లవ్ పోయిందని.. సూసైడ్ వీడియో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన యువకుడు..
posted on Jul 9, 2021 @ 11:07AM
నేను లవ్ లో ఫెయిల్ అయ్యాను. ఇక నేను బతికి సాధించేదేమీ లేదు. జీవితంపై విరక్తి పుడుతోంది. అందుకే చనిపోవాలనుకుంటున్నా. ప్రేమించి మోసం చేసిన వాళ్లు అమ్మాయి అయినా… అబ్బాయి అయినా… ప్రేమలో మోసపోయిన వాళ్లు యువకులైతే ఒక న్యాయం.. యువతి అయితే ఒక న్యాయం ఉంటుందా..? అమ్మాయి జీవితం నాశనమవుతుందంటూ మాటలు చెబుతూ ఆమె కే సపోర్ట్ చేస్తారా.. అమ్మాయికైనా అబ్బాయి కైనా సరైన శిక్ష విధించాలని కోరుతూ ప్రేమ విఫలమైన ఓ యువకుడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా మరణంతోనైనా ప్రేమలో మోసం చేసే యువతులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పురుగుల మందు తాగేశాడు. అంతే కాకుండా తాను పురుగుమందు తాగుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేయడంతో అప్రమత్తమైన ఆ యువకుడి స్నేహితులు ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా యువకుడిని గుర్తించి రక్షించారు. నెల్లూరులో ఉండే అతని మిత్రుడు ఒకరు దానిని చూసి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఒంగోలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రకాశం జిల్లా. పీసీపల్లి మండలం. మారెళ్ల గ్రామానికి చెందిన యువకుడు. అతని నాగభూషణం. ఒంగోలులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇక అంటే లవ్ డ్యూయెట్స్ వేసుకున్నారు.. ఆ తర్వాత ఏమైనదో ఏమో తెలియదు సడెన్ గా తెలుగు సినిమాలో లాగే కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అతనితో ఆ యువతి మాట్లాడలేదు. ఆ విషయానికి అతను కుంగిపోయాడు. మనస్తాపం చెందాడు. ఈ విషయం స్వగ్రామంలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు సైతం తెలిసింది. తమ కుమారుడు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడని భావించిన తల్లిదండ్రులు ఇద్దరు యువకులను అతడికి కాపలాగా ఉంచారు. వారిద్దరి కళ్లుగప్పి యువకుడు గురువారం తన గది నుంచి వెళ్లిపోయాడు.
కాసేపట్లోనే తన ఫేస్‌బుక్ లో వీడియో సహా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పోస్టింగ్ పెట్టాడు. నెల్లూరులో ఉంటున్న స్నేహితుడు ఈ విషయాన్ని గుర్తించి ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సీఐ శ్రీనివాసరెడ్డి ట్రాకింగ్ చేశారు. నగర శివార్లలో బైపాస్ వద్ద ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. అప్పటికే అతను పురుగుమందు తాగడంతో వెంటనే అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందగానే స్పందించి తమ కుమారుడి ప్రాణాలను కాపాడిన పోలీసులకు యువకుడి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
ప్రేమించిన వాళ్ళు వెళ్లిపోయారని ప్రాణాలు ఎవడైనా తీసుకుంటారా.. అంటే ఫీల్ అవుతారుగాని ప్రాణం అంటే నేటి యువతకి లెక్కకుండా పోయింది.. బతుకు నిచ్చిన అమ్మ నాన్నలను వదిలి ఎవరో అమ్మాయి కోసం చావడం ఏంటి మూర్ఖత్వం కాకపొతే.. అని స్థానికులు, బంధువులు అనుకుంటున్నారు.