అనుకున్నామని జరగవు అన్ని...
posted on Oct 9, 2012 @ 11:52AM
పార్టీ పెట్టడమంటే నేడు డబ్బున్నోళ్ళకు ఓ ఫ్యాషన్‌గా మారినట్లుంది. అలా పార్టీ పెట్టేందుకు ఏదో ఒక బూచిని సాకుగా చూపిస్తే చాలు...! లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక...! అన్నది మాత్రం నిజం...! అసలు పరమావధి మాత్రం అధికారమే అన్నది జనంకు సైతం తెలిసిన నిజం! అనుకున్నామని జరగవు అన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్న పాట ఇప్పుడు వైఎస్‌ఆర్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. పార్టీని ఆట్టహాసంగా ప్రారంభించి... ఇతర పార్టీల్లోని పలువుర్ని ఆకర్షించి.. తమ వైపుకు తిప్పుకున్నా...వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి సుమారుగా 18నెలలకే నాయకత్వ సమస్య వెంటాడుతోంది. నాయకుడుగా పార్టీని స్థాపించి ముందుకు నడిపించవలసిన వ్యక్తి అవినీతికేసుల్లో ఇరుక్కుని.. ఐదునెలలుగా జైల్లో మగ్గుతుంటే తాత్కాలికంగా పార్టీని విజయమ్మ తదితరులు నడుపుతుండటంతో ఇతర పార్టీలనుండి ఆ పార్టీలో చేరిన నాయకులు అసలే పార్టీ గడుకాలంగా వుంటే... ఇప్పుడు పార్టీలో చేరిన మన పరిస్థితి ఏమిటా.. అని మదనపడుతుంటే... రావాలనుకుంటున్నవారు... పార్టీకి మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నారు.. టిడిపి అధినేత వస్తున్న మీకోసం అంటూ పాదయాత్రకు ప్రజల్లో గనుక స్పందన బాగా పెరిగితే పార్టీకి చాలా నష్టమని కొందరు పార్టీ ప్రముఖులు బాధపడుతుంటే... పరిస్థితిని అంచనావేసేందుకేనేమో త్వరలో కేంద్ర పాలకమండలి, కార్యనిర్వాహక మండలితో గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమావేశం జరుపనున్నారు. ఎప్పుడు టీవీల్లో, పేపర్లలో కనిపించే కొందరు పెద్దలు ఈ మధ్యకాలంలో ఎప్పుడో తప్ప కనిపించడంలేదు... వారి వాణి వినిపించడంలేదు. పార్టీ నాయకునికి బెయిల్ వస్తుందని ఆశపడితే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మళ్ళీ బెయిల్ పిటిషన్ వేయాలంటే... ఇంకో ఆరునెలల వరకు వేచిచూడవలసిందే. కార్యకర్తల్లో అపనమ్మకం అంటూ ఏర్పడటం ప్రారంభమైతే... అది పెరగుతూనే ఉంటుంది. విషయం వున్నా లేకపోయినా ఎప్పుడు ప్రతిపక్షాలను తిడుతుకూర్చుంటే... ఫలితముండదని, అందరిని ముందుకు నడిపే నాయకుడు అవసరమని.. నాయకత్వమంటే కేవలం డబ్బుతో సర్దుబాటు అయ్యేది కాదని, అది కొంతకాలమేనని... నాయకత్వమంటే అభిమానం కూడా కాదని... సరైన రక్షణ కల్పించలేనప్పుడు అభిమానం ఎందుకు పనికిరాదని గతంలో జాతీయ పార్టీలో కలిసిపోయిన ఓ బుల్లి పార్టీ చెప్పకనే చెప్పింది. కనుక వైఎస్‌ఆర్ పార్టీ నాయకుల్లోను, కార్యకర్తల్లోను సమర్ధవంతమైన నాయకత్వ భయం పట్టుకుంది... సమర్ధవంతమైన నాయకత్వంతో పైకి లేచేనా...లేక... బుల్లిపార్టీలా... కనుమరుగయ్యేనా... దీనికి సమాధానం... రాబోయే ఎలక్షన్లల్లో తేలిపోతుందని... సగటు రాజకీయ అభిమానులు అనుకుంటున్నారు.