పడుకున్న వ్యక్తి మాయం.. వరంగల్ లో హల్ చల్ ..
posted on Jun 10, 2021 @ 5:58PM
చేతబడి ఈ మాట ఎక్కుగా వింటుంటాం.. చేతబడి అవాస్తవం అని కొందరు అంటే.. కాదు నిజమే నేను చూశాను మా ఇంట్లో వాళ్ళకి మా పక్కింటి వాళ్ళు చేతబడి చేయించారు. అని చెప్పడం ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు.. కొంత మంది అయితే దేవుడికి చేతబడి ముడివేస్తారు.. దేవుడు ఉన్నాడు అని నమ్మితే చేతబడి కూడా ఉందంటారు. మంచి ఉంటే చెడు కూడా ఉంటుందని మరికొందరు అంటారు.. ఇంతకీ అది వాస్తవమా..? అవాస్తమా తెలియాలి అంటే దాని నుండి మనం ఎఫెక్ట్ అయితేనో, లేదంటే మనవాళ్ళు ఎఫెక్ట్ అయితేనో దాని వెనక ఉన్న నిజాలు తెలుస్తాయి.. అయితే తాజాగా ఇలాంటి ఒక విషయం వరంగల్ లో కలకలం రేపుతోంది.. అదేంటో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం..
మంచంమీద పడుకున్న సతీశ్ ఉదయం లేచి చూసే సరికి మిస్ అవ్వడం ఏంటి..? వీడికి ఏమైనా పిచ్చా పడుకునోడు ఎలా మిస్ అవుతాడు అని అనుకుంటున్నారా.. ? అది నిజమే కానీ అతడు పడుకున్న మంచం పక్కన ముగ్గు వేసి ఉంది.. అది చాలదు నమ్మడానికి. అతను తప్పిలోలేదని అది నిజంగానే చేతబడి జరిగిందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలంలో గల ఉప్పరపల్లి గ్రామంలో ఈ చేతబడుల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే ఓ యువకుడు మాయమయ్యాడు. అయితే గతంలో ఇదే తరహాలో ఒకరు అదృశ్యం అయ్యారు. ఇంతవరకు అదృశ్యం అయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు.
గ్రామంలో రాత్రికి రాత్రే చీమల సతీష్ (28) అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. రాత్రి పడుకున్న సతీష్ తెల్లారేసరికి మాయమయ్యాడు. అయితే అతడు పడుకున్న మంచం పక్కకు చేతబడి చేసిన ఆనవాళ్లు గ్రామస్థులకు కనిపించాయి. సతీష్ పడుకున్న మంచం పక్కన మనిషి బొమ్మ, ముగ్గు గీశారు. అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు. బొగ్గు వేసి ఉంది. దీంతో సతీశ్ పై చేతబడి జరిగిందా ? అని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యం అయ్యాడని, అయితే ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ప్రపంచంలో అన్నీ ప్రశ్నలకు సమాధానం ఉంటుంది.. కాకపోతే ఆ ప్రశ్నలకు సమాధానం సైన్సులో దొరుకుతాయి.. ఇంకొన్ని సార్లు శాస్రం లో కూడా దొరుకుతాయి.. అలాగని కనిపించకుండా పోయిన వ్యక్తి నిజంగానే చేతబడిగావించాడా..? అంటే అది సరైన సమాధానం కాదు..