందూముస్లిం మత వ్యతిరేక రంగును పులుముకున్నట్లు అయిందని మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.