మహిళను పాడుచేసిన.. యువజన కాంగ్రెస్ నాయకుడు..
posted on May 26, 2021 @ 11:45AM
ఓపెన్ చేస్తే.. అది గుంటూరు జిల్లా. నరసరావుపేట. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ. ఆమెకు పెళ్లి అయింది. కొద్దీకాలానికి తన భర్తతో విబేధాలు వచ్చాయి. అప్పటి నుండి ఆ మహిళ భర్త నుండి దారంగా వచ్చి నరసరావుపేటలో నివాసం ఉంటోంది. ఈ నేపథ్యం లో తన దగ్గరున్న 47 సవర్ల బంగారం ఉంది.. ఆ బంగారాన్ని దాచిపెట్టమని చెప్పి ఏడాది కిందట బరంపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రు గ్రామానికి చెందిన గుంజి శ్రీనివాసరావులకు నమ్మి ఇచ్చింది. వాళ్ళు కూడా తీసుకునే తప్పుడు నమ్మకంగా ఉన్నారు. మనుషులు కదా. సామాన్యంగా మనుషులకు ఉన్న దురాశ వాళ్ళ మెదళ్లలో పుట్టింది.. కొన్నీ కాలం తర్వాత ఆ మహిళ తన బంగారం తనకు కావాలని వాళ్ళను అడిగింది. ఆమె బంగారం అడగడంతో ఆ వ్యక్తులు ప్లేట్ ఫిరాయించారు. మొహం చాటు వేశారు. ఆమె ఎన్ని సార్లు అడిగిన ఫలితం లేదు. ఆ మహిళ ఎన్నిసార్లు అడిగినా వారు బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో చివరకి ఆ మహిళ ఆమెకు న్యాయం కావాలని.. ఆమె బంగారం ఆమె కు కావాలని, నరసరావుపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కట్ చేస్తే.. అదే సమయంలో పట్టణానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు అట్లూరి విజయకుమార్, మాజీ రౌడీషీటర్ గుజ్జర్లపూడి ఆనంద్ విజయ్‌కుమార్ అలియాస్ కన్నల్ ఆ ఒంటరి మహిళపై కన్ను వేశారు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనుకున్నారు. పథకం వేశారు. తాము బంగారం ఇప్పిస్తామని ఆమెను నమ్మించారు. అప్పటికే నిస్సహాయక స్థితిలో ఉన్న ఆ మహిళ కసాయిని గొర్రె నమ్మినట్లు నమ్మింది. ఇంకా అంటే ఆమె పై అత్యాచారానికి తెరలేపారు ఆ దుండగులు. నగరం లో శ్రీనివాసనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఆమెను అక్కడ ఉంచారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన కన్నల్, విజయకుమార్ అనుకున్నట్లు గానే అదే ఇంట్లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తమ దగ్గర ఉన్న నగ్నవీడియోలు సోషల్‌మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు దర్యాప్తు చేపట్టారు. అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ2 అయిన అట్లూరి విజయకుమార్‌ను నరసరరావుపేట టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.