నేనే సీఎం.. సింహం సింగిల్‌గానే..
posted on Mar 25, 2021 @ 4:52PM
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని.. తానే సీఎంనని వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు షర్మిల. టీఆర్ఎస్ చెబితేనో, బీజేపీ అడిగితేనో వచ్చిన వాళ్లం కాదంటూ క్లారిటీ ఇచ్చారు.
ఏప్రిల్ 9న పాదయాత్రతో తొలి అడుగు వేద్దామన్నారు షర్మిల. పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా 'సంకల్ప సభ' వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఏప్రిల్ 9న, లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన షర్మిల సభకు కొవిడ్ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ జరపాలని కండీషన్ పెట్టారు. దీంతో.. సభ నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై షర్మిల మరింత కసరత్తు చేస్తున్నారు.