హైకోర్టు తీర్పుల గురించి జగన్ ఏం అనుకుంటున్నారు?
posted on Aug 15, 2020 9:24AM
వరసపెట్టి హైకోర్టు అన్ని విషయాలలో జగన్ ప్రభుత్వాన్ని మొట్టి కాయలు వేస్తోంది. అయినా ఏపీ సీఏం జగన్ అండ్ కో ఏమాత్రం వెరవకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం నుంచి అమరవాతే కాదు, పంచాయితీ కార్యాలయలకు వైసీపీ రంగులు వేయడం వరకు అన్నింటా ఎదురు దెబ్బలే అయినా జగన్ ప్రబుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది.
అమరావతి విషయంలో కూడా కోర్టులు ఏ తీర్పు ఇచ్చినా వెనక్కి తగ్గేది లేకుండా కార్యాలయాలను షిష్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. రాజధానిగా అమరావతిని మార్చలేదని, మరో రెండు రాజధానులు పెడుతున్నామనే వాదన తెస్తారని, అందుకే కొన్ని కార్యాలయ్యాలు అక్కడకి పంపుతున్నామని కోర్టు చెబుతారని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమరావతి సమర్దకులు సుప్రసిద్ధ లాయర్ హరీష్ సాల్వేను తమ కోసం వాదించడానికి నియమించుకుంటే జగన్ వర్గం ఆయన రంగంలోకి దిగకుండా చూసుకుందని వినికిడి.
అసలు రాజధానిని అక్కడ నుంచి తరలించి, హైకోర్టును కర్పూలు పంపే ప్రయత్నంతోనో హైకోర్టు వర్గాలు భగ్గమంటున్నాయి. అప్పటి నుంచి స్టేట్ , అండ్ కోర్టు మధ్య ఉప్పు నిప్పు లానే ఉంది. పబ్లిక్ లోను, కొంత జాతీయ మీడియాలోను జగన్ అపఖ్యాతి కూడగొట్టుకొన్నది నిజమే. అయితే ఆ ముప్పును ఆయన ఎలా తొలగించుకుంటారనే విషయంలో వైసీపీకి మహా నికార్సయిన క్లారిటీ ఉందట. ఏంటంటే ఎల్లో మీడియా అంటూ పత్రికల మీద దాడి చేసి గుడ్డ కాల్చి మొహం వేసినట్లు కోర్టుల మీద కూడా ఎదురు దాడి చేయడమేనట.
కోర్టులు అకారణంగా తనను వెంటాడుతూ ఉన్నాయని తన మీద పగబట్టి టీడీపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని పదే పదే చెప్పి ప్రజల అటెన్షన్ ను కోర్టు తీర్పు మీద కూడా కోర్టు ఇంటెన్షన్ మీదకు డైవర్టు చేసే ప్రయత్నమట. అందుకే మంత్రులు,ఎంఎల్ ఏలు తాజాగా కోర్టులను చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నారని వాదన లేవదీస్తున్నారు. అలా పదే పదే మాటాడుతుంటే ప్రజలకు కోర్టుల మీద నమ్మకం పోతుందని, అమరావతి నిర్మాణం మీద చేసినట్లునే కోర్టు తీర్పుల మీద ప్రచారం చేయాలనే మహా వ్యూహం ఉందని అంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ నేర్పిన విద్యనే ఇపుడు మరోసారి ప్రయోగించనున్నారట. నిజానికి కోర్టు తమ మీద ఎన్ని మొట్టికాయలు వస్తే అంత మంచిదనే వర్గం కూడా ఉందట వైసీపీలో.