ఏడాదిగా 30 మంది.. కూతురుతో తల్లి.. ఛీ ఛీ..
posted on Mar 25, 2021 @ 5:10PM
అమ్మాయి పై అత్యా..చారం. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది కామా*ధులు. ఒకటి, రెండు రోజులు కాదు, ఏకంగా ఏడాది పాటు అత్యాచార* చేశారు. డబ్బు మైకంలో పడి కట్టుకున్న ఆ దారుణానికి సహకరించింది ఎవరో కాదు. ఓ కసాయి తల్లి. మొగుడిని వదిలేసింది. జల్సాల కోసం సంవత్సరం పాటు ఆ అమ్మాయికి నరక వేదన చూపించింది. అమ్మాయి కన్నీళ్లను చూసి కూడా కరగలేదు ఆ కసాయి తల్లీ హృదయం. తన కూతురి జీవితాన్ని అంధకారం చేయడానికి ఆస్కార్ రేంజ్ లో నటించింది. చివరికి బాలిక ఫిర్యాదు తో ఆ కసాయి తల్లి చేతికి సంకెళ్లు పడ్డాయి.
ఉత్తర కర్ణాటక నుంచి కూతురుతో వచ్చిన ఓ మహిళ తనను భర్త వదిలేశాడని అందుకే తన సోదరి కుమార్తెతో శృంగేరికి వచ్చానంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తితో వివాహమైనా.. కొంతకాలానికే అతడితో సంబంధం తెంచుకుంది. అప్పటి నుండి కొత్త నాటకానికి తెర తీసింది తన కూతుర్ని. తన సోదరి కుమార్తె అని కొందరికి, తన భర్తకు అతని మొదటి భార్యకు పుట్టిన సంతానమని మరికొందరికి ఆ బాలిక గురించి చెబుతూ వచ్చింది. ఏడాదిగా తనపై 30 మంది అత్యాచార* చేస్తున్నారంటూ బాలిక ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పినతల్లిగా చెప్పుకొనే ఆ మహిళ కన్నతల్లేనని.. డబ్బు కోసం కూతురితో వ్యభిచార* చేయిస్తోందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి బాలిక ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే 30 మంది కామాంధుల్ని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తును కొనసాగించే కొద్దీ అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.